7, డిసెంబర్ 2014, ఆదివారం

మూడు గంటల మంత్రి పదవి...(నాయకురాలు నాగమ్మ-6)



        గురజాల రాజ్యం లో విపరీతంగా దొంగతనాలు ప్రబలి పోయాయి. ప్రజలు, వ్యాపారులు రాజుగారికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. 

     గ్రామాలలోని సమయ పాలకులందరూ నాగమ్మ వద్దకు వెల్లి తమ గోడు చెప్పుకున్నారు. (బ్రహ్మనాయుడి ఆగడాలను అడ్డుకోలేక పోతున్నామని నలగామ రాజు తమ్ముడు నరసింగరాజు నాగమ్మను పాలనలో జోక్యం చేసుకోవాలంటూ ప్రాధేయ పడినట్లు కొందరు రచయితలు రాశారు) అది నిజం అయి వుండక పోవచ్చు. ఎందుకంటే రాజకీయాలలో వుండేవారు సామాన్యులు ఎంత మేధావులైనా వారిని చిన్న చూపే చూస్తారు కాబట్టి నాగమ్మను నరసింగరాజు ప్రాధేయ పడడం కల్పన అయి వుండవచ్చు. ప్రజల వ్యాపారుల విన్నపాలే నిజమయి వుంటాయి.
          ఈ నేపథ్యం లో ఏదో ఒక చర్య తీసుకోవాల్సిన పరిస్థితులు నాగమ్మ ముందు ఏర్పడ్డాయి. 

      సుదీర్ఘంగా ఆలోచించిన నాగమ్మ అనుగురాజు గతంలో తనకు చేసిన వాగ్దానాన్ని వినియోగించుకోవాలని  నిర్ణయించుకుంది. ఏడు ఘఢియల సమయం నాగమ్మకు ఆమెకోరిన సమయంలో తన వారసులెవరు వున్నా మంత్రి పదవి ఇవ్వాలని రాసి ఇచ్చిన వాగ్దాన పత్రం తీసుకుని రాజ సభకు చేరుకుంది నాగమ్మ. 

       అప్పుడు బ్రహ్మనాయుడు గురజాలలో లేడు. అది యాధృచ్చికమో లేక నాగమ్మ అదే సమయాన్ని ఎంచుకుందో తెలియదు కానీ ఆమెకు రాజు ఏడు ఘడియల పాటు మంత్రి పదవి ఇచ్చాడు. 

       ఏడు ఘఢియలంటే నేటి మన కాలమానం ప్రకారం రమారమి మూడు గంటల కాలం మాత్రమే. ఆ కొద్ది సమయం లో అమె మంత్రికి వుండే అన్ని అధికారాలను వినియోగించుకుంది. 
    
     దండనాయకులను తీసుకుని బ్రహ్మనాయుడి అనుచరుల ఇళ్ళపై దాడులు చేశి సోదాలు చేసింది. ధనం, వస్తుసంపద, స్వాధీనం చేసుకుని రాజుగారి ఎదుటికీ తీసుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో దోషులు సాక్ష్యాధారాలతో సహా పట్టుబడ్డారు.

        వారికి నాలుగు తగిలించేసరికి వాస్తవాలు బయటపెట్టారు. ఈ అరాచకాల వెనుక బ్రహ్మనాయుడు వున్నాడన్న వాస్తవం బయట పడే సరికి గ్రామాల పాలకులకు ఏం సమాధాన చెప్పాలో రాజుకు అర్థం కాలేదు. 

      ఈ లోపు పొరుగూరు వెళ్ళిన బ్రహ్మనాయుడు తిరిగొచ్చాడు. సభలో విచారణ జరిగింది. సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ బ్రహ్మనాయకుడికి వ్యతిరేకంగా ఉన్నాయి. బ్రహ్మనాయుడు ఏమీ మాట్లాడ లేక పోయాడు. ఏం చేయమంటారు బ్రహ్మన్నగారూ  అని రాజుగారు అడిగారు.

        మీ ఇష్టం ప్రభూ.... అన్నాడు బ్రహ్మన్న.

      రాజ్యంలో ప్రజలను కాపాడాల్సిన స్థాయిలో వుండి ప్రజా సంపదను దోచుకోవడానికి కారకుడైన బ్రహ్మన్నను కఠినంగా శిక్షించాలని సభికులు కోరారు. 

      దోషి స్థానంలో వున్న బ్రహ్మన్న మాట్లాడలేదు.

        అనుగు రాజు మరణం తరువాత గురజాల రాజ్యానికి బ్రహ్మనాయుడు చేసిన సేవలను పరిగణలోకి తీసుకున్న సభ బ్రహ్మనాయుడిపై బహిష్కరణ వేటు వేయాలని నిర్ణయింది. 

     నాటి ఆచారాల ప్రకారం బ్రహ్మనాయుడి కుటుంబాన్ని, ఆయన అనుచరుల కుటుంబాలను కులం నుండి బహిష్కరించారు. నాటి శెట్టి సమయాల ఆచారం ప్రకారం వెలివేయబడిన కుటుంబాలకు ఎవరూ సేవలందించ కూడదు. చాకలి బట్టలు వుతకడు, మంగలి క్షవరం చేయడు, కుమ్మరి కుండలు ఇవ్వడు. బేదరి స్మశానంలో శవాన్ని సైతం తగులబెట్టడు. వెలివేయబడిన వారి జీవితం చాలా దుర్భరంగా వుండేది. 

        రాజ్యాన్ని సంక్షోభంలోనుండి గట్టెక్కించిన నాగమ్మను శాస్విత మంత్రిగా వుండిపోవాల్సిందిగా రాజుతో సహా, గ్రామ సమయాల పాలకులు సైతం కోరడంతో నాగమ్మ చరిత్రలో తొలి మహిళా మంత్రిణిగా బాధ్యతలు చేపట్టింది. ఇలా రెడ్డిగారి నాగమ్మ నాయకురాలు నాగమ్మ అయింది.  

                 నేటి "వెలమకులం" బ్రహ్మనాయుడితోనే ప్రారంభమైందా....తరువాత టపాలో చూడండి  

4, డిసెంబర్ 2014, గురువారం

పలనాటిలో పెచ్చుమీరిన అరాచకం....(నాయకురాలు నాగమ్మ-5)



          అనుగు రాజు మరణం తరువాత చిన్నరాణి మైలమాదేవి ఒక్కగానొక్క కుమారుడు రాజపుత్రులందరిలోకి పెద్దవాడు 13 సంవత్సరాల నలగామరాజు సింహాసనమధిష్టించాడు. నలగాముడు చిన్నపిల్లవాడు కావడంతో మంత్రి బ్రహ్మనాయుడే అధికారాన్ని చలాయించాడు. 

    స్వతహాగా బ్రహ్మనాయుడు వ్యభిచారని పలువురు రచయితలు అభిప్రాయపడ్డారు. బ్రహ్మనాయుడు ప్రదిపాదించిన, ఆయనకు చరిత్రలో సంస్కరణవాది అని పేరు తెచ్చిపెట్టిన చాపకూటి సిద్ధాంతం గురించి చాలమంది రచయితలు గొప్పగా వర్ణించారు. "చాపకూటి సిద్ధాంతం" అంటే "సహపంక్తి భోజనాలు" అని కులమతాలకు అతీతంగా దాన్ని బ్రహ్మనాయుడు ప్రతిపాదించాడని చాలమంది నేటికీ అపోహ పడుతుంటారు కానీ అది తప్పు .

     నిజానికి చాపకూటి సిద్ధంతం అంటే ఒక చాపను పరిచేవారు ఆ చాపపై అన్నం, కూరలు వంటి ఆహార పదార్తాలను వడ్డించేవారు. ఒకవ్యక్తి ఆ చాపపై అన్నం కలుపుకుని తిని వెళ్ళిన తరువాత అదే ప్రదేశంలో తరువాత వచ్చిన వారు అన్నం కలుపుకుని భుజించాలి. ఇది చాలా అనాగరిక వ్యవహారం కావడంతో నాటి వ్యవస్థలో బ్రహ్మనాయుడిపై వ్యతిరేకత వచ్చిందంటారు. ఈ చాపకూటి సిద్ధాంతం వెనుక బ్రహ్మనాయుడి అనుచరుల అసాంఘిక కార్యకలాపాలు పెచ్చుమీరిపోవడంతో ప్రజలలో బ్రహ్మనాయుడి పట్ల అసంతృప్తి జ్వాలలు రగిలాయంటారు. 

       బ్రహ్మనాయుడి కౄర స్వభావానికి భయపడ్డవారు ఆయన వ్యవహారాలను ప్రశ్నించలేక పోయారు. చివరికి రాజు నలగాముడు సైతం బ్రహ్మనాయుడిని అడ్డగించలేక పోయాడని అంటారు. అందుకే ఎన్ని ఫిర్యాదులు వచ్చినప్పటికీ నలగాముడు మిన్నకుండిపోయాడే కానీ బ్రహ్మనాయుడిని అదుపుచేయలేక పోయాడు. దీంతో బ్రహ్మనాయుడి అనుచరగణం ఆడింది ఆట పాడింది పాట అన్న చందంగా సాగింది. అనుచరులలో కొందరు బ్రహ్మనాయుడి అండ చూసుకుని వ్యాపారులను దోచుకోవడం, దొంగతనాలు చేయడంతో ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ  పరిస్థితులలో కొట్టుమిట్టాడారు. 

         ఇక్కడ చరిత్రకారులు మరచిపోయిన కొన్ని వ్యవస్థల గురించి చెప్పుకోవాలి. నాటి కాలంలో భారతదేశం నుండి పెద్ద ఎత్తున వ్యాపారాలు జరిగేవి. ఈ వ్యాపారస్తులకు సంబంధించి ట్రేడ్ యూనియన్ లు వుండేవి. వాటిని శెట్టిసమయాలు, వణిజసమయాలు అని పిలిచేవారు. ఈ సమయాలకు ఎక్కువగా నాటి పాలకుల బంధువులే నాయకులుగా వ్యవహరించేవారు. ఈ సమయాలు (యూనియన్లు) కొన్నికులాల సముదాయాలు.

           ఈ సమయాలకే గ్రామాలలో అధికారాలు వుండేవి. గ్రామాధికారులను శెట్టి, దేశాయి, రెడ్డి అని పిలిచేవారు. ఈ సమయ పాలకులు పన్నులు వసూలు చేయడం, తీర్పులు చెప్పడం వంటి అధికారాలను కలిగి వుండేవారు. యుద్ధాల వలన రాజులు మారినా ఈ సమయాలు  మాత్రం యధావిధిగా పనిచేసేవి. రాజులు కూడా ఈ సమయాల సలహా సంప్రదింపులతోనే రాజ్యపాలన కొనసాగించేవారు. ఇప్పటివరకు దొరికిన ఆధారాల వలన ఈ సమయాలు క్రీ.శ.1వ శతాబ్దం వాడైన కరికాళచోళుని కాలంలో ప్రారంభమైనట్టుగా ఆధారాలు లభిస్తున్నాయి. భారతదేశం ప్రపంచదేశాలలో అత్యున్నత నాగరికతను అనుభవించడానికి ఈ సమయాలే కారణం. 

        ఇక్కడ కులం గురించి అసందర్భమైనా ఒక చిన్న విషయం చెప్పుకోవాల్సిన అవసరం వుంది. ప్రాచీన భారతీయులు చాలా మేధావులు వారికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే జన్యుపరంగా సంక్రమించే నైపుణ్యం గురించిన అవగాహన వుంది. 

        నేడు చాలామంది కుహనా మేధావులు భారతదేశం అభివృద్ధి చెందకపోవడానికి చాలా కులాలు వుండడమే కారణం అంటారు. కొందరైతే కులం గోడలు బ్రద్దలు కొడదాం రండి అంటూ పిలుపునిస్తుంటారు. 

     పాశ్చాత్య ప్రపంచంలో "మెండెల్" ప్రకటించిన తరువాతనే జాతులు వంశపారంపర్య లక్షణాలను కలిగి వుంటాయని తెలిసింది. 

      ఈ సంగతి ప్రాచీన భారతీయులకు కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే తెలుసు. అందుకే కులాలను ఏర్పరిచారు. ఈ కులాలు వృత్తుల వారీగానే ఏర్పడ్డాయి. ఎందుకంటే ఒకతరం సంపాదించుకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకున్న తరువాతి తరం దాన్ని మరింత మెరుగుపరచి ముందుతరానికి అప్పగించేది. అలాంటప్పుడు ఒక రకమైన సాంకేతికతను ఆ కులం వారే కొనసాగించేవారు. తరతరాలుగా ఆ రంగాలలో నైపుణ్యం సంపాదించేవారు. కుల సంకరం జరిగితే నైపుణ్యాన్ని కోల్పోయే ప్రమాదం వుందన్న విషయం ప్రాచీన భారతీయులకు బాగా తెలుసు. 

         నేడు మనం జన్యు స్వచ్చత గురించి మాట్లాడుతుంటాము. సంకరజాతి వంగడాలకు జన్యు స్వచ్చత వుండదు. మన పూర్వీకులు మనుషులాలో కూడా జన్యు స్వచ్చతను కాపాడేందుకే కులాల ఏర్పాటును చేశారు. అలా తరతరాలుగా సాంకేతికత జన్యు రూపంలో సంక్రమిస్తూ వస్తోంది. కానీ నేడు పంచామృతం లాంటి మన గొప్పదనానికి కల్తీ కల్లు వంటి పాశ్చాత్య సంస్కృతి కి వున్న తేడాను తెలుసుకోలేక పోతున్నాము.

ఇక కథలోకి వద్దాం ...

       అలా కొన్ని వృత్తులకు సంబంధించిన కులాలు తమ ఉత్పత్తులను తామే అమ్ముకునే వెసులుబాటు ఆ కాలంలో వుండేది. ఈ కులాలన్నిటికీ "మహానాడు"లు  అనే వేదికలపైన కట్టుబాట్లు, హద్దులు నిర్ణయించేవారు. అవే నాటి శాసనాలు. 56 దేశాలుగా(చప్పన్న దేశాలు) పిలువబడిన అఖండ భారతదేశం మొత్తం ఈ మహానాడులలో జరిగే శాసనాలకు ప్రజలు కట్టుబడి జీవించేవారు. ఇక మన కథలో...

       జిట్టగామాల పాడు గ్రామ పెద్దలు నాగమ్మ కుటుంబీకులు. నాగమ్మ తండ్రి తీర్పులు చెప్పడంలో దిట్ట అని మనం చదువుకున్నము కదా. అంటే ఆ పరగణాలో నాగమ్మ కుటుంబం ఖచ్చితంగా సమయ పాలకులు అయివుండాలి. 

           సాధారణంగా మనకు ఒక వ్యక్తి అన్యాయం చేస్తే ఆ వ్యక్తికి గిట్టని వ్యక్తికి చెప్పుకోవడం జరుగుతుంది. కౌటిల్యుని అర్థ శాస్త్రం ప్రకారం శత్రువు శత్రువు మిత్రుడవుతాడు. 

       అదే విధంగా ఇక్కడ బ్రహ్మనాయుడు అతని అనుచరులు చేస్తున్న ఆగడాల గురించి దోపిడీకి గురైన సమయాల వ్యాపారులు ఫిర్యాదులు చేశారు. రాజు కూడా పట్టించుకోవడంలేదని వాపోయారు. అమ్మా నాగమ్మా నువ్వే ఎలాగయినా మమ్మల్ని, మా వ్యాపారాలను కాపాడాలని వేడుకున్నారు. అప్పటికే బ్రహ్మనాయుడు చాపకూటి సిద్ధాంతం చాటున చేస్తున్న దురాగతాలు ఆమె చెవిని చేరాయి. 

ఇక్కడ మరో చిన్న వివరణ ఇవాల్సి వస్తున్నందుకు క్షంతవ్యుణ్ణి. 

          కులాలన్నీ ఒక్క మాటపైన ఉన్న సమయాల గురించి మనం తెలుసుకున్నాము. నిజానికి నాటి ప్రజలంతా ఒక్కమాటపైనే వుండేవారా... ఈ రచయిత చెబుతున్నది ఎంతవరకు నమ్మవచ్చు...నిజమే ఆ కాలంలో కులాల వారీగా వున్న సమూహాలు అన్నీ ఎప్పుడూ ఒకటిగా లేవు. పూర్వాచార, వామాచార కులాలుగా ఏర్పడ్డాయి. వీరిని కుడి, ఎడమ చేతుల కులాలు అనికూడా అంటారు. 

      పూర్వాచార కులాలు అంటే ప్రాచీన ఆచారాలు, కట్టుబాట్లు క్రమశిక్షణాయుతమైన జీవితానికి కట్టుబడి జీవించేవారు. వామాచార కులాలు ఎప్పుడు వీరికి వ్యతిరేకమే వీరు స్వతహాగా ఆధునిక భావాలు కలవారు. ఈ రెండు వర్గాలలో పూర్వాచార కులాలు మెజారిటీ కులాలు కావడం తో వామాచార కులాలపై ఎప్పుడూ పైచేయిగానే వుండేవారు. 

       పూర్వాచార కులాలు కులసంకరానికి పూర్తిగా వ్యతిరేకం అయితే వామచారకులాలు కులసంకరాన్ని పెద్దగా పట్టించుకునే వారు కాదు. విధవా వివాహాలకు పుర్వాచార కులాలు వ్యతిరేకమైతే వామాచార కులాలు అనుకూలంగా వుండేవి. ఇల ఈ రెండు వర్గాలూ ఒకరు ఎడ్డేమంటే మరొకరు తెడ్డెమనేవారు.

          నాటి రాజులు, గ్రామాధికారులూ మెజారిటీ వర్గాలైన పూర్వాచార కులాలకు చెందిన వారే. 

        అందుకే బ్రహ్మనాయుడు చేపట్టిన చాపకూటి సిద్ధాంతం పూర్వాచార కులాల కట్టుబాట్లను బ్రష్టు పట్టించేవిధంగా వుండడంతో ఆ వర్గాలన్నీ ఆగ్రహంతో రగిలి పోయాయి. అందుకే ఆయా వర్గాలు అన్నీ నాగమ్మను ఆశ్రయించి ప్రతిఘటించాల్సిందిగా కోరి వుండవచ్చు. 

         పదవులకు దూరంగా ప్రశాంతంగా ఆశ్రమం నిర్మించుకుని జీవిస్తున్న నాగమ్మ కులాల శ్రేష్టులు అంతా తనను ఆశ్రయించినప్పుడు కాదనలేక ఆలోచనలో పడింది. బ్రష్టు పట్టిన వ్యవస్థను ప్రక్షాలనం చేయడానికి నాగమ్మ రంగంలోకి దిగక తప్పలేదు. 

        నాగమ్మ ఏం చేసింది... ఎలా బ్రహ్మనాయుడి అనుచర సామ్రాజ్యాన్ని ఢీకొట్టింది...బ్రష్టు పడుతున్న వ్యవస్థను ఒక్క అబల ఎలా సరిదిద్దింది నేటి తరం ఊహించను కూడా ఊహించలేని  సాహస మహిళ నాగమ్మ ఎలా సాధించిందో ....
                                                          తరువాత టాపాలో చూద్దాం...

2, డిసెంబర్ 2014, మంగళవారం

నాగమ్మ ఎలా నాయకురాలయింది... (నాయకురాలు నాగమ్మ-4)



నాగమ్మ... నాయకురాలు నాగమ్మ...

      నాగమ్మ ఇంటి పేరు నాయకురాలు కాదు. ఆ కాలంలో నాయకుడు, నాయుడు అనే బిరుదాలు (లేదా పదవులు) రాచరికం లో అంతర్భాగమైన సైనికులకు, సేనానాయకులకు కనిపిస్తాయి. చరిత్రలో చాలామంది పరిశోధకులు నాగమ్మ జన్మస్థలం నేటి కరీం నగర్ జిల్లాలోని ఆరవెల్లి గ్రామమేనని నిర్ధారణకు వచ్చారు. చాలమంది రచయితలు నాగమ్మ చౌదరి రామిరెడ్డికి అనాధగా దొరికిన బిడ్డగా రాశారు. చౌదరి రామిరెడ్డి కి నాగమ్మ అనాధగా దొరికిన బిడ్డనే అయితే నాగమ్మ తన  చివరి రోజుల్లో అదే ఆరవెల్లికి వెళ్ళి వుండేది కాదు. అక్కడే ఆమె చివరి రోజులు గడిపింది అన్న ఆధారాలు కనిపిస్తున్న నేపథ్యంలో అనాధగా దొరికిందన్న కట్టుకథను కొట్టివేయక తప్పదు. 

     దీన్ని బట్టి నాగమ్మ తండ్రి చౌదరి రామిరెడ్డి నాగమ్మను తీసుకుని పలనాటి ప్రాంతంలోని జిట్టగామాలపాడుకు వచ్చి వుండవచ్చు. బహుశా ఆరవెల్లి ప్రాంతంలో కరువు ఏర్పడడమో లేక చౌదరి రామిరెడ్డి ఆర్థికంగా దెబ్బతినడమో, లేక నాగమ్మ తల్లి మరణించి నందు వల్ల ఆ బాధను మరచిపోవడానికి గ్రామాన్ని వదలి బావమరిది మేకపోతుల జగ్గారెడ్డి పంచన చేరి వుండవచ్చు. మేకపోతుల జగ్గారెడ్డి జిట్టగామాలపాడులో బహుశా గ్రామ పెద్ద అయి ఉండవచ్చు. ఎందుకంటే ఈ చౌదరి, రెడ్డి అనే బిరుదులు లేదా పదవులు పెద్ద ఆస్తి పరులకు, గ్రామాధి కారులకు మాత్రమే ఉండేవి. 
     నేడు మనకు కనిపిస్తున్న రెడ్డి కులం, కమ్మ కులానికి చెందిన పదాలు కాదని గమనించాలి. 
   ఎందుకంటే నేడు రెడ్డి, కమ్మ అని పిలువబడే కులాలు నాటికి ఇంకా ఏర్పడలేదు కనుక ఈ పదాలు కులసూచకాలు కాదని మనవి చేస్తున్నాను. ఎందుకంటే కమ్మ కులస్తులు కాకతీయుల కాలంలో కాపు కులం నుండి విడిపోయారని తెలుస్తోంది. కాకతీయులు పలనాటి యుద్ధం తరువాత రాజ్య పాలన చేపట్టారు. ఇక రెడ్డి అనే కులం అప్పుడు లేనే లేదు.

     అలా వలస వచ్చిన రామిరెడ్డి తన ఒక్కగానొక్క కుమార్తెకు క్షత్రియోచిత విద్యలన్నీ నేరిపించాడు. తెలుగు, సంస్కృత భాషలలో నాగమ్మ ప్రవీణురాలని తెలుస్తోంది. బ్రతుకుదెరువు కొరకు వలస వచ్చిన వ్యక్తి ఒక ఆడపిల్లకు ఇలా అన్నివిద్యలూ ఎందుకు నేర్పిస్తాడు? దీన్ని బట్టి చౌదరి రామిరెడ్డి బ్రతుకుదెరువును వెతుక్కుంటూ జిట్టగామాలపాడుకు రాలేదని అర్థమవుతుంది. మేకపోతుల జగ్గరెడ్డి కుమారుడు సింగారెడ్డి కి ఇచ్చి నాగమ్మకు బాల్య వివాహం చేశారు. చాలామంది రచయితలు నాగమ్మ భర్త పేరు తెలియదని రాశారు. కొంతమంది మేనమామ జగ్గరెడ్డినే వివాహం చేసుకుందని రాశారు. ఇందులో వివాదాలెలా వున్నా నాగమ్మకు మాత్రం బాల్యవివాహం జరిగిందన్నది మాత్రం అందరూ ఒప్పుకునే అంశం.
   
     ఈ నేపథ్యం లో జిట్టగామాలపాడులో చెరువు నిర్మాణం కొరకు భూమి సేకరణజరిగింది. అందులో ఏర్పడిన వివాదంలో నాగమ్మ తండ్రి చౌదరి రామిరెడ్డి, మేనమామ జగ్గారెడ్డిలు హత్యకు గురయ్యారు. ఈ వివాదం బ్రహ్మనాయుడికి జగ్గారెడ్డికి జరిగినది కావడంతో హత్య చేయించింది బ్రహ్మనాయుడే అని నిర్ధారణకు వచ్చారు. నాగమ్మ తండ్రి రామిరెడ్ది తీర్పులు చెప్పడంలో దిట్ట అని పేరుండేది. ఈయనను నిద్రిస్తుండగా మంచానికి కట్టివేసి సమీపంలో వున్న అడవిలోకి తీసుకు వెళ్ళి హత్య చేశారు. నిద్రిస్తున్న వాడిని హత్య చేశారు అంటే మెలకువగా వున్నప్పుడు ఆయనను ఏమీ చేయలేని పరిస్థితులు వుండి వుండవచ్చు. దీన్నిబట్టి చౌదరి రామిరెడ్డి మహావీరుడై వుండి వుండాలి, లేదా ఈయనను ఏమైనా చేస్తే ప్రజలు తిరగబడే పరిస్థితులు వుండి వుండాలి. అందుకే ఆయనను మంచానికి కట్టివేసి హత్య చేసి వుంటారు. జగ్గరెడ్డి హత్య గురించి వివరణ దొరకలేదు. 

     కానీ ఈ రెండు హత్యలూ బ్రహ్మనాయుడే చేయించాడనే అరోపణలు మాత్రం పలనాటి చరిత్ర రాసిన రచయితలందరూ ఏకీభవించారు.  

         ఈ విధంగా బ్రహ్మనాయుడి పై నాగమ్మకు వ్యతిరేకత ఏర్పడింది. 

     తండ్రి మేనమామ తరువాత గ్రామాధిపత్యం నాగమ్మనే చేపట్టినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే అనుగురాజు అడవిలో వేటాడి తిరుగు ప్రయాణంలో వుండగా ఆయనకు, ఆయన పరివారానికి చలువ పందిళ్ళు వేసి తృప్తితీరా భోజనం పెట్టింది. ఒక్కసారి ఆనాటి పరిస్థితులను బేరీజు వేద్దాం....

       రాజులకు భోజనం పెట్టడం అంటే మామూలు విషయం కాదు కదా. ఆ స్థాయిలో భోజనం పెట్టడం అంటే పెద్ద సంపన్నులయి వుండాల్సిందే. ఎంత సంపన్నులయినా ఎవరు పడితే వారు భోజనం పెడితే రాజులు భుజిస్తారా??? భారత దేశంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కులాల పట్టింపు వుండేది. అంతే కాకుండా సామాజికంగా కూడా ఉన్నత స్థాయిలో ఉండేవారి అహ్వానాలు మాత్రమే రాజులు మన్నించేవారు. దీన్ని బట్టి నాగమ్మ ఖచ్చితంగా ఆ ప్రాంత పాలనకు సంబంధించిన కుటుంబానికి చెందినదే అయివుండాలి. కత్తిసాము, అశ్వారోహణ, గజారోహణ, యుద్ధతంత్రాలు, సంస్కృతాంధ్ర భాషలలో పాండిత్యం. ఇలా సకల కళలు అభ్యసించిందంటే ఈమె సామాన్య కుటుంబంలో పుట్టిందని అభిప్రాయపడడం సమంజసమేనా???? 

        అనుగురాజు ఆనందపడే రీతిలో సత్కరించిందంటే ఏ స్థాయిలో సత్కరించి వుండాలి? ఆమె సత్కారాలకు ఆనంద భరితుడైన అనుగురాజు ఆమె కోరినప్పుడు ఏడు ఘడియల పాటు మంత్రి పదవి ఇస్తానని వరమిచ్చాడు. కాదు రాసి ఇచ్చాడు. వరం నాగమ్మే అడిగిందా లేక అనుగురాజే ప్రతిపాదించాడా? ఒక్క సారి విశ్లేషించి చూద్దాం. 

         భోజనం చేసిన తరువాత నాకు మంత్రి పదవి ఇమ్మని నాగమ్మే అడిగి వుంటుందా... అలా అడిగితే నాగమ్మ చులకన అయివుండేది. ఆమె ఆతిథ్యానికి ముగ్ధుడైన అనుగురాజు నీకేం కావాలో కోరుకో అని వుండవచ్చు. నాగమ్మ ప్రతిభాపాటవాల గురించి అనుచరులు చెప్పి వుండవచ్చు. అంతటి ప్రతిభా పాటవాలు కలిగివుండి ఈ మారుమూల గ్రామంలో ఎందుకున్నావని రాజు ప్రశ్నించి వుండవచ్చు. రాజ్య పాలనలో భాగస్వామివి కమ్మని రాజు ఆహ్వానించి వుండవచ్చు...వాటన్నింటిని నాగమ్మ సున్నితంగా తిరస్కరించి వుండవచ్చు... 

    పైన ఉదహరించిన ఊహలన్నీ నాకు నాగమ్మపై ఉన్న అభిమానాన్ని ప్రదర్శించడానికి తాపత్రయ పడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి కదా. 

      నేను ఇలా ఎందుకు ఊహించడానికి తాపత్రయ పడుతున్నానంటే తల్లిదండ్రులను, భర్తను, మేనమామను కోల్పోయి వైరాగ్యంతో జీవిస్తున్న నాగమ్మ మంత్రి పదవి కొరకు ఆశపడిందంటే నా మనసు అంగీకరించడం లేదు. 

        అలాంటి నాగమ్మ ఏడు ఘడియల పాటు ప్రధానమంత్రి పదవి ఇమ్మని అడిగిందనే రచయితలు రాశారు. 

       నిజానికి పదవీ కాంక్ష ను నాగమ్మ కలిగి వుంటే రాజు అనుమతి ఇచ్చిన తక్షణమే పదవిని స్వీకరించివుండేది. కానీ తనకు ఇష్టమైనప్పుడు పదవి తీసుకుంటానని చెప్పింది. 

      ఇక్కడ నాగమ్మ కోరిక కంటే అనుగురాజు  వత్తిడి చేసినట్లుగానే కనిపిస్తుంది. మంత్రి పదవి స్వీకరించమంటే సమయమొచ్చినప్పుడు స్వీకరిస్తానని నాగమ్మ అని వుండవచ్చు. నీకు ఇష్టమొచ్చినప్పుడు నా వారసులు ఎవరు వున్నా నాగమ్మకు ఏడు ఘడియల పాటు మంత్రి పదవి ఇవ్వాలని దాన పత్రం లేదా ఫర్మానా రాసి ఇచ్చాడు అనుగురాజు. ఇక్కడ దాన పత్రం రాసి ఇచ్చినది అనుగురాజు కాదు నలగామరాజేనని కొంతమంది రచయితలు రాశారు. కానీ అది వాస్తవం కాదు నాగమ్మకు అనుమతి పత్రం రాసి ఇచ్చినది అనుగురాజేనన్నది వాస్తవం.

      అలా మంత్రి పదవి వద్దని తిరస్కరించిన నాగమ్మ ఏ పరిస్థితిలో మంత్రి పదవి తీసుకుంది చరిత్రలో తొలి మహిళ మంత్రిణిగా ఎలా తన కీర్తిని సుస్థిరం చేసుకుంది? 

                                                               తరువాయి టపాలో చర్చిద్దాం....                                     

1, డిసెంబర్ 2014, సోమవారం

అనుగురాజు మరణం ఒక మిస్టరీ....(నాయకురాలు నాగమ్మ-3)



         అనుగురాజు మరణం గురించి మౌఖిక కథల్లోనూ చాలమంది రచయితల కథల్లోనూ ఈ విధంగా రాశారు. 

     బ్రహ్మనాయుడు సింహాసనానికి నమస్కరించాడు... వెంటనే సింహాసనం పేలిపోయింది. పగిలిపోయిన సిమ్హాసనం లో నుండి ఒక ముక్క ఎగిరి వచ్చి అనుగురాజును తగిలింది దానితో అనుగురాజు మరణించాడు. ఇది మనమయితే నిజంగానే నమ్మము. కానీ బ్రహ్మనాయుడిని విష్ణువాంశ సంభూతునిగా భావించే ప్రజలు మాత్రం నమ్మారు. కాదు బ్రహ్మనాయుడి స్వంతమీడియా నమ్మించింది. 

     నిజానికి అనుగు రాజు మరణించే నాటికి నలగామరాజుకు 13 సంవత్సరాలు. అంటే పెంపుదు కొడుకు బాదరాజు బహుశా యువకుడై వుండవచ్చు. బ్రహ్మనాయుడు కూడా యవ్వనంలో వుండివుండవచ్చు. తండ్రి దొడ్డనాయుడు తదనంతరం బాదరాజు మంత్రి కావాలి కానీ బ్రహ్మనాయుడు మంత్రి అయ్యాడు అంటే ఇక్కడ బాదరాజు ఎందుకు మంత్రి కాలేక పొయాడు? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. బాదరాజు చనిపోయి అయినా వుండాలి లేదా పదవి వద్దు అని ప్రక్కకు తప్పుకుని అయినా వుండాలి. ఈ క్రమంలో మంత్రి పదవి దక్కించుకున్న బ్రహ్మనాయుడు తండ్రిని, అన్నను హతమార్చి వుంటాడా? చాలామంది రచయితలు అన్నను తండ్రిని హతమార్చి మంత్రి అయ్యాడనే రాశారు. ఇది అంతగా మనం నమ్మాల్సినంత అవసరం లేదేమో... ఏది ఏమైనా తండ్రి, అన్న ల అడ్డు తొలగిన తరువాతనే బ్రహ్మనాయుడు మంత్రి అయ్యాడన్నది వాస్తవం. 

        ఈ నేపధ్యం లో అనుగురాజు మరణం మాత్రం మిస్టరీ గానే మిగిలింది. వాస్తవానికి అనుగురాజుకు వేట అంటే ప్రాణం. ఒక సారి వేటకు వెళ్ళిన సమయంలో వెనుక నుండి ఒక సైనికుడు వేసిన బాణం గురితప్పి అనుగురాజుకు తగిలి మరణించాడు. ఆ వేట సమయం లో బ్రహ్మనాయుడు కూడా అదే బృందంలో వున్నాడు. తన అనుచరుడి ద్వారా బాణం వేయించి అనుగురాజును హత్య చేయించాడనే ఆరోపణలు వున్నాయి. ఈ విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు "నమస్కారం పేలిపోయిన సిం హాసనం" అంటూ కట్టు కథలు కల్పించారు. ఎవరిపైనా అనుమానం లేని అనుగురాజు జరిగింది నిజంగా ప్రమాదమేనని నమ్మాడు. తన పిల్లలు చిన్న వారని వారి బాధ్యతలు పట్టించుకోవాలని బ్రహ్మనాయుదిని ఆదేశించి చనిపోయాడు. ఈ నిజం తరువాత నిలకడమీద తెలిసి వుంటుంది. 

    ఈ సంఘటనను బట్టి బ్రహ్మనాయుడు మొదటి నుండీ పథకాలు పన్నడంలో మాంచి ఘటికుడే నని అర్థమవుతోంది.

     అలా రాజ్యం పై బ్రహ్మనాయుడు పెద్దరికాన్ని సంపాదించుకున్నాడు. గురజాల సిం హాసనం పై పేరుకు నలగామ రాజు కూర్చున్నప్పటికీ పెత్తనం మాత్రం బ్రహ్మనాయుడే చలాయించాడు. 

     అనుగు రాజు రెండవ భార్య భూరమాదేవికి నలుగురు కుమారులు కామరాజు, నరసింగరాజు, జెట్టి రాజు, పెరుమాళ్ళు రాజులు.

      పెద్ద భార్య వీరవిద్యల దేవికి ముగ్గురు కుమారులు పెద్ద మల్లదేవుడు, పినమల్లిదేవుడు, బాల మల్లిదేవుడు. వీరందరూ చాల చిన్నవారు. ఇలా  ఈ పిల్లలందరూ పెద్దవారయ్యేనాటికి రాజ్యం మొత్తం బ్రహ్మనాయుడి గుప్పిటిలోనే వుంది. పేరుకు రాజు నలగాముడే అయినప్పటికీ మొత్తం పరిపాలన అంతా బ్రహ్మనాయుడే నడిపించాడు. ఈ క్రమంలో బ్రహ్మనాయుడికి అత్యంత సన్నిహితులు, మిత్రబృందాలూ ఏర్పడ్డాయి. మామూలే కదా అధికారం ఎక్కడ వుంటే ఈగలు కూడా అక్కడే వుంటాయి!!! 

     ఇలా ఎలాంటి అడ్డంకులూ లేకుండా పరిపాలన సాగుతుండగా...రాజ్యంలో విపరీతంగా దొంగతనాలు, దారిదోపిడీలు విపరీతంగా జరగడం మొదలయ్యాయి. వ్యాపారులు సంతలలో వ్యాపారాలు చేసుకోలేక పోయారు. ఎక్కడి బండ్లను అక్కడే అటకాయించి దొంగలు యథేచ్చగా దోచుకుంటున్నారు. వ్యాపారులు మొదట మంత్రిగారికి ఫిర్యాదు చేశారు. ఫలితం లేదు నేరుగా రాజుగారికే ఫిర్యాదు చేశారు కానీ ఆయన మంత్రి గారినే పురమాయించడంతో పరిస్థితి యథాతథంగానే ఉండిపోయింది. ఈ పరిస్థితిలో   ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని వ్యాపారులు,వృత్తుల వారు, ప్రజలు నాగమ్మను ఆశ్రయించారు. ఈ దొంగతనాల వెనుక బ్రహ్మనాయుడి అనుచరుల హస్తం ఉందని అందుకే బ్రహ్మనాయుడు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. ఎలాగయినా తమను కాపాడమని ఆమెను ప్రాధేయ పడ్డారు. 

       రాజు, మహామంత్రుల మీదనే నాగమ్మకు ప్రజలు ఫిర్యాదులు చేశారంటే అసలు ఎవరు ఈ నాగమ్మ??? ఈ నాగమ్మకు ఉన్న అధికారమేంటి??? ఒక వితంతువు పైన ప్రజలకు ఇంత నమ్మకమేంటి???  

                                      ....    తదుపరి టపాలో పరిశీలిద్దాం.  .....                   

20, అక్టోబర్ 2014, సోమవారం

శీలం బ్రహ్మనాయుడు "శీలవంతుడు" కాదా (నాయకురాలు నాగమ్మ-2)



     దైవాంశ సంభూతుడుగా ప్రచారం చేయబడిన బ్రహ్మనాయుడు శీలవంతుడు కాదా??? అమాయక ప్రజలను అబద్ధాలతో,భ్రమలతో మోసం చేశాడా????

      అవుననే అనాల్సి వస్తోంది. చాపకూటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహోన్నత వ్యక్తి అని మనం భావిస్తున్న బ్రహ్మనాయుడు. తండ్రి లాంటి అనుగురాజును చంపించాడా? అడ్డం వచ్చిన తనతండ్రి దొడ్డనాయుడిని కూడా చంపించాడా??? జిట్టగామాలపాడు  వాస్తవ్యురాలు ఆరవెల్లి నాగమ్మ తండ్రి చౌదరి రామిరెడ్డిని, మేనమామ మేకపొతుల జగ్గరెడ్డిని అమానుషంగా చంపించాడా????

    చివరికి నలగామరాజు అల్లుడు అలరాజును తన ప్రియ పుత్రుడు కన్నమదాసుతో చంపించాడా??? శాంతియుతంగా వున్న పలనాడును రెండుగా చీల్చింది తన స్వార్థం కొరకేనా??? తన ఉనికిని పటిష్టం చేసుకోవడానికే పలనాటి యుద్ధమనే మారణహోమాన్ని సృష్టించాడా? అవసరం లేకపోయినా, యుద్ధాన్ని నివారించ గలిగే అవకాశాలు వున్నా పలనాటి యుద్ధం ఎందుకు జరిగింది??? నాలుగు పుట్ల నల్లపూసలు నాగులేటి ఒడ్డున ఎదుకు రాలాయి??? వీటన్నిటికీ కారకుడు బ్రహ్మనాయుడే అయివుండి అపవాదులు నాయకురాలిపై ఎందుకు మోపాడు?  

      పలనాటి యుద్ధ చరిత్రను లోతుగా పరిశీలిస్తే, పరిశొధిస్తే అవాక్కయ్యే నిజాలు తెలుస్తాయి. సచ్చీల నాగమ్మపై బ్రహ్మనాయుడు క్రక్కిన విషపు జ్వాలల వేడి మన హృదయాన్ని తాకుతుంది. 

అసలు ఈ పలనాడు రాజ్యం సంగతేందో చూద్దాం.

     ఇప్పటి వరకు లభించిన, అందరు రచయితలు ఏకాభిప్రాయానికి వచ్చిన ఆధారల ప్రకారం పలనాటి కథ 11,12 శతాబ్దాల నాటిదని తెలుస్తోంది. 

      హైహేయ  రాజవంశానికి చెందిన రాజు అనుగురాజు. ఇతడు ఉత్తరాది నుండి దక్షిణానికి వచ్చినట్లు తెలుస్తోంది. తన పూర్వీకుల పాపాల వల్ల తనకు కష్టాలు వచ్చాయని పండితుల సలహా ప్రకారం తీర్థ యాత్రలు చేస్తూ కృష్ణానది లో మునగగా తాను ధరించిన జీడిబట్టలు తెల్లగా మారి పాపప్రక్షాలన జరిగింది. అందు వల్ల ఇక్కడే స్థిరపడిపోయాడు. ఇదీ సంక్షిప్తంగా అనుగురాజు కథ. 

     అనుగురాజు నిజంగా రాజ్యాన్ని పరిపాలిస్తుంటే తీర్థ యాత్ర ముగియగానే తన రాజధానికి వెళ్ళీపోయి వుండేవాడు. కానీ వెళ్ళకుండా ఇక్కడే స్థిరపడిపోయాడు. 

     నిజానికి అనుగురాజు రాజ్యాన్ని శత్రువుల దండయాత్రలలో కోల్పోయి వుండవచ్చు. తన బంధువర్గంతో రాజ్యాన్ని విడిచి శత్రువుల బారినుండి తమను రక్షించుకోవడానికి దక్షిణాదికి వచ్చి వుండవచ్చు. రాజ్యం కోల్పోయిన తరువాత తన కష్టాలకు కారణం ఏమిటని పండితులను అడిగి వుండవచ్చు. దానికి పండితులు మీ పూర్వీకుడు కార్త్యవీర్యార్జునుడు చేసిన పాపాలు నిన్ను వెంటాడుతున్నాయి కనుకనే నీకీ కష్టాలు అని చెప్పి వుండవచ్చు. ఈ కారణం  పైనే చాలామంది రచయితలు "కార్త్యవీర్యార్జునుడు చేసిన పాపాలు తన వంశీయులను అందరిని బధ పెట్టకుండా నన్నే ఎందుకు బధపెడుతున్నాయి" అని అనుగురాజు ఎందుకు అడగలేదో అంటూ చతురోక్తులు వాడారు. 

    అలా దక్షిణాదికి వచ్చిన అనుగురాజుకు చందనవోలు రాజు (వెలనాటి గొంకరాజు,వెలనాటి గొంకరాజు రాజేంద్ర చోడుడు అయి వుండవచ్చని చరిత్రకారుల అభిప్రాయము. ఈయన చతుర్థజ కులజుడని శాసనాలలో రాసి వుంది)తన కుమార్తె మైలమాదేవిని ఇచ్చి వివాహం చేశాడు. ఆమెకు అరణంగా గురజాల సీమను ఇచ్చాడు. 

మనం ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మన దృష్టితో చూద్దాం. 

     ఎక్కడో రాజ్యాన్ని పోగొట్టుకుని వచ్చిన అనామకుడికి ఎవరైనా కుమార్తెనిచ్చి, రాజ్యాన్నిస్తారా???? ముక్కుముఖం తెలియని వానికి అసలు కుమార్తెనే ఏ బుద్ధితక్కువ వాడు కూడా ఇవ్వడు. ఇక్కడ చందనవోలు రాజు కుమార్తెతో పాటు రాజ్యాన్ని కూడా ఇచ్చాడు. 

     అంటే ఇక్కడ చందనవోలు రాజుకు, అనుగురాజుకు ఖచ్చితంగా బంధుత్వం వుండేవుంటుంది. అందుకే చెడి తన పంచకు వచ్చిన వానికి పిల్లనిచ్చి రాజ్యాన్ని కూడా ఇచ్చి వుంటాడు. అలా గురజాల రాజధానిగా పలనాటి ప్రాంతానికి అనుగురాజు రాజయ్యాడు. ఆయనకు మంత్రి దొడ్డ నాయుడు. ఆ కాలంలో నాయుడు, నాయకుడు అనే బిరుదులను కేవలం సైనిక కుటుంబాలకు చెందిన వారికి మాత్రమే లభించేవి. కనుక ఈ దొడ్డనాయుడు రాజబంధువుల కుటుంబానికి చెందిన వాడు అయి వుండవచ్చు. చందనవోలు రాజుకు అత్యంత నమ్మకస్తుడు అయినా అయివుండవచ్చు. అలా రాజయిన అనుగురాజుకు దొడ్డనాయుడు మంత్రి అయ్యాడు. ఈయన కేవలం మంత్రి మాత్రమే కాదు రాజుకు అత్యంత సన్నిహితుడు కూడా అయివుండాలి. ఎందుకంటే పిల్లలు లేని అనుగురాజు దొడ్డనాయుడు పెద్ద కుమారుడు బాదరాజును పెంచుకున్నట్లు తెలుస్తోంది. కొంతకాలానికి బాదరాజుకు పెళ్ళి చేసి ఒక పట్టణానికి పాలకుడిగా నియమిచినట్లు ఒక సమాచారం కాగా బ్రహ్మనాయుడే మంత్రి  పదవి కొరకు అన్నను, తండ్రిని తుదముట్టించాడని కొందరు రాశారు. బాదరాజు పాలకుడే అయివుంటే యుద్ధ కాలం నాటికి ఎవరి తరపుననో ఒకరి తరపున యుద్ధం లో పల్గొని వుండేవాడు కానీ ఆయన యుద్ధం చేయలేదు. అంటే పలనాటి యుద్ధకాలం నాటికే మరణించి ఉండాలి. 

     అనుగురాజుకు ముగ్గురు భార్యలు వీరవిద్యలదేవి లేదా వీర విద్యాదేవి. రెండవ భార్య భూరమదేవి, మూడవ భార్య మైలమాదేవి.

    మూడవభార్య మైలమాదేవి కుమారుడే నలగామరాజు. అంటే  అనుగురాజు పలనాటికి వచ్చేనాటికే ఇద్దరు భార్యలు వుండి వుండాలి. అందుకే మైలమాదేవి మూడవభార్య అయింది.

   అంతే కాక మైలమాదేవికే మొదటి సంతానం కలిగి వుంటుంది అందుకే మైలమాదేవి కుమారుడైన నలగామరాజే అనుగురాజు తరువాత రాజైనాడు. నలగామరాజు 13 సంవత్సరాల వయసుకే రాజైనట్లు తెలుస్తోంది.

    అంటే అప్పటికే అనుగురాజు మృతి చెందాడు. బ్రహ్మనాయుడు అనుగురాజు వద్ద మంత్రిగా పని చేసినట్లు లేదు కనుక ఆయన కూడా అయన తండ్రి దొడ్డనాయుడి మరణం తరువాతనే మంత్రి అయినట్లు తెలుస్తోంది. నలగామరాజు రాజుగా, బ్రహ్మానాయుడు మంత్రిగా ఒకేసారి పదవులు స్వీకరించారా???

   అలా స్వీకరించడానికి ముందు అనుగురాజు ఎలా మరణించాడు, దొడ్డనాయుడు ఎలా మరణించాడు అన్నదానికి వివిధ రచయితలు ఏమిరాశారో పరిశిలిద్దాం....

                                                          ఇంకా  ఉంది తరువాత టపాలో ...               

15, అక్టోబర్ 2014, బుధవారం

కాపులారా లేవండి వెంకయ్యనాయుడి కీర్తిని బ్రతికించుకుందాం ...




రఘుపతి వెంకయ్యనాయుడు నేటి మన తెలుగు సినిమాకు ఆద్యుడు. సినిమా కొరకే జీవించి, సినిమాను శ్వాసించి సినిమా కొరకు జీవితాన్నే కాదు ఆస్థిని కూడా అంకితం చేసిన కళాతపస్వి. 
ఆ కళాతపస్వి జన్మదినం నేడు. సినిమా కొరకు తనను తాను అర్పించుకున్న ఆ మహానుభావుడిని సినిమారంగం ఎంతవరకు గౌరవించింది. ఏ మేరకు మర్యాదనిచ్చింది. 
సినిమా రంగం మొత్తాన్నైతే నిందించను ఎందుకంటే బాబ్జీ వంటి దర్శకులు ఆ మహానుభావుడి గురించి చాలా అభిమానాన్ని చూపించారు. 
వెంకయ్య పేరులో "నాయుడు" ను తొలగించినప్పుడు ఎందుకు తొలగించాల్సి వచ్చిందని తన కలం గళంతో ఎలుగెత్తి ప్రశ్నించిన వాడు బాబ్జి. మరి అలాంటి బాబ్జికి వెంకయ్య నాయుడు మా వాడు అని చెప్పుకుంటున్న "సినిమా కాపులు" ఏ మాత్రం మద్దతిచ్చారు. వెంకయ్య నాయుడు గురించి పరిశోధనలు చేసిన వారు భారతీయ సినిమాకు దాదాసాహెబ్ ఫాల్కే ఆధ్యుడు కాదు వెంకయ్య నాయుడే ఆద్యుడు అన్న ఆధారాలు సంపాదించారు. వందేళ్ళ సినిమా ఉత్సవం చెన్నై లో జరిగినప్పుడు ఆ మహానుభావుడి ఫొటొ ఒక్కటి కూడా పెట్టలేదన్న విమర్శలు వచ్చాయి. అప్పుడు తెలుగు "సినిమా కాపులు" ఏం చేస్తున్నారు? 

రఘుపతి వెంకయ్య నాయుడు పై 15-10-2012 న బాబ్జి దర్శకత్వంలో ఒక సినిమా మొదలు పెట్టారు. ఆ సినిమా అప్పట్లోనే పూర్తయినట్లు వార్తలు వచ్చాయి. నిర్మాత ఆర్థిక ఇబ్బందులతోనో మరే ఇతర కారణాల వల్లనో ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు.

గత రెండు నెలల క్రితం సినిమా పెద్దలు దాసరి నారాయణరావు గారు ఈ సినిమాను  కొన్నట్లుగా తెలిసింది. ఎందువల్లనో ఆయన కూడా ఈ సినిమాను విడుదల చేయలేదు. ఈ రోజు విడుదల చేసి వుంటే బాగుండేది.

 ప్రపంచానికి దిక్సూచిని అందించిన వారు కాపులు, ప్రపంచానికి వాణిజ్యాన్ని నేర్పించిన వారు కాపులు. మొట్టమొదట వజ్రాన్ని సానబట్టిన వారు కాపులు. చరిత్రనంతా కోల్పోయాము ఇంకా కోల్పోవడానికి మన వద్ద ఏమీలేదు. మొన్న శ్రీకృష్ణదేవరాయలు బలిజ వంశీయుడు కాదన్నారు కొందరు. నిన్న రఘుపతి వెంకయ్య నాయుడు బలిజ నాయుడా? కమ్మ నాయుడా? అని కొందరు ప్రశ్నించారు? ఇకనైనా ఈ జాతి నిద్ర లేవక పోతే మీ చరిత్రను ఇతరులు క్లెయిం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తస్మాత్ జాగ్రత్త.

రఘుపతి వెంకయ్య నాయుడు చిత్రాన్ని వెంటనే విడుదల చేసి ఆ మహానుభావుడికి ఘనంగా నివాళి అర్పించ వలసిందిగా గౌరవనీయులు, పెద్దలు దాసరి నారాయణరావు గారిని సవినయంగా వేడుకుంటున్నాము.

దయచేసి ప్రపంచ వ్యాప్తంగా వున్న కాపులు వెంకయ్య నాయుడు సినిమాను విడుదల చేయమని దాసరి గారిపై వత్తిడి తీసుకు రావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
******************* 

బుధవారం ఆంధ్రభూమిలో వచ్చిన ఈ ఆర్టికల్ ను కూడా చదవండి  

              




వెంకయ్య నాయుడికి సాక్షి దినపత్రిక ఇచ్చిన నివాళి ఇదికూడా చూడండి



14, అక్టోబర్ 2014, మంగళవారం

పలనాటి యుద్ధం ఏకపక్షంగా వ్యక్తీకరించబడింది. (నాయకురాలు నాగమ్మ -1)




         పలనాటి యుద్ధానికి సంబంధించిన గాధ మొత్తం ఒక వర్గం కోణం లోనే ఆవిష్కరించబడినట్లు కనిపిస్తుంది.. శ్రీనాథుడు సైతం ఒకవైపు నుండే చూసి పలనాటివీరచరిత్రాన్ని రాసినట్లుగా అనిపిస్తుంది. బహుశా ఈ కథను మౌఖికంగా ప్రచారం చేసిన వీరవిద్యలవాండ్ల ద్వారా చెప్పించుకుని దానిని తనదైన శైలిలో గ్రంధస్తం చేసి వుండవచ్చు.

     ఎందుకు ఇలా ఒక వర్గం కోణం లోనుండే పలనాటి యుద్ధ చరిత్ర రాయబడిందని నేను ఆరోపిస్తున్నానంటే ఈ కథలో వున్న పాత్రలు అన్నీ ఎక్కువగా బ్రహ్మనాయుడి వర్గానికి సంబంధించిన వారివి కావడం, వారితో సంబంధాలు ఉన్నవారివే కావడం వలన నేను ఈ అభిప్రాయానికి రాక తప్పడం లేదు.

     నాగమ్మ వర్గం వైపు పాత్రలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇలా ఎందుకు జరిగి వుంటుందంటే ఈ కథను ఎక్కువగా ప్రచారం చేసిన కళాకారులు. బ్రహ్మన్నాయుడి కి సన్నిహితులు కావడం తో వారికి బ్రహ్మనాయుడి వైపు పాత్రల పరిచయం మాత్రమే వుంటుంది. నాగమ్మ వర్గీయులలో చాలామంది వివరాలు బయటకు రాకపోవడానికి వారి గురించి ఈ కళాకారులకు  తెలియకపోయివుండవచ్చు. 

    ఇక మరో విషయం ఏమిటంటే పలనాటి వీరుల చరిత్రలు చెప్పే వీరవిద్యల వాండ్లు అనుగురాజు పెద్ద భార్య వీరవిద్యాదేవి పేరు పైన ఏర్పడినట్లుగా తెలుస్తోంది.

   అంటే ఆ కాలంలోనే ప్రచార మాధ్యమాల ప్రభావాన్ని అత్యంత సమర్థవంతంగా వినియోగించుకున్న వ్యక్తి బ్రహ్మనాయుడని చెప్పుకోవచ్చు. ఈ ప్రచార బృందాల ఏర్పాటులో రాణిపేరును వినియోగించుకున్న బ్రహ్మనాయుడు  నేటి ఆధునిక  రాజకీయనాయకుల పంధాను (సోనియాగాంధి ప్రాపకం కొరకు రాజీవ్ యువశక్తి, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాల ఏర్పాటు)  900 ఏళ్ళక్రితమే అమలు చేశాడంటే నిజంగా ఆశ్చ్యర్యం వేస్తుంది.

    అలా బ్రహ్మన్నాయుడి అండదండలతో ఏర్పడిన ఈ కళా బృందాలు తమకు అన్నం పెట్టిన వారిని కీర్తించక మరెవరిని కీర్తిస్తారు? 

    ఈ క్రమంలోనే వారు ఈటు వైపు చూపిన శ్రద్ధ వైరి పక్షం పాత్రల పై చూపలేక పోయి వుండవచ్చు అంద్కుకే నాగమ్మ వర్గం వారి వివరాలు పూర్తిస్థాయిలో  లభించవు. 

    మలిదేవరాజు అంతఃపురం కాపలా యువతి "మాడచి" అన్న పేరును కూడా ప్రచారం చేయగలిగిన వారు నాగమ్మ కుటుంబం గురించి కూడా సరిగా వివరాలందించలేకపోయారు. బ్రహ్మనాయుడి దత్తు కుమారుల పేర్లు సైతం చెప్పగలిగిన వారు నలగామరాజు భార్య వుందో లేదో కూడా చెప్పలేక పోయారు. 

   మనం సాధారణంగా గమనిస్తుంటాము. ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడినప్పుడు ఎవరి ని వారు తమను సమర్థించుకుంటూ వాదనలు వినిపిస్తారు. నాకెందుకో పలనాటి చరిత్రలో వీరవిద్యావంతులు కానీ, శ్రీనాథుడు గానీ బ్రహ్మనాయుడి తరపున వాదనలు వినిపించినట్లుగానే కనిపిస్తోంది. ఓక వైపు వారు చెప్పే కథ విని అవతలి వారిని దుర్మార్గులుగా వర్ణించడం ఎంతవరకు న్యాయం?


    పాపం నాగమ్మ ప్రచార మాధ్యమాల ప్రభావం తెలియని అమాయకురాలిలా కనిపిస్తోంది. జర్మనీ నియంత హిట్లర్ కు అత్యంత సన్నిహితుడు "పాల్ జోసెఫ్ గోబెల్స్" అనే నాజీ లీడర్. ఈయనను హిట్లర్ ప్రచార శాఖ మంత్రిగా నియమిచాడు. హిట్లర్ చేసే పనులన్నింటినీ చాలా గొప్పవని, హిట్లర్ అవతార పురుషుడని ఉత్త అబద్ధాల ప్రచారం చేసేవాడు. ఇలాంటి ప్రచారం వల్ల ప్రజలలో హిట్లర్ గొప్ప నాయకుడిగా మనుగడ సాగించాడు. 

      ప్రచారం యొక్క ప్రభావం ఏంటో నాజీ నియంత హిట్లర్ కు తెలుసు. దానితోనే ప్రజలను మొసం చేశాడు కానీ ప్రపంచాన్ని మోసం చేయలెకపొయాడు.

      మన బ్రహ్మన్నాయుడు గారికి హిట్లర్ గారికి పోలికలేమైనా కనిపిస్తున్నాయా...

        నాకైతే కనిపిస్తున్నాయి.

    బ్రహ్మన్నాయుడిని విష్ణువాంశ సంభూతుడిగా ప్రచారం చేసిన వారికి, హిట్లర్ ను మించిన నాయకుడు ప్రపంచంలో లేడని ప్రచారం చేసిన గోబెల్స్ కు తేడా నాకెక్కడ కనిపించడం లేదు.

     అందుకే పలనాటి చరిత్ర ఏకపక్ష దర్పణమనే నేను అభిప్రాయపడుతున్నాను. అబద్ధాలు చెప్పేవాడు ఎక్కడో ఒకచోట తడబడతాడు.కానీ పలనాటి చరిత్రలో అలాంటి తడబాట్లు చాలా వున్నాయి.

      ఈర్ష్యతో ఉండేవాడు అసూయను, అక్కసును తన మాటల్లో వెళ్ళగక్కుతాడు. అలాంటి అక్కసు కూడా పలనాటి చరిత్రలో చాలాచోట్ల తారస పడుతుంది.   
                                                                                                                                             (ఇంకా వుంది)

3, అక్టోబర్ 2014, శుక్రవారం

నాయకురాలు నాగమ్మ నాయకురాలే... ప్రతి నాయిక కాదు....



    


      వెయ్యి సంవత్సరాల క్రితం జీవించి ప్రపంచం లోనే తొలి మహిళా మహామంత్రిణి గా పిలువ బడిన నాయకురాలు నాగమ్మ. స్వార్థపరుల ఓర్వలేనితనం, కుహనా ప్రచారకుల అబద్ధపు ప్రచారాలతో ఆమెను ఓ విషపు నాగుగా చిత్రీకరించారు. పలనాటి యుద్ధం లో నాగమ్మే నిజమైన హీరో. అనేక  చారిత్రక అంశాలను పరిశీలించిన తరువాత నాగమ్మ ఉదాత్తత ను, గొప్పదనాన్ని బయటకు రాకుండా చరిత్రకు మసిపూసి మారేడుకాయను సృష్టించారనిపించింది. నిజానికి పలనాటి యుద్ధం జానపదుల మౌఖిక గాథ గానే ప్రచారం పొందింది. దానినే శ్రీనాథుడు "పల్నాటి వీరచరిత్రము" గ ద్విపదలో రచించారు. తరువాత చాలామంది రచయితలు చిలవలు పలవలు అల్లి దానినే మరింత అందంగా తీర్చిదిద్దారు.
       ఎవరి కథలో చూసినా నాగమ్మను కుటిలనీతికి ప్రతినిధిగానే చూపించారు. నాకు ఈ కథలు చదువుతోంటే ఎన్నో అనుమానాలు చాలాచోట్ల పూరించకుండా వదలివేసిన ఖాళీలు కనిపించాయి. కొన్నిచోట్ల నాగమ్మపై అక్కసు వెళ్ళగక్కుతున్నట్లుగా అనిపించింది. గురజాల ప్రాంతాన్ని ఏలుతున్న అనుగురాజు వేటకు వెళ్ళి తిరుగు ప్రయాణంలో అనామకురాలైన నాగమ్మ ఆతిథ్యాన్ని స్వీకరించాడు. ఆమె ఆతిథ్యానికి ముగ్ధుడై ఏడు ఘడియల పాటు మంత్రి పదవిని అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఎవరూ కూడా నాగమ్మ ఎవరు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు.
    ఒక మహరాజుకు ఒక అనామకురాలు విందు ఏర్పాటు చేయడమేమిటి? ముక్కూ ముఖం తెలియని అనామకురాలు విందు ఏర్పాటు చేస్తే రాజు వెళ్ళి తినడమేంటి? అనామకులు విందుకు పిలిస్తే రాజు లాంటి వారు వారి సైన్యంతో విందుకు వెళతారా??? 
      ఇక మరో సందేహం ఎప్పుడో అనుగురాజు వాగ్దానం చేస్తూ ఏడు ఘడియల పాటు మంత్రి పదవి ఇస్తానంటే దాన్ని ఆయన హయాం లోనే అనుభవించక అనుగురాజు కొడుకు నలగాముడు రాజ్యం చేస్తున్న కాలంలో నాగమ్మ ఎందుకు మంత్రి పదవిని కోరింది? 
      సరే నలగాముడి కొలువులో మంత్రి పదవి చేపట్టిన నాగమ్మ ఏడు ఘడియల తరువాత పదవిని ఎందుకు త్యజించలేదు? 
       కేవలం అతి కొద్దికాలం మంత్రి పదవిలో వున్న నాగమ్మ మాటలు విని కొన్ని ఏళ్ళుగా మంత్రి పదవిలో వున్న బ్రహ్మన్నను నలగాముడు ఎందుకు వదులుకున్నాడు.
      మంత్రి పదవి పోయిన తరువాత బ్రహ్మనాయుడు ఏంచేశాడు? 
     ఇలా ఎన్నో సందేహాలు. అబద్ధం చెప్పేవాడు ఎక్కడో ఒక చోట తడబడతాడంటారు. అలాంటి తడబాట్లు పలనాటి చరిత్రలో చాలా కనిపిస్తాయి. అలాంటి చోట్ల హాస్యాస్పదమైన కారణాలు చాలా చూపిస్తారు.
     ఇక బాలచంద్రుడినైతే ఏకంగా మహాభారతంలో అభిమన్యుడితో పోలుస్తారు. కొన్ని కథలలో ఏకంగా పలనాటి యుద్ధానికి బాలచంద్రుడు కారణమవుతాడని జ్యొతిష్కులు చెబితే బ్రహ్మనాయుడు చంపి వేయాల్సిందిగా ఆదేశించాడని రాశారు. 
   ఈ కథలలో బ్రహ్మనాయుడును కేంద్రంగా చేసి ఆయనను దైవాంశ సంభూతుడుగా చూపించడానికి ప్రయత్నించినట్లు కనిపిస్తుంది. ఆయన కథానాయకుడైతే ఆయనకు వ్యతిరేకంగా వున్న నాగమ్మ ప్రతినాయకురాలేగా... బ్రహ్మనాయుడుకు లేని గొప్పదనాన్ని ఎలాగైతే అంటగట్టారో అలాగే నాగమ్మలో లేని దుష్ట లక్షణాలను ఆమెకు ఆపాదించారు. 
      వెయ్యి సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఇతిహాసాన్ని విశ్లేషించడం నిజంగా ఒక సాహసమే... ఆ సాహసానికి నేను ఒడిగట్టాను చరిత్రలో పూరణకు నోచుకోని అనేక  ఖాళీలను పూరించడానికి నడుంకట్టాను. నా  సాహసోపేతమైన ఈ నిర్ణయానికి స్వర్గంలో వున్న నా పెద్దలు, నా వంశీయులు, ఆ భగవంతుడు ఆశీర్వాదాలు అందజేయమని వినమ్రతతో ప్రార్థిస్తున్నాను.

                                                                                                                                          -రచయిత 

15, జులై 2014, మంగళవారం

రాయల వంశం గురించి పెనుగొండలక్ష్మి గ్రంధం లో శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారు ఏమని రాశారు.



      పుట్టపర్తి వారు రాయల వారి రాజగురువు శ్రీ తాతాచార్యుల వారి వంశీకులు. వీరి ఇంట్లో విజయనగర సామ్రాజ్యం గురించి దాని వైభవం గురించి తరతరాలుగా మాట్లాడుకునే వారు. శ్రీ నారాయణాచార్యుల వారి గురించి ప్రపంచానికి చెప్పడానికి నా అర్హత చాలదని సవినయంగా విన్నవించుకుంటున్నాను. ఎవరెస్ట్ శిఖరం గురించి ఒక చీమ వర్ణించగలుగుతుందా....నా పరిస్థితి అదే... 


      ఎవని పదమ్ములు శివ తాండవ లయాధిరూపమ్ములు
ఎవని భావమ్ములు సుందర శివాలాస్య రూపమ్ములు
అతడు పుట్టపర్తి సూరి! అభినవ కవితా మురారి!!
                                                -సి. నారాయణ రెడ్డి

          ప్రతివ్యక్తీ తనదైన చరిత్రను తెలుసుకోవడానికి ఉత్సాహపడతాడు. తనచరిత్ర గొప్పదైతే దానిని తలచుకొని గర్వపడతాడు. దాని స్పూర్తితో భవిష్యత్తును మలచుకోవడానికి తాపత్రయపడతాడు. 

       శ్రీ పుట్టపర్తి వారి వంశం కూడా విజయనగర సామ్రాజ్యం లో అంతర్భాగమే. అందుకే పెనుగొండ కోట, పాడుబడిన అంతఃపుర మహళ్ళు చూసినప్పుడు ఆయన హృదయం ఉప్పొంగేది. ఆ వినాశనాన్ని తలచుకొని ఆయన కళ్ళు అశృధారలను స్రవించేవి. 

       ఎందుకు ఆచార్యుల వారు అంతగా స్పందించేవారంటే... ఆ ప్రాంతం రాయల వంశీకుల  గౌరవాన్ని పొందిన పుట్టపర్తి వంశీకులు నడయాడిన ప్రాంతాలు కావడం వల్లనే.

        పుట్టపర్తి నారాయణాచార్యులు 14 భాషలలో అనర్గళంగా కవిత్వం చెప్పగల దిట్ట మాత్రమే అని చాలమంది అనుకుంటుంటారు. 

ఆయన కవిత్వంలో ఎంతటి శిఖరమో చరిత్ర పరిశోధనలో అంతకంటే ఉద్ధండుడని చాలమందికి తెలుసు. 

శ్రి రాయల వారి ఇంటిపేరు సంపెట వారని మొట్టమొదట ప్రకటించిన వారు శ్రీ ఆచార్యుల వారే.  

        ఆయన 12 సంవత్సరాల వయసులో అద్భుతంగా రాసిన పద్య కావ్యం పెనుగొండలక్ష్మి. ఈ గ్రంధం చివరన మా పెనుగొండ అంటూ పెనుగొండ చరిత్రను, ప్రాంతాలను ఆయన వర్ణించారు. ఆ క్రమం లోనే శ్రీ ఆచార్యుల వారు రాయల వంశాన్ని గురించి 37వ పేజీలో చెప్పారు. 

గమనించండి


పుట్టపర్తి వారు స్వదస్తూరి తో రాసిన పత్రము



18, ఏప్రిల్ 2014, శుక్రవారం

కాకతీయ ప్రతాపరుద్రుడు బ్రహ్మణుడా హవ్వ.... ఈ రాతలు చూడండి.

           కాకతీయ ప్రతాపరుద్రుడు రుద్రమదేవి కుమార్తె యొక్క  కుమారుడు అన్న విషయం అందరికీ తెలిసినదే. పెద్ద కుమార్తె ముమ్మడమ్మను తన పుట్టింటి వారికి ఇచ్చి పెళ్ళి చేసింది. తన పుట్టింటి వంశీయుడైన కాకతీయ మహదేవుడికి ( ఇతడికి "కాకతీయ వంశ దుగ్దాబ్ది చంద్రమ" అనే బిరుదు ఉంది) ఇచ్చి పెళ్ళి చేసింది. వీరి కుమారుడే  ప్రతాపరుద్రుడు. రుద్రమదేవి చాళుక్య వీరభధ్రుడి ఇల్లాలైనప్పటికీ కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలడానికి పుట్టింటికి వచ్చి వారి సామ్రాజ్యానికి వారసులు లేని లోటు తీర్చింది. తన తదనంతరము తన కుమార్తె కుమారుడిని సిమ్హాసనము పై కూర్చోబెట్టింది. 
దీన్ని బట్టి చాళుక్య వీరభధ్రుడి కుటుంబము కాకతీయుల కుటుంబము వియ్యపు కుటుంబాలే కదా. అలాంటప్పుడు వీరభధ్రుడి కుమార్తె కుమారుడు చాళుక్య  వంశీయుడెలా అవుతాడు???

        మరి ''ఆంధ్రుల చరిత్ర '' లో చిలుకూరి వీరభధ్ర రావు గారు మహదేవుడు నియోగి బ్రహ్మణుడు అని రాశారు. మరి దీనికి సంబంధించిన ఆధారాలు ఏమైన చుపించారా అంటే అదీ లేదు. ప్రతాప రుద్రుడు కాకతియుడెలా అవుతాడు అని ఆయన ప్రశ్నించిన వైనాన్ని ఒక్క సారి గమనించండి. ఈ గ్రంధం లోని పీటికలోనే ఆయన అనేక వివాదాలను ఎదుర్కున్నట్లు చెప్పారు. శేషాద్రి,రమణకవులనే వారి తొ చరిత్ర నిర్మాణంలో అభిప్రాయ భేదాలున్నట్లు ఆయనే చెప్పుకున్నారు. ఈ గ్రంధం లో ఈయన చాళుక్య వంశీయులను బ్రహ్మణులను చేసేశాడు. 

చాళుక్య వంశీయులు బ్రహ్మణులు అనడానికి ఎలాంటి ఆధారాలు చూపించడు.

ఎవరు చరిత్ర రాస్తే వారు తమ కులం వారని చెప్పుకోవడానికే ప్రాధాన్యతనిస్తే అసలు చరిత్ర ఎలా బయటకు వస్తుంది. 

ఇలాంటి మహానుభావుల చేతిలో నిర్మాణమైన చరిత్ర లో వాస్తవాలు ఎంత?     






ఇది కూడా గమనించండి


23, మార్చి 2014, ఆదివారం

యాదవుల గురించిన వికిపీడియా సమాచారం చూడండి


http://te.wikipedia.org/wiki/%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A6%E0%B0%B5#.E0.B0.97.E0.B1.8B.E0.B0.A4.E0.B1.8D.E0.B0.B0.E0.B0.AE.E0.B1.81.E0.B0.B2.E0.B1.81      

       యాదవ అనే శీర్షిక క్రింద వికిపీడియా లో వున్న సమాచారాన్ని (నేటివరకు వున్న సమాచారాన్ని) ఇక్కడ ఇస్తున్నాను. పాఠకులు దయచేసి గమనించగలరు. గతం లో ఇలాగే గొల్ల అనే శీర్షిక క్రింద వున్న సమాచారాన్ని ఒక బ్లాగులో చూపించగానే ఎవరో మహానుభావులు సమాచారం మొత్తాన్ని ఎడిట్ చేసేశారు. అదే విధంగా ఈ సమాచారాన్ని కూడా ఎడిట్ చేసే అవకాశాలు చాలా వున్నాయి కనుక పరిశీలించాలన్న ఆసక్తి కలిగిన వారు వెంటనే పరిశీలించగలరు.  

       భారతదేశంలో పాడి పశువులను జీవనాధారంగా కలిగియుండే తెగలు చాలా ఉన్నాయి. వారిలో యాదవ అనేది ఒక ప్రాచీన తెగ. వేదవ్యాసుడు వ్రాసిన మహాభారత కావ్యంలో యాదవులు చంద్రవంశపు రాజులని ప్రస్తావన ఉన్నది. వృషిణి అను తెగకు చెందిన యాదు అను రాజుయొక్క సంతానమునకు యాదవులని పేరు వచ్చినది. యాదవులకు ప్రధాన ఆరాధ్యదైవం శ్రీకృష్ణుడు మాత్రమే. యాదవులు ముఖ్యంగా ఉత్తరభారతదేశంలో కనిపిస్తారు.

విషయ సూచిక  
1 గోత్రములు
2 అపొహ
3 ఇవీ చూడండి
4 లంకెలు
గోత్రములు

      అఫారియ, ఆత్రి, ఆరుద్ర, అహ్లవత్/అహ్ల, అరుకవల్, అక్షితల, బద్గర్, భగ్తిహ, భతోతియ, భలేరావ్, బల్వాన్, బిక్వాలియా, భిల్లాన్, బకియ, బదారియ, బద్గిర్/బద్గారియ, బనియ, బిచ్వాల్, భాటియా/భాటి, భమస్ర, భంకోలియా, బమోరియా, బిస్వార్, చౌర, చండేల/చండేల్, చౌహాన్, చిటోసియ, చిక్న, చోర, దగర్, దూసద్, దహియ, దెహ్రాన్, దతర్త, దేశ్వాల్, దభర్, దందోలియ, దైమ, దదాన్, ఇకోసియ, ఫతల్, గంగానియ, గౌర్, ఘోషి, గొగాద్, గ్వాల్ వంశ్, గుమ్మి, గున్ వాల్, గాలి, గుర్వాలియ/గుర్వాడియ, గిరాద్, హరర్ద్, హర్బ్ల/హర్బాలా, హుదిన్ వాల్, హరికుప్పల, హర, హిన్ వాల్, జద్వల్, జగ్దోల్య, జగ్రోలియ, ఝవత్, జగ్దోలియ, జదం, జదవ్, జడేజ, ఝరోదియ, కకష్ / కక్కష్, కాస్యప్, కాన్ వి, ఖోలిద, కృష్టాత్, కోసిల, ఖోస్య, కుషగర్, ఖోల, కలలియ, ఖైలియవ్, ఖెర్వాల్, ఖోర్, ఖర్, కదైన్యా, కరిర, కక్రాలియ, కథి/కథియ, ఖేశ్వాల్, కమరియ, కొమొల్ల, ఖర్షన్, కల్గన్, లంబ, మాందైయ, మందల్, మరఠా, మొతల్, మథ, మేథ, మెథానియ, మెహతా, మొతన్, మహలె, మహ్లా/మహ్లావత్, ముద్దాద, నందగోపాల్,
అపొహ

      యాదవులు అనగా గొల్లలు అని తెలుగువారిలో ఒక అపోహ ఉన్నది. గొల్లలు దక్షిణ భారతదేశానికి చెందిన ఒక ద్రావిడ తెగ. కాగా యాదవులు ఉత్తరభారతదేశంలో కనిపించే పశువుల కాపరులు. ఈ రెండు తెగల వృత్తి ఒకటే కావడంతో సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన తెలుగు కవులు తెలుగువారికి కిరాతులను బోయవారిగా పరిచయం చేసినట్లే యాదవులను కూడా గొల్లవారిగా పరిచయం చేశారు. రిజర్వేషన్ సౌలభ్యం కోసం భారత ప్రభుత్వం కూడా పశువులు, గొఱ్రెలను మేపుకొనే తెగలందరినీ యాదవ గ్రూపుగా వర్గీకరించింది. ఈ కారణంగా గొల్లలు - యాదవులు ఒక్కటేనని అనే భావన ఏర్పడింది, యాదవ-గొల్ల అనే ఉపకులం ఏర్పడింది. ఈ భావన వల్ల ఇటీవల గొల్లవారు కూడా తమ పేర్ల చివర యాదవ్ అని తగిలించుకుంటున్నారు. వాస్తవానికి గోత్ర, గృహనామ, ఆచార వ్యవహార విషయాల్లో గొల్లలకు యాదవులకు ఎటువంటి సంబంధము లేదు. పైన ఇవ్వబడిన గోత్రములలో ఏ ఒక్కటీ గొల్లలకు చెందినది లేదు.

ఇవీ చూడండి

22, మార్చి 2014, శనివారం

యాదవులంటె ఎవరు? ఇదిగో వాస్తవాలు గమనించండి



96 తెగలు కలిగి 56 దేశాలను పాలించిన వారు బలిజలు. ఇది ఎన్నో శాసనాలలో కనిపిస్తున్నా వాస్తవం. ఈ 96 తెగలు ఏవి? వాటిలో  యదు వంశం కూడా ఒకటా....

బ్రిటీషు వారు రాసిన ఈ గెజిట్ రిపోర్టులు గమనించండి....


       The Poona Kunbis not content with calling themselves Marathas, go so far as to call themselves Kshatriyas and wear the sacred thread they include a traditional total of Ninety six clans which are side to be sprung from the rules of fifty six contries who are the descendants of Vikram of Ujain whose traditional date is B.C.56, Shalivahan of Paithan whose traditional date is A.D.76, and Bhojaraja of Malva whos traditional date is about th end of the tenth centuary. According to the traditional accounts. The Bhosles to whoom Shivaji belonged are the descendents of Bhojaraja: the descendants of Vikram are called sukarrajas and those of Shalivahan Rajakumars. All claim to belong to one of the four branches or vanshas of the Kshatriyas soma-vansha of the moon branch, surya-vansha sun branch, Sesh-vansha or the Snake branch, and Yadu-vansha or the shepherd branch. 

Bombay Gazetteer Vol's 18,284and 285.


బ్రిటీషు వారు రాసిన ఈ గెజిట్ రిపోర్టులు గమనించండి.

ఈ బాంబే గెజిట్లో మహారాష్ట్ర లోని మరాఠాలను కునిభి లు అంటారు. చత్రపతి శివాజీ ఈ వంశం వాడే...


ఈ క్రింది హైదరాబద్ గెజిట్ ను గమనించండి... 

  The Kapus or Kunibis the great Agricultural Caste in the State members 29,53,000 Persons or 26 percent of the whole population. 

Vol.XIII Page no. 247, Hyderabad State Gazette.

మహారాష్ట్ర లోని కునిభి లు, హైదరాబాదులోని కాపులు ఒకటె కులమనే కదా దీని అర్థం.

Under Kapu Heading in castes and tribes of Southern India Vol.No.117 

Balija:- The Chief Telugu trading casts many Balijas are now engaged in cultivation and this accounts for so many having returned Kapu as their main castes - kapu is a common Telugu word for many or cultivator it is not improbable that there was once a closer connection.


"బలిజ వారిది భూమి బలుసమై వ్రాసి
ఇసుక ముప్పిరిత్రాడు వెయ్యంగ నేర్చి
కలిమి బలములకెల్ల ఘన పుణ్య రాశి
కలనైన ధర్మముల్ ఘనత తో జేసి
అయ్యావళి ముఖ్యమైనట్టి వారు
కయ్యమందున కాలు కదిలించ బోరు
నేయ్యమందు మహా నేర్పు గల వారు
దివ్యతుల యాభై ఆరు దేశాల వారు బలిజ వారు"

"తెలివినేబదియారు దేశాదిపతులుగా
నిలుచుట బలిజ సింహాసనంబు,
శరణాగతత్రాణ సద్బిరుదుభాసిల్లె
......... బలిజ సింహాసనంబు,
మర్యాదమల్లని మాడ్కిని ధర్మంబు
న్యాయంబు బలిజ సింహాసనంబు,
త్యాగభోగంబుల దానకర్ణుని మించె
నభివృద్ధి బలిజ సింహాసనంబు,
మాళ వాంధ్ర మగధ కురూ లాట
........... ప్రభులు బలులు
అద్భుతంబైన బలిజ సింహాసనంబు." 

బాంబే గెజిట్లో వున్న 56 దేశాల వారూ ఓరియెంటల్ లైబ్రరీ లో లభిస్తున్న  10-16-10 అనే తాళపత్ర గ్రంధం  లో ని పై పద్యాలలో వున్న 56 దేశాల వారు బలిజ కులస్తులే అయినప్పుడు. 

బాంబే గెజిట్లో వున్న యదు వంశం  బలిజ కులానికి చెందిన 96 తెగల్లో ఒకటి కదా...

 యదు వంశీయులు క్షత్రియ వంశీయులే కానీ గొల్లలు కాదు. 

మరి అలాంటప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో వున్న గొల్ల కులస్తులు మేము  యదు వంశీకులమని  ఎలా చెప్పుకుంటారు? 

1, మార్చి 2014, శనివారం

తెలుగు పద్యాలను అర్థం చేసుకోలేని అర్ధ మేధావులే గొల్లలను తప్పుదోవ పట్టించారు.



         తెలుగు చాలా భాషల కంటే అధునాతన భాష. ప్రపంచం లోనే ఏ భాష లో కూడా లేనటువంటి సాహిత్య ప్రక్రియలను కలిగినటుమవంటి ఏకైక భాష. 

        అలాంటి తెలుగు భాషలో నిష్ణాతులమని చెప్పుకున్న కొంతమంది "పారిజాతాపహరణాన్ని"  అర్థం  చేసుకోలేక పాపం గొల్ల కులస్తులను తప్పుదోవ పట్టించారు. తమ ఉనికి కొరకు తమకు తెలిసిన వాటినే పుస్తకాలుగా రాశారు. అలాంటివారిని కొంతమందిని మేము గుర్తించాము. వారిని పేర్లతో సహా ఇక్కడ ప్రచురించి కడిగి వేయాలని మొదట అనుకున్నాము. కానీ వారు గౌరవప్రదమైన వృత్తులలో జీవిస్తున్నారు. సమాజం లో గౌరవాన్నీ ఆస్వాదిస్తున్నారు. వారి వయసు రీత్యా వారిని అవమానించ కూడదని అది సంస్కారం కాదని వారు కావాలని ఆ తప్పులు చేసి వుండక పోవచ్చని పొరపాటుగా తమ పుస్తకాలను ప్రచురించారని మేము భావిస్తున్నాము. అలాంటి రచయితలు ఒక్క సారి తమ తప్పులను తెలుసుకుని సరిదిద్దుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అలా సరిదిద్దుకోని పక్షం లో వున్న గౌరవాన్ని ముందు తరాల ముందు కోల్పోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాము.  


                                                                                                                   -బ్లాగు నిర్వాహకుడు   

శ్రీకృష్ణదేవరాయల వంశ వివరణ


పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన

           పారిజాతాపహరణము  శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవి అయిన ముక్కుతిమ్మన చే వ్రాయబడినది.  
ఇందు వర్ణించిన వర్ణన ప్రకారం శ్రీమహావిష్ణుమూర్తి ద్వాపరయుగములో శ్రీకృష్ణునిగా యయాతి పెద్దకుమారుడైన యదువు వంశములో వసుదేవుని ఇంట పుట్టినప్పటికీ అతను చిన్నతనములోనే నందుని ఇంట పెరిగినందున సింహాసనం ఎక్కి రాజ్యాన్ని పరిపాలించే అర్హత పొందలేకపోయెను, మరల అదే  శ్రీ మహావిష్ణుముర్తి కలియుగములో యయాతి రెండవ కుమారుడైన తుర్వసుని వంశపరంపరలో నరసనాయకుని ఇంట శ్రీకృష్ణదేవరాయలుగా అవతరించి సింహాసనంఎక్కి రాజ్యాన్నిపరిపాలించే అర్హత పొందెను అని ద్వాపరయుగములో జరిగిన శ్రీకృష్ణుని వర్ణనలతో, కలియుగములోని శ్రిక్రిష్ణదేవరయలను పోలుస్తూ(తులానాత్మక వర్ణన) అద్భుతమైన వర్ణనలతో పారిజాతాపహరణము రచించెను 

పారిజాతాపహరణము కృతిపతియగు శ్రీకృష్ణదేవరాయల  వంశ ప్రశస్తి గురించి వివరించిన పద్యాలు

ఆ యమృతాంశునం దుదయమయ్యె బుధుం, డతఁ డార్తరక్షణో
పాయుఁ బురూరవుంగనియె, నాతని కాయువు పుత్త్రుఁ డయ్యె, న
య్యాయతకీర్తికి న్నహుషుఁ డాత్మజుఁడై యిలయేలెఁ, దత్సుతుం
డై యలరె న్యయాతి, యతఁడాహవదోహలుగాంచెఁ దుర్వసు\న్‌.

     (ఈ పద్యములో చంద్రునికి బుధుడు, యీతనికి పురూరవుడు, యీతనికి ఆయువు, యీతనికి నహుషుడు, యీతనికి యయాతి పరంపరగా పుట్టినట్టు వర్ణించెను. ఈ యయాతికి తుర్వసుడు పుట్టెను అని తెలిపెను. అనగా యయాతికి యదు, తుర్వసు, అను, ద్రుహ్యు, పురులను ఐదుగురు కుమారులలో తుర్వసుని మాత్రమే ఇక్కడ శ్రిక్రిష్ణదేవరాయల వంశానికి మూలపురుషునిగా తెలిపెను )   

ఉర్వీశమౌళి యగు నా
తుర్వసు వంశంబునందు దుష్టారి భుజా
దుర్వార గర్వ రేఖా
నిర్వాపకుఁ డీశ్వరాఖ్య నృపతి జనించె\న్‌.
(ఈ పద్యములో తుర్వసు వంశమున ఈశ్వర పుట్టెను అని తెలిపెను).

శాశ్వత విజయుఁడు తిమ్మయ
యీశ్వర నృపతికిని గౌరి కెన యగు తత్ప్రా
ణేశ్వరి లక్కాంబికకు
న్విశ్వాతిగ యశుఁడు సరసవిభుఁ డుదయించె.

(ఈ పద్యములో తిమ్మయ కుమారుడు ఈశ్వర ఈతని భార్య లక్కంబిక ద్వారా నరసా నాయక పుట్టెను అని తెలిపెను).

ఆ నరస మహీమహిళా
జానికిఁ గులసతులు పుణ్యచరితలు తిప్పాం
బా నాగాంబిక లిరువురు
దానవ దమనునకు రమయు ధరయును బోలె\న్‌.

(ఈ పద్యములో నరసా నాయక భార్యలు తిప్పాంబా, నాగాంబిక అని తెలిపెను).

వారలలోఁ దిప్పాంబ కు
మారుఁడు పరిపంథి కంధి మంథాచలమై
వీరనరసింహరాయుఁడు
వారాశి పరీశ భూమి వలయం బేలె\న్‌.

(ఈ పద్యములో తిప్పాంబా కుమారుడు వీరనరసింహరాయుఁడు అని తెలిపెను).

వీర శ్రీనరసింహశౌరి పిదప న్విశ్వంభరా మండలీ
ధౌరంధర్యమున\న్‌ జనంబు ముదమంద న్నాగమాంబా సుతుం
డారూఢోన్నతిఁ గృష్ణరాయఁడు విభుండై రత్న సింహాసనం
బారోహించె, విరోధులు న్గహన శైలారోహముం జేయఁగ\న్‌.

(ఈ పద్యములో నాగాంబిక కుమారుడు గృష్ణరాయఁడు అని తెలిపెను).

యాదవత్వమున సింహాసనస్థుఁడు గామి - సింహాసనస్థుఁ డై చెన్ను మెఱయ
గొల్ల యిల్లాండ్రతోఁ గోడిగించుటఁ జేసి - పరకామినీ సహోదరతఁ జూప
మఱి జరాసుతునకై మథుర డించుటఁ జేసి - పరవర్గ దుర్గము ల్బలిమిఁ గొనఁగఁ
బారిజాతము నాసపడి పట్టి తెచ్చుట - నౌదార్యమున దాని నడుగు వఱుపఁ

       ఇందు శ్రీ మహావిష్ణుముర్తి ద్వాపరయుగమున శ్రీకృష్ణునిగా యయాతి పెద్ద కుమారుడైన యదువంశములో వసుదేవుని ఇంట పుట్టినప్పటికీ అతను చిన్నతనములోనే నందుని ఇంట పెరిగినందున కలిగిన యాదవత్వము (అనగా తిమ్మన్న గారి దృష్టిలో పశువులు మేపుకొను వృత్తి అయి వుండవచ్చు ) వల్ల సింహాసనం ఎక్కి రాజ్యాన్ని పరిపాలించే అర్హత పొందలేకపోయెను,  మరల  అదే  శ్రీ మహావిష్ణుముర్తి  కలియుగములో యయాతి రెండవ కుమారుడైన తుర్వసు వంశ పరంపరలో నరసనాయకుని ఇంట శ్రీకృష్ణదేవరాయలుగా అవతరించి సింహాసనం ఎక్కి రాజ్యాన్ని పరిపాలించే అర్హత పొందెను ఆనాడు ద్వాపరయుగములో శ్రీకృష్ణునిగా గొల్ల స్త్రీలతో తిరుగుతూ ఉండేననియు, కాని కలియుగములో శ్రీకృష్ణదేవరాయలుగా పర స్త్రీలు అందరిని తోబుట్టువులుగా చూసే వాడనియు, ఆనాడు ద్వాపరయుగములో శ్రీకృష్ణునిగా జరాసందునితో చేసిన యుద్దమున ఓడిపోయి మధుర విడిచి వెళ్ళిపోతే, ఈనాడు కలియుగములో శ్రీకృష్ణదేవరాయలుగా శత్రు దుర్గములను అమిత భలముతో జయిన్చేననియు, ఆనాడు ద్వాపరయుగములో శ్రీకృష్ణునిగా పేరాసతో పారిజాతము స్వాదీనము చేసుకోనేననియు, ఈనాడు కలియుగములో శ్రీకృష్ణదేవరాయలుగా దానిని ఔదార్యముతో అడిగి తెచ్చుకొనెను అని ద్వాపరయుగములోని  శ్రీకృష్ణుని వర్ణనలతో శ్రిక్రిష్ణదేవరయలను కలియుగములోని శ్రీ మహావిష్ణుముర్తి అవతారంగా పోలుస్తూ అద్భుతమైన వర్ణనలతో పారిజాతాపహరణము రచించెను)

చక్రవర్తి మహా ప్రశస్తి నాఁడును నేఁడు - చెలఁగి ధర్మ క్రమ స్థితి ఘటించె
భూభృదుద్ధరణ విస్ఫూర్తి నాఁడును నేఁడు - గో రక్షణ ఖ్యాతిఁ గుదురు పఱిచె
సాధు బృందావన సరణి నాఁడును నేఁడు - వంశానురాగంబు వదలఁ డయ్యె
సత్యభామా భోగసక్తి నాఁడును నేఁడు - నాకల్ప మవని నింపార నిలిపె
నాఁడు నేఁడును యాదవాన్వయమునందు
జనన మందెను వసుదేవ మనుజవిభుని
కృష్ణుఁ డను పేర నరసేంద్రు కృష్ణదేవ
రాయఁ డనుపేర నాదినారాయణుఁడు.

         చక్రవర్తి యను గొప్ప ప్రసిద్ధి కలిగి యుండి ధర్మక్రమ స్థితిని ఘటించుట చేసియు, భూబృదుద్దరణ మొనర్చి గో రక్షణ ఖ్యాతి పాదుకోల్పుట చేసియు, సాథు బృంధావన సరణిని మించి వంశాను రాగము వదలమిం చేసియు త్యభామా భోగాసక్తిని మీరి ఆ కల్ప మవని నుల్పుట చేసియు,ఆ ఆదినారాయణుడె ద్వాపరయుగములో యదు వంశములోని వాసుదేవ సుతుడైన కృష్ణుడు కలియుగమున ఆ యదువు తమ్ముడైన తుర్వసు వంశములోని నరసరాజునకు కొడుకై కృష్ణరాయడు అను పేరుతో పుట్టెనని భావము  

      కృష్ణావతరమున చక్రమును దరించి ధర్మరాజునకు న్యాయమును కలిగించెను. కృష్ణరాయ అవతారమున చక్రవర్తి అని ప్రఖ్యాతి కెక్కి ధర్మమును కాపాడెను.  

చక్రవర్తిత్వము ధర్మక్రమ స్థితి ఈ రెండు అవతారాలలోను సమాన ధర్మాలు.

       క్రిష్ణవతారమున గోవర్ధనగిరిని ఎత్తి గోవులను గోపాలకులను కాపాడెను.  కృష్ణరాయ అవతారమున భూ పాలకులను జయించి భూమిని బాగా పాలించెను.

భూబృదుద్దరణ గో రక్షణ  ఈ రెండు అవతారాలలోను సమాన ధర్మాలు.

        క్రిష్ణవతారమున బృంధావన మునందు వేణువు నందును  గోప స్త్రీల అనురాగాముతోను కులుకుచుండెను.   కృష్ణరాయ అవతారమున దానిని మించిన అనురాగాముతోను  తన కుటుంబీకుల యందును తన వంశీయుల యందును అధిక ఆదరణ కలిగి ఉండెను.(ఎవరు ఈ బంధువులు ఆ కాలం లో ఏ కులానికి అధిక గౌరవం దక్కింది?)

సాదు బృంధావన వంశాను రాగములు ఈ రెండు అవతారాలలోను సమాన ధర్మాలు.

          క్రిష్ణవతారమున సత్యభామా ప్రీతి చేత పారిజాతమును స్వర్గమునుండి తెచ్చెను. కృష్ణరాయ అవతారమున సత్యమునందును సొంత భార్యలు యందును ప్రేమచే నవని నాకల్పము నిలిపెను. సత్యభామా భోగసక్తి యు నవని నాకల్ప స్థాపనము  ఈ రెండు అవతారాలలోను సమాన ధర్మాలు.

           అందువలన ఆ ఆదినారాయణుడె ద్వాపరయుగములో యదు వంశములోని వాసుదేవ సుతుడైన కృష్ణుడు కలియుగమున ఆ యదువు తమ్ముడైన తుర్వసు వంశములోని నరసరాజునకు కొడుకై కృష్ణరాయడు అను పేరుతో పుట్టెనని చమత్కారములతొ  ముక్కు తిమ్మన పారిజాతాపహరణము నందు వర్ణించెను.   


----------------------------------------


     అల్లసాని పెద్దన తను వ్రాసిన మనుచరిత్రమున శ్రీకృష్ణదేవరాయలు వంశం గురించి తెలుపుతూ చంద్ర వంశములోని యయాతి కొడుకైన యదువుకు తమ్ముడైన తుర్వసుని వంశములోని వాడని చాలా స్పస్టముగా తెలిపియున్నారు. 

     అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు తన వంశం గురించి తన స్వహస్తాలతో రచించిన ఆముక్తమాల్యద అను కావ్యమున చంద్ర వంశములోని యయాతి కొడుకైన యదువుకు తమ్ముడైన తుర్వసుని వంశములోని వాడినని చాలా స్పస్టముగా తెలిపియున్నారు 

-----------------------------------------------

        మన హిందూ పురాణాలు ప్రకారం చంద్రవంశమున బుధుడు, యీతనికి పురూరవుడు, యీతనికి ఆయువు, యీతనికి నహుషుడు, యీతనికి యయాతి పరంపరగా పుట్టెను. ఈ యయాతి కృతయుగమువాడు. ఆతనికి యదు, తుర్వసుడు, అను, ద్రుహ్యు, పురు అని ఐదుగురు కుమారులు. వీరిలో యదువుకు పుట్టినవారు మాత్రమె యదు వంశీయులు. ఈ యదువంశములోనే శ్రీకృష్ణ భగవానుడు ద్వాపర యుగములో పుట్టెను. కలియుగములో హైహయ, కలచుర్య, హొయసల, రాష్ట్రకూట, విజయనగర సంగమ, సాళువ మొదలగు వంశాలవారు ఈ యదువంశ పరంపరలోని వారుగా  ప్రకటించుకున్నారు.

         యదువు తమ్ముడగు తుర్వసుని వంశ పరంపరలోని వారమని గంగవాడి, కళింగ గంగ వంశీయులు, విజయనగర పాలకులైన శ్రీకృష్ణదేవరాయల కుటుంబీకులు ప్రకటించుకున్నారు. ఇంకా  తుర్వసుని వంశ పరంపరలోని వారే దక్షిణాదికి వచ్చి పాండ్య, చోళ, కేరళ, కుళ్య రాజ్యాలను స్తాపించెనని పురాణాల కథనం. మరియు యవనులు అను వారు కూడా తుర్వసుని వంశ పరంపరలోని వారని పురాణాల కథనం.

       యదువు తమ్ముడగు "అను" వంశ పరంపరలోని వారే అంగ, వంగ, కళింగ, పుండ్ర, ఓడ్ర, ఆంధ్ర మొదలగు వారని పురాణాల కథనం.      

    యదువు తమ్ముడగు ద్రుహ్యు వంశ పరంపరలోని వారే కంబోజ, మ్లేచ్చులు మొదలగు వారని పురాణాల కథనం.      
     
     యదువు తమ్ముడగు పురు వంశ పరంపరలోని అర్జనుని వంశం వారే భారత ఖండానికీ సర్వచక్రవర్తులు గ కలియుగములో వర్దిల్లినారు. వారి వంశ పరంపరలోని వారమని చాళుక్య, విజయనగర పాలకులైన అరవీటి మొదలగు వంశాలవారు ప్రకటించుకున్నారు).  

       కృతయుగములో తరువాత ద్వాపరయుగములో ఆ తరువాత కలియుగములో ఈ యయాతి వంశీయులు అనేక అనేక వంశ అనువంశ పరంపరలుగా విడిపోతూ అనేక  వర్గాలుగా విడిపోయి భరతఖండమంతా విస్తరించినారు. వీరందరూ ఉమ్మడిగా చంద్రవంశీయులు. 

                                                                విశ్లేషణ :   పోలిశెట్టి సత్తిరాయుడు, హైదరాబాదు.