1, మార్చి 2014, శనివారం

తెలుగు పద్యాలను అర్థం చేసుకోలేని అర్ధ మేధావులే గొల్లలను తప్పుదోవ పట్టించారు.



         తెలుగు చాలా భాషల కంటే అధునాతన భాష. ప్రపంచం లోనే ఏ భాష లో కూడా లేనటువంటి సాహిత్య ప్రక్రియలను కలిగినటుమవంటి ఏకైక భాష. 

        అలాంటి తెలుగు భాషలో నిష్ణాతులమని చెప్పుకున్న కొంతమంది "పారిజాతాపహరణాన్ని"  అర్థం  చేసుకోలేక పాపం గొల్ల కులస్తులను తప్పుదోవ పట్టించారు. తమ ఉనికి కొరకు తమకు తెలిసిన వాటినే పుస్తకాలుగా రాశారు. అలాంటివారిని కొంతమందిని మేము గుర్తించాము. వారిని పేర్లతో సహా ఇక్కడ ప్రచురించి కడిగి వేయాలని మొదట అనుకున్నాము. కానీ వారు గౌరవప్రదమైన వృత్తులలో జీవిస్తున్నారు. సమాజం లో గౌరవాన్నీ ఆస్వాదిస్తున్నారు. వారి వయసు రీత్యా వారిని అవమానించ కూడదని అది సంస్కారం కాదని వారు కావాలని ఆ తప్పులు చేసి వుండక పోవచ్చని పొరపాటుగా తమ పుస్తకాలను ప్రచురించారని మేము భావిస్తున్నాము. అలాంటి రచయితలు ఒక్క సారి తమ తప్పులను తెలుసుకుని సరిదిద్దుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అలా సరిదిద్దుకోని పక్షం లో వున్న గౌరవాన్ని ముందు తరాల ముందు కోల్పోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాము.  


                                                                                                                   -బ్లాగు నిర్వాహకుడు   

శ్రీకృష్ణదేవరాయల వంశ వివరణ


పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన

           పారిజాతాపహరణము  శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవి అయిన ముక్కుతిమ్మన చే వ్రాయబడినది.  
ఇందు వర్ణించిన వర్ణన ప్రకారం శ్రీమహావిష్ణుమూర్తి ద్వాపరయుగములో శ్రీకృష్ణునిగా యయాతి పెద్దకుమారుడైన యదువు వంశములో వసుదేవుని ఇంట పుట్టినప్పటికీ అతను చిన్నతనములోనే నందుని ఇంట పెరిగినందున సింహాసనం ఎక్కి రాజ్యాన్ని పరిపాలించే అర్హత పొందలేకపోయెను, మరల అదే  శ్రీ మహావిష్ణుముర్తి కలియుగములో యయాతి రెండవ కుమారుడైన తుర్వసుని వంశపరంపరలో నరసనాయకుని ఇంట శ్రీకృష్ణదేవరాయలుగా అవతరించి సింహాసనంఎక్కి రాజ్యాన్నిపరిపాలించే అర్హత పొందెను అని ద్వాపరయుగములో జరిగిన శ్రీకృష్ణుని వర్ణనలతో, కలియుగములోని శ్రిక్రిష్ణదేవరయలను పోలుస్తూ(తులానాత్మక వర్ణన) అద్భుతమైన వర్ణనలతో పారిజాతాపహరణము రచించెను 

పారిజాతాపహరణము కృతిపతియగు శ్రీకృష్ణదేవరాయల  వంశ ప్రశస్తి గురించి వివరించిన పద్యాలు

ఆ యమృతాంశునం దుదయమయ్యె బుధుం, డతఁ డార్తరక్షణో
పాయుఁ బురూరవుంగనియె, నాతని కాయువు పుత్త్రుఁ డయ్యె, న
య్యాయతకీర్తికి న్నహుషుఁ డాత్మజుఁడై యిలయేలెఁ, దత్సుతుం
డై యలరె న్యయాతి, యతఁడాహవదోహలుగాంచెఁ దుర్వసు\న్‌.

     (ఈ పద్యములో చంద్రునికి బుధుడు, యీతనికి పురూరవుడు, యీతనికి ఆయువు, యీతనికి నహుషుడు, యీతనికి యయాతి పరంపరగా పుట్టినట్టు వర్ణించెను. ఈ యయాతికి తుర్వసుడు పుట్టెను అని తెలిపెను. అనగా యయాతికి యదు, తుర్వసు, అను, ద్రుహ్యు, పురులను ఐదుగురు కుమారులలో తుర్వసుని మాత్రమే ఇక్కడ శ్రిక్రిష్ణదేవరాయల వంశానికి మూలపురుషునిగా తెలిపెను )   

ఉర్వీశమౌళి యగు నా
తుర్వసు వంశంబునందు దుష్టారి భుజా
దుర్వార గర్వ రేఖా
నిర్వాపకుఁ డీశ్వరాఖ్య నృపతి జనించె\న్‌.
(ఈ పద్యములో తుర్వసు వంశమున ఈశ్వర పుట్టెను అని తెలిపెను).

శాశ్వత విజయుఁడు తిమ్మయ
యీశ్వర నృపతికిని గౌరి కెన యగు తత్ప్రా
ణేశ్వరి లక్కాంబికకు
న్విశ్వాతిగ యశుఁడు సరసవిభుఁ డుదయించె.

(ఈ పద్యములో తిమ్మయ కుమారుడు ఈశ్వర ఈతని భార్య లక్కంబిక ద్వారా నరసా నాయక పుట్టెను అని తెలిపెను).

ఆ నరస మహీమహిళా
జానికిఁ గులసతులు పుణ్యచరితలు తిప్పాం
బా నాగాంబిక లిరువురు
దానవ దమనునకు రమయు ధరయును బోలె\న్‌.

(ఈ పద్యములో నరసా నాయక భార్యలు తిప్పాంబా, నాగాంబిక అని తెలిపెను).

వారలలోఁ దిప్పాంబ కు
మారుఁడు పరిపంథి కంధి మంథాచలమై
వీరనరసింహరాయుఁడు
వారాశి పరీశ భూమి వలయం బేలె\న్‌.

(ఈ పద్యములో తిప్పాంబా కుమారుడు వీరనరసింహరాయుఁడు అని తెలిపెను).

వీర శ్రీనరసింహశౌరి పిదప న్విశ్వంభరా మండలీ
ధౌరంధర్యమున\న్‌ జనంబు ముదమంద న్నాగమాంబా సుతుం
డారూఢోన్నతిఁ గృష్ణరాయఁడు విభుండై రత్న సింహాసనం
బారోహించె, విరోధులు న్గహన శైలారోహముం జేయఁగ\న్‌.

(ఈ పద్యములో నాగాంబిక కుమారుడు గృష్ణరాయఁడు అని తెలిపెను).

యాదవత్వమున సింహాసనస్థుఁడు గామి - సింహాసనస్థుఁ డై చెన్ను మెఱయ
గొల్ల యిల్లాండ్రతోఁ గోడిగించుటఁ జేసి - పరకామినీ సహోదరతఁ జూప
మఱి జరాసుతునకై మథుర డించుటఁ జేసి - పరవర్గ దుర్గము ల్బలిమిఁ గొనఁగఁ
బారిజాతము నాసపడి పట్టి తెచ్చుట - నౌదార్యమున దాని నడుగు వఱుపఁ

       ఇందు శ్రీ మహావిష్ణుముర్తి ద్వాపరయుగమున శ్రీకృష్ణునిగా యయాతి పెద్ద కుమారుడైన యదువంశములో వసుదేవుని ఇంట పుట్టినప్పటికీ అతను చిన్నతనములోనే నందుని ఇంట పెరిగినందున కలిగిన యాదవత్వము (అనగా తిమ్మన్న గారి దృష్టిలో పశువులు మేపుకొను వృత్తి అయి వుండవచ్చు ) వల్ల సింహాసనం ఎక్కి రాజ్యాన్ని పరిపాలించే అర్హత పొందలేకపోయెను,  మరల  అదే  శ్రీ మహావిష్ణుముర్తి  కలియుగములో యయాతి రెండవ కుమారుడైన తుర్వసు వంశ పరంపరలో నరసనాయకుని ఇంట శ్రీకృష్ణదేవరాయలుగా అవతరించి సింహాసనం ఎక్కి రాజ్యాన్ని పరిపాలించే అర్హత పొందెను ఆనాడు ద్వాపరయుగములో శ్రీకృష్ణునిగా గొల్ల స్త్రీలతో తిరుగుతూ ఉండేననియు, కాని కలియుగములో శ్రీకృష్ణదేవరాయలుగా పర స్త్రీలు అందరిని తోబుట్టువులుగా చూసే వాడనియు, ఆనాడు ద్వాపరయుగములో శ్రీకృష్ణునిగా జరాసందునితో చేసిన యుద్దమున ఓడిపోయి మధుర విడిచి వెళ్ళిపోతే, ఈనాడు కలియుగములో శ్రీకృష్ణదేవరాయలుగా శత్రు దుర్గములను అమిత భలముతో జయిన్చేననియు, ఆనాడు ద్వాపరయుగములో శ్రీకృష్ణునిగా పేరాసతో పారిజాతము స్వాదీనము చేసుకోనేననియు, ఈనాడు కలియుగములో శ్రీకృష్ణదేవరాయలుగా దానిని ఔదార్యముతో అడిగి తెచ్చుకొనెను అని ద్వాపరయుగములోని  శ్రీకృష్ణుని వర్ణనలతో శ్రిక్రిష్ణదేవరయలను కలియుగములోని శ్రీ మహావిష్ణుముర్తి అవతారంగా పోలుస్తూ అద్భుతమైన వర్ణనలతో పారిజాతాపహరణము రచించెను)

చక్రవర్తి మహా ప్రశస్తి నాఁడును నేఁడు - చెలఁగి ధర్మ క్రమ స్థితి ఘటించె
భూభృదుద్ధరణ విస్ఫూర్తి నాఁడును నేఁడు - గో రక్షణ ఖ్యాతిఁ గుదురు పఱిచె
సాధు బృందావన సరణి నాఁడును నేఁడు - వంశానురాగంబు వదలఁ డయ్యె
సత్యభామా భోగసక్తి నాఁడును నేఁడు - నాకల్ప మవని నింపార నిలిపె
నాఁడు నేఁడును యాదవాన్వయమునందు
జనన మందెను వసుదేవ మనుజవిభుని
కృష్ణుఁ డను పేర నరసేంద్రు కృష్ణదేవ
రాయఁ డనుపేర నాదినారాయణుఁడు.

         చక్రవర్తి యను గొప్ప ప్రసిద్ధి కలిగి యుండి ధర్మక్రమ స్థితిని ఘటించుట చేసియు, భూబృదుద్దరణ మొనర్చి గో రక్షణ ఖ్యాతి పాదుకోల్పుట చేసియు, సాథు బృంధావన సరణిని మించి వంశాను రాగము వదలమిం చేసియు త్యభామా భోగాసక్తిని మీరి ఆ కల్ప మవని నుల్పుట చేసియు,ఆ ఆదినారాయణుడె ద్వాపరయుగములో యదు వంశములోని వాసుదేవ సుతుడైన కృష్ణుడు కలియుగమున ఆ యదువు తమ్ముడైన తుర్వసు వంశములోని నరసరాజునకు కొడుకై కృష్ణరాయడు అను పేరుతో పుట్టెనని భావము  

      కృష్ణావతరమున చక్రమును దరించి ధర్మరాజునకు న్యాయమును కలిగించెను. కృష్ణరాయ అవతారమున చక్రవర్తి అని ప్రఖ్యాతి కెక్కి ధర్మమును కాపాడెను.  

చక్రవర్తిత్వము ధర్మక్రమ స్థితి ఈ రెండు అవతారాలలోను సమాన ధర్మాలు.

       క్రిష్ణవతారమున గోవర్ధనగిరిని ఎత్తి గోవులను గోపాలకులను కాపాడెను.  కృష్ణరాయ అవతారమున భూ పాలకులను జయించి భూమిని బాగా పాలించెను.

భూబృదుద్దరణ గో రక్షణ  ఈ రెండు అవతారాలలోను సమాన ధర్మాలు.

        క్రిష్ణవతారమున బృంధావన మునందు వేణువు నందును  గోప స్త్రీల అనురాగాముతోను కులుకుచుండెను.   కృష్ణరాయ అవతారమున దానిని మించిన అనురాగాముతోను  తన కుటుంబీకుల యందును తన వంశీయుల యందును అధిక ఆదరణ కలిగి ఉండెను.(ఎవరు ఈ బంధువులు ఆ కాలం లో ఏ కులానికి అధిక గౌరవం దక్కింది?)

సాదు బృంధావన వంశాను రాగములు ఈ రెండు అవతారాలలోను సమాన ధర్మాలు.

          క్రిష్ణవతారమున సత్యభామా ప్రీతి చేత పారిజాతమును స్వర్గమునుండి తెచ్చెను. కృష్ణరాయ అవతారమున సత్యమునందును సొంత భార్యలు యందును ప్రేమచే నవని నాకల్పము నిలిపెను. సత్యభామా భోగసక్తి యు నవని నాకల్ప స్థాపనము  ఈ రెండు అవతారాలలోను సమాన ధర్మాలు.

           అందువలన ఆ ఆదినారాయణుడె ద్వాపరయుగములో యదు వంశములోని వాసుదేవ సుతుడైన కృష్ణుడు కలియుగమున ఆ యదువు తమ్ముడైన తుర్వసు వంశములోని నరసరాజునకు కొడుకై కృష్ణరాయడు అను పేరుతో పుట్టెనని చమత్కారములతొ  ముక్కు తిమ్మన పారిజాతాపహరణము నందు వర్ణించెను.   


----------------------------------------


     అల్లసాని పెద్దన తను వ్రాసిన మనుచరిత్రమున శ్రీకృష్ణదేవరాయలు వంశం గురించి తెలుపుతూ చంద్ర వంశములోని యయాతి కొడుకైన యదువుకు తమ్ముడైన తుర్వసుని వంశములోని వాడని చాలా స్పస్టముగా తెలిపియున్నారు. 

     అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు తన వంశం గురించి తన స్వహస్తాలతో రచించిన ఆముక్తమాల్యద అను కావ్యమున చంద్ర వంశములోని యయాతి కొడుకైన యదువుకు తమ్ముడైన తుర్వసుని వంశములోని వాడినని చాలా స్పస్టముగా తెలిపియున్నారు 

-----------------------------------------------

        మన హిందూ పురాణాలు ప్రకారం చంద్రవంశమున బుధుడు, యీతనికి పురూరవుడు, యీతనికి ఆయువు, యీతనికి నహుషుడు, యీతనికి యయాతి పరంపరగా పుట్టెను. ఈ యయాతి కృతయుగమువాడు. ఆతనికి యదు, తుర్వసుడు, అను, ద్రుహ్యు, పురు అని ఐదుగురు కుమారులు. వీరిలో యదువుకు పుట్టినవారు మాత్రమె యదు వంశీయులు. ఈ యదువంశములోనే శ్రీకృష్ణ భగవానుడు ద్వాపర యుగములో పుట్టెను. కలియుగములో హైహయ, కలచుర్య, హొయసల, రాష్ట్రకూట, విజయనగర సంగమ, సాళువ మొదలగు వంశాలవారు ఈ యదువంశ పరంపరలోని వారుగా  ప్రకటించుకున్నారు.

         యదువు తమ్ముడగు తుర్వసుని వంశ పరంపరలోని వారమని గంగవాడి, కళింగ గంగ వంశీయులు, విజయనగర పాలకులైన శ్రీకృష్ణదేవరాయల కుటుంబీకులు ప్రకటించుకున్నారు. ఇంకా  తుర్వసుని వంశ పరంపరలోని వారే దక్షిణాదికి వచ్చి పాండ్య, చోళ, కేరళ, కుళ్య రాజ్యాలను స్తాపించెనని పురాణాల కథనం. మరియు యవనులు అను వారు కూడా తుర్వసుని వంశ పరంపరలోని వారని పురాణాల కథనం.

       యదువు తమ్ముడగు "అను" వంశ పరంపరలోని వారే అంగ, వంగ, కళింగ, పుండ్ర, ఓడ్ర, ఆంధ్ర మొదలగు వారని పురాణాల కథనం.      

    యదువు తమ్ముడగు ద్రుహ్యు వంశ పరంపరలోని వారే కంబోజ, మ్లేచ్చులు మొదలగు వారని పురాణాల కథనం.      
     
     యదువు తమ్ముడగు పురు వంశ పరంపరలోని అర్జనుని వంశం వారే భారత ఖండానికీ సర్వచక్రవర్తులు గ కలియుగములో వర్దిల్లినారు. వారి వంశ పరంపరలోని వారమని చాళుక్య, విజయనగర పాలకులైన అరవీటి మొదలగు వంశాలవారు ప్రకటించుకున్నారు).  

       కృతయుగములో తరువాత ద్వాపరయుగములో ఆ తరువాత కలియుగములో ఈ యయాతి వంశీయులు అనేక అనేక వంశ అనువంశ పరంపరలుగా విడిపోతూ అనేక  వర్గాలుగా విడిపోయి భరతఖండమంతా విస్తరించినారు. వీరందరూ ఉమ్మడిగా చంద్రవంశీయులు. 

                                                                విశ్లేషణ :   పోలిశెట్టి సత్తిరాయుడు, హైదరాబాదు. 
                                                                                         
    

19 కామెంట్‌లు:

  1. అభిగారూ, నమస్తే. మీ బ్లాగ్ పాత పోస్టులను కూడా చూశాను. కృష్ణదేవరాయలు, కాకతీయులమీద చాలా పెద్ద చర్చలే జరిగినట్లు తెలుసుకున్నాను. చరిత్రమీద, వర్ణాశ్రమధర్మంమీద మీ అభిప్రాయాలు, పరిజ్ఞానానికి అభినందనలు. మొండిగా వాదన చేయకుండా తప్పయితే సరిదిద్దుకుంటాను అని మధ్యమధ్యలో చెప్పటం చాలా నచ్చింది. సాటి కాపు కులస్తుడిగా నాకు చాలా సంతోషం వేసింది.

    All the Best!


    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలు తేజస్వి గారూ....

    రిప్లయితొలగించండి
  3. ఈ బ్లాగు నిర్వాహకుడు పారిజాతపహరణం గ్రంధాన్ని టీకా తాత్పర్యంతొ అందించిన రచయితలను కడిగి వదిలిపెట్టకుండ వదిలిపెట్టినందుకు అతనిని అభినందిచవలసినదే!!!.


    పారిజాతపహరణం విషయంలొ అందరు బలిజకుల వాదులు చేసినట్లే పోలిసెట్టి సత్తిరాయుడుగారు కూడా చేసినారు.


    సత్తిరాయుడుగారు ,మీరు 'యాదవత్వం ' అంటే గొల్లతనం అని అన్నారు ,యాదవత్వానికి వర్తించిన గొల్లతనం 'యాదవాన్వయంకీ వర్తించదా?


    'యాదవత్వం అంటే గొల్లతనమైనప్పుడు ,యాదవాన్వయం అంటే గొల్లకులం లేక గొల్లవంశం అవ్వాలికదా? '

    మీరు శ్రీక్రిష్ణదేవరాయలు యాదవకులంలొ పుట్టినట్లు పారిజాతపహరణంలొ చెప్పలేదు అని అంటున్నారు, మరి క్రిష్ణదేవరాయలు వేయించిన శాసనాలలో తనూ యాదవకులంలొ పుట్టినట్లు చెప్పినాడు కదా?(ఈ శాసనాలను మీరు ఈ బ్లాగు నిర్వాహకుడు వద్ద కూడా చూడ వచ్చు )

    ఈ బ్లాగు నిర్వాహకుడు లాగ కాకుండ మీరైన సూటిగా నా ప్రశ్నలకు సమాదానం చెప్పగలరని భావిస్తూన్నాను?




    రిప్లయితొలగించండి
  4. వెంకటేశ్వర్లు గారూ మీకు వెర్రి ఇంకాస్త ముదిరినట్టుందిగా!!!!

    పైన నేను వదలిపెట్టిన రచయితలు టీకా, తాత్పర్యాల తో సహా అందించిన రచయితలు కాదు.

    ఇప్పుడు మీ లా అడ్డంగా వాదించే వారిని తయారు చేసిన వారు.

    మీకు తవ్వాఓబులరెడ్డి గారి బ్లాగులో ఇచ్చిన కోటింగ్ సరిపోయినట్లు లేదుగా....

    ఇప్పుడు సత్తిరాయుడు గారు పద్యాల అర్థాలను వివరించారు.

    ఈ పద్యాలను తప్పుగా అర్థం చేసుకున్న వారు గొల్ల కులస్తులను తప్పు దోవ పట్టించిన రెండు మూడు పుస్తకాలు అవి కూడా ఈ మధ్య రాసినవి మాత్రమే, సరిదిద్ధుకోండని సలహ ఇచ్చాను అంతే.

    యాదవ+అన్వయము = యాదవాన్వయము

    మీరు పిల్లలకు ఏం చదువు చెబుతున్నారో ఏం పాడో ఇలాంటి చెత్తనే చెబుతున్నట్టున్నారుగా.

    నా పదాలలోని శ్లేషలనే అర్థం చేసుకోలేని మీరు ముక్కు తిమ్మన గారి పద్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. బెస్టాఫ్ లక్....

    రిప్లయితొలగించండి
  5. ఏంటీ శ్రీక్రిష్ణదేవరాయలు యాదవ కులం లో పుట్టానని శాసనాలలో చెప్పాడా??? అ శాసనాలు నా వద్దకూడా వున్నాయా??

    ఇదిగో ఇలాంటి మాటలనే నేను చెత్త అనేది.

    నా వద్ద శాసనాలు వున్నాయని మీకెవరు చెప్పారూ... లెక పోతే మా ఇంట్లో ఎవరూ లేనప్పుడు వచ్చి చూసి పొయారా.....

    ఒక పద్దతి పాడూ లేకుండా మాట్లాడుతారు కాబట్టే మీకు వేపకాయంత కాదు తాటికాయంత ఉంది అనేది....

    శ్రీకృష్ణదేవరాయలు గొల్ల కులస్తుడని శాసనాలు వుంటే మేమెందుకు ఆయనను మా వాడని చెప్పుకుంటాము.

    మాకు కస్తో, కూస్తో సిగ్గు వుంది. ఆత్మాభిమానం ఉంది.

    రిప్లయితొలగించండి
  6. తవ్వాఒబులరెడ్డిగారి బ్లాగులొ మీరే ఒప్పుకున్నారు.

    శ్రిక్రిష్ణదేవరాయల కులం గురించి వాదించే వారు అతని శాసనాల గురించి గాని,వాటిని చూడ కుండానే మీలాంటి వారు ఈ వాదనలు ఎందుకు చేస్తున్నారు?

    సౌత్ ఇండియా శాసన సంపుటలలొ ఉన్నాయి చూడండి.

    రిప్లయితొలగించండి
  7. సౌత్ ఇండియా శాసన సంపుటి లో కాపీలు నా మెయిల్ కు పంపించండి చూద్దాం.

    abhikalasri@gmail.com

    రిప్లయితొలగించండి
  8. కృష్ణదేవరాయలు యాదవవంశం లోనే పుట్టినాడు !!!! ...... తుర్వసు వంశంలో కాదు !!!! ???.....


    అసలు కృష్ణదేవరాయలు యాదవ కులములోనే పుట్టినాడేమో !!!
    అందుకే నంది తిమ్మన పారిజాతాపహరణంలో కృష్ణునితో పోల్చి ఉన్నాడు !!! లేకపోతే పోల్చనక్కరలేదు కదా !!!
    ఎందుకంటే ..... "కృష్ణభగవానుడు" ద్వాపరయుగములో యాదవవంశంలోనే పుట్టినాడు కదా !!! .... కాని సింహాసనం ఎక్కలేకపోయెను .... అదో పెద్ద భారతం
    ఎవరీ కృష్ణభగవానుడు ..... విష్ణుమూర్తి !!! అబ్బో పెద్ద కదేవుంది

    అందుకే ....... కృష్ణభగవానుడు కలియుగములో "కృష్ణదేవరాయలు"గా యాదవుడుగా పుట్టేసి సింహాసనం ఎక్కేసెను !!!..... అవునా !!! ??? డౌటే లేదు !!!


    యాదవులెవరు ..... యదు వంశీయులు !!! యదువు ఎవరు ....... యయాతి పెద్దకొడుకు !!! యయాతి ఎవరు ..... చంద్ర వంశ చక్రవర్తి !!! అబ్బో చాలా పేద్ద వంశం !!!


    అయ్యబాబోయ్ అయ్యబాబోయ్ ...... కాని అదేమి విచిత్రమో గాని !!!.... కృష్ణదేవరాయలకు తను అంత గొప్ప యదువంశంలో పుట్టి ఉండికూడా ???యాదవుడు అయి కూడా ???...... ఆ వంశ పరంపర మొత్తంగా మొత్తం మరిచిపోయి (ఆ కదంతా విని దిమ్మ తిరిగి మైండు బ్లాకు అయి వుండాలి !!!)
    తను వ్రాసుకున్న ఆముక్తమాల్యదలో యదువు తమ్ముడు తుర్వసుని వంశ పరంపరలో నుండి వచ్చినట్టుగా !!! పొరబడిపోయి ??? చాలాచాలా పెద్దతప్పు చేసేశారు బాబోయ్ !!!! ...... యాదవజాతి చరిత్రకు చాలా పెద్ద ద్రోహం తెచ్చేసాడు !!! అయ్యో ఎలా ???

    అల్లసాని పెద్దన కూడా మనుచరిత్రలో వీరి పూర్వీకులను యదువు తమ్ముడు !!! తుర్వసుని ??? వంశ పరంపరలోని వారిగా పొరబడిపోయి చాలా చాలా పెద్ద తప్పు చేసేశారు !!!
    నంది తిమ్మన కూడా పారిజాతాపహరణంలో వీరి పూర్వీకులను యదువు తమ్ముడు !!! తుర్వసుని ??? వంశ పరంపరలోని వారిగా పొరబడిపోయి చాలా చాలా పెద్ద తప్పు చేసేశారు !!! (ఆ కదంతా విని వీళ్ళకు కూడా దిమ్మ తిరిగి మైండు బ్లాకు అయి వుండాలి ??? !!!)


    దీనిని మనం సరి చేసేయాలి !!!.... మనం మాత్రమె చేయాలి !!!! .... ఎలా దీనిని సరి చేయాలి ?? ఎలా ????


    ఒక పని చేసేస్తే !!! ఆముక్తమాల్యద, మనుచరిత్ర, పారిజాతాపహరణం గ్రంధాలలో చెప్పిన, వీరు శాసనాలలో వేసుకున్న యదువు తమ్ముడు తుర్వసుని వంశపరంపరను తొలగించేసి ??? యదువంశ పరంపర !!! పెట్టేస్తే సమస్య తీరిపోతుంది కదా !!!.... ???
    అప్పుడు కృష్ణదేవరాయలు కచ్చితంగా యదువు వంశీయుడు అయిపోతాడుకడా ??? .... అవును దీనికిక తిరుగులేదు ..... నడండి లైబ్రరీలకు ..... చెయ్యండి కరెక్షన్సు !!!! ఇవ్వండి కృష్ణదేవరాయలకు యదువంశ పరంపర !!! బెస్ట్ ఆఫ్ లక్ !!!

    రిప్లయితొలగించండి
  9. page 179


    No 38.

    Nanjangud Taluk



    1. Svasti sri vijayabhyudaya Salivahana saka 5 varusha

    2.1434 sandu ......srimukha samvatsarada Phalguna ba svasti jitam

    3.bhagavata gata ghana gaganabhena sthira simhasanarudha sri nahaajadhiraja ra

    4.ja parameswara sriman mahamedini ,miseyaraganda kathari saluva sriman dekshina samu

    5.dradhipati Narasimha varma maharajadhiraja tut putra pituranvagata YADAVA kulamba

    6.ra dyumani samyuktva chudamini sakala vanahi brind sandoha (santarpana)paranarisahodara

    7.sauchavira(sarvavira) parakramadhara sakala desadhisvara mani makuta charanaravinda kathari

    8.trinetra srimat krishnavarma maharajadhiraja prudhvirajyam geyinottiralu dakshina de

    9.sadhi vijayavagi dittayisida vira Krishnarayara nyupadim srimanu mahapradhanam Ya

    10.ju sakheya khandava gotrada Apastambha sutrada srimanu Saluva Timmarasaru dakshina

    11.varanesi Gajaranyakshetra Rajaraja purvada Talakadali sri mahadevadevo

    12. ttama kirti Narayana devarige thayurasthalada kavahaliyolaganegado ...............................


    Translation
    -----------

    Be it well.In the victorious and prospering Salivahan era 1434 year s having expired while the year srimukha was current, on the 5th lunar day of the dark half of Phalghuna.

    Be it well.Victory to the Adorable(padmanabha)who resembles the sky free from clouds.

    While illustrious Krishnavarma maharajadhiraja seated on the stable throne, the prosperous king of kings, lord of kings, champion over those who wear mustaches in the great earth, kathari saluva(dagger and kite ) , ruler over the southern sea,Narasimha mahadhiraja's son ; asun to the fragment that is the Yadava race of which he is a lineal descendant: :..............................

    Under the orders of vira Krishnaraya, whole he was pleased to go on a victorious expedition to the to the south:the illustrious mahapradhana(chief minister) Saluva Timmarasa of yaju sakha khandava gotra and apastambha sutra made agift to the best of the gods kirtinarayana devaru of Talakadu which is Rajarajpuram...............

    Note
    -----

    It belongs to the reign of Vijayanara king Krishnaraya and is dated S.1434srimuka sam.phal.ba.5. This data correspond to March 15, A.D. 1514; .........


    The pecular feature in the historical portion of this record the king Krishnaraya is here styled krishnavarma maharajadhiraj as is also the case in two other inscriptions of th same Talu.(E.C.-III Nanjanguda 190 and 195 of 1512 and 1513 A.D)............

    University of Mysore

    Annual Report of the Mysore Archaeological Department for the 1930

    Banglore
    1934.

    ఈ చర్చ స్దాయికి ఈ శాసనం చాలు.ఈ చర్చ ఇక్కడే జరగాలి .వ్యక్తిగతంగా జరగ కూడదు. కాబట్టి నా దగ్గర వున్న శాసనలలొ ఒక్కదానిలొని ముఖ్యమైన, అవసరమైన భాగాలని ఇస్తూన్నాను. ఈ శాసనాలు కర్నాటక రాష్ట్ర పురావస్తు శాఖ వద్ద దొరుకును .

    రిప్లయితొలగించండి
  10. కృష్ణమూర్తి గారు మీరు మళ్ళీ మొదటికే వచ్చారు గా...

    ఇదే కాదు చాలా శాసనాలలో విజయనగర రాజులు యదు వంశీయులుగా వున్న విషయం మాకు తెలుసు. మీకు ఎప్పటి నుందో చెబుతున్నాము యదు వంశీయులు గొల్లలు కాదు అని గతం లోనే స్పష్టం చేశాము. విజయ నగర కాలం నాటికి మీరు గొల్లలు గానే వున్నారు. స్వతంత్ర్యం వచ్చిన తరువాత రాజకీయాల కొరకు యాదవ్ అని తగిలించుకున్నారు. యదు వంశీయులు క్షత్రియులు. మీ గొల్లలకు ఏ కాలంలో కూడా క్షత్రియత్వము నెరిపే అవకాశం కానీ అవసరం కానీ రాలేదు. సాలువ వంశీయుల ఇంటిపేరు కటారి వారు, తుళువ వంశీయుల ఇంటిపేరు సంపెట వారు. ఈ రెండూ వియ్యపు కుటుంబాలు. ఈ రెండు ఇంటిపేర్లు కలిగిన వారు ఇప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ లో బలిజ కులస్తులు వున్నారు. కటారి కనకయ్య నాయుడు పేరు విన్నారా??? సి.కె.నాయుడు భారత దేశ తొలి క్రికెట్ కెప్టెన్ మీరు. వీరి ఇంటిపేరు కటారి వారే.

    తవ్వా ఓబులరెడ్డి గారి బ్లాగులో మీరు యాదవ అనే సంస్కృత పదానికి గొల్ల అనేది తెలుగు అర్థమేమో అని అన్నారు. అప్పుడే మీకు అన్ని వివరణలు ఇచ్చాను. యదు వంశీకులు గొల్లలు కాదు అని చాల స్పష్టంగా చెప్పాను అయినా మిరు ఇంకా అదే దారిలో వెళుతున్నారు. మీది కాని చరిత్రను క్లెయిం చేసుకోవడానికి విపరీత ప్రయత్నాలు చేస్తున్నారు.

    రాయల కాలం లో తన కులానికి విపరీతమైన ప్రాధాన్యత లభించింది. ఆ కాలంలో బలిజ కులస్తులు అన్నింటా అధికారాలు చెలాయించారు. శెట్టి సమయాలు, లేదా బలిజ సమయాలు అనే యూనియన్ల కు కేవలం బలిజ కులస్తులే నాయకులుగా వ్యవహరించారు. అంటే కాదు ఆ కాలంలో పన్నులు వసూలు చేయడం, తీర్పులు చెప్పడం, శిక్షలు వేయడం ఈ శెట్టి సమయాలే నిర్వహించేవి. బలిజ కులస్తులు న్యాయాధికారులుగా వేలాది సంవత్సరాలు వ్యవహరించారు.

    కానీ గొల్ల కులస్తులకు అంతటి ప్రాధాన్యత ఏ కాలంలోనూ లభించలేదు.

    కేవలం బొక్కసం గొల్ల, సన్నిధి గొల్ల అనే పదవులు మాత్రం దక్కాయి.

    బొక్కసం గొల్ల అంటే కోశాగార నిర్వహణ, నిధుల రవాణా.

    సన్నిధి గొల్ల అంటే దేవాలయాల సేవ. ఉదయం తలుపులు తీయడం, సాయంత్రం తలుపులు మూయడం.

    బొక్కసం గొల్లలు అంటు వున్న పదవులు ఎవరు నిర్వహించినా వారు బొక్కసం గొల్లలుకానే పిలువబడే వారు.

    అది కూడా ఎందుకంటే గొల్ల కులస్తుల వద్ద వున్న సంపదను దొంగిలిస్తే వారు పూర్తిగా పతనమై పోతరన్న నమ్మకాలు వుండడం వల్ల గొల్ల కులస్తులకు ద్వారపాలకులుగా, నిధుల కాపలాదారులుగా వుండే అవకాశాలు దక్కాయి.

    అప్పటి కాలం లో చాలా రాజ్యాలలో బొక్కసం గొల్ల పదవులు వుండేవి అవి ఇతర కులస్తులు కూడా నిర్వహించేవారు అయిన వారు బొక్కసం గొల్లలుగానే పిలువ బడ్డారు. ఉదాహరణకు గొల్కొండ కోటలో ఈ పదవులను మున్నూరు కాపులు ఎక్కువగా నిర్వహించారు కానీ ఆ పదవిలో వున్న వారిని బొక్క సం గొల్ల అని పిలిచే వారు.

    మరి వీరిని ఎక్కడా కూడా బొక్కసం యాదవ అని కానీ, సన్నిధి యాదవ అని కానీ అనేవారు కాదు.

    మీరు మొట్ట మొదట గొల్లలు గొల్లలే కానీ యాదవులు కాదు అనే విషయాన్ని మరచిపోకుండా చరిత్ర చదవండి. వాస్తవాలు గోచరిస్తాయి.

    చేసిన తప్పులనే ఒక సంవత్సరంగా మీరు చేస్తున్నారు. ఎప్పుడు వాస్తవాలు గ్రహిస్తారు మీరు.

    రిప్లయితొలగించండి
  11. నా మార్చి 12,2014 పొస్టింగుకి మీరు క్రిష్ణమూర్తి గారికి జవాబు ఇచ్చినారు,గమనించగలరు !

    కాని ఈ జవాబు మీ సహజమైన స్తాయికి తగినట్లుగానే ఉంది.

    ఇంటిపేరులు వ్యక్తి యొక్క కుల నిర్ణయానికి ప్రామాణికం కాదని మరల మరొక సారి తెలియ చేస్తూన్నాను .అనుమానముంటే చరిత్రకారులను సంప్రదించవచ్చు .ఉదాహరణకి 'కటారీ లాంటి ఇంటి పేరు నాకు తెలిసిన మాలకులస్తులకి ఉన్నది.క్రిష్ణ జిల్లాలొ యాదవులకి ఉన్నది.

    ప్రతి కులానికి తనదైన చరిత్ర ఉన్నది .అలాగే బలిజ కులానికి తనదైన చరిత్ర ఉన్నది .వ్యాపార సమయాలలొ కీలకమైన పాత్రను పోషించి ఉండవచ్చు .రాజకీయంగా కొన్ని పదవులు నిర్వహించి ఉన్నారు ,దానిని ఎవరు కాదనరు.అంతమాత్రన మొత్తం చరిత్రంతా వారిదే అనడం సహేతుకం కాదు.

    మీ పొస్టింగులొ "ఇదేకాదు చాల శాసనాలలొ విజయనగర రాజులు యదువంశీయులుగా ఉన్న విషయం మాకు తెలుసు" అని అన్నారు .( ఇదే విషయాన్ని తవ్వా ఓబులు రెడ్డి గారి బ్లాగులొ ఒప్పుకున్నారు కూడా)

    కాని 'పారిజాతపహరణం' లొ శ్రీక్రిష్ణదేవరాయలు యాదవుడని చెప్పలేదని ,"శ్రీక్రిష్ణదేవరాయలు యదువంశీయుడే కాదు" అని ఒక బ్లాగునే పెట్టారు.

    పారిజాతపహరణం గ్రంధం టీకా తాత్పర్యంతొ వచ్చి అందులో శ్రీక్రిష్ణదేవరాయలు యాదవ కులములొనే మరలా పుట్టినట్లు పేర్కొనగా ఆ పండితులను నిందించినారు కూడా.

    ఇదే బ్లాగులొ మర్చి 7,2014 నాటి పొస్టింగులొ ' ఏంటీ శ్రీక్రిష్ణదేవరాయలు యాసవ కులంలొ పుట్టానని శాసనాలలో చెప్పాడా??? అని చాల బిగ్గారగా ప్రశ్నించారు!


    ఇప్పుడేమో శ్రీక్రిష్ణదేవరాయలు యదువంశియుడని మాకు తెలుసు అంటున్నారు! ఇంత బాగొతం ఎందుకూ?

    మీరు చేసే మరొక విచిత్ర వాదన యాదవులు ,గొల్లలు ఒకటి కాదు అని.

    ఈ విషయంలొ ఓబులు రెడ్డి గారి బ్లాగులొ చర్చించాము.ఈ వాదనలు మీరు ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యంతో చేస్తూన్నారు కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా అదే వాదన వదులుకొలేక పొతూన్నారు.

    యాదవులు ,గొల్లలు ఒకటేనని చరిత్రకు తెలుసు, చరిత్రలొ నమోదయి ఉన్నది, దానిని ఎవరు మార్చలేరు, ప్రపంచమంతా తెలిసిన విషయం.

    'యాదవ ' అనేది గొల్లల యొక్క పౌరాణిక పట్టపు నామము, 'గొల్ల ' అనేది యాదవుల వ్రుత్తి నామము.నేను ఏనాడూ యదవ అనే సంస్క్రుత పదానికి గొల్ల అనేది తెలుగు అర్ధమేమో అని నేను అనలేదు!

    అసలు యాదవత్వం అంటే గొల్లతనమని మీరే ఒప్పుకున్నారు కదా!

    మన దేశంలో ప్రతి కులానికి ఒకటి కంటే ఎక్కువ పేరులు వున్నాయనేది అందరికి తేలిసిన విషయమే!

    బ్రామ్హణులకి విప్రులని కూడా ఉన్నది.రెడ్డి కులాని కాపులని కూడా ఉన్నది.ముత్తరాసి కులానికి ముదిరాజ్ ,తెనుగోల్లన్ని ఉన్నది కదా!

    బలిజ కులాని కాపు,తెలగ,ఒంటరి మొదలగు పేరులున్నాయని మీరు కూడ ఒప్పుకుట్టారు కదా!

    అలాగే యాదవులకి లేక గొల్లలకి కూడా అనేక పేరులు ఉన్నాయి.

    page 207
    --------
    kuruba are known by different names in different areas of the nation.In some locations in karnataka, people from the Kuruba community use Naiker as surname.It means the same as Gowda (a leader of village of temple)The following are used

    Andar,AHiyaru,Ahir,,Appugol,Maldhari/Bharwad/Rabari,Bharavadaru,Dhangar,Dhangad/Dhanwar/Dhanka/Dhangod,Doddi Gowda,Gadhariya,Gadaria,Gowda,Gaddi,Gadri,Gollavadu,Gounder,Halumatha,Heggades,Idayar,Khuruk,Kuda,Kuruba,Kuruba Gowda,Kuruma,Kurumba,Kurmar,Kurumbar,Kalavar,Kuruma,Kuruavaaru,Kurkhi,Kurupu,Naikers, Oraons,Pal/Pala, Palaru,Paalakyatriya, Poduvar, Yadavalu.

    MARTIAL RACES OF UNDIVIDED INDIA

    BY Vidya Prakash Tyagi

    2009

    Kalpaz publictions

    New Delhi-110052.


    ఇది ఒక చిన్న ఉదహరణ .ఈ విధమైన అధ్యాయనాలు అనేకం ఉన్నాయి.

    ఈ విషయములొ ఇంకా కుతర్కం చేయలనుకుంటే అది మీ విఙ్నతకు వదిలేస్తున్నాను.











    రిప్లయితొలగించండి
  12. పూర్వం హొయసల యదు వంశ క్షత్రియులు " యాదవ కులాంబరద్యుమణి సంయక్త్వ చూడామణి " అనే బిరుదు దరించి ఉన్నారు. - ఈ బిరుదు హొయసల రాజ్యములో వారికి చెందిన అనేక శాసనాలలో మాత్రమే కనిపిస్తుంది

    నంజంగుడ్ తాలుకాలో చాలా హొయసల శాసనాలలో కనిపిస్తుంది - శాసనకారుడు కాపీ కొట్టి కృష్ణదేవరాయలకు అంటగట్టేసినాడు


    అలాగే తుర్వసుని వంశ సంతతిలొనివారగు తుళువ వారి కన్నా ముందు విజయనగర పాలకులగు సాళువ వంశీయులు " శ్రీ మన్మహా మేదినీ మీసెయర గండ కటారి సాళువ " అనే బిరుదు దరించి ఉన్నారు. ఇది సాళువ వంశీయులకు చెందిన బిరుదు. - శాసనకారుడు కాపీ కొట్టి కృష్ణదేవరాయలకు అంటగట్టేసినాడు


    తుళువ వారు సాళువ వారితో సాన్నిహిత్యముగా ఉన్నకారణంగా వీరు ఆ వంశ పరంపరకు చెందనప్పటికి చాలామంది శాసన కారులు వీరిని కూడా సాళువవారి లాగే "యదు వంశ క్షత్రియులు" అని పేర్కొంటూ వచ్చిన శాసనాలు అక్కడక్కడా చరిత్రకారులకు లబించినను, "యదువంశంలో పుట్టిన శ్రీకృష్ణుడు కలియుగంలో కృష్ణదేవరాయలుగ పుట్టినాడు" అనే దానిని కూడా ఆనాటి కొందరు శాసన కారులు కూడా తప్పుడు అర్ధం చేసుకొని కృష్ణదేవరాయలు కూడా యదు వంశంలోని వాడే అనే భావన కలగడానికి అవకాశం కలిపించబడింది

    తుళువ వంశీయులగు వీరనరసింహరాయలు, కృష్ణదేవరాయలు, అచ్యుతదేవరాయలు, సదాశివరాయలు తమసాహిత్యములోనూ తమదానశాసనాలలోనూ "యదువంశ పరంపరలో కాకుండా" "యదువు తమ్ముడగు తుర్వసు వంశ పరంపరలో " మాత్రమే తుళువ వంశము ప్రఖ్యాతిని తెలుపుకొనుచూ వచ్చినారు.

    యదు వంశం వేరు ... తుర్వసు వంశం వేరు

    రిప్లయితొలగించండి
  13. గొల్లాశబ్దము అచ్చమైన తెలుగు శబ్దమనియు,'యాదవాశబ్దము దానికి

    సంస్క్రుతీకరణమనియు నాయభిప్రాయము".

    Venkateswarlu ChennuboinaMay 13, 2013 at 3:21 PM

    ఇవి ఓబులరెడ్డి గారి బ్లాగులో మీరు స్వయంగా తైపు చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ అలాగే వున్నాయి ఒక సారి చూసుకోండి.

    http://sreekrishnadevaraya.blogspot.in/2010/08/blog-post.html

    రిప్లయితొలగించండి
  14. శ్రీకృష్ణదేవరాయలు యదు వంశీయుడే కాదు అని బ్లాగులో పెట్టానని అంత ఉక్రోషం ఎందుకు వెంకటేస్వర్లు గారూ.... తుర్వసుని వంశీకుడని స్పష్టంగా ఉంది కదా...

    అవును ఖచ్చితంగా బలిజకులస్తులది ఘనమైన చరిత్రనే. ఎన్నో క్షత్రియ వంశాల మూలాలు మాలో వున్నాయి. అందులో ఎతువంటి సందేహం లేదు. దానికి మీరు చింతించాల్సిన అవసరం లేదు. సహేతుకం కాదు అనడానికి మీ వద్ద ఉన్నా ఆధారం ఏమిటో చెప్పండి???
    చాలా శాసనాలలో విజయ నగర రాజులు యదు వంశీయులు అని రాశారు అని ఇప్పుడు కూడా ఒప్పుకుంటున్నాను. ఆ శాసనాలు స్వయంగా శ్రీకృష్ణదేవరాయలు వేయించినవి అని మీరు రాశారు. కాదు అని అంటాము మేము. ఒక వ్యక్తి ఇంటి పేరును ఇతరులు రాసేటాప్పుడు పొరపాటుగా రాసే అవకాశాలు వున్నాయి. అలాగే శాసనాలు రాసే వారు పొరపాటుగా యదు వంశీయుడని రాసారు కానీ శ్రీ రాయలే స్వయంగా తాను తుర్వసుని వంశీయుడినని చెప్పుకున్నాడు కదా.... అలాంటప్పుడు యదు వంశీయుడెలా అవుతాడో మీరే చెప్పాలి మరి.

    పరిజాతాపహరణం ప్రపంచం ఎదురుగా పెట్టాను అందులో మీరు ఎక్కడ పొరపాటు పడ్డారో కూడా తెలిపాను కానీ జీర్ణించుకోవడానికి మీరు ఇబ్బంది పడుతున్నట్టున్నారు.

    మేము ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు బలిజ కులస్తుడనడానికి వున్నా ఆధారాలు చూపిస్తున్నాము.

    మీరు గొల్ల కులస్తుడనడానికి ఉన్నా ఆధారాలు చూపమంటున్నాము దానికి యదు వంశాన్ని చూపించి అదిగో అదే గొల్ల అంటే నమ్మడానికి ఇక్కడ తెలివిలేని దద్దమ్మలెవరూ లేరు.

    యదు వంశీకులు అంధ్రప్రదేశ్ లో గొల్లలు ఒకటి కాదు అనడానికి ఎన్నో ఆధారాలు అంతర్జాలంలోనే కావాల్సినన్ని దొరుకుతాయి.

    మీకు ఓపిక ఉంటే వెతికి తెలుసుకోండి. లేదు అంటే మీ ఇష్టం వచ్చినట్టు అన్వయించుకోండి మాకేమీ అభ్యంతరం లేదు.

    గొల్లలకు కూడా చాలా పేర్లున్నాయి ఒప్పుకుంటాను. యాదవ అనే కులం పేరు మీది కాదు మీరు తగిలించుకున్నాదే.

    కాదు మీకు వున్నదే అని మీరు అంటే స్వాతంత్ర్యానికి పూర్వం యాదవకులం అని వున్న ఒక్క కుల ధృవీకరణ పత్రాన్ని చూపించమని మిమ్మాల్ని ఎన్ని సార్లో అడిగాను కానీ మీరు చూపించలేక పోయారు.

    మికు ధైర్యముంటే మీ 10వతరగతి టి.సి చూపించండి అందులో ఏముందో చూద్దాం. నా మెయిల్ కు పంపించండి ఇదే బ్లాగులో పెడతా...

    కులాల పేర్లు చెప్పి బోడిగుండుకీ మోకాలికీ బాగానే ముడివేస్తారే....

    రిప్లయితొలగించండి
  15. తెలుగు గొల్ల పదానికి యాదవ పదం సంస్క్రూతీకరణ అనేది నా అభిప్రాయం కాదు.అది తంగిరాల వేంకట సుబ్బారవు గారిది.గమనించవలెను.


    రాఘవరాయలు గారికి, అన్ని కాపి అనే వాదనను తీసుకొచ్చారు.సరే, శ్రీక్రిష్ణదేవరాయలు బలిజ కులస్తుడని ఏ కాపి కొట్టని ఒక్క శాసనాన్ని మీరు చూపించవలసినదిగా మనవి.అటువంటి శాసనాన్ని మీరు చూపించినచో అంగీకరిచటానికి ఏ అభ్యంతరము లేదూ!

    సాక్ష్యానికి సాక్ష్యామే జవాబు.


    మీరు కాని , రాఘవ రాయలు లాంటి వారు ఇటువంటి కుతర్కం కంటె బిన్నంగా వాదిస్తారని ఎవరు అనుకోరు.

    యాదవులు గొల్లలు ఒకటె అని అనటానికి నేను కులాలమీద చేసిన అధ్యాయనం నుండి చిన్న ఉదాహారణాన్ని ఇచ్చినాను.మీరు విచిత్ర వాదన చేయాలని చేసినా నిజం నిజం కాక పోదు!

    ఇంటర్నెట్లో యాదవులు,గొల్లలు ఒకటి కాదని అనటానికి చాల ఉన్నాయని అన్నారు.ఈ విషయం పై మన మద్య ఓబులురెడ్డీగారి బ్లాగులో చర్చ జరిగింది.నేను ఆ వాదనకి సపొర్ట్ ఒక్క సాక్ష్యాన్ని ఆంధ్ర మహాభారం నుండి చూపమని అడిగి ఉన్నాను, చూపలేదు. ఎందుకు దానినే పట్టుకు వ్రేలాడుతారు.

    యదువు,తుర్వసుడు ఒకే కులానికి చెందినవారు అవుతారు కదా?

    శ్రీక్రిష్ణదేవరయలు బలిజ కులస్తుడని ఒక్క శాసనాని కాని ఆ నాటి గ్రంధాలనుండి చూపించండినేను నేను నా వాదనలను వెనక్కు తీసుకుంటాను.

    రిప్లయితొలగించండి
  16. వెంకటేశ్వర్లు గారూ ఉడుక్కోకండి...

    విజయనగర పాలకులు బలిజ కులస్తులు అనడానికి మేము చాలా ఆధారాలు చూపించాము. ఎప్పుడో బ్రిటీషు వారు రాసిన కులాల, తెగల రిపోర్టులలో కూడా ఇదే విషయం రాశారు. వాటి కాపీలు కూడా ఇదే బ్లాగులో పెట్టాము కదా. మేము చెబుతున్న కోటబలిజ, పేటబలిజ అనే విభాగాలు కూడా బ్రిటీషు వారు గ్రంధస్తం చేశారు కదా. వాటిని ఎప్పుడొ మా తాతలు పుట్టక ముందు బ్రిటిషు వారు రాశారు. వాటిని మేము రాయలేదు కదా... ఇన్ని ఆధారాలు ఉన్న తరువాతనే మేము రాయల వారు బలిజ కులస్తుడు అంటున్నాము.

    రైట్ మీ వాదన తోనే ఏకీభవిద్దాము. బ్రిటిషు వారు రాసిన సౌత్ ఇండియా క్యాస్ట్స్ అండ్ ట్రైబ్స్ లో మీ కులం గొల్ల కులం గానే ఉంది కదా ఎక్కడా యాదవ అని లేదే !!!

    అలా రాసిన రాతలు ఏవైనా వుంటే చూపించండి. నేను మీతో ఏకీభవిస్తాను.

    స్వాతంత్ర్యానికి పూర్వం గొల్ల అనే కులం మాత్రమే ఆంధ్ర ప్రదేశ్ లో వుంది.

    స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాజకీయ స్వార్థం కొరకు యాదవ అని తగిలించుకున్నారు. ఇది వాస్తవం వాస్తవాలు ఒప్పుకోవడానికి మీకు కష్టంగా వుంది.

    1. బ్రిటీషు రికార్డులలో అంధ్ర ప్రదేశ్ లోని గొల్లలను యాదవులుగా రాసిన రాతలు ఏమైనా వుంటే చూపించండి.

    2.స్వాతంత్ర్యానికి పూర్వం అంధ్రప్రదేశ్ లో గొల్లలకు యాదవ అని కులధృవీకరణ పత్రం అధికారులు మంజూరు చేసినది వుంటే చూపించండి.

    ఈ రెండూ మీరు చూపించగలిగితే ఈ బ్లాగులో రాయలు బలిజ కులస్తుడు అని వున్న పోష్తింగ్స్ ను నేను తీసి వేస్తాను.

    ఈ సారి పై రెండూ నిరూపించ గలిగితే వాదనకు రండి. లేక పోతే అనవసరంగా సమయాన్ని వృధా చేయవద్దు.

    రిప్లయితొలగించండి
  17. ఈ బ్లాగులొ మీ వాఖ్యానానికి నేను ఇచ్చిన జవాబును ఇంత వరకు ముద్రించకుండా చేసినారు.ఇదేనా మీవాదనలో నిజాయితి ?

    రిప్లయితొలగించండి
  18. భారతదేశంలో పశువులను, గొర్రెలను, మేకలను మేపుకొని వాటిని జీవనాధారంగా కలిగియున్న యున్న తెగలు చాలా ఉన్నవి. యాదవ అనేది ఉత్తర భారతదేశమునకు చెందిన తెగ, గొల్ల అనేది దక్షిణభారతదేశానికి చెందిన తెగ. భారతదేశ కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ పద్దతిని సులభంగా అమలుపర్చడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న పశువులను, గొర్రెలను, మేకలను మేపుకొని జీవించే తెగలవారందరిని 'యాదవ ' అను వర్గంగా పేర్కొన్నది. అలాగే సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన తెలుగు కవులు కిరాతులను బోయవారిగా పేర్కొన్నట్టే యాదవులను గొల్లవారిగా పేర్కొన్నారు. ఈ కారణం వల్ల ప్రజల్లో యాదవులు, గొల్లవారు ఒక్కరేనని భావన ఏర్పడింది, శ్రీకృష్ణ యాదవ సంఘములు కూడా ఏర్పడినవి. అందుకు గొల్లవారు కూడా తమ పేర్ల చివర యాదవ్ అని తగిలించుకోవడం జరుగుచున్నది. వాస్తవానికి ఆచార వ్యవహారాలు, గోత్రాలు, గృహనామాల విషయాల్లో గొల్లవారికి, యాదవులకు ఎటువంటి సంబంధములు లేవని చరిత్రకారుల భావన.

    రిప్లయితొలగించండి
  19. యాదవులను దేశంలొ వివిద ప్రాంతాలలో వివిద పేరులతొ పిలుస్తారు అని నేను చెప్పి ఉన్నాను.దేశంలోని అనేక పోరాట జాతులు లేక కులాలను అద్యాయనం చేసి వ్రాసినటువంటి Martial races of undivided India గ్రంధంలో యాదవ,గొల్ల లేక కురుమ కులాన్ని గురించి ఇలా చెప్పి ఉన్నది.

    Kurubas are known by different names in different areas of the nation.In some locations in karnataka,people from the Kuruba community use Naiker as surname.It means the same as Gowda(a leader of village or temple).The following areused:
    Andar,Ahiyaru,Ahir,Appugolu,Maldhari/Bharwad/Rabari,Bharavadaru,Dhangaru,Dhangad/Dhanka/Dhangod,Doddi Gowda,Gadaria,Gowda,Gaddi,Gadri,Gollavadu,Gounder,Halumatha,Heggades,Idyar,Khuruk,Kuda,Kuruba,Kuruba Gowda,Kurama,Kurumba,Kurar,Kurumbar,Kalavar,Kuruma,Kurumavaaru,Kurkhi,Kurupu,Naikers,Nikhers,Oraon,Pal/pala,Palaru,Paalakyatriya,Poduvar,Yadavalu.

    రిప్లయితొలగించండి