5, జూన్ 2020, శుక్రవారం

114 సంవత్సరాల నాటి బలిజల ఇండ్లపేర్లు....

       విజయరంగ చొక్కనాథుడు (1704) మధుర రాజ్యాన్ని పాలించిన నాయక రాజు... రాజులు నిజానికి తమ కులం బహిరంగంగా చెప్పుకోవడానికి సంకోచించారు..అందుకే వారు కులం పేరు చెప్పుకోకుండా తమ తమ వంశాల పేర్లు మాత్రమే శాసనాలలో చెప్పుకున్నారు...మరి విజయరంగ చొక్కనాథుడికి ఎవరికీ లేనంత కులాభిమానం ఏమిటో అర్థం కాదు..శ్రీ రంగం లోని కోనేరు వద్ద గల శాసనం లో తమ బంధువుల ఇంటిపేర్లు అన్నీ రాయించాడు..వీరిలో 40 రాజకుటుంబాల కు సేవికా వృత్తి కానీ,వెండి ఆభరణాలు కానీ ధరించడం నిషేధం...ఎందుకంటే ఈ కుటుంబాలు సేవికా వృత్తి చేస్తే ఆయా వంశాల గౌరవం తగ్గుతుందని ఆనాటి వారు భావించేవారు..అదే విధంగా వెండి ఆభరణాలు అంటే కాళ్ళకు మెట్టెలు, కానీ కాళ్ళ గొలుసులు కానీ బంగారం తో చేసినవి మాత్రమే వాడాలి....
          అదే విధంగా మహా బంధువులు, గోష్టి బంధువులు, బహు బంధువులు అంటూ చాలా ఇండ్ల పేర్లు శాసనం లో చెక్కించారు...ఆ ఇండ్ల పేర్లు మీ కోసం ...120 సంవత్సరాల క్రితం అచ్చు వేయబడిన పగడాల నరసింహులు నాయుడు గారి "బలిజ వంశ పురాణం" కాపీలు...