24, మే 2015, ఆదివారం

నాయుళ్ళంటే బలిజ కులస్తులే...నాయుడు పదాన్ని ఇతరులు వాడకూడదు...


          నాయకుడు అనే పదానికి ఆధునిక రూపమే నాయుడు. నాయక అనే శబ్దం కులసూచకం. ఈ పదాన్ని గతం లో కేవలం నాయక కుటుంబాల వారు మాత్రమే వాడేవారు. కానీ ఈ మధ్య కాలంలో ఇతర కులాల వారు కూడా ఈ శబ్దాన్ని తమ పేర్ల చివర తగిలించుకుంటున్నారు. నాయుడు అనేది బిరుదమని చాలామంది పొరపాటు పడుతున్నారు. అది పూర్తిగా తప్పు. 96 తెగలు కలిగి 56 రాజ్యాలు పరిపాలించిన వారు బలిజ కులస్తులు. ఈ 96 తెగల వారు సూర్య,చంద్ర,శేషనాగ,యదు వంశాలకు చెందిన వారు. ఈ 96 తెగల్లో "నాయక" అన్నది ఒకటి. ఈ విషయాన్ని అనేక ప్రాచీన గ్రంధాలలో ప్రస్తావించినప్పటికీ చాలామంది తమ పేరు చివరన నాయుడు అని తగిలించుకోవడం బహుశా వాస్తవం తెలియక అయి వుండవచ్చు. ఈ వాస్తవాలు అందరికీ తెలియాలని సంబంధిత సమాచారాన్ని ఇక్కడ పెడుతున్నాను గమనించగలరు. బాంబే గెజిటీర్ లో 96 తెగల సంచారం ఇచ్చారు. వాటిలో ఉన్న 'నాయక్' పదాన్ని గమనించండి.


1901 మద్రాస్ సెన్సస్ రిపోర్ట్ లో కూడా బలిజ బ్రాకేట్ లో నాయక్ అని వున్న విషయాన్ని గమనించండి. ఇదే పేరాలో  నాయక్ ఆర్ బలిజ కింగ్స్ అని వుండడం గమనించ గలరు.


కందుకూరి ప్రసాదిత్య భూపాలుడు రాసిన శ్రీ ఆంధ్ర విజ్ఞానము అనే గ్రంధం లో నాయక శబ్దం నాయుడుగా మారినదని తెలిపారు. ఈ గ్రంధం 1938 లో ప్రచురించబడింది. 
ఆయన తెలగ లేక నాయుడు అని సంభోధించారు.  
1381 వ పేజీ చివరలో, 1382 వ పేజీ మొదట్లో పెద్ద పెద్ద చదువులు చదివి యున్నతోద్యోగముల నొనర్చు వారు తెలగాలు నాయుళ్ళనిపించుకొనుచున్నారు. కానీ ఇటీవల నుద్యోగ గౌరవము నందుచున్న ప్రతి శూద్ర కులజుడును నాయుడు అని పిలువ బడుచున్నాడు. దీనిని చదువరులు గమనింతురు గాక అని హెచ్చరించాడు. 


దీనిని బట్టి నాయుడు అనే ఉపనామాన్ని బలిజ కులస్తులు మాత్రమే ఉపయోగించాలి. అది కులనామమే కానీ బిరుదం కాదని ఇతర కులాల వాళ్ళు తెలుసుకోవాలి. ఇలా నాయుడు అని ఉపనామాన్ని పెట్టుకున్న ఇతర కులాల వాళ్ళు ఇకనైనా దాన్ని తొలగించుకుంటారని ఆశిద్దాం. ఇప్పటికీ కోస్తా ప్రాంతం లో నాయుళ్ళు అని కేవలం బలిజ,కాపు లను మాత్రమే సంభోధిస్తారు. పాఠకులు గమనించ గలరు."నాయుడు" అనే ఉపనామం బలిజ కులాన్ని సూచిస్తుంది. ఇతర కులాల వాళ్ళూ దీన్ని తమ పేరు చివర తగిలించుకోవడం వల్ల వారు తమ కులాన్ని తప్పుగా చెప్పుకోవడం అనే భావించాల్సి వుంటుంది కనుక అలాంటి వారు సవరించుకుంటారని ఆశిస్తున్నాను.