11, జులై 2015, శనివారం

వెలివేయబడిన బ్రహ్మనాయుడి బంధువులే వెలమలు (నాయకురాలు నాగమ్మ-7)



        నాకు లభించిన అనేక ఆధారాలను బట్టి బ్రహ్మనాయుడి బంధువులే వెలమ కులస్తులని స్పష్టం చేస్తున్నాను. నేను స్పష్టం చేస్తున్న ఈ విషయం ఎవరినో కించపరచాలనో, నొప్పించాలనో చేస్తున్నది కాదు. చరిత్ర అనేక విధాలుగా వక్రీకరించబడింది. ఏ కులానికి సంబంధించి ఆ కులం ప్రత్యేకతలు చరిత్రలో ఎన్నో వున్నాయి. చరిత్రగతిని అర్థం చేసుకోవడం లో జరిగిన పొరపాట్లు, లేని చరిత్రను తమకు ఆపాదించుకున్న కొందరు రచయితలు అసలు చరిత్రను బయటకు రాకుండా చేశారని నా అభిప్రాయము. రెండువేల సంవత్సరాలకు పూర్వం నాలుగు వర్ణాలుగా, 27 కులాలుగా వున్న కులాలు 19 వ శతాబ్దం ఆరంభం నాటికి 66 అంతకంటె ఎక్కువ కులాలుగా విభజన చెందాయి. ప్రధాన కులం లో నుండి విభజింపబడ్డ కొంతమంది తరువాత కాలంలో ప్రత్యేక కులాలుగా ఏర్పడ్డ సందర్భాలు అనేకం. కొన్ని కులాలు వృత్తులాలో సహాయకారులుగా వుంటూ తరువాత ప్రత్యేక కులాలుగా విడిపోయిన సందర్భాలు ఎక్కువగా కనిపిస్తాయి. 

     అలా బలిజ లేదా కాపు కులం నుండి విడిపోయిన వారే వెలమ, కమ్మ కులాలు. వీరిలో వెలమలు పలనాటి చరిత్ర కాలం లో విడిపోగా, కమ్మ కులస్తులు కాకతీయ ప్రతపరుద్రుని కాలంలో విడిపోయినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. 

     నేటికీ ప్రకాశం జిల్లా లోని దోర్నాల మండలం లో వున్న బొమ్మలాపురం ప్రాంతం లో వెలమ కులస్తులు వున్నారు వీరిని ఈ ప్రాంతం లో పెద్ద కమ్మ వారని అంటారు. దీన్ని బట్టి వెలమలు కమ్మల కంటె ముందుగా విడిపోయిన వారని అర్థమవుతోంది. 

 పద్మనాయక చరిత్ర లోని ఈ క్రింది పద్యాలను ఒకసారి గమనించండి.

ఊరివరదనీరు నురికి సరస్సుజేరి
తీర్థయోగమైన తెరగుగాదె
కాలచోదితమున గాకతీశ్వరుల గొల్చి
కాపులెల్ల వెలమ కమ్మలైరి.

తొలికాలముర్వి గొడవల 
వెలియై యాలయములందు విహరించుటచే
నిలకాపు జనులు కొందరు 
వెలమలన్ జగతిలోన విశ్రుతులగుటన్ 

ఈ పద్యాలు కాపు కులం నుండి పై రెండు కులాలు విడిపోయినట్లుగా స్పష్టం చేస్తున్నాయి. 

    కమ్మ కులం గురించి మరో సందర్భం లో చర్చిద్దాం. ప్రస్తుతానికి పలనాటి యుద్ధ కాలం లో వున్నాం కాబట్టి సందర్భానుసారంగా వెలమ కులం ముందు నాటి పరిస్థితులు ఏంటో దాని పూర్వాపరాల గురించి విశ్లేషిద్దాం.

రెండవ పద్యం లో "తొలికాలముర్వి గొడవల" అంటె మొదట్లో జరిగిన భూతగాదాల వల్ల.

    వెలియై యాలయములందు విహరించుటచే అంటే వెలివేయబడి ఆలయాలందు తలదాచుకున్నారు. వారే తరువాతి కాలం లో వెలమలుగా పిలువబడ్డారు. ఒక కులాన్నే వెలివేయడం సాధ్య మౌతుందా??? సాధ్యం కాదు. 

    కానీ పెద్ద ఎత్తున వెలివేయబడ్డారు. బహుశా అవి కొన్ని కుటుంబాలై వుంటాయి. అలాంటి పరిస్థితులు ఎప్పుడు ఏర్పడ్డాయి. 

    కమ్మలకంటే ముందుగానే వెలమలు వెలివేయబడి మరో కులంగా స్థిరపడ్డారు. అంటే కాకతీయుల కాలం కంటే ముందై వుండాలి. 

     వెలమ కులం లో ప్రసిద్ధి గాంచిన వారు వెలుగోటి రాజులు. వీరి గోత్రం "రేచెర్ల"  వీరు 11,12 శతాబ్దాలలో నేటి కర్నూలు జిల్లా "వెలుగోడు" లో స్థిరపడినట్లు కనిపిస్తొంది. ఆ కాలం నాటికి ఈ ప్రాంతం లో అనేక గ్రామాలు ఉన్నాయి. వీరు నివసించిన వెలుగోడు మొదట్లో వెలివాడ, వెలుగువాడ, వెలుగోడుగా రూపాంతరం చెదినట్లు తెలుస్తోంది. వీరు ఇక్కడ మట్టికోట కట్టుకుని విజయనగర రాజులకు సామంతులుగా రాజ్యమేలారు. నేటికీ విరు నిర్మిచిన చెన్నకేశవస్వామి దేవాలయం నాటి రాజులు వాడిన చలువబండ వెలుగోడులో వున్నాయి. ఆ తరువాత ముస్లిం పాలకుల దాడులలో వెలుగోడు మట్టి కోట ధ్వంసం కాగా వెంకటగిరి చేరినట్లు తెలుస్తోంది.

ఇక కథలోకి వద్దాం.....

      ప్రాచీన భారత దేశం లో శెట్టి సమయాలు అనే ఒక బృహత్తరమైన వ్యవస్థ వుండేది. వీరే అటు వ్యాపారాలను ఇటు గ్రామ, పట్టణ, నగర పాలనలను నిర్వహించారు. వీరినే దేశాయి రెడ్లు, దేశాయి శెట్లు అని పిలిచేవారు. ఈ దేశాయిలు, శెట్లు నాటి గ్రామాలలో పన్నులు వసూలు చేయడం, తీర్పులు చెప్పడం చేసేవారు. కులాల కట్టుబాట్లను నియంత్రించేది కూడా వీరే. నాటి ప్రజల లో కుడి, ఎడమ చేతులకు చెందిన కులాలు వుండేవి. వాటిలో కుడిచేతి కులాలే మొదటి నుండి ఆధిపత్యం చెలాయించాయి. ఈ కులాలకు చెందిన వారే నాటి రాజులు, చక్రవర్తులు. ఈ కుడి చేతి కులాలకు పెద్దలు బలిజ కులస్తులు.  

      నాగమ్మ తండ్రి రామిరెడ్డి జిట్టగామాల పాడులో తీర్పులు చెప్పడం లో దిట్ట అని పేరుప్రఖ్యాతులు గాంచాడు. అంటే ఆయన ఆ ప్రాంత దేశాయి రెడ్డి. దీన్ని బట్టి నాగమ్మ సామాన్య కుటుంబానికి చెందినది కాదు ఉన్నత కుటుంబానికి చెందినది అని తెలుస్తోంది. 

     భారత దేశాన్ని, ఇక్కడి సంపదను శాసించిన వారు వ్యాపారులు. పలనాటి చరిత్ర నాటికే పెద్ద ఎత్తున సముద్ర వ్యాపారాలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రతి రాజ్యం లో ప్రధాన ఆదాయ మార్గాలుగా వర్తక వాణిజ్యాలు వున్నాయి. ఈ వర్తక వాణిజ్యాలను శాసించిన వ్యాపారులు ఎవరు? 

    చరిత్రలో వర్తక వాణిజ్యాలను శాసించిన సమయాలు ప్రధానంగా వీరబలింజ సమయాలు. వీరిలో అయ్యావళీ-500, ముమ్మూరి దండులు-36 అనేవి శాసనాలలో ప్రముఖంగా కనిపిస్తాయి. వీరంతా వర్తకులే కాదు గొప్ప యుద్ధ వీరులు కూడా. ఈ ముమ్మూరి దండులు వర్తక బిడారులను దొంగల నుండి రక్షించే రక్షకులు. 

ఇదీ నాటి నేపథ్యం...

     ఇలాంటి పరిస్థితులలో వర్తకులపై పెద్ద ఎత్తున దొంగల దాడులు జరుగుతుండేవి. వీటిని అరికట్టాల్సిన బాధ్యత నాటి వీరబలింజలది. ఈ క్రమం లోనే వ్యాపారులు రాజుకు ఎన్నో సార్లు ఫిర్యాదులు చేసి వుంటారు.  కానీ రాజు మంత్రి బ్రహ్మనాయుడికి బాధ్యతలు అప్పగించి వుంటాడు. ఆ దోపిడీ దారులంతా బ్రహ్మనాయుడి బంధువులు, స్నేహితులు కావడం తో వారిపై ఎలాంటి చర్యలూ తీసుకుని వుండరు. 

    విరబలింజ సమయాలకు ఒక అలవాటు వుంది. ఏ రాజైనా తమకు అనుకూలంగా చర్యలు తీసుకోక పోతే ఆ రాజ్యాలను సైతం ఆక్రమించుకుంటారు. తమ వారిని పాలకులుగా నియమిస్తారు. కానీ ఇక్కడ పాలకులు దొంగలూ అందరూ తమవారే ఏం చేయాలి? 

అందుకే జిట్టగామాలపాడు లో తండ్రి తరువాత ఆ బాధ్యతలను నిర్వహిస్తున్న నాగమ్మను ఆశ్రయించారు. 

అలా నాగమ్మ అనుగురాజు తనకు ఇచ్చిన వరాన్ని ఉపయోగించుకుని బ్రహ్మనాయుడి భరతం పట్టింది. 

వాస్తవానికి నాగమ్మ ఒక్కతి కాదు ఆమె వెనుక ఉన్న సమయాలు ఆమెకు అండగా నిలిచాయి. 

      ఇక్కడ ఒక్క దొంగతనాలు మాత్రమే బ్రహ్మనాయుడిని మంత్రి పదవికి దూరం చేయలేదు. అది ఒక కారణం మాత్రమే. ప్రధానమైనది ఆయన ప్రతిపాదించిన చాపకూటి సిద్ధాంతం. ఈ చాపకూటి సిద్ధాంతం సహపంక్తి భోజనాలని చాలామంది రచయితలు అభిప్రాయపడ్డారు. కానీ అది తప్పు. చాపకూటి సిద్ధాంతం అనేది ఒక "ఎంగిలిమగళం" అని తెలుస్తోంది. ఒక చాపను పరచి అందులో  భోజనాన్ని కలిపుతారు. అక్కడ ఒకరు తిన్న తరువాత అదే చోట మరొకరు తింటారు. ఇక్కడ కులం లేదు కట్టుబాట్లు ఉండవు. ఇది చూసి చాలా మంది బ్రహ్మనాయుడిని గొప్ప సంఘ సంస్కర్తగా అభివర్ణిస్తారు. కానీ ఈ చాపకూడు వెనుక పచ్చి వ్యభిచారం జరిగేదని భార్యా భర్తల మధ్య ఉండే కట్టుబాట్లకు తిలోదకాలిచ్చేశారని తెలుస్తోంది. కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నమై పోయింది. దీనికి అనుగుణంగానే మాచెర్ల, మార్కాపురం లలో ఉన్న చెన్నకేశవస్వామి దేవాలయ గాలి గోపురాలపై విపరీతమైన బూతు బొమ్మలను చెక్కించారని అంటారు. 

     కులసంకరాన్ని అతి పెద్ద నేరంగా భావించే పూర్వాచార కులాలకు బ్రహ్మనాయుడు పెద్ద సవాలుగా మారాడు. దీనిని పలువురు నాటి పెద్దలు నలగామరాజు దృష్టికి తీసుకు వచ్చి వుంటారు కానీ బ్రహ్మనాయుడికి ఎదురు చెప్పలేని అశక్తత నలగాముడు వెలిబుచ్చి వుంటాడు. దీనిని అడ్డగించలేని నలగాముడు నాగమ్మకు పరోక్షంగా సహకరించి వుండవచ్చు. చాపకూడును అడ్డగించలేక పోయినా, బ్రహ్మనాయుడిని నిలువరించడానికి దొగతనం నేరాలు అవకాశంగా చిక్కాయి. ఆయన అనుచరులు పెద్ద ఎత్తున సాక్ష్యాలతో సహా పట్టుబడడం తో బ్రహ్మనాయుడు తప్పించుకోలేని పరిస్తితులు ఏర్పడ్డాయి. 


    అలా దొరికిన బ్రహ్మనాయుడిని మొదట దేశబహిష్కారం శిక్షగా వేసి వుంటారు.  యుద్ధం లో ఓడిపోయిన తరువాత అయన వర్గీయుల పై కుల బహిష్కరణ వేటు వేసి వుండవచ్చు.

ఇంకా  ఉంది తరువాత టపాలో ...

96 కామెంట్‌లు:

  1. Mr.balijavani telisi teliyani kathalu cheppi nuwu yavarini erripappalani cheyyalev "anni kulalu balijala nunchi vachaya "kamma .kulam క్రిశ 10 ki munde unnadani telusuko "eka naiyulane padam kmma kulanamame

    రిప్లయితొలగించండి
  2. నీదగ్గర ఉన్న ఆధారమేమిటంటే ఇంతవరకు చూపించలేదు మిత్రమా నీవు. నాయుడు అనే పదం నాయక అనే పదం యొక్క్ అపభ్రంశ రూపం. నాయక అనేది ఒక కులం. అదే బలిజ కులం. 96 బలిజ కుల తెగల్లో నాయక అనేది ఒకటి. ఆధారం బాంబే గెజిట్ చూడు.

    రిప్లయితొలగించండి
  3. నాయక అనే పదం లంబాడిలకు కుడా ఉంది వాళ్ళు మినుంచే వచ్చారా

    రిప్లయితొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  5. రాజు నాయుడు గారూ లంబాడీ ల గురించి నాకు తెలియదు. ఈ బ్లాగు బలిజ కులం గురించిన సమాచారాన్ని అందివ్వడానికి ఏర్పాటు చేయబడింది. ఎవరినీ నొప్పించాలనే వుద్దేశ్యం మాకులేదు. నేను పైన రాసిన సమాచారం మీ కమ్మ కులస్తులు రాసిన పుస్తకాల నుండి సేకరించినదే. బావయ్య చౌదరిగారు రాసిన కమ్మవారి చరిత్ర చూడండి. ప్రొఫెసర్ యార్లగడ్డ బాలగంగాధర రావు గారు కూడా పల్నాటి వీర చరిత్రలో కూడా సూచాయిగా పై సమాచారాన్ని తెలిపారు. చరిత్ర అనేది గతించిపోయిన వాస్తవం. బలిజ కులస్తులకు చెందిన చరిత్రను ఎంతోమంది కబ్జా చేశారు. అందుకే పాత రికార్డులు తోడుతున్నాము. ఈ బ్లాగు వెనుక 16 మంది పరిశోధకులు వున్నారు. మేము కథలు రాయడం లేదు. గతించిపోయిన చరిత్రను ఆవిష్కరిస్తున్నాము. మేమూ తప్పులు రాసి వుండవచ్చు. ఆ తప్పులను ఆధారాలతో సహా ఎత్తి చూపిస్తే తప్పకుండా సరిదిద్దుకుంటాము. ఆధారాలు లేకుండా నిందారోపణలు చేస్తే ఎవరికీ ప్రయోజనం ఉండదు. 96 తెగలు కలిగి 56 రాజ్యాలు పరిపాలించిన వారు బలిజ కులస్తులు అనే తాళ పత్రాలు చెన్నై ఓరిఎంటల్ లైబ్రరిలో మాకు లభించాయి. ఇలా చెప్పుకున్న జాతులు ఏవి వున్నాయి అనే శోధనలో బాంబే గెజిటీర్ లభించింది. అందులో వున్న ""నాయక్" అనే పదమే విజయనగర, మధుర, తంజావూరు పాలకులకు చెందిన "నాయకరాజులు" అనే పదాలకు మూలం. ఈ నాయక్ అనే పదం కుల సూచకం. అందుకే ఇతర కులాల వారు పెట్టుకోకూదదు అని చెప్పాము. ఇప్పుడు మీరు నాయుడు అని పెట్టుకున్నారు దానికి నాకేమీ అభ్యంతరం లేదు. కర్నూలు జిల్లాలో చాలా మంది బోయ కులస్తులు కూడా నాయుడు అని పెట్టుకుంటారు. అవి నిజమైన చరిత్రలు తెలియక పెట్టుకునే పేర్లు కాబట్టే తెలియజెప్పడానికి ప్రయత్నించాము. ఈ నాయక శబ్దం నుండి పుట్టినదే నాయుడు అనేశబ్దం ఇది పూర్తిగా కులసూచకం. నాయుళ్ళు అంటే బలిజ, తెలగ,కాపు,ఒంటరి కులస్తులు మాత్రమే. ఇది చరిత్ర నా ఇష్టం అంటే దానికి మా అభ్యంతరాలేమీ ఉండవు. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాము. అదే రాజుల కాలమై వుంటె ఇలా మాట్లాడే అవకాశం ఉండేది కాదు.

    రిప్లయితొలగించండి
  6. కమ్మ కులస్తులు బలిజ వారి నుండి వాచ్చారని అసత్యలు రాయడం మంచి కాదు కమ్మకులం" క్రిశ10 కి ముందె ఉంది అందుగల ఆధారాలు మికు 'వికిపిడియా లొ ఉన్నాయి చుసుకొండి ఇంతకు ముందు (అంటె క్రిశ10)నాయకుడు " అనేపదం మా కమ్మ వారి పేర్ల చివర ఉండెది 'అదె నాయుడు గా మారింది కమ్మరాష్ర్టం అనబడె పాంతములొ ఉన్నవాళ్ళంతా కమ్మవారైయ్యరు

    రిప్లయితొలగించండి
  7. వికిపీడియా... సమాచారం ప్రామాణికం కాదు. శాసనాధారం కానీ ప్రాచీన గ్రంధా ఆధారం కానీ వుంటే చూపించండి. కమ్మ నాడు అనే ప్రాంతం కమ్మ కులం నుంది వచ్చిన పేరు కాదు అబద్దాలు రాయాల్సినంత ఖర్మ మాకు లేదు,

    రిప్లయితొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  9. రాజు నాయుడు గారూ గుండ్ల కమ్మ నదీ పరీవాహక ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతాన్ని కమ్మనాడు అన్నారు . ఆ ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణులను కమ్మనాటి బ్రాహ్మణులు అనేవారు. కాపులను కమ్మకాపులు అనేవారు (దీన్ని మీరు అంగీకరించరు అనుకోండి) కమ్మవారి గిరించి చరిత్ర రాయాలన్న కోరిక గానీ ఆసక్తి గానీ నాకు లేవు. నేను ఇంగ్లీషోదు రాసిన రాతలను పట్టుకుని మాట్లాడడం లేదు.
    మీరు ముందు మీ వారు రాసిన కమ్మవారి చరిత్ర చదవండి. యార్లగడ్డ బాలగంగాధర రావు గారు రాసిన పలనాటీ వీర చరిత్ర చదవండి. ఇవేవీ చదవకుండా నాపై నిందారోపణలు చేయడం ఎంతవరకు సబబు. ఇక ఎవరో రాసిన రాతలను పట్టుకుని రాసేది చరిత్ర కాదు. ఎందుకంటే చాలామంది చరిత్ర కారులు చాల చాల పొరపాట్లు చేశారు. ఇంకా చేస్తున్నారు. అవి కాల పరీక్షకు నిలబడవు. శాసనాధారాలు, ప్రాచీన గ్రంధాలు మాత్రమే చరిత్రకు ఆధారాలుగా భావిస్తున్నారు. మాది కాని చరిత్ర మాది అనె చెప్పుకోవాల్సినంత ఖర్మ మాకు పట్టలేదు అన్నారు వెరీగుడ్ అదీ స్పిరిట్.
    కమ్మ కులం 10వ శతాబ్దం నుండి వుంది అని మీరంటున్నారు. ఒక్క శాసనాధారం చూపించండి ఒప్పుకుంటాను. అందరికీ కమ్మవారిపై ఎందుకింత అక్కసు అని బాధ పడ్డారు. మీమీద అక్కసు వెళ్ళగక్కడానికి మీరేమీ నాకు శత్రువులు కాదే... మీ వల్ల నాకేమీ అన్యాయం జరుగలేదే.... మరి మీ పైన అక్కసు వెళ్ళగక్కాల్సినంత అవసరం నాకేముంటుంది చెప్పండి.
    నాయుడు అని ఇతర కులాలు పెట్టుకోకూడదని చెప్పాను ఎందుకు పెట్టుకోకూడదో సాక్షాలతో సహా చూపించాను. దానికి చాలా అసభ్యంగా కామెంట్ రాశారు ఇది సబబేనా..."బిలివి" సంస్థానాధీశుడు స్రీ కందుకూరి ప్రసాదిత్య భూపాలుదు రాసిన శ్రీ ఆంధ్ర విజ్ఞానము అనే గ్రంధం స్కాన్ డ్ కాపీలను పెట్టాను. ఈ గ్రంథం 1938 లో అచ్చు వేయబడింది. ప్రాసాదిత్య భూపాలుడు. బలిజ కులస్తుడు కూడా కాదు.
    ఇవన్నీ అవసరం లేదు మీరు కమ్మ కులం 10వ శతాబ్దం నుండి వున్నట్లు ఒక్క సాసన ఆధారం చూపించండి చాలు. నా రాతలు అన్నీ వెనక్కు తీసుకుంటాను.
    మళ్ళీ చెబుతున్నాను మీ కమ్మ కులం పై నాకెలాంటి ద్వేషం కానీ చిన్న చూపు కానీ లేదు. నా ప్రాణ మిత్రులు బలిజ కులంలో లేరు మీ కమ్మ కులస్తులే. కామినేని వెంకటేశ్వర రావు అని మీ వాడే. వాడితో అత్యంత సన్నిహితంగా వుంటానని మా వాళ్ళు చేసే ఎద్దేవాలు కూదా భరించాను. నాకు కులాభిమానం మాత్రమే వుంది పిచ్చి లేదు.

    రిప్లయితొలగించండి
  10. చలాబాగాచెప్పారు" కమ్మనాడు అసలు పెరు కర్మనాడు అక్కడ బౌద్ద(కర్మ) మతం పరిడవిల్లినందున ఆ పెరువచ్చీందిఇక్రమంలొనె అక్కడఉన్న నదికి కుడాఆపెరువచ్చీంది(బౌద్దులు ఆ నది దగ్గర గుండ్లుచెయించుకుఇని కర్మలను ఆచరించెవారు కాబట్టి గుండ్లకర్మగా ఉన్న నది పెరు కాలానుగుణంగా గుండ్లకమ్మ అయినది) అక్కడ మొదట నివసించినవారె కమ్మవారు(మాకమ్మవారు) తరువాత వచ్చీనవారె కాపు బ్రహ్మణ ఇత్యది కులాలు కాకతియులు కమ్మవారిని వెరు చెస్తె ఎ రాజు చెసాడు ఎప్పుడు చెసాడొ చెప్పమని మనవి కమ్మవారు కాపులనుండి రాలెదని మాదగ్గర అదారాలు ఉన్నాయి ఎవరొ రాసినవి చుసి రాసెవి చరిత్ర కాదని చెప్పారు మిరుచెస్తున్నది ఎమిటి? ఎవొ కొన్ని జిరక్స్‌ పెట్టి ఆబుత కల్పన చెస్తున్నారు వరిజినల్స్‌ చుపించండి అంటె(రాగిరెకులు శిలాశసనాలు ) ఆకాలంలొ వటిపైనె రాసెవారు కాబట్టి "అప్పుడె మిరుచెప్పినవి నమ్ముతాను'

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "కమ్మ" అను పదము క్రీస్తు కాలము నుండి కలదు. కమ్మనాడు, కమ్మ రాష్ట్రం అను ప్రదేశాల పేర్లు పెక్కు శాసనములలో పేర్కొనబడినవి. గంగా నదీ మైదానములోని బౌద్ధులు పుష్యమిత్ర సుంగ (184 BCE) యొక్క పీడన తప్పించుకోవడానికి పెద్ద సంఖ్యలో కృష్ణా నది డెల్టాకు వలస వచ్చారు. వీరివలన బౌద్ధమతం ఈ సారవంతమైన ప్రాంతంలో పలు శతాబ్దములు పరిఢవిల్లింది. ఇప్పటికీ ధరణికోట, భట్టిప్రోలు, చందవోలు మున్నగు ఊళ్ళు ఆనాటి చరిత్రకు ఆనవాళ్ళు. చరిత్రకారులు కర్మ అనబడు సంస్క్రిత పదము తరువాత సంవత్సరాలలో కమ్మ (పాళి పదం) గా మారింది. కమ్మనాడు అనబడు ఈ ప్రాంతములో వసించు వారే పిమ్మట కమ్మవారయ్యారు. చారిత్రకముగా కమ్మవారు ఒక కులముగా పదవ శతాబ్దము నుండి తెలియబడుతున్నారు. గుంటూరు జిల్లా ముప్పళ్ళ మండలం మాదాల గ్రామంలో ఉన్న సాగరేశ్వర ఆలయంలో 1125 వ సంవత్సరం నాటి పిన్నమ నాయుడి శిలా శాసనంలో కమ్మ వారు దూర్జయ అను క్షత్రియ కులానికి చెందినవారని, తాను వల్లుట్ల గోత్రానికి చెందినవాడుగా తెలుపుచున్నది. పల్నాటి యుద్ధము తరువాత, కాకతీయుల కాలంలో కమ్మవారు సైన్యాధ్యక్షులుగా పనిచేశారు. కాకతీయ రాజైన గణపతిదేవ మహారాజు తన సైన్యాధ్యక్షుడైన జయప సేనాని చెల్లెళ్ళను (నారమ్మ, పేరమ్మ లను) వివాహమాడాడు. ఇందువల్ల గణపతిదేవుడి కుమార్తె రుద్రమదేవిని కమ్మవారు తమ ఆడపడుచుగా భావిస్తారు. క్షత్రియ సామ్రాజ్యాలు అంతమైన తర్వాత కమ్మవారు కొద్దికాలం ఆంధ్ర దేశాన్ని పాలించారు. కాకతీయ - ముసునూరి దుర్జయ నాయకులు, అయ్య (దివిసీమ) నాయకులు, సూర్యదేవర నాయకులు, ముసునూరి నాయకులు, పెమ్మసాని నాయకులు, రావెళ్ళ నాయకులు, శాయపనేని నాయకులు, సాగి నాయకులు, యార్లగడ్డ నాయకులు దీనికి ఉదాహరణ.......For full details, follow my blog http://kammakshatriyakambhojaarya.blogspot.in/

      తొలగించండి
  11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  12. తెలుగు సైట్ గారూ చరిత్ర నేను రాసేది కాదు. గతం లో వేసిన శాసనాలను, గ్రంథాలను పరిశీలించి ఇక్కడ ఆధారాలను చూపిస్తున్నాము. కమ్మవారు కాపుల నుండి విడిపోయిన వారు అని మీ కుల పెద్దలు రాసిన రాతలు చదివే నేను పై నిర్ధారణ చేశాను. అది నిజం కాదని మీ వద్ద ఆధారాలుంటే పంపించండి నేను రాసిన రాతలను సవరించుకుంటాను. మిమ్మల్ని కించపరిచేందుకు ఈ రాతలు రాయలేదని ముందే చెప్పాను. ఆధారాలుంటే నా మెయిల్ ఐడి కి పంపించగలరు. ఇక బ్రిటీషు వారు జనాభా గణన నిర్వహించేటప్పుడు ఆయా కులాలు ఇచ్చిన సమాచారాన్నే పరిగణలోకి తీసుకున్నారు. మరి అప్పట్లో మీ కుల పెద్దలు ఇచ్చిన సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని వుంటారు. అభ్యంతరాలను సైతం వారు పరిగణలోకి తీసుకుని సవరించారు. ఏది ఏమైనా మీ వద్ద ఉన్న ఆధారాలు పంపిస్తే పైన రాసిన దానిని తప్పకుండా సవరిస్తాను. abhikalasri@gmail.com

    రిప్లయితొలగించండి
  13. సత్యాన్వేషి గారూ మీ రెండు వ్యాఖ్యలు అసభ్యంగా వుండడంతో తొలగించడం జరిగింది. అసభ్య పదజాలాన్ని ఇంకోసారి వాడితే మీ వ్యాఖ్యలు ప్రచురించబడవు. నేను అబద్ధాలు రాస్తే చర్తిత్ర గతిలో అవి కనుమరుగవుతాయి. అసలైన చరిత్ర రాయాలంటే ఆధారాల్తోనే రాయాలని నమ్మే మొదటి వ్యక్తిని నేను. కులాల పుట్టుక పరిణామం వాటి జనభా సంఖ్యా పరిమాణాన్నీ బట్టి వుంటాయి. అల్ప సంఖ్యాక జనాభా కలిగిన కులాలు అతి ప్రాచీనమైనవి అయ్యే అవకాశాలు చాలా తక్కువ. అల్ప సంఖ్యాకులుగా వున్నారు అంటే వారు ఏదో ఒక పరిస్తితిలో ఎదో ఒక కులం నుండి విడిపోయిన వారే అయి వుంటారు. వెలమ కులస్తులు విడిపోయిన తరువాత అనాచారులుగా బ్రతకలేదు. ఆయుధోపజీవులై వీరుల్లాగ బ్రతికారు. చరిత్రలు సృష్టించారు. వారికి అలాంటి చరిత్ర కావాల్సినంత వుంది. చరిత్ర స్వంతంగా వుండాలి కబ్జా చేయకూడదు. నిజాలు తెలిసిన రోజున అవమానాల పాలు అవుతారు.

    రిప్లయితొలగించండి
  14. మి బ్లాగ్‌లొ ragava royal అనెఅతను చాలా అసబ్యంగా మా వాణ్ణీ తిట్టాడు మిరు ముందు ఆ వ్యక్యలను తొలిగించడి

    రిప్లయితొలగించండి
  15. పాఠకులకు విజ్ఞప్తి... దయచేసి ఫేక్ ఐడిలతో వ్యాఖ్యానాలు రాయవద్దు. అలా రాసిన వ్యాఖ్యలను ప్రచురించనని సవినయంగా తెలియజేస్తున్నాను. ఈ బ్లాగులో నేను రాసే రాతలు కేవలం ఆధారాలతో మాత్రమే రాస్తున్నానని మనవి చేస్తున్నాను. వాటిని ఖండించాలంటే తప్పకుండా ఆధారాలు చూపించాల్సిందే. ఏ ఇతర కులాన్నీ కించపరచాలని నా వుద్దేశ్యం కాదు. ఎందు కంటే ఏ కులం గొప్పదనం- లోపాలు ఆ కులం వారికే తెలుస్తాయి. ఇతరులకు తెలియవు. ఇతరులకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా వుండదు. అలాంటప్పుడు అయా కులాల గురించి ఇతరులు చర్చించడం సంస్కారం కూడా కాదు.
    నేను వెలమ, కమ్మ కులాలు కాపు కులం నుండి విడిపోయాయని బావయ్య చౌదరిగారు రాసిన కమ్మవారి చరిత్ర, ను ఉదహరించాను అలాగే గౌరవనీయులు ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు గారు రాసిన పలనాటి వీర చరిత్ర గ్రంధాలను ఉటంకించాను. కమ్మ కులం గురించి వారికంటే నాకు ఎక్కువగా తెలియదు ఇది వాస్తవం. నేను చరిత్ర గతిలో విస్మరించబడిన అనేక అంశాలను వెలికి తీసి విశ్లేషిస్తున్నాను. నేను రాసే రాతలు అన్నీ వాస్తవాలని నేను గుడ్డిగా వాదించదలచుకోలేదు. అవి తప్పు అని సాక్షాధారలతో నిరూపించినప్పుడు వాటిని సవరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దయచేసి ఖండించదలచిన వారు సహేతుకమైన ఆధారాలను పంపిస్తూ పద్దతిగా వాదిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయి. నేను గొప్ప అంటే నేను గొప్ప అనే అహంకారాలతో దుర్భాషాలాడుతూ వ్యాఖ్యలు రాస్తున్నారు వాటి వల్ల ప్రయోజనం వుండదు. నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే చరిత్ర గతించిన వాస్తవం అది నిప్పులాంటిది. దానిని వక్రీకరించి రాస్తే కాలగతిలో ఏదో ఒక నాడు రాసిన వారు బఫూన్లుగా మిగిలిపోతారు.

    రిప్లయితొలగించండి
  16. బ్రహ్మనాయుడు కమ్మవాడె ' మిరు చెప్పేవన్ని కెవలం ఉహజనితాలు' వెలనాటిలొ వున్నవారె వెలమలు"కమ్మనాడులొనివారు కమ్మవారు"ఇప్పటి మి కాపుకలం' క్రిశ10లొ కాపు ఓకటికాదు ' వ్యవసాయం చెసె సముహన్ని కాపు అని పిలిచెవారు ఇప్పటి కొన్ని గ్రామాల్లో వ్యవసాయాన్ని కాపుదానం అంటారు' కాపు అనె పదం కులం కాదు ' ప్రతాపరుద్రుడు కమ్మ వెలమలకు కెవలం గృహనామాలు గొత్రాలే ఎర్పటు చెసాడు కులాల్ని వెర్పచలెదు కమ్మకుల గృహనామల్లో ఎక్కువగా "నేని' అని వుంటుంది ఇ 'నేని" నాయుడుకి అంత్యరుపం నాయుడు అనేది కులసుచకం కానేకాదు

    రిప్లయితొలగించండి
  17. కమ్మవారికి పుర్వకాలంనుండి పెరుచివర నాయుడు వుంది వారంతా సైన్యదిపతులు విరులు పరిపాలకులు వారికెమైనా పిచ్చెక్కి పెర్ల చివర నాయుడని పెట్టుకున్నారా నివు వారికంటె గొప్పవాడివా

    రిప్లయితొలగించండి
  18. మిరు బపూన్‌కాకండని సవినయముగా మనవి చేసుకొంటున్నాము

    రిప్లయితొలగించండి
  19. మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అది చరిత్ర కాదు మిష్టర్ "నాయిస్టం" మీ వాదనలకు ఆధారాలు చూపమని అడుగుతున్నాను మీరు చూపించకుండా అది అలా ఇది ఇలా అంటూ వ్యాఖ్యానాలు రాస్తున్నారు. అసలు కమ్మ వారి గురించి నేను ఇంకా ఏమీ రాయలేదు. రాస్తాడేమో అన్న భయంతో ఇలా వ్యాఖ్యానాలు రాస్తున్నారా? నేను రాసిన రాతలు అవును అనడానికి నావద్ద సాక్ష్యాలు వున్నాయి. కాదు అనడానికి మీవద్ద సాక్ష్యాలు వుంటే చూపించండి. తప్పులుంటే నేను సరిదిద్దుతాను అని ఎన్నో సార్లు చెప్పాను కానీ మీరు అనవసరమైన వాదనలు చేస్తున్నారు. వాటి వల్ల ప్రయోజనం లేదు. కమ్మ అనే కులం గురించి ఏడవ శతాబ్దానికి చెందిన శాసనం నా వద్ద ఉంది. కానీ ఆ కమ్మలు మీరు కాదు. అది పాంచాననం వారిలో ఒక శాఖ. ఈ శాసనం దేవాలయం కట్టిన ఒక శిల్పికి సంబంధించినది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కమ్మ అనే కులం గురించి ఏడవ శతాబ్దానికి చెందిన శాసనం నా వద్ద ఉంది. కానీ ఆ కమ్మలు మీరు కాదు. అది పాంచాననం వారిలో ఒక శాఖ. ఈ శాసనం దేవాలయం కట్టిన ఒక శిల్పికి సంబంధించినది

      అభిగారు .. ఈ శిల్పి గురించి ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇవ్వగలరా ... శాసనంతో సహా .. లేక లింకునైనా ..

      తొలగించండి
  20. ధన్యవాదాలు సత్యాన్వేషి గారూ ....మీ సలహా తప్పకుండా పాటిస్తాను. బఫూన్ కావడానికి కారణాలేమిటో తమరు వివరించలేదు?

    రిప్లయితొలగించండి
  21. మిరు ఎదొ రాస్తారని మాకు భయంలేదు ఎందుకంటే మా కుల చరిత్ర గోప్పది ఆలానే మికు మి కులం గొప్పది కమ్మవారు క్రీశ 5 నుండి తేలుప బడుతున్నారు "మిరు కమ్మవారు బలిజల నుండి విడిపోయినవారని రాసారు కాని అది నిజంకాదు మిపైన దురుసుగా మాట్లాడి నందుకు చింతిస్తున్నాము ఇకనుంచి చర్చ అన్నిరువులుతొనే సాగుతుంది అవిదమైన కామెంట్లు అన్ని తోలగించండి మొదట రాఘవ చెసికామెంట్‌ మిరు ఇంకా తొలగించలేదు ఆతను 'నాయల 'అంటే మెము చేతులకి గాజులు వెసుకుని కుర్చొలేదు దాని సగతి తేల్చండి మిమ్మలని మా చరితత్ర రాయమని అడగం లేదురాస్తానంటే వద్దనం కమ్మవాణి బ్లాగ్‌వస్తుంది దాంట్లో మా దగ్గరి శసనాలు రుజువులు అన్నిపేడాతాం

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 1. కమ్మవాణి బ్లాగుకు స్వాగతం....
      2. మీ చరిత్ర రాయాల్సినంత అవసరం కానీ తీరిక కానీ నాకులేదు.
      3. నేను అడిగేది కూడా శాసనాలూ రుజువుల గురించే.
      4. మీరు రాసుకున్న దానిని మాత్రమే నేను ప్రస్తావించాను దానికి ఎందుకు వులికిలికి పడుతున్నారు?
      5. ఆధారాలు రుజువులు చూపించండి నా రాతలు తొలగిస్తాను అని మొదటి నుండీ చెబుతూనే వున్నాను. కానీ మీరే విషయం వదిలేసి పక్కదారిలో వెళుతున్నారు.
      6. ఇక మీరు నన్ను తిట్టిన తిట్లు కూడా బ్లాగులో ప్రచురించాను.

      తొలగించండి
  22. మి రాతలే మిమ్మలని బపున్‌ చేస్తాయి నేను ఇమాట ఎందుకన్నానొ ముందు ముందు మికేతేలుస్తాయి

    రిప్లయితొలగించండి
  23. మంచిది సత్యాన్వేషీ....మీకు సత్యము గోచరించు గాక....బెస్టాఫ్ లక్....

    రిప్లయితొలగించండి
  24. ముందు మీ పేరు తప్పు రాసుకున్నారు దాన్ని సరిదిద్దుకోండి. "సత్యన్వేషి" అనేది తప్పు "సత్యాన్వేషి" అని రాసుకోవాలి. చరిత్రను ఖూని చేసినట్లు తెలుగు భాషను ఖూని చేయకండి. బెస్టాఫ్ లక్...

    రిప్లయితొలగించండి
  25. మి దగ్గర సమాదానం లేనప్పుడు అది తప్పు ఇది తప్పు అంటు పక్కదారి పట్టిస్తారు చరిత్రని ఖూని చేస్తుంది మిరె అసలు ఇవన్ని అనవసరం మిరు కమ్మవారి ప్రస్తావనతేచ్చినందుకు మిబ్లాగ్‌కి రావలిసివచ్చింది లేకపొతేమాకెమి అవసరం" మి 'సత్యన్వేషి

    రిప్లయితొలగించండి
  26. మిరు కొన్ని బ్లాగ్‌లొ చెసిన వదనలు చుసా మిరు అవతలివారి సామాదానం చప్పలెక ఉక్కిరిబిక్కిరి అయ్యింది తేలుసును "సారు

    రిప్లయితొలగించండి
  27. చుడు బాబు చిన్నా నిన్ను ఇక్కడ ఎవరు బుతులు తిట్టలేదు

    రిప్లయితొలగించండి
  28. మా చరిత్ర రాయలన్న కొరిక తిరిక లేనప్పుడు "కమ్మవారి గురించి ఇంకొసారి చర్చిదాం అని మి బ్లాగ్‌లొ ఎందు రాసినట్టు

    రిప్లయితొలగించండి
  29. కమ్మ వారి ప్రస్తావన తీసుకు రావడం తప్పా....లేక నేరమా....మీరు రాసుకున్న చరిత్రనే నేను ఉటంకించాను కానీ నేను చరిత్ర సృష్టించలేదు కన్నా....కమ్మవారి చరిత్ర బావయ్య చౌదరి గారు రాశారు. ముందు అది చదివి తరువాత నాపై యుద్ధానికి రా... గొల్లలతో కంచం పొత్తు, మంచం పొత్తు వున్న విషయాన్ని గౌరవనీయులు అచార్య యార్లగడ్డ బాలగంగాధర రావు గారు వుటంకించారు. మరి ఇందులో ఏవైన ఆక్షేపణలు వుంటే వారిపై చూపించుకో. నాపై అక్రోశం ఎందుకు. వారి కంటే నీవు మేధావివా...నిన్ను చూస్తుంటే నాకొక తెలుగు సామెత గుర్తుకొస్తోంది. "మొగుడు కొట్టినందుకు కాదు ఆడబిడ్డ నవ్వినందుకు ఏడుస్తున్నా" అని వాపోయిందట నీబోటి ఒకావిడ. నీ బాధ చూస్తుంటే పై రాతలు రాసిన వారిని ఏమనలేక వాటిని ఉటంకించిన నాపై పడి ఏడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక ఇప్పుడు జరుగుతున్నది కూడా కమ్మవారి గురించి చర్చనే సోదరా....అది మొదలు పెట్టింది మీరే....

    రిప్లయితొలగించండి
  30. ఆచార్యదేవ" కొంతమంది చరిత్రకారులు'శ్రీక్రిష్ణదేవరాయలు కమ్మవాడన్నరు దానిని ఎందుకు రాయరు" మిరు 54 రాజ్యాలుపాలించి 96 తేగలు కలిగినవారమని చేప్పుకున్న గేజేట్‌లోనే ఉంది బలిజలు నాయక్‌ కాదని 2. బిలివి సంస్తానాదిశుడు రాసిన ఓరీజినల్‌ గ్రందం ప్రచురించండి. చిటిముక్కలుకాదు ఇలాంటివి నేను ఎన్నయిన పెట్టగలను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 96 తెగలు తమ పేరు చివర తగిలించుకునే బిరుదులు అవి. "నాయక్" అనే బిరుదుని కేవలం బలిజ కులస్తులే కలిగి వున్నారు. అందుకే థర్స్టన్ తన కేస్ట్స్ అండ్ ట్రైబ్స్ లో బలిజ కులం గురించి రాసిన (పేజీ నెం.134) బలిజ అని బ్రాకెట్ లో నాయక్ అని ఉద్ఘాటించారు గమనించండి. ఈ నాయక్ వల్లనే నాయక రాజులు అనే పేరు వచ్చింది
      శ్రీకృష్ణదేవరాయలు కమ్మవాడని కొంతమంది చెప్పుకున్నారు అది తప్పు అని తెలిసినప్పుడు దాన్ని ఎలా రాయగలుగుతాము చెప్పు.
      బిలివి సంస్థానాధీశుడు రాసిన ఒరిజినల్ గ్రంథం నెట్ లో దొరుకుతుంది ప్రయత్నించండి. నేను చెప్పే వాటిలో చాలా గ్రంథాలు నెట్ లోనే దొరుకుతాయి కాస్త ఓపికగా వెతకండి.

      తొలగించండి
  31. సామెత బానే ఉందికాని నిన్ను చుస్తే నాకు ఒక సామెత చప్పాలాని ఉంది "....... ఆ ఎందుకులే' మళ్ళి బాధపడతావ్‌" నేను మేదావినీ నితోచెప్పానా నికు నువ్వే మేదావిలా అనుకుని చేత్తమొత్తం రాస్తున్నావ్‌

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శిష్యా...( ఆచార్య దేవా అని సంభోధించారు కదా... అందుకనెమాట) రాయలు కమ్మ వాడని కమ్మ వారు చెప్పుకున్నారు.... కానీ కాదే.... కాకతీయులు బ్రాహ్మణులని చిలుకూరి వీరభద్ర రావు గారు రాశారు ....అది కూడా తప్పనే తేలింది. రాయలు గొల్ల వాడని రాసింది ఆచార్య యార్లగడ్డ బాలగంగాధర రావు గారే. వాటిని పొరపాట్లుగా నిరూపించాము. నేను బాలగంగాధర రావు గారిని కూడా తప్పుబట్టను ఎందుకంటే ఆయన పారిజాతాపహరణంలో నంది తిమ్మన పద్యాలు చదివి అలా పొరపాటు పడి వుండవచ్చు. పొరపాటు తప్పు కాదు అది సరిదిద్దుకోగలిగినదే. చరిత్ర నిర్మాణం లో అనేకానేక పొరపాట్లు జరిగాయి. భారత దేశం గతం లో ఇప్పుడున్నట్లుగాలేదు. నేడు కులం గురించి అంతగా మనం పట్టించుకోము. కానీ ప్రాచీన సమాజం లో కుల పట్టింపులు చాలా ఎక్కువగా వుండేవి. కట్టుబాట్లు కూడా చాలా కఠినంగా అమలు జరిగాయి. ఇప్పుడు మనం మాట్లాడే భావ స్వాతంత్ర్య హక్కు అప్పుడు ఇంతగా వుండేది కాదు. కులాల వారీగా ఎవరి హద్దుల్లో వారు వుండే వారు. మనం చరిత్ర తెలుసుకోవాలంటే నాటి సమాజాన్ని నేటి మన ధోరణి తో చూడకూడదు. ఆనాటి జీవన కోణంలోనే చరిత్ర నిర్మించాల్సి వుంటుంది. నేను నీవు తిట్టే తిట్లకు, పెట్టే కామెంట్లకు అతీతంగానే అలోచిస్తాను నీవు నాతో వాదించాలంటే మొదట కుల చట్రం నుండి బయటకు రా... అసలు చరిత్ర ఏమిటి ఎలా వుంది. ఏది వాస్తవం.... ఏది అవాస్తవం అని ఒకరు చెప్పేదాన్ని పట్టించుకోకు. నీకు నువ్వే శోధించి తెలుసుకో. ఆధారాలు లభించాయి ఇదిగో ఆధారాలు అని ప్రపంచానికి చూపించు. అప్పుడు నా రాతలు తప్పయితే నీ ఆధారాల ముందు తప్పకుండా చిన్నబోతాయి. చిన్న పిల్లాడిలా కామెంట్లు రాసి నా టైం వేస్ట్ చెయ్యొద్దని మనవి.
      ఇక సామెతల గురించటావా నేనేం ఫీల్ కానులే... కొత్త సామెత ఒకటి తెలిసిందని సంతోష పడ్తాను...

      తొలగించండి
  32. వాటి తాలూకా లింకులు ఇవ్వగలరు" అందరు చూస్తారు

    రిప్లయితొలగించండి
  33. వాటి తాలూకా లింకులు ఇవ్వగలరు" అందరు చూస్తారు

    రిప్లయితొలగించండి
  34. అలా ఐతే బోంబేగేజిట్‌లో బలిజ పేరు ఎందుకు ఇవ్వలేదొ సేప్పగలరు మిరు ఇచ్చిన2 గేజిట్‌లలొ ఒకటి తప్పుఅయ్యివుండాలి దింట్లొ మిరు దేన్ని ఎన్నుకొంటారు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ గుంటూరోళ్ళంతా ఇంతేనబ్బా....ఏదీ సరిగా అర్థం చేసుకోరూ......బాంబే గెజిట్ లో 96 తెగల పేర్లు ఇచ్చారు. ఆ తెగలలో "నాయక్" అనే తెగకు చెందిన వారు బలిజ, కవరై, కాపు, తెలగ, ఒంటరి అనే వారు. అందుకే థర్స్టన్ కేస్ట్స్ అండ్ ట్రైబ్స్ లో బలిజ అని బ్రాకెట్ లో "నాయక్" అని పేర్కొన్నాడు. నీకు చరిత్ర గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం లేదు. ఏ కాడికి నన్ను ఎలా విమర్శిద్దామా అని తాపత్రయ పడుతున్నట్లు కనిపిస్తోంది. రెండు గెజిట్లలో ఏదీ తప్పు కాదు రెండూ కరెక్టే...నీకు అర్థం అయి చావడం లేదు అంతే.....

      తొలగించండి
  35. మంచిది అధ్యక్ష"మాకుచేప్పెముందు ఆ చట్రంనుంచి మిరే బయటపడండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్.....
      --------కూర్చొని రొట్టె తినొద్దు రా బాబు అంటే అద్దుకుని తింటా నువ్వేం చేస్తావ్ అన్నాడంట ఒకడు వెనకాల......

      తొలగించండి
  36. ఇక చాలించండి మి బుటకపు రాతలు బలిజలు క్షత్రీయుల అని ఎక్కడ చెప్పబడింధి మిరుచూపే సాక్షంలొనే ఉంది బలిజలు శూద్రూలని" మరి క్షత్రీయులువాడే నాయక్‌ మికెలా వర్తిస్తుంది

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చరిత్ర చదువు....500 వీరబలింజ శాసనాలు చదువు..చదవలేక పోతే చరిత్ర కారులను అడిగి తెలుసుకో.... ఇదే బ్లాగులో బలిజలు క్షత్రియులు ఒకే తెగ వారు అనే అనేక సాక్ష్యాలు వున్నాయి. నేటికీ క్షత్రియులుగా చలామణి అవుతున్న అనేక రాజవంశాలు బలిజలు గానే వున్నారు. క్షత్రియ అనే కులం కేవలం 300 సంవత్సరాల క్రితం తమను తాము విడదీసుకున్నదే కానీ వేరొకటి కాదు. మల్లంపల్లి సోమసేఖర శర్మగారు చాలా శాసనాలను పరిష్కృతం చేశారు. వాటిని గ్రంధస్తం కూడా చేశారు. ఓపిక వుంటే చదివి తెలుసుకోగలవు.

      తొలగించండి
  37. కమ్మవారిది దుర్జయవంశమ్‌ కాకతియ గణపతిదేవుడు వేయించిన ఒకశాసనంలొ తమది దుర్జయవంశమని చేప్పబడింది " గుంటూరు(జిల్లా) మాదాలలొని సాగరేశ్వరాలయంలో.క్రిశ 1125 నాటి పిన్నమనాయుడుశాసనంలొ కమ్మవారు దుర్జయులని తాను వల్లుట్ల గోత్రీకుడనని తేలిపినాడు కాబట్టి కాకతియులు కమ్మవారే కమ్మలు మి బలిజలనుండి వచ్చిన కులంకాదని తేటతేల్లమైనది" వల్లుట్ల గోత్రం కమ్మలుకు మాత్రమే యున్నది

    రిప్లయితొలగించండి
  38. దుర్జయ వంశీకులు కమ్మ కులస్తులు కాదు. శాసనాన్ని స్కాన్ చేసి చూపించగలరు. నాయక రాజుల లోని వారే. దుర్జయుడు. 5వ శతాబ్దం వాడు. ఇక వల్లుట్ల గోత్రం బలిజకులస్తులకు కూడా వుంది. ఇది ప్రామాణికం కాదు.
    కాకతీయులు కరికళ చోళుని వంశానికి చెందిన వారమనే శాసనాలు వున్నాయి. దాని ప్రకారం చూస్తే వీరి గోత్రం "కాశ్యప" అయ్యే అవకాశం వుంది. నిజానికి కాకతీయులు జైన మతం నుండి శైవ మతం లోనికి మారారు. వీరు తమ గోత్రం గురించి చెప్పుకున్న శాసనాలేవీ ఇంతవరకు బయటకు రాలేదు. "వల్లుట్ల" "రేచెర్ల" అనేవి గ్రామ నామాలు. వీటిని గోత్రలు తెలియని వారు తమ గోత్రలుగా చెప్పుకున్నారు.
    కాకతీయుల కులము గురించి చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయమున్నవి. కొన్ని శాసనాల్లో సూర్యవంశ క్షత్రియులని, మరి కొన్ని పుస్తకాల్లో తెలుగు నాయక వంశాల మాదిరి దుర్జయ వంశమువారని చెప్పబడ్డారు. గుంటూరు తాలూకా మల్కాపురంలో కూలిపోయిన ఒక గుడియొద్ద ఉన్న నంది విగ్రహం మీద చెక్కిన శిలాశాసనం 395 (ఆ. ఋ. ణొ. 94 ఒఫ్ 1917.) కాకతీయులు సూర్యవంశపు క్షత్రియులని తెలుపుచున్నది [5]. కర్నూలు జిల్లా త్రిపురాంతకంలో ఉన్న త్రిపురాంతకేశ్వర ఆలయంలో చెక్కబడిన శిలాశాసనం 371 (ఆ. ఋ. ణొ. 196 ఒఫ్ 1905.) ప్రకారం గణపతిదేవుడు సూర్యవంశ క్షత్రియుడని తెలుపుచున్నది [6]. రుద్రమ దేవి భర్త వీరభద్రుడు కాస్యప గోత్రీకుడు కావున తర్వాత కాలంలో కాకతీయులు కాస్యపగోత్రపు క్షత్రియులుగా చెప్పుకున్నారని చరిత్రకారుల భావన [7] [8] "శ్రీ మన్మహాపరిచ్చేదక వర్ణాట కోట కాకతీ వంశ పాటవముల వసిష్ట కౌండిన్య వర ధనంజయ కాస్యపాఖ్య గోత్రంబుల నతిశయిల్లు" అని శ్రీ మాన్ పరవస్తు వెంకటాచార్యులు వ్రాశారు. ఇందులో కాకతీయులు కాస్యప గోత్రీకులని తెలుస్తోంది.

    రిప్లయితొలగించండి
  39. కమ్మలు క్షత్రియులు నుండి విడిపొయిన తెగ ఆంద్రవిజ్ఞానం ద్వితియ భాగంలొ ఉంది" ముసూనూరి నాయాక్స్‌ కూడా కమ్మలె "మల్లంపల్లిసోమశేఖరశర్మ గారి పరిసోధన' కరికళ చోడ దుర్జయుడు ఒకే వంశం వారు కమ్మవారే "జాయపనాయుడు కమ్మ దుర్జయ వంశస్థుడు

    రిప్లయితొలగించండి
  40. కమ్మలు బలిజల నుండి విడిపోయారని రాస్తే, మీ వాళ్ళు అంగీకరించడం లేదుకదా....
    కరికాళ చోళుడు, దుర్జయుడు ఒకే కులం వారే... కరికాళ చోళుడు ఒకటవ శతాబ్దం వాడు.... దుర్జయుడు ఐదవ శతాబ్దం వాడు. జాయప సేనాని 12 వ శతాబ్దం వాడు....ఈ శతాబ్దాలలో కమ్మ కులం వుంటే వీరందరూ కమ్మలని చెప్పుకోవచ్చు. కమ్మ కులం అని వున్న ఒక్క శాసనం కూడా లేదే మరెలా కమ్మ ని చెప్పుకుంటారు. 500 వీర శాసనాలు కలిగిన ఒకే ఒక వీర జాతి బలిజలు, గౌరీపుత్రులు పలనాటి యుద్ధం నాటి కులాల జాబితా మీ వాళ్ళే ఇచ్చారు అందులో కమ్మ అనే కులాన్ని చేర్చడం మరచి పోయారేమో అడిగి కనుక్కోండి. ఇక పరిశొధకుల విషయానికి వస్తే అప్పటికి వారికి లభించిన ఆధారాలను బట్టి వారు అభిప్రాయాలు వెలిబుచ్చారు అంతే.... ఆ తరువాత వెలికి వచ్చిన శాసనాలను పరిశీలించిన తరువాత అవి తప్పులని చాలామంది పరిశోధకులు తేల్చారు. చరిత్ర ఎప్పుడూ రచయితల అభిప్రాయలను బట్టి ఉండదు శాసనాధారాల ద్వారానే వ్యక్తమౌతుంది. నేదు నేను వ్యక్త పరుస్తున్న అభిప్రాయాలు కూడా భవిష్యత్తులో తప్పులని తేల వచ్చునేమో. అవి తప్పులని తేలాలంటే మీ లాంటి వారు తప్పులనే శాసనాధారాలను చూపించాల్సి వుంటుంది. చరిత్ర లో కబ్జాలు చెల్లవు.......నిజం నిప్పు లాంటిది అది ఎప్పుడైనా బయట పడుతుంది.... ఆరోజు నేను కాదు చరిత్ర కబ్జా దారులు బఫూన్లుగా మిగిలిపోతారు....

    రిప్లయితొలగించండి
  41. అసలు బలిజ అనేది కులమే కాదు అది ఓక వ్యపార సముహం అందులొ చాలా కులాలువుండేవి కాలక్రమేణ అందులోని కొందరు బలిజలుగా మిగిలారు అదే కులమైంది

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అని ఎక్కడ వుంది. ఏ గ్రంధాధారంగా చెబుతున్నావు? ఏ శాసనాధారంగా చెబుతున్నావు? హాఫ్ నాలెడ్జ్ ఫుల్ ఫీలింగ్ తో ఏదిబడితే అది రాసి దయచేసి టైం వేస్ట్ చెయ్యొద్దు. బలిజ కులానికి సంబంధించి 500 వీర శాసనాలు వున్నాయి. వీరబలింజ సమయాల గురించి చిలుకూరి వీరభద్రరావు, మల్లంపల్లి సోమశేఖర శర్మ లాంటి వారే సరిగా అర్థం చేసుకోలేక అయోమయం లో పడ్డారు. నీ రాతలను బట్టి చూస్తే నికు చరిత్ర గురించి కనీస అవగాహన లేదని తెలుస్తోంది. కేవలం కులాభిమానంతో ఇతర కులాలపైన దురభిమానంతో చరిత్ర గురించి మాట్లాడ కూడదు. ఎవరో ఏదో చెబితే దానిని పని గట్టుకుని ఈ బ్లాగ్ లో పోస్త్ చెయ్యొద్దు. ఇక్కడ రెండే రెండు విషయాలు మీకు చెబుతాను. ఇక్కడ ప్రకటించిన విషయాలలో తప్పులుంటె శాసనాధారలతో నిరూపిస్తే తప్పులు సరిదిద్దుకుంటాము. లేదా తెలుసుకోవాలన్న తాపత్రయం వుంటే తెలియజెప్పుతాము అంతే కానీ వ్యర్థ వాదనలు వద్దు. చరిత్ర చిన్నపిల్లల ఆటకాదు.....

      తొలగించండి
  42. కబ్జాలు ఎవరు చేస్తూన్నారొ అందరికి తేలుసు మామగారు" అసలు కమ్మలు బలిజల నుండి వచ్చారని కనిసం పది శాసనాలు చూపండి ఒప్పుకుంటాము నిరుపించలేకపొతే వాధననుండి తోలగిపోండిఅర్ధ రహిత వాధనలు చేల్లవు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేను నాకు తెలిసిన ఆధారాలను మీకు చూపించాను అవికూడా మీ వాళ్ళు రాసిన రాతలే... వాళ్ళను అడగకుండా నావెంట పడ్డారేంట్రా బాబూ.....నీ చరిత్ర గొప్పదనమూ....నీ చరిత్ర చండాలమూ....అంతా నీకే తెలిసి వుంటాయి. నాకెలా తెలుస్తాయి? మీ వారు రాసిన గ్రంథాలు చదివాను కాబట్టి పై విధంగా ధృవీకరించాను. దానికి నన్ను వేపుకు తింటున్నారుగా.....పది శాసనాల గురించి నన్ను కాదు గౌరవనీయులు బావయ్య చౌదరి గారిని అడుగు. కనీసం నీ కుల చరిత్ర కూడా నువ్వు చదవ కుండా ఇతర కులాలపైకి దండెత్తుతున్నావే.....ఇది ఏమి సభ్యత... ఇది ఏమి సంస్కారం.

      తొలగించండి
  43. కమ్మ కులం 12వ శతాబ్దం కంటే ముందు వుంది అనే శాసనాన్ని మీరు ఇంతవరకు చూపించలేదు. దాన్ని చూపించండి తరువాత వాదులాడుదాము. లేదు అని నేను చూసిన ఆధారాలను బట్టి స్పష్టం చేశాను..... వుంది అని పది శాసనాలు కాదు ఒక్క శాసనం చూపించినా ఇక్కడి రాతలను చెరిపి వేస్తాను. ఉంది అని నేనే ప్రకటిస్తాను...మీకు ఏమాత్రం స్పోర్టివ్ స్పిరిట్ వున్నా ఈ చాలెంజ్ ను స్వీకరించండి....

    రిప్లయితొలగించండి
  44. ఎంటి మామ ఇంత కోపమేందుకు కూల్‌ మ్యన్‌

    రిప్లయితొలగించండి
  45. 12వ శతాబ్దంకి ముందు కమ్మవారికి శాసనాలు లేకపోతే అప్పుడా కులమె లేదని మిరె నిర్దారిస్థారా అసలేంటయ్య మి గొల ని పాండిత్యంతొ మా బుర్రలు తినకు 2 ని కులంలో కూడా ఎదోక చండాలంఉంటుంది ముందు దాని సంగతి చూడు3కులాల పైన యుద్దం చేయాల్సిన అవసరం మాకేంటి3 మా గోప్పదనం మాకే తేలుసు" మికు తేలియకుంటే ఉరికే మి పనిచుసుకోండి ప్రతివాళ్ళు మామిద పడతారెంటయ్యబాబు

    రిప్లయితొలగించండి
  46. మీ పైన పడాల్సిన అవసరం మాకేముంటుంది తమ్ము|డూ.... మీరే ఏం రాస్తోడో అని కంగారు పడి నా వెంట పడ్డారు కానీ....మీ మానాన మీరు వుంటే ఎవరూ మీ వెంట పడరు.. చరిత్ర ను వక్రీకరించి క్లెయిం చేసుకుంటె ఎవరూ వదలరు...చరిత్ర ఇంటి స్థలం కాదు కబ్జా చేసుకోవడానికి. ఒక్క ఆధారం కూడా లేకుండా కాకతీయులు కమ్మ కులస్తులని చెప్పుకున్నారు... మొన్నటి దాకా శ్రీకృష్ణదేవరాయలు మావాడని చెప్పుకున్నారు. చివరికి రాయలు తండ్రి గొల్ల కులస్తుడు... తల్లి కమ్మ కులస్తురాలు అని కూడా మీరే డిక్లేర్ చేశారు....
    ఇవన్నీ తప్పులు కదా ప్రాచీన వ్యవస్థ మీరుచెప్పినట్లు కులసంకరాలతో లేదు. కులాలకు బాధ్యతలు వున్నాయి. వాటన్నింటినీ వదిలేసి ఎవరూ చూడడం లేదు అని రాంగ్ క్లెయిం లు చేశారు. నేను మీ ఒక్కరి అనడం లేదు, చాలా కులాలు అలా క్లెయిం చేసుకున్నాయి. అది తప్పు చరిత్ర చరిత్ర లాగే వుండాలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Meeru cheppedi akshara satyam Dupam Garu. Nenu kapunu kadu Kammanu antakante kadu. Vindyaparavatalu dati 6th shatabdam dakshina Barataniki vachhi stirapadina polavasa rajulam. Velamallo okabanganga telanganalo deshai garalvadda divanam vayvaharalu chusukunevallam. Mame kulam gurunchi antaga pattinchukomu. Mundu kammalau eduti manishini manishi laga chudadam nerchukommanan
      di.Veeriki charitre ledu anta kalegura gampa Anni kalisina hybride jathi veelladi. Anduke antha baritegimpu veelaki samjama antene bottiga respect vundadu veellaki kavalsindall dabbu , adikaram , ee rendu madalatho virraveege chachala swvabhavam kala okeokka jathi. Samajamlo edi goppado vattiki kamma rangu pulumutaru, Nati kakateeyyulanudi modalu evvarinanina kalipesukuntatru, evvadi chetilo dabbu adikaram vunte vadiki a kamma rangu poostaru. merem manushulara babu. telugu ane padam, tenugu ane padam nundi puttindi ee perupi oka kulam vundi danne andralo Ontarulani, Teanganalo ippatiki tenugulani, seemalo muttarajulu leka muttarasulani antaru valle ippatiki dasara sambarallo veera kadgam chabooni, ammavaraki prati roopakamga betala samharam chestaru,kai kala kramena veelu maruguna padi poyaru, nijanaiki velamalu valla charitranu vallu rasukoni veerulla nilabadi charitra srustincharu, okka kammaodu ee english vaditho yuddallo gelachadu ee charitralo vundi, enduku ra meeku anta balupu. charitra ledu tokka ledu meeru mee jathi. musukoni kulagodavalapi pani chusukondi.

      తొలగించండి
  47. ఇప్పుడు అర్దంమైంది ని భాద ఇప్పటిదాక నువ్వు చేప్పెదాంట్లో ఎక్కడో నీజముందేమొ అనుకున్నా" నువ్వు కూడా కమ్మ ద్వేషివే కాకతియులు కమ్మలంటే మీకు నచ్చదు అసలే అన్నింటా ముందుటాము ఎ రంగములోనై పైచేమాదే విళ్ళకి ఇంతచరిత్ర ఉండాలా అని కుళ్ళుకుంటున్నారు మేము కాకతియ పుతృలం కాబట్టే అన్నింటా సత్తా చాటుతున్నాం " 2పరాయివారి తండ్రిని మా తండ్రని చేప్పుకోటానికి మాకు సిగ్గు లజ్జాలేదనూకున్నావా మా చరిత్ర నే అందరు కబ్జచేసి పైగా మా పైనే దాడి చేస్తున్నారు 3కమ్మలుకు మికాపులకు సంభంధమేలేదు కమ్మలనే కమ్మకాపులేనే వారు కాపు అంటే రైతు కాపులేల్ల కమ్మ వెలమలైరీ "అంటే వ్యవసాముచెయువారు కులాలు విడినారు కాపు అంటే మిరుకాదు ఇ విషయము నికు ఎప్పుడు అర్దంమవుతుందో మాకి హింస ఎప్పుడు విరగడవుతుందొ" కాలచోదితమున అభిగారివల్ల జనులంతా """""అయ్యిరీ కాబ్జా చేయ్యలేదు మకాది చెతకాదు ఎదైనా సత్తాచూపి సాదిస్తాం

    రిప్లయితొలగించండి
  48. కమ్మ కులాన్ని నేనెప్పుడూ ద్వేషించను. ఎందుకంటే 60 కులాలను ప్రేమించగలిగిన నాకు నువ్వొక్కడివీ ఎక్కువ కావు. ఇక్కడ కులాన్ని ప్రేమించడం ద్వేషించడం అనేది కాదు పాయింటు. కాకతీయులు కమ్మ కులస్తులు కాదు వారు బలిజలు, గౌరీ పుత్రులు, అని పిలువబదినారన్న ఆధారాలను ఈ బ్లాగులోనే పెట్టాను. కాప్యేషాం కులమున్నతి అన్న ప్రతాపరుద్రుడి గురించి కుడా ఆధారాలు పెట్టాను. అయినా కాకతీయులు కమ్మ కులస్తులే అంటూ వితండ వాదం చేస్తున్నావు చూడు... ఆ వితండ వాదమే నీ స్థాయి దిగజారుస్తూ వుంది. నీ లాంటి కొంతమంది చేసే రాంగ్ క్లెయింస్ వల్ల పాపం కమ్మ కులస్తులంతా బలి అవుతున్నారు. మీ లాంటి మేధావులు చేసె తప్పులకు కమ్మ కులస్తులంతా ఎందుకు అవమాన పదాలి అంటాను నేను. నేను కమ్మ కులస్తుల గురించి తప్పుగా మాట్లాడడం లేదు. కమ్మ కులస్తులు కష్టపడి అభివృద్ధి చెందిన మాట నేనెరుగుదును నిజాయితీ పరుడిని ఎవ్వడూ వేలెత్తి చూపలేడు. ఎవరో కొంతమంది మీ లాంటి వారు చేసే తప్పులకు కులాన్నీ మొత్తం ఎందుకు బలి పెడుతున్నారు.
    ఏ రంగం లో నైనా మాదే పై చేయి అన్నావు మంచిది ఈ మాట నీ అహంకారాన్ని ప్రతిబింబిస్తోంది. దేశం కొరకు ప్రాణాలర్పిస్తున్న సైన్యం లో నీ పర్సెంటేజీ ఎంతొ చెప్పగలవా...హస్త కాళాకారులలో నీ పర్సెంటేజీ ఎంతో చెప్పగలవా....మొదట అహంకారాన్ని వదిలి పెట్టు నీవు అప్పుడే అందరికీ మిత్రుడివి అవుతావు. నీ పైన ని కులం పైన ఎవరికీ ద్వేషం లేదు. నీ అహంకారమే నీ బాధకు కారణం వేరెవరో అనుకోవడం నీ అజ్ఞానం.

    రిప్లయితొలగించండి
  49. అభి అన్న నేను చెబితే విన్నావా తొక్కలో మర్యాదలు అంటావు నా కమెంట్లు డెలిట్ చేశావు నువ్వు ఎన్ని చెపినా వీళ్ళు అంతే మారరు తెలంగాణా వాల్లు ఆంధ్రోల్లను తిట్టడానికి కారనం వీల్లు కాదా విల్లు బిచ్చగానికి ఒక రూపాయ వేయడం ఎప్పుడన్న చుశావా నివు మారవు వాల్లు మారరు కమ్మ పాసు కడిగినా పొదు

    రిప్లయితొలగించండి
  50. Hari rao నువ్వొక పేక్‌ ఐడి అని తేలుసు పిచ్చికుతలు ఆపీ విషయనికి రా మాపైన ఎడవటంతప్ప ఎమి చేతకాదు మిలాంటి వారికి "మి ఎడుపు మిది ఎడవండి 2నువ్వు రాసింది ఎంటో అర్దంఅయ్యెలా రాయి ముందు ఆంగ్లభాష సరిగా నేర్చుకో రాకుంటే తేలుగులొ ఆగొంరించు 3ముందు నువ్వు గమనించాల్సి విషయమ్‌ ఎంటంటె నువ్వుచెప్పిన ఎకులాల్ని నేను దుషించలేదు అభిగారు చేప్పింది కాదు అని వాదిస్తున్నా అంతే 4 ముందు నువ్వుచరిత్ర తేలుసుకుని మాట్లాడు "అభిగారు అప్పుడప్పడు ఇంలాటి పెక్‌లని దింపి నోటికొచ్చినట్టు తిట్టి భయపెట్టాలని చుస్తారు ఎంటయ్య ఇది"దిన్ని ప్రచురిస్తావో లేదొ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిట్టాలంటే ఫేక్ ఐడి లు అవసరం లేదు ప్రతాప్ రవి గారూ.....నాకు తెలుగు భాషలో వున్న తిట్ట్లన్నీ తెలుసు....కానీ నా పెద్దలు నేర్పిన సంస్కారం అడ్డొస్తోంది. ఇక ఫేక్ ఐడి లను నేనే దించినట్లు చేసిన ఆరోపణలను ఖంఢిస్తున్నాను మీరే చాలా ఫేక్ ఐడి లతో వాదిస్తున్నారని మావాళ్ళు చెప్పారు కానీ నేను పట్టించుకోను. ఫేక్ ఐడి అయినా...ఒరిజినల్ ఐడి అయినా నా బ్లాగులో సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాది. అసభ్యకర పదజాలాన్ని ఎవరు ఉపయోగించినా ఆ కామెంట్లను తొలగించాను వారు కాపులైన సరే కమ్మలైనా సరే ఏ ఇతర కులాలకు చెందిన వారైనాసరే....చర్చ లో వాస్తవాలు బయటకు రావాలి. ఆధారాలు చూపించండి అని ఎన్ని సార్లు అడిగినా మీరు వట్టి చేయి మూర వేస్తున్నారే కానీ విషయం తేల్చలేక పోతున్నారు. ఇక నైనా ఫాల్స్ ప్రిస్టేజీ లు వదలి పెట్టి ఇకనైనా వాస్తవం లోకి రండి. ఈ బ్లాగు ప్రతి రోజూ ప్రపంచ వ్యాప్తంగా కనీసం 50 మంది చూస్తారు. మన భావజాలాన్ని మనం మాత్రమే కాకుండా ప్రపంచమంతా తిలకిస్తోందన్న విషయాన్ని గురుతుంచుకోండి.

      తొలగించండి
  51. నాది అహంకారం కాదు ఆత్మవిస్వసం సైన్యంలో ఎంతమంది ఉన్నారన్నారు మివాళ్ళెంతమంది ఉన్నారు ఎవరున్నా వాళ్ళుగొప్పవాళ్ళు మిరు నేను కాళిగా వాదులాడుకుని వారి మర్యయద తియ్యెద్దు

    రిప్లయితొలగించండి
  52. కాటారి గారు మిరు మొదటినుంచి ఇంతే తేలంగాణావాళ్ళు ఆంద్రావాళ్ళని తిట్టటానికి సంభదం ఎంటో మిగోల మిది భిచ్చగాళ్ళకి మిరెన్ని కోట్టులు దానం చెసారెంటి మిరు తిట్టటానికి పాపం భిచ్చగణ్ణీ ఎందుకులాగుతారు కమ్మ పాచికడగటాని మిరెమైనా పాచిపని చేస్తున్నారా మిరు మారరు

    రిప్లయితొలగించండి
  53. అభిగారు "మిలాంటి వాళ్ళవల్ల కూడా మివాళ్ళు తిలదించుకునె పరిస్తి తిసుకొచ్చారు మిరు పొగిడిన నోటితోనే తిట్టటం మాకు చెతకాదు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా వల్ల నా కులం తలదించుకునే పరిస్థితే వస్తే నా బ్లాగే కాదు నేనుకూడా వుండను. నా ప్రతి అడుగూ నా కులం మెచ్చుకునే లాగానే వుంటాయి తప్ప తల దించుకునే లా వుండదు. నా కులం గురించి నేను ఇచ్చే సమాచారం తప్పు అని ఇంత వరకు ఎవరూ నిరూపించ లేక పోయారు. మీరూ ప్రయత్నించి చూడండి తప్పు అని నిరూపించగలరేమో.

      తొలగించండి
  54. అంత నిజాయితి ఉంటె మరి hari raoఫేక్‌ ఐడి పిచ్చికుతలు ఎందు ప్రచురించినారు నేను ఎప్పుడైనా పరుష పధాలు వాడినాన

    రిప్లయితొలగించండి
  55. మికులం గురించి "వర్తావ్యపారాలు శాసించినాము రాజ్యలు ఎలినాము అని ఎంతోగోప్పగా రాసుకున్నారు కాని మా గోప్పదనం చేప్పేఒక్క కామేంట్‌ చెసినందుకు మికు మివాళ్ళకి అంత కోపమొందుకోచ్చిందో" సైన్యం హస్తకాళాకారులు అంటు గోప్పప్రసంగం ఇచ్చినారు మి ఆనందంకొసం నేను ఫేక్‌ ఐడి అనుకుందాము మా పెద్దవాళ్ళుకూడా నాకు సంస్కారం నెర్పినారు మిరు మికుల సమాచారం ఇచ్చుకుంటే మాకు అభ్యంతరాలు లేవు నిజంగా కాకతియులు కాపులైతే సాక్షలతతో పుస్తకాలు ప్రచురించండి లేకపోతే న్యయవ్యవస్త వుంది కొర్టులో కేసువేసి గెలవండి మాది తపైతే ఉరె వేస్తారొ జెల్లోనె పెడతారొ " ప్రిగా భ్లాగ్‌లు తాయరు చెసి మా బుర్రలు తినకండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కాకతీయులు బలిజులు, గౌరీపుత్రులు అని పిలువబడినారని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన పాఠ్యపుస్తకం ఈ బ్లాగులోనే వుంది చదువు తమ్ముడూ.....
      ఇంతకంటే సాక్ష్యం అవసరం లేదేమో తమ్ముడూ....
      http://balijavani.blogspot.in/2014/02/blog-post_17.html

      తొలగించండి
    2. ఈ సాక్ష్యం చూసి కుడా నీవు అలాగే మాట్లాడితే నిన్ను ఖచ్చితంగా పిచ్చాసుపత్రికి పంపించాల్సిందే.....

      తొలగించండి
  56. Chinna pratap Firstly you should understand It is not fake ID give me your no I will call you then you might know where I am from, such a long time he has been asking proofs what ever you are claiming about your community. I have observed that you didn't proved your answers and never shown related proofs, more over you are blindly scolding and arguing others. Again don't think I am his favour or relation. Don't argue blindly,I have observed kammas web-sights and I have relations in my maternal relations we know their mentalities and their behaves at other chumma money minded fellows. Stop barking and shut up your main holes everything and submit the proofs what ever he asked then continue arguments so every one will accept your comments. Remind that facts are facts those never gonna fade out.

    రిప్లయితొలగించండి
  57. అభిగారు "పిచ్చాసుపత్రికి ముందు మిరె వెళ్ళటానికి సిద్దంగా ఉండన్‌డి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఓ సారీ.... పిచ్చి వాళ్ళని పిచ్చి వాళ్ళంటే వారికి చాలా కోపం......

      తొలగించండి
  58. Mr.hari rao"వెటిని నువ్వు సాక్షాలంటన్నావ్‌ ఇభ్లాగ్‌లొ వున్నవాటినా " వాటికి విలువ లేదు 'నువ్వు ముందు మాపై ఎడవటం ఆపు ' మని మైండెడ్‌ ఫేలొస్‌ ఎవరు నిజాయితిగా మని సంపాదించటమ్‌ ఎంత కష్టమొ ని తేలుసనుకుంటున్నాను" ఎదుటివాని బొక్కలెంచువారు తమబొక్కలేరుగరయా అని

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రతాప్ రవి గారూ నేను కాకతీయుల గురించి ఈ బ్లాగులో పెట్టిన పుస్తకం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రచురించినది నేను రాసినది కాదు. మీకి ఎక్కడైన దొరుకుతుంది. కాకతీయులు కమ్మ కులస్తులు అని ఉన్న శాసనాలు ఏవీ లేవు మీరు క్లెయిం చేసుకోవాలంటే ముందు అవి సంపాదించండి.....ఆయన మా నాన్న....ఈయన మా నాన్న అని ఇష్టమొచ్చినట్లు చెప్పుకుంటె వాళ్ళ పిల్లలు ఊరుకోరు.....

      తొలగించండి
  59. MR prathap seems you are just doing arguments. Still you are not showing evidence more over you are telling telugu proverbs which not at all you and your community people just its time waste to talk with you. Look like you are big arrogant rather you don't have stuff to show proves so you never gonna prove what ever you are claiming.Be polite and always talk with evidence.No one can say than this much you.

    రిప్లయితొలగించండి
  60. దుపం అభి గారు మీకు ఫేస్బుక్ ఉందా ...?????? రెగ్యులర్ గా టచ్ లో ఉంది అమూల్యమైన సమాచారం తెలుసుకోవటానికి

    రిప్లయితొలగించండి
  61. 8125515706 naa ph number. mee id ni cheppagalaru meeku facebook unte

    రిప్లయితొలగించండి
  62. గతంలో నిజమైన చరిత్రకారులు నిష్పక్షపాతంగా సత్యాన్వేషణ చేశారు. నేడు ప్రతి విషయాన్ని రంగుటద్దాలలో చూసి అసహనంతో అసభ్యమైన భాషలో అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నాం !!!

    రిప్లయితొలగించండి
  63. YRB గారూ మీరు చేసిన వ్యాఖ్య అర్థం కాలేదు...కాస్త స్పష్టంగా కామెంట్ చేయగలరు. గత చరిత్ర కారులు నిస్పాక్షికంగా చరిత్రను సంకలనం చేసి వుంటే నేడు ఈ సమస్యలు తలెత్తేవి కావు. ఎవరు పరిశోధన్ చేస్తే రాజులు వారి కులం అని రాసుకున్న మహానుభావుల వల్లనే ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రాచీన భారత దేశం లో కులం చాలా ప్రధాన పాత్ర పోషించింది. హిందూ దేశం పైన విదేశీయులు దాడులు చేసి ఇక్కడి మహిళలను, పిల్లలను బానిసలుగా పట్టుకు పోయి హింసించిన కాలాన్ని మనం నేడు చూడలేము... అలాంటి విపత్కర పరిస్థితులలో అన్ని జాతులను కాపాడడానికి తమ జీవితాలను పణంగా పెట్టిన వారు ఒక పద్దతిలో ...కట్టుబాట్లతో జీవించారు. వారిని నేడు మనం ఇతర కులాలతో సంభోధిస్తున్నాం...తల్లి వేరు తండ్రి వేరు అని నిరాధార రాతలు రాస్తున్నాం ఇది ఎంతవరకు సమంజసం...నా వరకు నేను ఆధారాలతో మాత్రమే అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నాను. నా అభిప్రాయాలు తప్పు అని పలువురు ఆధారాలు చూపించినప్పుడు ఎలాంటి భేషజాలు లేకుండా సరిదిద్దుకున్నాను. 5000 సంవత్సరాలకు పూర్వమే తెలుగు వీరులు ప్రపంచమంతా తిరిగారు. ఎన్నో వలస సామ్రాజ్యాలు స్థాపించారు. సూర్య, చంద్ర, శెషనాగ, యదు వంశాలకు చెందిన 96 తెగలే చప్పన్న దేశాలుగా పిలువబడిన 56 రాజ్యాలను పరిపాలించాయి. మరి తెలుగు చరిత్ర కారులు వీరిని ఎందుకు విస్మరించారు. ఇలాంటివి తప్పిదాలు చరిత్రలో చాలా జరిగాయి. వాటిని సరిదిద్దడమే మా లక్ష్యం. మీ లాంటి పెద్దలు తప్పులుంటే సూచిస్తే సరిదిద్దు కుంటాను ....

    రిప్లయితొలగించండి
  64. కమ్మలు కాపుల నుండి ఏర్పడలేదు.

    రిప్లయితొలగించండి
  65. అభి గారు చరిత్ర ను సరిదిద్దాలి...అదీ ఆధార సహితంగా

    రిప్లయితొలగించండి
  66. సూపర్బ్ సర్ మంచి విషయాలు తెలిపారు

    రిప్లయితొలగించండి
  67. Dr.ఎడ్వర్డ్ తుర్స్టన్ వ్రాసిన కాస్ట్స్ &ట్రైబ్స్ అఫ్ సౌత్ ఇండియా (1900AD -మద్రాస్ museum లో ఉన్నాది .అందులో బేతి రెడ్డి రాజు గారి నుంచే కమ్మలు ,కాపులు ,వెలమలు వచ్చి నారని ఉంది. చెవిరెడ్డి (betireddy)వారసులుగా వెలమలు ,మరియు దొడ్డా నాయుడు అతని కుమారుడు బ్రహ్మనాయుడు (పల్నాటి )అని చదివాను ,ఇది విశదపరచ గలరా ?కులాల్ని పక్కకు పెట్టి

    రిప్లయితొలగించండి
  68. బలిజ నుండి వెలమ వేరవడం , వెలమ నుండి భూమి తగాదాలతో వేరుపడి కమ్మలయ్యారని మీరు ప్రస్తావించిన ఆధారిత చరిత్ర గ్రంధం కాస్త వివరంగా వివిధ పులీకరించండి!
    ASRK. Satya prasad.

    రిప్లయితొలగించండి
  69. బలిజ లు వేరు కాపులు వేరు అభి గారు ప్రతపా రుద్ర చరిత్ర అనె పుస్తకం లో కులాలు వర్ణాలు గురించి పేర్కొన్నరూ బలిజలు అర్యవర్తం నుండీ వచ్చినా వారు

    రిప్లయితొలగించండి