12, మే 2013, ఆదివారం

రాయల వారి గురించి వాస్తవాలు


          శ్రికృష్ణదేవరాయలు ఈ పేరు వింటే నే  ప్రతి తెలుగువాడి హృదయం ఉప్పొంగిపోతుంది. "దేశభాషలందు తెలుగు లెస్స" అని రాయలు రాశాడని ప్రతి తెలుగువాడు సంబరపడతాడు. కానీ అలాంటి వ్యక్తి ఈ నేల మీద తిరుగాడాడంటేనే... భవిష్యత్తులో ఎందుకు ఇప్పుడే చాలామంది నమ్మరు. ఆ మహాపురుషుడి గురించి, ఆ మహా వీరుడి గురించి, ఆ గొప్ప పరిపాలనా దక్షుడి గురించి డొమెంగో పెయిస్, న్యూనిజ్ రచనలే లేకుంటే బహుశా నేను కూడా నమ్మి వుండే వాడిని కానేమో. మహమ్మదీయ మహమ్మారుల చేతుల్లో భారతదేశ చరిత్ర మంటల్లో తగులబడి పోయింది. సాంస్కృతిక వారసత్వ సంపద వారి మూర్ఖత్వానికి శిథిలమైపోయి నేడు వెక్కిరిస్తొంది.

           క్రీ.శ. 1520 లో పోర్చుగల్ రాజోద్యోగి "డొమింగో పెయిస్" తన కంటితో చూసిన విజయనగర సామ్రాజ్యాన్ని ఇలా వర్ణించాడు.  

        "విజయనగర సామ్రాజ్యానికి రాజధాని "హంపి". దానికి ఆరుమైళ్ళ దూరంలో కొండలవరుస వున్నది. అందులో నుండి రెండు ద్వారాల గుండా  మార్గాలు ఏర్పడ్డయి. నగరం లోనికి పోవాలంటే ఈ ద్వారాలు తప్ప వేరే దారి లేదు. కొండలవరుసలు 72 మైళ్ళ పొడవున నగరాన్ని చుట్టివున్నాయి. ఏడు ప్రాకారాల మధ్య శతృదుర్భేధ్యంగా కట్టిన ఈ నగరం లో అసంఖ్యాకమైన జలాశయాలున్నాఇ. నీటిపారుదలకు చక్కటి ఏర్పాట్లున్నాయి. పచ్చని పొలాలతో, చక్కని తోటలతో, బాటలప్రక్కన చెట్లతో తీర్చిదిద్దిన రహదారులతో క్రమపద్దతిన కట్టిన ఇండ్లతో  కళాత్మక కట్టడాలతో, సమస్త వస్తువులు విక్రయించే అంగళ్ళతో ఈ నగరం బహు సుందరంగా వుంది. ఈక్కడి వాణిజ్య వీధులలో పలురకాల కెంపులు, వజ్రాలు, వైఢూర్యాలు, పచ్చలు, మాణిక్యాలు, రత్నాలు, ముత్యాలు కుప్పలు పోసి విక్రయిస్తున్నారు. అనేక దేశాల నుండి వర్తకులు ఇక్కడకు వచ్చి నివాసము ఏర్పాటు చేసికొని వజ్ర వైఢూర్యాది నవరత్నాల వ్యపారము సాగిస్తున్నారు. 

            ఈ నగరమెంతో విశాలమైనది. దీని వైశాల్యము ఇంత అని వ్రాయలేను. ఎందుకంటే నేను ఒక  కొండ పైకి ఎక్కి చూచినా నగరము కొంతభాగము మాత్రమే కనిపించినది. కొండలమధ్య విస్తరించి వుండడం వలన పూర్తి నగరాన్ని చూడలేక పొయాను. నాకు కనిపించిన భాగమే  "రోం"  నగరమంత పెద్దదిగా వుంది. చెట్ల గుంపులతో ఇండ్ల చుట్టూ తోటలతో ఎటు చూసిన చెరువులతో రమణీయంగా కనిపించింది. ఈ నగరము లో జన సంఖ్యను లెక్కించడం కష్టమైనందువల్ల సుమారు ఇంత అని నేను చెప్పినా అతిశయోక్తిగా భావించి ఎవరూ నమ్మరన్న భయంతో ఆ ప్రయత్నం చేయడం లేదు. ఇది ప్రపంచంలోకెల్లా సమర్థవంతమైన గొప్ప నగరం అని మాత్రము నేను చెప్పగలను".

           నేటికి 500 సంవత్సరాల క్రితం ప్రపంచం లోనే ఇంత గొప్ప నగరం లేదని ఒక యురోపియన్ సంభ్రమం తో రాశాడంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. బలిజ వంశ చక్రవర్తులు ఎంతటి వైభవోపేత సామ్రాజ్యాలను అనుభవించారో. 
    
         శ్రీకృష్ణదేవరాయలు 20 సంవత్సరాలకే చక్రవర్తియై మరో 20 సంవత్సరాలు మాత్రమే రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ 20 సంవత్సరాల కాలం లో ఎన్నో యుడ్డాలు, మరెన్నో విజయాలు. ఆ రోజుల్లో రాయల వారిని శ్రీకృష్ణుడే మళ్ళీ జన్మించాడని అనుకొనే వారట. కేవలం 40 సంవత్సరాలకే పరిపూర్ణమైన వ్యక్తిగా శ్రీ రాయలు కనిపిస్తారు. ఆయన రచించిన అముక్తమాల్యద చదివిన వారికి. అంతటి మహాపురుషుడు బలిజ కులం లో జన్మించినందుకు ప్రతి బలిజ కులస్తుడూ గర్వించాలి. 

        కానీ కొన్ని కులాల వాళ్ళు మావాడంటే మావాడని రాయల వారిని తమవాడిగా చెప్పుకోవడం కొరకు తాపత్రయ పడుతున్నారు. అందుకే సవివరమైన విశ్లేషణలను చేయదలిచాను. విజయనగర సామ్రాజ్య చరిత్ర విషయం లో చాల మంది వక్రీకరణకు పాల్పడుతున్నారు. వక్రీకరించి రాసే రాతల వల్ల సామాన్యులే కాదు పండితులు సైతం పొరపడే అవకాశం వుంది. కనుక వాస్తవ చరిత్ర ఏమిటొ ప్రజలకు తెలియజెప్పాల్సిన ఆవశ్యకత నాకు కనిపించింది. అందుకే రాయలవారి గురించి, విజయనగర సామ్రాజ్యం గురించి వాస్తవాలు తెలియజెప్పడానికే నా ఈ చిన్ని యత్నం.