9, జులై 2012, సోమవారం


పాములపాడు పెరికబలిజలు గర్జించారు.
       

        

       కర్నూలు జిల్లాలోని పెరికబలిజలు గర్జించారు. తమ హక్కులకై పోరాటాలకు తెరతీశారు. పాములపాడు పట్టణం లోని శివాలయం వద్ద 9-7-2012 సోమవారం సమావేశమైన మండలం లోని పెరికబలిజలు మహార్యాలీ నిర్వహించారు. పట్టణం లోని ప్రధాన వీధులగుండా సాగిన ర్యాలీలో "పెరికబలిజలు వర్ధిల్లాలి" మాహక్కులు మాకు కావాలి అంటూ నినాదాలతో వీధులు మారుమ్రోగాయి. 1958 నుండి 1997 వరకు వున్న మాహక్కులు మాకు కావాలి అంటూ నినాదాలిచ్చారు. అనంతరం పాములపాడు తహశీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు.  ఈ కార్యక్రమం లో కర్నూలు జిల్లా కాపు, తెలగ,బలిజ, మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు యర్రంశెట్టి నారాయణరెడ్డి, జిల్లా కార్యదర్శి ధూపం అభిమన్యుడు, పాములపాడు మండల అధ్యక్షుడు పూజల రామలింగారెడ్ది, కోశాధికారి రామకృష్ణ, ఆత్మకూరు నాయకులు రిటైర్డు డిఆర్ ఓ వెంకటేశ్వర్లు.కొత్తపల్లె పెరికబలిజ  నాయకులు, వెలుగోడు పెరికబలిజ నాయకులు పాములపాడు మండలం లో వున్న అన్ని గ్రామాల పెరికబలిజలు పాల్గొన్నారు.