30, జూన్ 2012, శనివారం

          

మా హక్కులు మాకు కావాల్సిందే...

కొత్తపల్లె మండలం లో ఎలుగెత్తి చాటిన పెరికబలిజలు


     కర్నూలు జిల్లా కొత్తపల్లె మండలం లోని పెరికబలిజలు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన మా హక్కులు మాకు దక్కాల్సిందే నంటూ శుక్రవారం ర్యాలీ, ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. గత ఆత్మకూరు నియోజకవర్గం లోని మండలాలైన వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు, కొత్తపల్లె మండలాల లో నివశిస్తున్న పెరికబలిజలు తమకు ఓట్లు వేయలేదనే ఒకే ఒక్క కారణం తో వారికి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను కాలరాయడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు. గత ౧౫ సంవత్సరాలుగా తమకులాన్ని అణగదొక్కారని వారు వాపోయారు. ఈ కుట్ర వల్ల గత ౧౫ సంవత్సరాలుగా ఎన్నో విద్య, ఉపాధి అవకాశాలను తమ కుటుంబాలు కోల్పోయాన్నారు.  ఇంతకాలం జరిగిన కుట్రను తాము కనుగొన్నామని ఈ కుట్రను ఇక సాగనీయమని కలసికట్టుగా పోరాటం చేసితీరుతామని వారు హెచ్చరించారు. అనంతరం తహశీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు.