10, ఏప్రిల్ 2020, శుక్రవారం

పెమ్మసాని కుటుంబీకులకు శ్రీ కృష్ణదేవరాయలుకు ఎలాంటి సంబంధం లేదు

పెమ్మసాని కుటుంబీకులకు శ్రీ కృష్ణదేవరాయలుకు ఎలాంటి సంబంధం లేదు
స్పష్టం చేసిన పెమ్మసాని రాజా కుటుంబీకులు పెమ్మసాని పరంధామ్ గారు....
.      ఈ రోజు అనగా 10-4-2020 మధ్యాహ్నం 11-27 నిముషాలకు నాకు ఒక మెస్సెజీ వచ్చింది. నేను పెమ్మసాని పరంధామ్ మీతో మాట్లాడవచ్ఛా ...అని.  నేనే వారికి ఫోన్ చేశాను. ఆయన చాలా సౌమ్యంగా మాట్లాడారు. ఆయన నాతో మాట్లాడుతూ ఫేస్ బుక్ లో రాయల వివాదం గురించి చదివానండీ మీ బ్లాగు కూడా చూశాను అన్నారు. శ్రీకృష్ణదేవరాయల తల్లి దీపాల నాగమ్మ అని చెన్నై లోని రాతప్రతుల లైబ్రరీ నుండి సేకరించిన పత్రాలలో వుందన్నారు...ఈ దీపాల నాగమ్మ ప్రస్తావన మా పెమ్మసాని వారి రికార్డులలో ఎక్కడా లేదని వారు స్పష్టం చేశారు,శ్రీకృష్ణదేవరాయల కుటుంబానికి పెమ్మసాని వారి కుటుంబానికి ఎలాంటి బంధుత్వం లేదని ఆయన స్పష్టం చేశారు...అదేవిధంగా మధురను పాలించిన విశ్వనాథనాయకుని కుటుంబం తో కానే తంజావూరు రాజకుటుంబాలతో కానీ పెమ్మసాని వారికి బంధుత్వం లేదని తెలిపారు. శ్రీ ముత్తేవి రవీంధ్ర నాథ్ రాసిన శ్రీకృష్ణదేవరాయల వంశ మూలాలు అనే పుస్తకం విషయం లో తమకు ఎలాంటి ప్రమేయం లేదన్నారు. అదే విధంగా ఆయన రాసిన పుస్తకాన్ని తాము సమర్థించడం లేదని స్పష్టం చేశారు...  ఇక అదేవిధంగా తమిళనాడు కమ్మ సంఘం వారు కూడా తిరుమలై నాయకర్ చిత్రపటాన్ని   కమ్మ కుల సంఘం పోస్టర్ లలో  కమ్మకులస్తుడిగా చూపవద్దని సూచించానని ఆయన తెలిపారు....తాను కొటికం వారి కైఫీయాత్ తో పాటు చాలా మాన్యు స్క్రిప్ట్స్ పరిశీలించానని వారందరూ బలిజకులస్తులేనని అదే విషయాన్ని తమ కులస్తులకు చెప్పానని ఆయన తెలిపారు. శ్రీకృష్ణదేవరాయల కుల వివాదంలో కమ్మవారి తరపునుండి శ్రీ పెమ్మసాని పరంధాం గారు ముగింపునిచ్చారనే అనుకుంటున్నాను. అదేవిధంగా కొందరు ఉద్రేక స్వభావులు వికీపీడియాలో శ్రీకృష్ణదేవరాయల తల్లి నాగులాంబ  పెమ్మసాని వారి ఆడపడుచు అని పెట్టారు. అలాంటి వాటిని కూడా తొలగించమని శ్రీ పరంధామ్ గారిని సవినయంగా కోరుతున్నాను..
....   ప్రతి కులంలో మంచి వాళ్ళు వుంటారు, చెడ్డవాళ్ళూ వుంటారు...శ్రీ పెమ్మసాని పరంధామ్ గారు నాతో మాట్లాడిన తీరు వారిపై గౌరవాన్ని పెంచింది.... మీ వాదనను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను...కమ్మ వారి పట్ల నాకు ఎలాంటి ద్వేష భావన లేదు...ఎవరో కొందరు ఫేక్ ఐడీ లతో వచ్చి నన్ను బూతులతో సత్కరించారు .... ఎవరో కొందరు వెధవలు చేసే పనులకు మనం కులాన్ని ధూషించకూడదు అన్నది నా అభిమతం ....నా రాతల వల్ల మిమ్మల్ని నొప్పించి వుంటే నన్ను మన్నించమని పెమ్మసాని పరంధామ్ గారిని కోరుతున్నాను......

                                                                                                              -ధూపం అభిమన్యుడు