120 సంవత్సరాల క్రితం బ్రిటీషువారు కులగణన కార్యక్రమం చేపట్టారు . ఆ సందర్భంగా బలిజ కులస్తులను శూద్రులుగా పరిగణించి నాలుగవ తరగతిలో చేర్చారు...దీనికి నాటి బలిజ సమాజం అభ్యంతరాలు వెలిబుచ్చింది...బలిజకులస్తులు చంద్రవంశ క్షత్రియులని వారిని నాలుగవతరగతిలో కాకుండా రెండవతరగతిలో చేర్చాలని డిమాండ్ చేసింది....దానికి సెన్సస్ కమిటీ ఆధారాలు చూపెట్టమని అడిగింది ...దానికి అనేక పురాణాధారాలు ...చారిత్రక ఆధారాలను నాటి బలిజ పెద్దలు వారికి చూపించారు....ఆ ఆధారాలను అనేకమంది బ్రాహ్మణ పండితులకు ...చరిత్రకారులకు ...గురుపీఠాల అధిపతులకు పంపించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నాక బలిజకులస్తులను చంద్రవంశ క్షత్రియులుగా అంగీకరిస్తూ తెల్లవారు రెండవ కేటగిరీలో చేర్చారు.. ఆ వివరాలను ఉటంకిస్తూ శ్రీ పగడాల నరసింహులు నాయుడు గారు "శ్రీ చంద్రవంశ క్షత్రియులైన, ఆంధ్రులు, గౌరవులు, అను బలిజవంశ పురాణం లేక నాయుడుగార్ల సంస్థాన చరిత్రము" అనే పుస్తాకాన్ని వెలువరించారు...దీనికంటే ముందు "బలిజవారు పురాణం" అనే పుస్తకాన్ని ఆయన రచించారు ఇది సుమారు 500 పేజీల లకు పైగా తమిళ భాషలో వున్నది. ఈ రెండు పుస్తకాలు ప్రస్తుతము ఇండియాలో లభించడం లేదు. కాపు చరిత్ర సంకలన సమితి సభ్యులు ...శ్రీ పోలిశెట్టి సత్తిరాయుడు గారు లండన్ లోని బ్రిటీషు మ్యూజియం నుండి వాటి కాపీలను తెప్పించారు...ఆ వివరాలు మీ కోసం...