తెలగాలు అంటే ఎవరో తెలియదు కానీ వారి గురించి వ్యాఖ్యానించడానికి ఏ మాత్రం వెనుకాడరు. తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారా అంటే కనీసం అది కూడా చేయరు. చరిత్ర అంటే నిజంగా వీరికి చిన్న పిల్లలు ఆడుకునే ఆటగా కనిపిస్తున్నట్లుంది.
బలిజ కులస్తులను నిరంతరం కించపరుస్తూ రాతలు రాయించే వారు ఒకరైతే రాసేవారు మరొకరు. రాయించే వారు బయటకు రావడం లేదు కానీ రాసే వారు మాత్రం మనకు కనిపిస్తున్నారు. అలాంటి వారిలో యద్దనపూడి వెంకటరత్నం యాదవ్ అనే రచయిత ఒకరు. ఈయన గతం లో యయాతి వంశీకుడు శ్రీకృష్ణదేవరాయలు అనే వ్యాసాన్ని రాశారు. జులై 21,2010 లో ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రచురించింది. దీంట్లో రాయలు బలిజ కులస్తుడు కాదని పాణి అనే రచయితను విమర్శిస్తూ రాశారు. 2014 సెప్టెంబర్ లో పి.వి.పరబ్రహ్మ శాస్త్రి గారిని విమర్శిస్తూ తెలింగ కులనామం కాదు అంటూ తెగ విమర్శించారు.
నాకెందుకో వెంకటరత్నం గారు బలిజ కులం పై వ్యతిరేకతతో రగిలి పోతున్నట్లు కనిపించింది ఆ రెండు వ్యాసాలలో. చరిత్ర గతించి పోయిన వాస్తవం. దాని పాదముద్రలే ఆధారాలు. గాడ్ బాసన్ ను కనుక్కోవడనికి శాస్త్రవేత్తలు బిగ్ బాంగ్ ప్రయోగాన్ని చేశారు. ప్రయోగానంతరం తాము గాడ్ బాసన్ ను కనుక్కున్నామని ప్రకటించారు. వారు దాన్ని చూశారా? లేదు సెకెన్ లో వందల వంతు కాలంలో జరిగి పోయే సంఘఠనను ఏ మానవ నేత్రం చూడలేదు. కానీ అది మిగిల్చిన గుర్తులను చూశారు అప్పుడే అవి గాడ్ బాసన్ పాద ముద్రలుగా భావించారు. అందులో కూడా కొంత అనుమానమే...
చరిత్ర కొరకు ఇంతలేసి ప్రయోగాలు సాధ్యం కాదు. గతం లొ నిర్మించబడిన రాతల ఆధారాలే చరిత్రకు సాక్షాలు. మరి ఎలాంటి చారిత్రక సాక్షాలు చూడకుండా తెలగ అనేది కులనామం కాదు అంటూ ఎలా ఖండించ గలుగుతారు?
కందుకూరి ప్రసాద భూపాలుడు రాసిన శ్రీ ఆంధ్ర విజ్ఞానము అనే గ్రంధం లో
1938 లో ప్రచురితమైన వ్యాల్యూం నెం.2 లో గాజుల బలిజ గురించి, వ్యాల్యూం నెం.3 లో తెలగలు తెలుగు ప్రభువుల సీమలు,వ్యాలూం నె.6 లో కోటబలిజలు, లింగబలిజలు, విశ్వనాథనాయకుడు గురించి రాసిన సమాచారాన్ని ఇక్కడ యథతథంగా ఇస్తున్నాను గమనించండి.
సేకరణ :- పోలిశెట్టి సత్తిరాయుడు, హైదరాబాదు.