30, డిసెంబర్ 2013, సోమవారం

మను చరిత్రలో రాయల వంశాన్ని గురించి అల్లసాని పెద్దన ఏమన్నారు...

మనుచరిత్ర పీఠికలో రాయల వారి వంశం గురించి అల్లసాని పెద్దన పద్యాలు.       



    కృతిపతి వంశప్రశంస


సీ. కలశపాథోరాశి గర్భవీచిమతల్లి, కడుపార నెవ్వానిఁ గన్నతల్లి
యనలాక్షు ఘనజటా వనవాటి కెవ్వాఁడు, వన్నెవెట్టు ననార్తవంపుఁబువ్వు
సకలదైవత బుభుక్షా పూర్తి కెవ్వాఁడు, పుట్టు గానని మేని మెట్టపంట
కటికిచీఁకటితిండి కరముల గిలిగింత, నెవ్వాఁడు దొగకన్నె నవ్వఁజేయు

 
తే. నతఁడు వొగడొందు, మధు కైటభారి మఱఁది,
కళల నెల వగువాఁడు, చుక్కలకు ఱేఁడు,
మిసిమి పరసీమ, వలరాజు మేనమామ,
వేవెలుంగుల దొర జోడు, రేవెలుంగు. 18

తే. ఆ సుధాధాము విభవమహాంబురాశి
కుబ్బు మీఱంగ నందనుఁ డుదయమయ్యె
వేద వేదాంగ శాస్త్రార్థ విశద వాస
నాత్త ధిషణా ధురంధరుం డైన బుధుఁడు. 19

క. వానికిఁ బురూరవుఁడు ప్ర
జ్ఞానిధి యుదయించె సింహ సదృశుఁడు, తద్భూ
జానికి నాయువు తనయుం
డై నెగడె, నతండు గనె యయాతి నరేంద్రు\న్‌. 20

క. అతనికి యదు తుర్వసు లను
సుతు లుద్భవమొంది రహిత సూదనులు, గళా
న్వితమతులు, వారిలో వి
శ్రుతకీర్తి వహించెఁ దుర్వసుఁడు గుణనిధియై. 21

తే. వానివంశంబు తుళువాన్వవాయ మయ్యె,
నందుఁ బెక్కండ్రు నృపు లుదయంబు నొంది
నిఖిల భువన ప్రపూర్ణ నిర్ణిద్రకీర్తి
నధికులైరి తదీయాన్వయమునఁ బుట్టి. 22

మహాస్రగ్ధర. ఘనుఁడై తిమ్మక్షితీశాగ్రణి, శఠకమఠ గ్రావసంఘాత వాతా
శనరా డాశాంతదంతి స్థవిరకిరుల, జంజాటముల్‌ మాన్పి, యిమ్మే
దిని దోర్దండైకపీఠి\న్‌ దిరముపఱిచి, కీర్తిద్యుతుల్‌ రోదసిం బ
ర్వ నరాతుల్‌ నమ్రులై పార్శ్వములఁ, గొలువఁ దీవ్రప్రతాపంబు సూపె\న్‌. 23

క. వితరణఖని యాతిమ్మ
క్షితిపగ్రామణీకి దేవకీదేవికి సం
చితమూర్తి యీశ్వర ప్రభుఁ
డతిపుణ్యుఁడు పుట్టె సజ్జనావనపరుఁడై. 24

చ. బలమదమత్త దుష్టపుర భంజనుఁడై పరిపాలితార్యుఁడై
యిలపయిఁ దొంటి యీశ్వరుఁడె యీశ్వరుఁడై జవియింప రూపఱె\న్‌
జలరుహనేత్రలం దొరఁగి శైలవనంబుల భీతచిత్తులై
మెలఁగెడు శత్రుభూపతుల మేనులఁ దాల్చిన మన్మథాంకముల్‌. 25

సీ. నిజభుజాశ్రిత ధారుణీ వజ్రకవచంబు, దుష్టభుజంగాహితుండికుండు
వనజేక్షణా మనోధన పశ్యతోహరుం, డరిహంస సంసదభ్రాగమంబు
మార్గణగణ పిక మధుమాస దివసంబు, గుణరత్న రోహణ క్షోణిధరము
బాంధవసందోహ పద్మవనీ హేళి, కారుణ్యరస నిమ్నగా కళత్రుఁ  

తే. డని, జగంబుల మిగులఁ బ్రఖ్యాతిఁ గాంచె
ధరణీధవ దత్త వివిధోపదా విధా స
మార్జితశ్రీ వినిర్జిత నిర్జరాల
యేశ్వరుఁడు, తిమ్మభూపతి యీశ్వరుండు. 26


క. ఆ యీశ్వర నృపతికిఁ బు
ణ్యాయతమతియైన బుక్కమాంబకుఁ దేజ
స్తోయజహితు లుదయించిరి,
ధీయుతులగు నారసింహ తిమ్మనరేంద్రుల్‌. 27

క. అందు నరసప్రభుఁడు, హరి
చందన మందార కుంద చంద్రాంశు నిభా
స్పంద యశ స్తుందిల ది
క్కందరుఁడై ధాత్రి యేలెఁ గలుషము లడఁగ\న్‌. 28

ఉ. శ్రీరుచిరత్వ భూతిమతి జిత్వరతాకృతి శక్తికాంతుల\న్‌
ధీరత సార భోగముల, ధీనిధి యీశ్వర నారసింహుఁ డా
వారిజనాభ శంకరుల, వారికుమారుల, వారితమ్ముల\న్‌,
వారియనుంగు మామలను, వారివిరోధులఁ బోలు నిమ్మహి\న్‌. 29

సీ. అంభోధివసన విశ్వంభరావలయంబుఁ, దనబాహుపురి మరకతముఁ జేసె
నశ్రాంత విశ్రాణ నాసార లక్ష్మికిఁ, గవికదంబముఁ జాతకములఁ జేసెఁ
గకుబంత నిఖిలరా ణ్నికరంబుఁ జరణమం, జీరంబు సాలభంజికలఁ జేసె
మహనీయ నిజవినిర్మలయశ స్సరసికి, గగనంబుఁ గలహంసకంబుఁ జేసె  

తే. నతిశిత కృపాణ కృత్త మత్తారివీర
మండలేశ సకుండల మకుట నూత్న
మస్త మాల్య పరంపరా మండనార్చి
తేశ్వరుండగు నారసింహేశ్వరుండు! 30

తే. ఆ నృసింహప్రభుండు తిప్పాంబవలన
నాగమాంబికవలన నందనులఁ గాంచె
వీరనరసింహరాయ భూవిభుని, నచ్యు
తాంశసంభవుఁ గృష్ణరాయ క్షితీంద్రు. 31

క. వీరనృసింహుఁడు నిజభుజ
దారుణకరవాల పరుషధారాహత వీ
రారి యగుచు నేకాతప
వారణముగ నేలె ధర నవారణమహిమన్‌. 32

క. ఆవిభు ననంతరంబ ధ
రావలయముఁ దాల్చెఁ గృష్ణరాయఁడు చిన్నా
దేవియు, శుభమతి తిరుమల
దేవియునుం దనకుఁ గూర్చు దేవేరులు గా\న్‌. 33






      

25, డిసెంబర్ 2013, బుధవారం

శ్రీకృష్ణదేవరాయలు యదువంశీయుడే కాదు



      శ్రీకృష్ణదేవరాయలు యదు వంశీయుడు కాదు యదువు తమ్ముడు తుర్వసుని వంశీయుడు. పారిజాతాపహరణం పీఠికలో నందితిమ్మన చాలా స్పష్టంగా చెప్పాడు. యదువంశీయులకు రాజ్యార్హత లేదని కూడా స్పష్టం చేశాడు. అప్పటి కాలం లో శ్రీ రాయల వారిని సాక్షాత్తూ అ శ్రీకృష్ణుడే శ్రీ కృష్ణదేవరాయలుగా జన్మించాడని అనుకునేవారట. కృతిపతి వంశావళి అంటూ ఆయన కృష్ణుడితో తులానాత్మక వర్ణన చేస్తూ రాశారు. ఈ పద్యాలను సరిగా అర్థం చేసుకోలేని యాదవులని చెప్పుకునే గొల్ల సోదరులు రాయలు గొల్ల కులస్తుడని పొరపాటు పడ్డారు. కొంతమంది కుహనా మేధావులు కేవలం ఒక పద్యం చూపించి రాయలు గొల్ల కులస్తుడే అంటే నమ్మి అనవసరంగా తమది కాని చరిత్రను తమదిగా పొరపాటున చెప్పుకున్నారు. ఇప్పుడు దాన్ని వెనక్కు తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. చరిత్ర వాస్తవం అది నిప్పు లాంటిది, అబద్దాల దుప్పటి దానిపై కప్పి మాయ చేయాలని చూస్తే ఆ దుప్పటిని కాల్చుకుని బయటకు వస్తుంది. వాస్తవంగా పారిజాతాపహరణం లో ఏముందో ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం వుంది. పారిజాతాపహరణం పీటిక కాపీలను ఇక్కడ పెడుతున్నాను గమనించ గలరు. యదువు సంతతి వారిని మాత్రమే యాదవులు అంటారు. తుర్వసుని సంతతి వారిని కాదు. కురు సంతతి వారిని కౌరవులు అంటారు. వీరంతా బంధువులు చంద్రవంశ క్షత్రియులు. వీరు వున్నత కులానికి చెందిన వారే కానీ దిగువ స్థాయి కులాలకు చెందిన వారు కాదు. పారిజాతాపహరణం లో శ్రీరాయల వారి మెప్పుకోలు కొరకు ముక్కుతిమ్మనార్యుడు శ్రికృష్ణుడికి దక్కని అనేక అర్హతలను రాయలవారు అందుకున్నారని 17 వ పద్యం లో చమత్కరించారు. ఈ పద్యాల క్రింద అర్థాన్ని తాత్పర్యాన్ని కూడ గమనించగలరు.

సేకరణ: పోలిశెట్టి సత్తిరాయుడు గారు, హైదరాబాదు

















5, నవంబర్ 2013, మంగళవారం

బలిజ కులస్తులను మహానాటి పెద్దలుగా నియమియమించిన శాసనం

           చరిత్రలో కనీస గౌరవం కూడా లభించని చాలా కులాలు శ్రీకృష్ణదేవరాయలు తమ కులస్తుడని చెప్పుకుంటూ, బలిజ కులస్తుడు కాదని అడ్డంగా వాదిస్తుంటారు. అలాంటి వారు ఈ శాసనాన్ని గమనించాలి. ఈ మూడు శాసనాలలో మొదటిది,రెండవది శ్రీకృష్ణదేవరాయలు కంటే ముందువి అంటే 1506 నాటివి. అప్పటికి విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయల అన్న వీరనరసిం హరాయలు పరిపాలిస్తున్నాడు. మూడవదైన ఫర్మానా క్రీ.శ.1549 ఔరంగాజేబు కాలం లో చేసిన శాసనం. ఈ శాసనాన్ని 56 దేశాలలో బలిజ కులస్తులు పన్నులు వసూలు చేయడమే కాదు గ్రామాల లో న్యాయాధికారులుగా గ్రామాల పై పెత్తనాన్ని కూడా కట్టబెట్టారు. దేశం లో ఇన్ని రకాల కులాలు ఉండగా ఒక్క బలిజ కులస్తులకు మాత్రమే ఈ గౌరవం ఎందుకు దక్కింది?  ఏదో ఒకరో ఇద్దరో మేధావులు వుంటే వారికి మాత్రమే గౌరవం దక్కుతుంది కానీ ఇక్కడ ఒక కులానికి మొత్తం గౌరవాన్నే కాదు అధికారాన్ని కూడ ధారాదత్తం చేశారు. 

మరి ఆ కాలం నాటి రాజులు తమ కులానికి గౌరవం దక్కకపోతే జీర్ణించుకునేవారేనా?? 

ఆ నాటి కట్టు బాట్లను మీరితే ఆ కులాలకు కఠిన శిక్షలుండేవి. 

     మరి ఆ నాటి రాజులు తమ కులస్తులని కొన్ని కులాలు ఊకదంపుడు ఉపన్యాసాలిస్తుంటాయి మరి అదే నిజమైతే ఆయా కులాలకు ఎంతో గౌరవం దక్కాలి కదా? 


మరి కనీస గౌరవం కూడా దక్కని కులాలు ఈ రోజు విజయనగర రాజులు తమ కులస్తులని వాదిస్తుంటారు. 

మరి నాటి రాజులు వారి కులస్తులైతే  తమ కులానికి గౌరవం దక్కక పొవడం చూసి ఊరుకునే వారా??? 

 పెళ్ళిళ్ళకు కూడా గుఱ్ఱం ఎక్కే అవకాశం కూడా లేని కులాలు నాటి రోజుల్లో ఎలా రాజ్యాలేలి వుంటాయి. 

ఈ శాసనాన్ని చూసిన తరువాత అయినా ఆయా కులాలు వాస్తవాలను తెలుసుకుంటాయని ఆశిద్దాం.  





శాసనం  -1

       ఎర్రంశెట్టి మీరాపాత్రుడు. వలదు యెలిజేటి శ్రీగవిరి ఆర్కాగుండవర ప్రవర్ధన వరాత్త జగదేవు కంశేంజేటి అశ్వపతి, గజపతి, నరపతి మూడు సిం హాసనాల రాజులున్నూ దేశాలలో నడిపించుచున్న పన్నులు వర్ణాశ్రమ ధర్మాల కల్లా పన్నులు.

1.  గోవులకు తోకరూకలు పన్ను
2.  బ్రాహ్మణులకు బొట్లపన్ను
3.  తలవెంట్రుక స్త్రీలకు వర్ణాశ్రమ ధర్మాల పన్ను
4.  ఋతువుల పన్ను
5.  స్తనముల పన్ను
6.  శుభశోభనాలకు పన్ను
7.  సమస్త వర్ణాశ్రమ ధర్మాల వారికి పన్ను

ఈ పన్నులు రద్దు చేస్తూ

1.        పెండ్లిండ్లకు దేవుని కట్నం       ఒక రూక
           సమయ మంత్రి కట్నం            ఒక రూక
           ఒజ్జలు కట్నం                        ఒక రూక
           మంగలి వాని కట్నం               ఒక రూక

2.    పంట పుట్టి కుంచాలు, గోనెకు హర్బాజాకు ఒకటికి ఒక కాసు ఈ పద్దతిన ఏర్పాటు చేసి మహానాటి పెద్ద మాట          మీరితే

1.   కులం తప్పు
2.   మహనాటివారి తప్పు
3.   దివాణం తప్పు
4.   దేవుని తప్పు విధిస్తారు

ఇందుకు సాక్షులు:

1.  పూర్వలింగ
2.  నారదలింగ
3.  మార్కండేయులు
4.  కవి సర్వాంచనులు

శాసనం -2

శాలివాహన శకం 1428 (క్రీ.శ.1506)
రాయన మంత్రి భాస్కరన్నగారు వ్రాసిన చప్పన్న దేశాలకు నిర్ణయ పత్రిక

స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శలివాహన శకవర్షంబులు 1428 నేటి తరణ నామ సంవత్సర మాహ శు15 లిఖితం

1.బ్రహ్మ ,2.క్షత్రియ, 3,వైశ్య, 4.శూద్ర, 5.వ్యవహారిక, 6.గొరక్షక, 7.కుంభకారక, 8.శిల్పికార, 9.పంచాణ, 10.తంతువాయి, 11.తిలఘాతక, 12.క్షౌరక, 13.రజక, 14.వస్త్రఛేదక,15.చిత్రకారక, 16.లుబ్దక, 17. ఛండాల, 18.మతంగ జాతులగు అష్టాదశ వర్ణంబుల వారున్నూ యేబది ఆరు దేశాలలో నున్న మంత్రి మహానాడున్నూ అశ్వపతి, గజపతి, నరపతి మూడు సిమ్హాసనాల వారున్నూ నరపతి సిం హాసనమున గూర్చుండి యేబది ఆరు దేశాల మంత్రి మ్హానాటిని పిలిపించుకొని కులాల హద్దులు నిర్ణయం చేసిరి.

కులాల హద్దులు

      కులము                                               అందలం                     పల్లకీ                             గుఱ్ఱం

1.   బ్రహ్మణులు                                             కలదు                      కలదు                           కలదు
2.  క్షత్రియులు                                               కలదు                      కలదు                           కలదు
3.   వైశ్యులు                                                 కలదు                      కలదు                           కలదు
4.  శూద్రులు                                                 కలదు                      కలదు                           కలదు
5.  పల్లెవారి పెళ్ళికి                                          లేదు                       కలదు                           కలదు
6.  గొల్లవారి పెళ్ళికి                                          లేదు                        లేదు                            లేదు
7.  కుమ్మరి గుండయ్య సంతతికి                      లేదు                        లేదు                             లేదు
8.  పంచాణము అయిదు విధముల
     వారికి ఋషులు పెట్టిన శాపం
     ఉన్నందున                                               లేదు                         లేదు                            లేదు
9.   సాలెవారికి                                               లేదు                         కలదు                          కలదు
10.   చాకలి వారికి                                          లేదు                          లేదు                           కలదు
11.   మంగలికి                                               లేదు                          లేదు                           లేదు
12.  బిక్ష జంగం                                             లేదు                          లేదు                            లేదు
13.  చిత్రకారుల శుభ శోభనలకు
       నరపతి ఇచ్చిన పంచవన్నెలు
       మహానాటి వారిచ్చిన తెల్ల గుఱ్ఱము
       పేటేరుమాలు, సుల్తాన్ బసికము
       కలదు
14.   ఎరుకల వారికి                                        లేదు                          లేదు                          లేదు
15.   మాలవారికి                                            లేదు                          లేదు                          లేదు
16.   మాదిగవారి పెండ్లిండ్లకు యముడు
        ఎక్కే వాహనము కలదు, మూడు
        కొంగుల ఉల్లెడ గలదు, మూడు
        స్తంభముల పందిరి   రొమ్ము తప్పెట,
        భూమిమీద అరివేణి కలదు                      లేదు                           లేదు                        లేదు

శాసనము -3 (ఫర్మానా)

శాలివాహన శకం 1471 అక్షయనామ సంవత్సర చైత్ర శు.10 ఇందు వారము 
          మహారాజశ్రీ అలంగరు పాదుషా వారు మంత్రి మహానాటి వారికి దయచేయించిన ఫర్మానా స్వస్తి సమస్త త్రిభువన విపుల విజ్ఞాన వీర వీరావతారులున్నూ గరుఢధ్వజ సిం హధ్వజ బిరుదాంక మూలికా ప్రశస్థ ధారులున్నూ, అంగ,వంగ,కళింగ కాశ్మీర కాంభోజాధి చప్పన్న దేశాధీశులున్నూ, వైఢూర్య, గొమేధిక,పుష్యరాగాధి నవరత్నాధికారులున్నూ, హరిహర గురుభక్తి పరాయణులున్నూ పరనారీ సహోదరులున్నూ మోకాలి పట్టభధ్రులున్నూ అయిన స్వస్తి సమస్త కల నామంక మాకాద ప్రశస్తదారులున్నూ సాలుమూల సమయ పెక్కండ్రున్నూ శ్రీ మహాకళ్యాణదారులున్నూ అయిన మంతి మహానాటివారికి విప్రముఖ్యులైన రాయని మంత్రి భాస్కరు  మొదలైన దయచేయించిన పట్ట పదుషా ఫర్మానా.

         నరపతి, గజపతి, అశ్వపతులు 56 దేశాల మంత్రులు రాజులును నవరత్న వ్యపారులును, అన్ని కులముల పెద్దలను పిలిపించి బలిజ కాపులను మహానాటి పెద్దలుగా పన్నులు వసూలు మరియు తప్పు చేసిన వారిని శిక్షించే అధికారము ఇస్తూ ఢిల్లీ పాదుషా గారు అక్షయనామ సంవత్సరం చైత్ర శుద్ద 10 ఇందువారం పార్షి మొహరు వున్న శాసనము ఉంది. పాదుషా గారి దస్కత్తు ఉన్నది.

 సంగ్రహణం : ఇలియట్ దొర శాసన సంపుటముల నుండి 

24, అక్టోబర్ 2013, గురువారం

విజయనగర రాజులు బలిజ కులస్తులే అన్న 1901 మద్రాస్ సెన్సస్ రెపోర్ట్

            విజయనగర రాజులు బలిజ కులస్తులే అని  లో బ్రీటీషు వారు తమ మద్రాస్ సెన్సస్ రెపోర్ట్ లో 1901 లోనే రాశారు దానికి ఆధారాలు కూడా చూపెట్టారు. బలిజ కులం గురించి, బలిజకులస్తులము అనే చెప్పుకునే కులాలగురించి కూడా చెప్పారు. తమ కులం గురించి తామే మర్చిపోయిన అనేక విషయాలను ఎప్పుడొ ఇందులో పొందుపరిచారు. శెట్టిసమయం (శెట్టిసమ్మే) గురించి దానిలోని కులాల గురించి కూడా ఈ రెపొర్ట్ లో సంక్షిప్తంగా తెలిపారు. ఇన్ని ఆధారాలు చూపినా ఇంకా శ్రికృష్ణదేవరాయలు తమవాడే అని చెప్పుకోవడానికి కొన్ని కులాలు ఇంకా తాపత్రయ పడడం ఆశ్చ్యర్యం కలిగిస్తోంది. భారతదేశం గురించి ప్రపంచం లోని చాలా దేశాలకు తెలిసినంత కూడా భారతీయులకు తెలియదు. అంతగా చరిత్రను విజ్ఞానాన్ని నాశనం చేశారు. అది బయటి సంస్కృతుల పని  పని. దేశ సంస్కృతిని కాపాడి ఉన్నతమైన నాగరికతలను అభివృద్ధి చేసిన, భారతీయ వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచం నలుమూలలకు చేర్చిన ఒకే ఒక జాతి బలిజ జాతి. ఒక చేత రాజ్యపాలన మరోచేత వ్యాపారం, గ్రామాలలో న్యాయాధిపతులైన శెట్టి లేదా దేశాయి లు ప్రపంచ న్యాయశాస్త్ర సూత్రాలకు పునాదులు వేశారు. ఇంతగా తమ భూమిని ప్రేమించి, పాలించి, సంపదలను సృష్టించిన బలిజల చరిత్ర వారికే తెలియనంతగా భూస్థాపితం అయింది.  వాటిని తవ్వి తీసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నడుం కట్టారు. చాలామంది ఇప్పటికే వారి వారి పరిశోధనలను గ్రంధస్తం చేశారు. ఈ పుస్తకాలు త్వరలోనే ప్రజల ముందుకు రానున్నాయి. వారి వారి గ్రంధాలలోని కొన్ని భాగాలనే నేను ఈ బ్లాగ్ లొ పోస్ట్ చేస్తున్నాను. చరిత్ర పునర్నిర్మాణానికి అంకితమైన ఆ మహానుభావులందరికీ భగవంతుడు అయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. 














                 

23, అక్టోబర్ 2013, బుధవారం

కాకతీయ రాజులు బలిజ వంశీయులే

        కాకతీయులు చోళవంశానికి చెందిన రాజులు. మున్నూరు సీమ(కృష్ణా జిల్లా) ప్రాంతీయులైన జాయప్పసేనాని సోదరీమణులు నారమ్మ,పేరమ్మ లను కాకతీయ గణపతిదేవుడు వివాహమాడాదు.(చేబ్రోలు శాసనము) వారి కుమార్తె రుద్రమదేవిని చాళుక్య వంశీయుడైన నిడదవోలు (తూర్పు గోదావరి జిల్లా) గణపతిదేవరాజుకిచ్చి వివాహం చేశాడు. వీరి కుమార్తె జ్ఞానాంబను ధరణికోట రాజు కోట పెద్దిరాజుకిచ్చి వివాహం చేశారు. వారి కుమారుడే కాకతీయ ప్రతాపరుద్రుడు.       


       కాకతీయ రాజులలో రుద్రమదేవి తరువాత ఆమె కుమార్తె జ్ఞానాంబ కుమారుడు  కాకతీయ ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు.  తాను కాపు వంశీయుడుగానే చెప్పుకున్నాడు. "దుర్వాసాదేవిపురాణం" లో చెప్పబడిన ఈ క్రింది శ్లోకాన్ని చూడండి.  

శ్లో:  ప్రతాపరుద్రనామ్నాతు యధారాజ మహీతలే!
     ఉదృవిప్యతి ధర్మాత్మా క్షత్రధర్మ పరాయణ !!
     భిబ్రాజచ్ఛల  మర్తి గండ్కులో రుద్రావతార:
     ప్రభు కాప్యేషాం కులమున్నతి
     తరాం రాజిష్యతిక్షా శ్రీ వీరాభ్యుదయాశ్రియా 
     పరమయా దేదీప్యమానస్వయంతలే 
     సర్వా ్ పూర్వాము దాహృతా ్ జనపదానాక్రమ్యరాజివ్వతి 

21, అక్టోబర్ 2013, సోమవారం

దక్షిణ భారత దేశాన్నేలిన నాయక రాజులు బలిజ కులస్తులే


              విశ్వనాథనాయకునికి మధురై(పాండ్య) రాజ్యాన్ని అచ్యుతదేవరాయలు రాసి ఇచ్చిన శాసనమే కొటికం వారి కైఫీయతు ఇందులో విశ్వనాథనాయకుని కులం ఇంటిపేరును స్పష్టంగా  కనబరిచారు. విశ్వనాథ నాయకుని తండ్రి తంజాఊరును రక్షించడానికి వెళ్ళి శతృవులను పారద్రోలిన తరువాత స్వతంత్రించుకుంటాడు. రాయల కుటుంబానికి బంధువులైనందున అచ్యుతరాయలను ధిక్కరిస్తాడు. మీ తండ్రి మీరు అందరూ రాజ్యాలు చేయాలి మేము మీ దగ్గర ఊడిగం ఛెయాలా అంటూ ధిక్కరిస్తాడు. నాగమనాయకుడిని  బంధించి ఎవరు తీసుకు వస్తారు అంటే అంత సాహసం చేయడానికి ఎవరూ ముందుకు రారు. అప్పుడు నాగమనాయకుని కుమారుడు విశ్వనాథనాయకుడు ముందుకు వస్తాడు. తండ్రిపై దండెత్తుతాడు అక్రమంగా సంపాదించిన రాజ్యం తనకు వద్దని తండ్రిని తెచ్చి అచ్యుతరాయలుకు అప్పచెబుతాడు. దానికి మెచ్చిన   అచ్యుతరాయలు నువ్వు అడిగి వుంటే రాజ్యాన్ని ఈచ్చే వాడిని అంటూ నాగమనాయకుడిని మందలించి విశ్వనాథ నాయకుడిని పాండ్య రాజ్యానికి విజయనగరం లోనే పట్టభిషేకం చేసి ఆ సందర్భం లో రాసి ఇచ్చిన అనుభవ హక్కు పత్రమే కొటికం వారి కైఫీయత్ . 



కొటికం వారి కైఫీయత్


     శ్రీ మన్మహామండలేశ్వరులైన రాజాధిరాజ రాజ పరమేశ్వరులైన శ్రి మహారాజ రాజశ్రీ శ్రీ ఘననగర విద్యాకరపట్నం సంస్థానకర్త అయిన  రాజ మహారాజశ్రి అచ్యుతదేవ మహారాయలయ్య వారు పృథినీ సామ్రాజ్యం చేయుచుండు వ్యాళ, చెల్లే శాలివాహనశకం ౧౪౫౫  (1455) మీద సం|| వైశాఖ శుద్ద ౧౫ (15) గురువారం శ్రవణా నక్షత్రం శుభయోగ శుభకరణమందు వారి బొక్కసం మొదలయిన సమస్త మనోవర్తి కార్యములు కొటికం నాగమనాయణ్కు  అఖిలండకోటి బ్రహ్మాండనాయకులైన శ్రీ రంగనాయకుల స్వామివారు స్వప్న లబ్దాంచిత, గంగాస్నానమున్నూ, మరకత విశ్వనాథ స్వామి లింగమున్నూ, విస్వనాథస్వామినాయుడు అనే పుత్ర సంతానమున్నూ  పొందియున్న యెడల శ్రీ మద్రాజాధిరాజ రాజపరమేశ్వరులైన మహారాజశ్రీ విశ్వనాథనాయనయ్య గారు ఒకనాటికొకనాడు స్వామి కటాక్షం చేత, విద్యలయందున్నూ సాధనయందున్ను, బుద్ధివిశేషం వ్యాపించి అన్నట మహాసామర్థ్యం కల్గియుండిన యెడల శ్రీ మన్మహామండలేశ్వరులయిన రాయదేవలవారి కార్యభాగములయందు కొనసాగేటట్టు నడతలు గలవారై, అంగ,వంగ కళింగాది దేశముల దిగ్విజయము చేసియున్న యెడలనున్ను, వొకానొక దినమందు  సమస్థాన కార్య ఉద్ధారణ చేసినందున అచ్యుతదేవమహాదేవలయ్యవారు అమరనాయక పట్టవర్ధన భూమిపాలన సంస్థాన కర్తవ్యముగా పాండ్య, చేర, చోళ, మళయాళ మండలాధిపత్యానికి చేరిన మామూలు అష్టదిక్కులున్నూ యేర్పరచి తూర్పు సముద్రం, మన్నారుకోట ఆగ్నేయం,అనంతశయనం, దక్షిణం గూడల్లూరు, నైరుత్యం పెద్దేరు కోయమ్ముత్తూరు వాళయూరు పడమర ఘట్టం కన్మ, ఉత్తరం వాలికొండ శ్వేతనది, ఈశాన్యం తంజనగరం సరిహద్దులు కావేర్యాంతం. ఈ మధ్యమ మందులోనుగా గల ఉభయ కావేరి, రామసేతు, ధనుష్కోటి,తామ్రపర్ణీ, చిత్రానదీ, క్షీరనదీ,కృతమలా, వేగావతీ, నిక్షేపనదీ, వరాహనదీ,సురభీనదీ,ఉత్తర శ్వేతనదీ, అమావతీ, సాలిగ్రామనదీ, రత్ననదీ, భవానినది మొదలయిన పుణ్యనదులున్నూ, శ్రీరంగం తోతాద్రి మధురై అళగిరి మొదలయిన విష్ణుస్థళాళుంకూడ్ని జంబుకేశ్వర మధుర చొక్కనాథ మీనాక్షి మొదలైన శివస్థలాలు కూడ్ని, గిరిదుర్గ, వనదుర్గ, స్థళదుర్గ, జలదుర్గ, శ్రీ త్రిశిరగిరి మధురాపురి పట్న సాలకలు మొదలయ్ని కూడ్ని రాజ్యములు చేర్నినాడు, పల్లెలూ గ్రామాలూ, వూళ్ళూ ప్యాటలు, కోటలు, స్థలనగరములతో నుంగూడ్ని రాష్ట్రముల్కు ఆస్తానమయిన మధురాపురి పట్నానకు చేర్ని దేవబ్రాహ్మణ క్షత్రియ, వైశ్య, శుద్రులు అష్టాదశ వర్న, పంచమ వర్ణక సహశ్రీజలతో నుంగూడ్ని రాష్ట్రం యావత్తూ కల్గిన యీ మధుర నగరానుకు, నీవే రాజువనిన్నీ, రాజ సప్తాంగముతో నున్నూ సభా సప్తాంగముతో నున్నూ కూడుకొని సభాసప్తాంగముల యిప్పించి శ్రీ మన్మహామండలేశ్వర అచ్యుతదేవ మహారాయలయ్యవారు దైవప్రాసాదలబ్దవశాత్ చాతను కరుణతోగూడి బలిజవర్న గెరికపాటి వంశమున కల్గిన శ్రీ విశ్వనాథ నాయనయ్య గారికి పాండ్యమండలాధీరాజు అనే ౨౪ (24) రెండున్న కోటి ద్రవ్యరాజ్యానికి శాస్త్రోక్తముగా పట్టభిషేకం విజయనగరమందు చేయించిరి. మరిన్ని భూవరహాది అనేకం. బిరుదున్నూ అనేక వాద్యాలున్నూ తమ కులదేవత అయిన దుర్గ లక్ష్మీ అమ్మవార్లున్నూ యిష్టదేవత అయిన, లక్ష్మీనారాయణస్వామి స్వర్ణ విగ్రహమున్ను దయచేసి, చతురంగ సేనలును మంత్రి సామ్రాజకులున్నూ, యిప్పించినందున విస్వనాథ నాయని వారు మరిన్నీ అనేకం బ్రహ్మలను రప్పించుకొ ప్రయాణం అంపించుకొని ఇచ్చటికి వచ్చి మధురాపుర పట్నంలో నగళ్ళు కల్గజేసి అచ్చట వునికి పట్టభిషిక్తుడై రాజ్యం శాసించి, శ్రీరంగం, జంబుకేశ్వరం మొదలైన మహాస్తళాలకు అధిక పుఛ్రయంగా వుత్సవాలు  మొదలయినవి. నడిపించుకొని తీరావాసములయందు అనేక అగ్రహారాదుల నిర్మించి వనాధుల ఛేదించి దుష్టనిగ్రహాది శిష్ట పరిపాలనము చేస్తూ మనునీతి ప్రకారం కార్యఖడ్గములుకి యోగ్యముగా ప్రజలను పరిపాలనము చేస్తూ వంశాభివృద్ధిగా ప్రభుత్వం చేయుదురు.  

18, అక్టోబర్ 2013, శుక్రవారం

సూర్యవంశ క్షత్రియులు బలిజ వంశీయులే - శాసనాధారము

    
    
    సూర్య, చంద్ర వంశాలు రెండూ బలిజ కులస్తులే వీటికి శాసనాధారాలు చాలా వున్నాయి. వాటిలో ద్రాక్షరామ శాసన సంపుటి నుండి లభించిన ఒక శాసనాన్ని గమనించండి.

1. స్వస్తి సమస్త ద్విజగురు దేవతా భక్తి మా(గక్) తత్సరులుం బ్రహ్మణ క్షత్రియ వైశ్య చాతువన్ ణా ్ శ్రమదమ్మ           ప్రతిపాలితా

2. (నేక)హయ గజాంబర స్వణ ్ ధనధాన్యసమృద్దులుం, అనద్వాహార ధారూధులు దండాయుధ హస్తులు -               నిజాభరణులుం విజయ

3.---ముని విశ్వకమ ్ తోటకాచయ్య ్ ప్రవీణులుం, అజాతశతౄలుం సంజాత మిత్రులుం వితరణ గుణ                    మంధాత్రులుం ని  

4.(భిలజన) మిత్రులుం బ్రణమతఫల ప్రారంభసూత్రులుం శ్రీ మనుమకుల పవిత్రులుం స్వస్తి సమస్త భువనజస           విఖ్యాత పంచాశత 

5. --- గుగుణాల ప్రతసత్యశో (చా) ర చారిత్ర సమలినయ విపుల విజ్ఞాన వీరబలంజమన్ ప్రతిపాలన విప్రద్ద                   గరుఢధ్వజ విరాజిత

1.అందరికీ శుభం కలుగు గాక సమస్త ద్విజులు, గురువుల పట్ల భక్తి కలిగిన వారిలో మొదటివారము, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, చాతుర్వర్ణాశ్రమ ధర్మ పాలితులము.
2. అనేక ఆశ్వాలు , ఏనుగులు, బంగారం, ధనం, ధాన్యం సమృద్ధిగా కలిగిన వారము, ఏకొరతా లేని వారము, నిరంతరం దండమును(ఆయుధము) చేత ధరించి వుండేవారము, నిజము మాట్లాడడాన్ని ఆభరణంగా కలిగిన వారము, విజయులము.
3. మనువు, మయుడు, విశ్వకర్మ, తోటక ఛందస్సులో ప్రవీణుడైన ఆచార్యుడు (శంకరాచార్యుడు) అంతటి నైపుణ్యం కలిగిన వారము, ఎవరిపట్లా శతృత్వం వహించని వారము, దాన గుణం కలిగిన వారము.
4. అందరికీ మిత్రులము, బ్రణమత (శబ్ధము చేసే మతము)బ్రాహ్మణ మత ప్రారంభ ఫలాన్ని అందించిన వారము, పవిత్రమైన 'మనువు' కులములో జన్మించిన వారము. సమస్త భూమండలం లో ఖ్యాతి నార్జించిన 500 వీరశాసనాలు కలిగిన వారము.
5. సర్వ గుణాలలో సత్యము శ్రేష్టమైనది అలాంటి సత్యవ్రతాన్ని ఆచారముగా ధీరత్వముతో ఆచరిస్తున్న అధికులము, విజ్ఞానులము, వీరబలింజ సమయధర్మ పరిపాలకులము, గరుడధ్వజ విరాజితులము


        ఇందులో మనుమ కులము అనగా మనువు జన్మించిన కులము అని అర్థము. అంటే సూర్యవంశం  అని అర్ధం. ఆ కాలం లో ఈ బిరుదాలను సామాన్యులు ధరిస్తే  కఠినంగా శిక్షించేవారు .           

20, మే 2013, సోమవారం

రాయల తల్లిదండ్రులిద్దరూ బలిజ కులస్తులే...


 రాయలు తల్లి మత్రమే బలిజ కులస్తురాలు తండ్రి గొల్ల కులానికి చెందిన వాడని గొల్ల గొల్ల కులస్తులు ఒక అసంబద్దమైన వాదన చేస్తుంటారు.

ఇది ఒక చెత్త వాదన 

 తండ్రి నరస నాయకుడు బలిజ వంశస్తుడు. వీరు కర్నాటక లోని తుళు ప్రాంతం లో నివశించారు కాబట్టి తుళువ నరస నాయకుడు అన్నారు. . 

  బలిజ కులస్తులలో కోటబలిజలు, పేటబలిజలు అని రెండు విభాగాలు వున్నాయి. కోటబలిజలు ద్విజులు అంటే కేవలం రాచరికం చేయువారు మాత్రమే జంధ్యం ధరిస్తారు. 

  ఇక్కడ ముందుగా  తెలుసుకోవల్సిన అంశం ఒకటుంది. భారతదేశం లో చాలా మంది కులం, వర్ణం ఒకటే అనుకుంటారు. అది తప్పు కులం వేరు వర్ణం వేరు. 

జన్మనా జాయతే శూద్ర: 
కర్మణా జాయతే ద్విజ:
వేద పఠనంతు విప్రానాం
బ్రహ్మజ్ఞానంతు బ్రహ్మణే

  జన్మించుటద్వారా అందరూ శూద్రులుగానే జన్మిస్తారు. కర్మలు చేయుట ద్వారా ద్విజులగుచున్నారు. వేదాలు పఠించినవారు విప్రులనబడతారు బ్రహ్మజ్ఞానం సంపాదించినవారు బ్రహ్మణులని పిలవబడతారు.

ద్విజులు తమ తమ కర్మానుష్ఠానం చెయడానికుద్యుక్తులు కావడమే ఉపనయనం. 


  ఒకప్పుడు కేవలం మూడు వర్ణాలు మాత్రమే వుండేవి అవి బ్రహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలు ఈ మూడు వర్ణాలు ద్విజులే అంటె ఉపనయనం ద్వారా కర్మలు చేయడానికి మనసా, వాచా, కర్మణా సిద్దమైనటువంటివారు. వీరిలో వ్యవసాయము, వ్యాపారము వైశ్య వర్ణమే చేస్తుండేది. వైశ్యవర్ణ కర్మలను నిర్వహించే వారిలో వ్యవసాయము చేసే వారికి సమయానికి అనుష్టానాలు చేయడం సాధ్యమయ్యేది కాదు అందువల్ల వారికి ఉపనయనం నుండి మినహాయింపు నిచ్చారు. వారే సూద్ర వర్ణం. శూద్ర వర్ణం లో ఎన్నో కులాలున్నట్లుగానే పై వర్ణాలలో సైతం కులాలున్నాయి. ఉదాహరణకు నంబి బ్రహ్మణులు, తంబలి బ్రాహ్మణులు వీరిద్దరూ బ్రహ్మణులే కానీ వారి కులాలు వేరు. వీరిద్దరి వృత్తి దేవాలయాలలో పూజాదికాలు నిర్వహించడమే మొదటివారు వైష్నవ పూజారులు, రెండవ వారు శైవ పూజారులు. అదె విధం గా క్షత్రియులు క్షాత్రమున్న వారందరూ క్షత్రియులే. వీరిలో వివిధ కులాలు వుండవచ్చు. 

 ఇది కులాలకు, వర్ణాలకు వున్న తేడా. ఈ సంగతి తెలియక చాలామంది వర్ణాన్ని కులంగా చెబుతుంటారు. 


ఈ విషయం  అర్థం అయితే కోటబలిజలకు, పేటబలిజలకు తేడా అర్థమవుతుంది. 

ఇక రాయల విషయానికి వస్తే ఆయన రాసిన ఆముక్తమాల్యద ను ఒక సారి పరిశీలిద్దాం. 

   యమునాచార్యుడు రంగనాథ స్వామి పాదాలు చూసిన తరువాత పూర్వజ్ఞానం కలుగుతుంది. అప్పుడు తన కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి రాజ నీతి గురించి చెబుతాడు. 

  ఇక్కడ రాజనీతి గురించి చెబుతున్నది యమునాచార్యుడనే పాత్ర అయినా ఆ రాజనీతి రాయల వారి స్వంత రాజనీతి అన్న విషయం గుర్తుంచుకోవాలి.

   భిల్లులు, మొదలైన ఆటవిక జాతుల వారు రాక్షస నీతి అవలంబిస్తారు. రాజు ఆజ్ఞకు అటువంటివారు వణుకుతూ బద్ధులై వుండేటట్లు చూడాలి. 

   అంటే ఆటవిక జాతులైన బొయ, ఎరుకల వంటి జాతుల కు రాయల కులానికి ఎలాంటి సంబంధం లేదని రుజువవుతుంది. ఎందుకంటే ఏ రచయిత కూడా తన జాతిని తప్పుగా చెప్పుకోడు. 


    కోట కాపలా, రక్షణ భారాలను ఆప్త బంధువులకే అప్పగించాలి. ఎవరిని బడితే వారిని నమ్మి ఇలాంటి బాధ్యతలు అప్పగిస్తే వారు కోటకే ప్రమాదం తీసుకు వచ్చి రాజ్యవిచ్చిత్తికి కారణం కాగలరు. అంటే రాయల వారి కాలం లో తమ కులం వారికి పెద్ద పీట లభించింది. 

    మరొక చోట అల్పబుద్ధి గలవారిని, హీనకులస్తులను దూరం చేసుకుంటే వారు తొందరగా  అలుగుతారు కనుక వారిని పరాయి వారికి భారం కాకుండా తృప్తిపరుస్తూ వుందు. 

   భార్యల పతిభక్తి, స్త్రీ పురుషులు వావి వరుసలు పాటించడం, దిగువ జాతులు అగ్రజాతులను అనుసరించుట, అధికారి పనికి సేవకులు ఒప్పుకొనుట ఇవన్నీ రాజు దండిస్తాడనే భయం తోనే సుమా!

    అంటాడు రాయల వారు. చివరి రెండు పేరాలను గమనిస్తే రాయలు అగ్రకులానికి చెందిన వాడనే అర్థం అవుతోంది కదా. 

మరి ఆంధ్ర దేశ చరిత్రలో ఎప్పుడైనా ఏ కాలం లోనైనా గొల్లకులస్తులు  అగ్ర కులస్తులుగా చలామణి కాలేదు. 


    గొల్ల ప్రభువుగా చెప్పబడుతున్న కాటమరాజు సైతం గొప్ప పశు సంపద కలిగిన సంపన్న గొల్లడే కానీ రాజు కానీ చక్రవర్తి కానీ కాదు. 

  ఈ కథలోనే తెలుస్తుంది శ్రీశైలం అడవులలో ఆవులను మేపుకుంటుండగా గడ్ది దొరకక నెల్లూరు మండలాన్నేలుతున్న నల్లసిద్ది మహారాజును ఆవులు మేపుకుంటానని అనుమతి కోరుతాడు. తరువాత మాటతప్పి యుద్ధానికి దిగుతాడు. ఈ యుద్ధం లో సైతం ఎక్కడ కూడా ఏనుగులు వాదినట్లు చెప్పరు ఏనుగుల లాంటి ఎద్దుల గురించే చెబుతారు. 

దీన్ని బట్టి ఏమర్థమౌతోంది గొల్లలు ఏ రోజు కూడా రాజ్యాలు ఏలలేదు అన్నది సుస్పస్టం. 

    ఎప్పుడూ కాటమరాజు పౌరుషాన్ని కథలుగా చెప్పే సుద్దుల గొల్లలు మరి మహా చక్రవర్తి అయిన రాయల వారి కథను ఎందుకు చెప్పలేదో......

ఎందుకంటె కాటమ రాజు గొల్లప్రభువు కాబట్టి ఆయన కథలు చెప్పారు, 

రాయల వారు గొల్ల కులస్తుడు కాదు కాబట్టి ఆయన కథలు వారు చెప్పలేదు.

     ఇక రాయల వారి తండ్రి సంపెట నరస నాయకుడు. ఈయన విజయనగర చక్రవర్తి సాళువ నరసిం హ దేవరాయల వద్ద సర్వ సేనాధిపతిగా వుండేవాడు. వీరు ఇద్దరూ వియ్యపు కుటుంబాలకు చెందిన వారు. ఈదే సాళువ వంశానికి చెందిన తిమ్మరాజు (కన్నడం లో అరుసు అంటే రాజు అని అర్థం) మంత్రిగా వుండేవాడు. నరస నాయకుని పెద్ద భార్య తిప్పాదేవి లేదా తిప్పాంబ. సాళువ నరసిం హ రాయలుకు సోదరి. ఈమె కుమారుడే వీర నరసిం హ రాయలు. 

     సాళువ నరసిం హదేవరాయల తదనంతరం ఆయన కుమారుడు రెండవ నరసిం హరాయలు పిల్లవాడు కావడం తో ఆయనను సిం హాసనం పై కూర్చోబెట్టి నరసనాయకుడు రాజ్యపాలన చేశాడు. నరసనాయకుని అనంతరం ఆయన పెద్దకుమారుడు వీరనరసిం హరాయలు రెండవ నరసిం హరాయలుకు ప్రతినిధిగా వుండి రాజ్య పాలన సాగించాల్సి వుండగా అతడిని చంపి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఇతని కౄరత్వానికి ప్రజలంతా అసహ్యించుకున్నారు. కానీ బలవంతుడు కావడం తో ఎవరూ నోరు మెదపలేదు తిమ్మరుసు తో సహా. కేవలం ఆరు సంవత్సరాలు మాత్రమే ఈయన రాజ్యం చేశాడు. అనారోగ్యం తొ చనిపొయిన తరువాత ఆయన సవతి సొదరుడు శ్రీకృష్ణదేవరాయలును తిమ్మరుసు చక్రవర్తిని చేశాడు. 

    నరస నాయకునికి ముగ్గురు భార్యలు ఒకరు తిప్పాంబ సాళువ నరసిం హ దేవరాయలకు సోదరి వరుస అవుతుంది. రెండవ భార్య నాగంబ నరసిమ్హదేవరాయల సోదరుదు తిమ్మరాజు బంధువులు అరిగండాపురం(దీనినే ఆ తరువాత తల్లి పేరుమీద నతులపురం గ పేరు మార్చరు) గాజుల వారి ఆడపదుచు, ఇక మూడవ భార్య ఓబులాంబ.


రెండవ భార్య నాగాంబ ఎకైక కుమారుడే మన హీరో కృష్ణరాయలు. 

     ఈమెనే పెమ్మసాని వారి ఆడపడుచు అని కమ్మ వారు పొరపాటు పడుతుంటారు. ఎందుకంటే గండికోట లో వున్న పెమ్మసాని కుమార్తె పేరు కూడా నాగమ్మే కావడం ఈ పొరపాటుకు కారణం. గండికోట నాగమ్మను దీపాల నాగి అంటారు.

   నాగాంబను చంద్రగిరి  ప్రాంతానికి వచ్చినప్పుడు నరసనాయకుడు మోహీంచి పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకున్నాడు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే విజయనగర రాజులందరూ తెలుగు వారేనన్న సంగతి. నాగాంబ సొంత ఊరు నాగులాపురం, ఈ గ్రామం పేరు అరిగండాపురం. రాయలు ఈక్కడే జన్మించారు. తాను పుట్టిన ఊరు కొరకు వేదనారాయణ స్వామి దేవాలయాన్ని ఇక్కడ నిర్మించాడు. నేటికీ ఈ దేవాలయాన్ని నిర్వహించేది రాయల వారి బంధువులే.

బలిజ కులం లో ఇంటర్ క్యాస్ట్ మేరెజెస్ లేవు. ఒక వేళ అలా చేసుకున్నా వారిని కులం లోనుండి వెలివేస్తారు.  

     రాయల వారి విషయం లో కూడా అలాగే జరగాల్సివుండేది. చిన్నమదేవి నర్తకి కావడం తో ఆమెను ఎంత ఇష్టపడి పెళ్ళి చేసుకున్నా ఆమె పట్టపురాణి కాలేక పోయింది. 

మొదటి భార్య కావాల్సిన చిన్నమదేవి రెండవ భార్య కావాల్సి వచ్చింది. 

      తన ప్రేమ విషయం చెప్పగానే వారిని వివాహం చేసుకోకూడదు అని తిమ్మరుసు వారించాడు. ప్రభువు ఎప్పుడు కూడా కులకాంతలనే మొదట పెళ్ళి చేసుకోవాలని మైసూరు గంగరాజు కుమార వీరయ్య కుమార్తె తిరుమలదేవినిచ్చి వివాహం జరిపించాడు. ఆ తరువాత రాయసం కొండమరుసు చిన్నమ దేవిని దత్తు తీసుకుని కన్యాదానం చేశాడు. ఆ తరువాత తుక్కాదేవితొ సహా 12 మందిని రాయలు వివాహం చేసుకున్నారు. అందువల్లనే తిరుమలదేవి కుమార్తెలను పెళ్ళి చేసుకున్న ఆరవీటి వంశస్తులు రామరాయలు, తిరుమలదెవరాయలులకే రాజ్యం దక్కింది. మిగిలిన రాణులకు పిల్లలున్నప్పటికీ వారికి రాజ్యార్హత దక్కలేదు. కనుక కులకాంతలనే రాజమాతలు గా అంగీకరించేవారు.  


దీన్నిబట్టి రాయల తల్లిదండ్రుల కులాలు వేరు వేరు కాదన్నది స్పష్టమౌతోంది.

12, మే 2013, ఆదివారం

రాయల వారి గురించి వాస్తవాలు


          శ్రికృష్ణదేవరాయలు ఈ పేరు వింటే నే  ప్రతి తెలుగువాడి హృదయం ఉప్పొంగిపోతుంది. "దేశభాషలందు తెలుగు లెస్స" అని రాయలు రాశాడని ప్రతి తెలుగువాడు సంబరపడతాడు. కానీ అలాంటి వ్యక్తి ఈ నేల మీద తిరుగాడాడంటేనే... భవిష్యత్తులో ఎందుకు ఇప్పుడే చాలామంది నమ్మరు. ఆ మహాపురుషుడి గురించి, ఆ మహా వీరుడి గురించి, ఆ గొప్ప పరిపాలనా దక్షుడి గురించి డొమెంగో పెయిస్, న్యూనిజ్ రచనలే లేకుంటే బహుశా నేను కూడా నమ్మి వుండే వాడిని కానేమో. మహమ్మదీయ మహమ్మారుల చేతుల్లో భారతదేశ చరిత్ర మంటల్లో తగులబడి పోయింది. సాంస్కృతిక వారసత్వ సంపద వారి మూర్ఖత్వానికి శిథిలమైపోయి నేడు వెక్కిరిస్తొంది.

           క్రీ.శ. 1520 లో పోర్చుగల్ రాజోద్యోగి "డొమింగో పెయిస్" తన కంటితో చూసిన విజయనగర సామ్రాజ్యాన్ని ఇలా వర్ణించాడు.  

        "విజయనగర సామ్రాజ్యానికి రాజధాని "హంపి". దానికి ఆరుమైళ్ళ దూరంలో కొండలవరుస వున్నది. అందులో నుండి రెండు ద్వారాల గుండా  మార్గాలు ఏర్పడ్డయి. నగరం లోనికి పోవాలంటే ఈ ద్వారాలు తప్ప వేరే దారి లేదు. కొండలవరుసలు 72 మైళ్ళ పొడవున నగరాన్ని చుట్టివున్నాయి. ఏడు ప్రాకారాల మధ్య శతృదుర్భేధ్యంగా కట్టిన ఈ నగరం లో అసంఖ్యాకమైన జలాశయాలున్నాఇ. నీటిపారుదలకు చక్కటి ఏర్పాట్లున్నాయి. పచ్చని పొలాలతో, చక్కని తోటలతో, బాటలప్రక్కన చెట్లతో తీర్చిదిద్దిన రహదారులతో క్రమపద్దతిన కట్టిన ఇండ్లతో  కళాత్మక కట్టడాలతో, సమస్త వస్తువులు విక్రయించే అంగళ్ళతో ఈ నగరం బహు సుందరంగా వుంది. ఈక్కడి వాణిజ్య వీధులలో పలురకాల కెంపులు, వజ్రాలు, వైఢూర్యాలు, పచ్చలు, మాణిక్యాలు, రత్నాలు, ముత్యాలు కుప్పలు పోసి విక్రయిస్తున్నారు. అనేక దేశాల నుండి వర్తకులు ఇక్కడకు వచ్చి నివాసము ఏర్పాటు చేసికొని వజ్ర వైఢూర్యాది నవరత్నాల వ్యపారము సాగిస్తున్నారు. 

            ఈ నగరమెంతో విశాలమైనది. దీని వైశాల్యము ఇంత అని వ్రాయలేను. ఎందుకంటే నేను ఒక  కొండ పైకి ఎక్కి చూచినా నగరము కొంతభాగము మాత్రమే కనిపించినది. కొండలమధ్య విస్తరించి వుండడం వలన పూర్తి నగరాన్ని చూడలేక పొయాను. నాకు కనిపించిన భాగమే  "రోం"  నగరమంత పెద్దదిగా వుంది. చెట్ల గుంపులతో ఇండ్ల చుట్టూ తోటలతో ఎటు చూసిన చెరువులతో రమణీయంగా కనిపించింది. ఈ నగరము లో జన సంఖ్యను లెక్కించడం కష్టమైనందువల్ల సుమారు ఇంత అని నేను చెప్పినా అతిశయోక్తిగా భావించి ఎవరూ నమ్మరన్న భయంతో ఆ ప్రయత్నం చేయడం లేదు. ఇది ప్రపంచంలోకెల్లా సమర్థవంతమైన గొప్ప నగరం అని మాత్రము నేను చెప్పగలను".

           నేటికి 500 సంవత్సరాల క్రితం ప్రపంచం లోనే ఇంత గొప్ప నగరం లేదని ఒక యురోపియన్ సంభ్రమం తో రాశాడంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. బలిజ వంశ చక్రవర్తులు ఎంతటి వైభవోపేత సామ్రాజ్యాలను అనుభవించారో. 
    
         శ్రీకృష్ణదేవరాయలు 20 సంవత్సరాలకే చక్రవర్తియై మరో 20 సంవత్సరాలు మాత్రమే రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ 20 సంవత్సరాల కాలం లో ఎన్నో యుడ్డాలు, మరెన్నో విజయాలు. ఆ రోజుల్లో రాయల వారిని శ్రీకృష్ణుడే మళ్ళీ జన్మించాడని అనుకొనే వారట. కేవలం 40 సంవత్సరాలకే పరిపూర్ణమైన వ్యక్తిగా శ్రీ రాయలు కనిపిస్తారు. ఆయన రచించిన అముక్తమాల్యద చదివిన వారికి. అంతటి మహాపురుషుడు బలిజ కులం లో జన్మించినందుకు ప్రతి బలిజ కులస్తుడూ గర్వించాలి. 

        కానీ కొన్ని కులాల వాళ్ళు మావాడంటే మావాడని రాయల వారిని తమవాడిగా చెప్పుకోవడం కొరకు తాపత్రయ పడుతున్నారు. అందుకే సవివరమైన విశ్లేషణలను చేయదలిచాను. విజయనగర సామ్రాజ్య చరిత్ర విషయం లో చాల మంది వక్రీకరణకు పాల్పడుతున్నారు. వక్రీకరించి రాసే రాతల వల్ల సామాన్యులే కాదు పండితులు సైతం పొరపడే అవకాశం వుంది. కనుక వాస్తవ చరిత్ర ఏమిటొ ప్రజలకు తెలియజెప్పాల్సిన ఆవశ్యకత నాకు కనిపించింది. అందుకే రాయలవారి గురించి, విజయనగర సామ్రాజ్యం గురించి వాస్తవాలు తెలియజెప్పడానికే నా ఈ చిన్ని యత్నం. 

3, మే 2013, శుక్రవారం

శ్రీ కృష్ణదేవరాయలు బలిజ కులానికి చెందినవాడే ఇదిగో ఒక ఆధారం

     శ్రీ కృష్ణదేవరాయలు బలిజ కులానికి చెందిన వాడే అని బహుభాషా పండితుడు, చరిత్రకారుడు, పద్మశ్రీ, సరస్వతీపుత్ర శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు ఒకానొక సందర్భంలో స్వయంగా  తన చేత్తో రాసి ఇచ్చిన ధృవీకరణ పత్రం లభించింది. శ్రీ నారాయణాచార్యులు రాయల రాజ గురువైన తాతాచార్యుల వంశీకులు. విజయనగర సామ్రాజ్యం గురించి అత్యంత ఇష్టంగా, బాధతప్త హృదయం తో పరిశోధన చేసిన గొప్ప వ్యక్తి. ఆయన జీవించి వున్న రొజుల్లొ ప్రస్తుతం కర్నూలులో నివసం వుంటున్న చొక్కపు నారాయణస్వామి గారికి తను స్వయంగా ఈ ధృవీకరణపత్రాన్ని రాసి ఇచ్చారు. 

      రాయల కులం గురించి భిన్న వాదోప వాదనలు జరుగుతున్న నేపథ్యం లో రాయల కులం పై సాక్ష్యాలను ఆవిష్కరించే ప్రయత్నం మొదలు పెట్టాను.