విశ్వనాథనాయకునికి మధురై(పాండ్య) రాజ్యాన్ని అచ్యుతదేవరాయలు రాసి ఇచ్చిన శాసనమే కొటికం వారి కైఫీయతు ఇందులో విశ్వనాథనాయకుని కులం ఇంటిపేరును స్పష్టంగా కనబరిచారు. విశ్వనాథ నాయకుని తండ్రి తంజాఊరును రక్షించడానికి వెళ్ళి శతృవులను పారద్రోలిన తరువాత స్వతంత్రించుకుంటాడు. రాయల కుటుంబానికి బంధువులైనందున అచ్యుతరాయలను ధిక్కరిస్తాడు. మీ తండ్రి మీరు అందరూ రాజ్యాలు చేయాలి మేము మీ దగ్గర ఊడిగం ఛెయాలా అంటూ ధిక్కరిస్తాడు. నాగమనాయకుడిని బంధించి ఎవరు తీసుకు వస్తారు అంటే అంత సాహసం చేయడానికి ఎవరూ ముందుకు రారు. అప్పుడు నాగమనాయకుని కుమారుడు విశ్వనాథనాయకుడు ముందుకు వస్తాడు. తండ్రిపై దండెత్తుతాడు అక్రమంగా సంపాదించిన రాజ్యం తనకు వద్దని తండ్రిని తెచ్చి అచ్యుతరాయలుకు అప్పచెబుతాడు. దానికి మెచ్చిన అచ్యుతరాయలు నువ్వు అడిగి వుంటే రాజ్యాన్ని ఈచ్చే వాడిని అంటూ నాగమనాయకుడిని మందలించి విశ్వనాథ నాయకుడిని పాండ్య రాజ్యానికి విజయనగరం లోనే పట్టభిషేకం చేసి ఆ సందర్భం లో రాసి ఇచ్చిన అనుభవ హక్కు పత్రమే కొటికం వారి కైఫీయత్ .
కొటికం వారి కైఫీయత్
శ్రీ మన్మహామండలేశ్వరులైన రాజాధిరాజ రాజ పరమేశ్వరులైన శ్రి మహారాజ రాజశ్రీ శ్రీ ఘననగర విద్యాకరపట్నం సంస్థానకర్త అయిన రాజ మహారాజశ్రి అచ్యుతదేవ మహారాయలయ్య వారు పృథినీ సామ్రాజ్యం చేయుచుండు వ్యాళ, చెల్లే శాలివాహనశకం ౧౪౫౫ (1455) మీద సం|| వైశాఖ శుద్ద ౧౫ (15) గురువారం శ్రవణా నక్షత్రం శుభయోగ శుభకరణమందు వారి బొక్కసం మొదలయిన సమస్త మనోవర్తి కార్యములు కొటికం నాగమనాయణ్కు అఖిలండకోటి బ్రహ్మాండనాయకులైన శ్రీ రంగనాయకుల స్వామివారు స్వప్న లబ్దాంచిత, గంగాస్నానమున్నూ, మరకత విశ్వనాథ స్వామి లింగమున్నూ, విస్వనాథస్వామినాయుడు అనే పుత్ర సంతానమున్నూ పొందియున్న యెడల శ్రీ మద్రాజాధిరాజ రాజపరమేశ్వరులైన మహారాజశ్రీ విశ్వనాథనాయనయ్య గారు ఒకనాటికొకనాడు స్వామి కటాక్షం చేత, విద్యలయందున్నూ సాధనయందున్ను, బుద్ధివిశేషం వ్యాపించి అన్నట మహాసామర్థ్యం కల్గియుండిన యెడల శ్రీ మన్మహామండలేశ్వరులయిన రాయదేవలవారి కార్యభాగములయందు కొనసాగేటట్టు నడతలు గలవారై, అంగ,వంగ కళింగాది దేశముల దిగ్విజయము చేసియున్న యెడలనున్ను, వొకానొక దినమందు సమస్థాన కార్య ఉద్ధారణ చేసినందున అచ్యుతదేవమహాదేవలయ్యవారు అమరనాయక పట్టవర్ధన భూమిపాలన సంస్థాన కర్తవ్యముగా పాండ్య, చేర, చోళ, మళయాళ మండలాధిపత్యానికి చేరిన మామూలు అష్టదిక్కులున్నూ యేర్పరచి తూర్పు సముద్రం, మన్నారుకోట ఆగ్నేయం,అనంతశయనం, దక్షిణం గూడల్లూరు, నైరుత్యం పెద్దేరు కోయమ్ముత్తూరు వాళయూరు పడమర ఘట్టం కన్మ, ఉత్తరం వాలికొండ శ్వేతనది, ఈశాన్యం తంజనగరం సరిహద్దులు కావేర్యాంతం. ఈ మధ్యమ మందులోనుగా గల ఉభయ కావేరి, రామసేతు, ధనుష్కోటి,తామ్రపర్ణీ, చిత్రానదీ, క్షీరనదీ,కృతమలా, వేగావతీ, నిక్షేపనదీ, వరాహనదీ,సురభీనదీ,ఉత్తర శ్వేతనదీ, అమావతీ, సాలిగ్రామనదీ, రత్ననదీ, భవానినది మొదలయిన పుణ్యనదులున్నూ, శ్రీరంగం తోతాద్రి మధురై అళగిరి మొదలయిన విష్ణుస్థళాళుంకూడ్ని జంబుకేశ్వర మధుర చొక్కనాథ మీనాక్షి మొదలైన శివస్థలాలు కూడ్ని, గిరిదుర్గ, వనదుర్గ, స్థళదుర్గ, జలదుర్గ, శ్రీ త్రిశిరగిరి మధురాపురి పట్న సాలకలు మొదలయ్ని కూడ్ని రాజ్యములు చేర్నినాడు, పల్లెలూ గ్రామాలూ, వూళ్ళూ ప్యాటలు, కోటలు, స్థలనగరములతో నుంగూడ్ని రాష్ట్రముల్కు ఆస్తానమయిన మధురాపురి పట్నానకు చేర్ని దేవబ్రాహ్మణ క్షత్రియ, వైశ్య, శుద్రులు అష్టాదశ వర్న, పంచమ వర్ణక సహశ్రీజలతో నుంగూడ్ని రాష్ట్రం యావత్తూ కల్గిన యీ మధుర నగరానుకు, నీవే రాజువనిన్నీ, రాజ సప్తాంగముతో నున్నూ సభా సప్తాంగముతో నున్నూ కూడుకొని సభాసప్తాంగముల యిప్పించి శ్రీ మన్మహామండలేశ్వర అచ్యుతదేవ మహారాయలయ్యవారు దైవప్రాసాదలబ్దవశాత్ చాతను కరుణతోగూడి బలిజవర్న గెరికపాటి వంశమున కల్గిన శ్రీ విశ్వనాథ నాయనయ్య గారికి పాండ్యమండలాధీరాజు అనే ౨౪ (24) రెండున్న కోటి ద్రవ్యరాజ్యానికి శాస్త్రోక్తముగా పట్టభిషేకం విజయనగరమందు చేయించిరి. మరిన్ని భూవరహాది అనేకం. బిరుదున్నూ అనేక వాద్యాలున్నూ తమ కులదేవత అయిన దుర్గ లక్ష్మీ అమ్మవార్లున్నూ యిష్టదేవత అయిన, లక్ష్మీనారాయణస్వామి స్వర్ణ విగ్రహమున్ను దయచేసి, చతురంగ సేనలును మంత్రి సామ్రాజకులున్నూ, యిప్పించినందున విస్వనాథ నాయని వారు మరిన్నీ అనేకం బ్రహ్మలను రప్పించుకొ ప్రయాణం అంపించుకొని ఇచ్చటికి వచ్చి మధురాపుర పట్నంలో నగళ్ళు కల్గజేసి అచ్చట వునికి పట్టభిషిక్తుడై రాజ్యం శాసించి, శ్రీరంగం, జంబుకేశ్వరం మొదలైన మహాస్తళాలకు అధిక పుఛ్రయంగా వుత్సవాలు మొదలయినవి. నడిపించుకొని తీరావాసములయందు అనేక అగ్రహారాదుల నిర్మించి వనాధుల ఛేదించి దుష్టనిగ్రహాది శిష్ట పరిపాలనము చేస్తూ మనునీతి ప్రకారం కార్యఖడ్గములుకి యోగ్యముగా ప్రజలను పరిపాలనము చేస్తూ వంశాభివృద్ధిగా ప్రభుత్వం చేయుదురు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి