7, జూన్ 2020, ఆదివారం

బలిజ వారి ఉపనయనము, పెళ్ళి తతంగము, గోత్రాల వివరణ

     బలిజ కులస్తులకు ఉపనయనము ఎప్పుడు చేయాలి...పెళ్ళిలో చేయవలసిన తతంగాలు ఏవి? బలిజ కులస్తుల గోత్రములు, సూత్రము తదితర వివరాలను 120 సంవత్సరాల క్రితమే శ్రీ పగడాల నరసింహులు నాయుడు గారు గ్రందస్తం చేశారు...ఈ ఆచారాలను ఆనాడు కొందరు ఆచరిస్తే మరి కొందరు ఆచరించ లేక పోయేవారు...అందరికీ ఈ సమాచారం అందుబాటులో వుండాలని ఆయన బలిజవారు పురాణం అనే తమిళ గ్రంథం లో,బలిజ వంశ పురాణము అనే తెలుగు గ్రంథం లో ఆయన వివరంగా తెలిపారు..బలిజవంశ పురాణం లోని అంశాలు ఇవి. అందరూ తెలుసుకోవాల్సినవి....






5, జూన్ 2020, శుక్రవారం

114 సంవత్సరాల నాటి బలిజల ఇండ్లపేర్లు....

       విజయరంగ చొక్కనాథుడు (1704) మధుర రాజ్యాన్ని పాలించిన నాయక రాజు... రాజులు నిజానికి తమ కులం బహిరంగంగా చెప్పుకోవడానికి సంకోచించారు..అందుకే వారు కులం పేరు చెప్పుకోకుండా తమ తమ వంశాల పేర్లు మాత్రమే శాసనాలలో చెప్పుకున్నారు...మరి విజయరంగ చొక్కనాథుడికి ఎవరికీ లేనంత కులాభిమానం ఏమిటో అర్థం కాదు..శ్రీ రంగం లోని కోనేరు వద్ద గల శాసనం లో తమ బంధువుల ఇంటిపేర్లు అన్నీ రాయించాడు..వీరిలో 40 రాజకుటుంబాల కు సేవికా వృత్తి కానీ,వెండి ఆభరణాలు కానీ ధరించడం నిషేధం...ఎందుకంటే ఈ కుటుంబాలు సేవికా వృత్తి చేస్తే ఆయా వంశాల గౌరవం తగ్గుతుందని ఆనాటి వారు భావించేవారు..అదే విధంగా వెండి ఆభరణాలు అంటే కాళ్ళకు మెట్టెలు, కానీ కాళ్ళ గొలుసులు కానీ బంగారం తో చేసినవి మాత్రమే వాడాలి....
          అదే విధంగా మహా బంధువులు, గోష్టి బంధువులు, బహు బంధువులు అంటూ చాలా ఇండ్ల పేర్లు శాసనం లో చెక్కించారు...ఆ ఇండ్ల పేర్లు మీ కోసం ...120 సంవత్సరాల క్రితం అచ్చు వేయబడిన పగడాల నరసింహులు నాయుడు గారి "బలిజ వంశ పురాణం" కాపీలు...  
















1, జూన్ 2020, సోమవారం

114 సంవత్సరాల క్రితం నాటి బలిజవంశ పురాణం ...అప్పటి గురుపీఠాలు ...బలిజ కులస్తుల గురించి వెలిబుచ్చిన అభిప్రాయాలు

             120 సంవత్సరాల క్రితం బ్రిటీషువారు కులగణన కార్యక్రమం చేపట్టారు . ఆ సందర్భంగా బలిజ కులస్తులను శూద్రులుగా పరిగణించి నాలుగవ తరగతిలో చేర్చారు...దీనికి నాటి బలిజ సమాజం అభ్యంతరాలు వెలిబుచ్చింది...బలిజకులస్తులు చంద్రవంశ క్షత్రియులని వారిని నాలుగవతరగతిలో కాకుండా రెండవతరగతిలో చేర్చాలని డిమాండ్ చేసింది....దానికి సెన్సస్ కమిటీ ఆధారాలు చూపెట్టమని అడిగింది ...దానికి అనేక పురాణాధారాలు ...చారిత్రక ఆధారాలను నాటి బలిజ పెద్దలు వారికి చూపించారు....ఆ ఆధారాలను అనేకమంది బ్రాహ్మణ పండితులకు ...చరిత్రకారులకు ...గురుపీఠాల అధిపతులకు పంపించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నాక బలిజకులస్తులను చంద్రవంశ క్షత్రియులుగా అంగీకరిస్తూ తెల్లవారు రెండవ కేటగిరీలో చేర్చారు.. ఆ వివరాలను ఉటంకిస్తూ శ్రీ పగడాల నరసింహులు నాయుడు గారు "శ్రీ చంద్రవంశ క్షత్రియులైన, ఆంధ్రులు, గౌరవులు, అను బలిజవంశ పురాణం లేక నాయుడుగార్ల సంస్థాన చరిత్రము" అనే పుస్తాకాన్ని వెలువరించారు...దీనికంటే ముందు "బలిజవారు పురాణం" అనే పుస్తకాన్ని ఆయన రచించారు ఇది  సుమారు 500 పేజీల  లకు పైగా తమిళ భాషలో వున్నది. ఈ రెండు పుస్తకాలు ప్రస్తుతము ఇండియాలో లభించడం లేదు. కాపు చరిత్ర సంకలన సమితి సభ్యులు ...శ్రీ పోలిశెట్టి సత్తిరాయుడు గారు లండన్ లోని బ్రిటీషు మ్యూజియం నుండి వాటి కాపీలను తెప్పించారు...ఆ వివరాలు మీ కోసం...