19, మార్చి 2016, శనివారం

కమ్మ మిత్రులారా చూడండి మీ వారి చరిత్ర కబ్జాలు....



మధురను పరిపాలించిన విశ్వనాథ నాయకుడు అతడి తండ్రి నాగమనాయకుడు,కమ్మ కులస్తులా ....
      విశ్వనాథ నాయకుడి గురించిన వివరాలాన్నీ కొటికం కైఫీయత్ చాలా స్పష్టంగా చెబుతోంది కొటికం కైఫీయత్ లో "బలిజవర్ణ గరికపాటి" అని కులాన్ని ఇంటిపేరుతో సహా పేర్కొన్నారు. ఇక ఆయన వంశం లో విజయరంగ చొక్కనాథుడు శ్రీరంగం లోని రంగనాథ స్వామి దేవాలయం లోని కోనేరు వద్ద శాసనం వేయించాడు. అందులో తనది బలిజ కులం అని రాజబంధువులు, గోష్టి బంధువులు అంటూ 200 ఇంటిపేర్లను చెక్కించాడు.  ఆ శాసనం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే వుంది. ఇంత స్పష్టంగా చరిత్ర మనకు లభిస్తుంటే మరో కమ్మ మిత్రులు ముత్తేవి రవీంధ్రనాథ్ గారు ఏ ఆధారాలు చూపకుండా చరిత్రను వివరిస్తున్నారు. ఇందులో కూడా మధుర రాజుల చరిత్రను కబ్జా చేసుకుని తన కులానికి అన్వయించుకున్నారు. అయ్యా ముత్తేవి రవీంధ్ర నాథ్ గారూ ఇప్పటికైన మేలుకోండి. ప్రపంచం మనవైపు చూస్తోంది.
మరొక విషయం కరికాళ చోళుడు కూడా కమ్మ వారే అని వీరు నిర్ధారించారు సుమండీ ....                               
ఈ   పోస్ట్ పెట్టడానికి గల కారణం ముత్తేరవీంద్రనాథ్ గారి ఫేస్ బుక్ టైం లైన్ లోనే ఖండించాలని అనుకున్నాను కానీ వారి టైంలైన్ లో కామెంట్లకు అవకాశం లేకుండా సెట్ చేశారు కనుక తప్పని సరి పరిస్థితిలో ఈ బ్లాగులో ఖండిస్తున్నాను.  
దయచేసి ఇకనైనా చరిత్ర కబ్జా చేయడం మానుకుంటారని ఆసిస్తున్నాను.

 రవీంధ్రనాథ్ గారి ఫేస్ బుక్ లంకెను ఇక్కడ ఇస్తున్నాను గమనించండి.

        ,


https://www.facebook.com/ravindranath.muthevi/posts/973980656005999

4 కామెంట్‌లు:

  1. నేను అనంతపురము వాస్తవ్యుడను, శెట్టిబలిజస్ధుడను. మా దగ్గర నాందార్లు, మోడికాళ్లు అని రెండు విభాగాలున్నవి బలిజ కులములోనే. యీ రెండు విభాగాలమీద సమాచారం యివ్వగలరు

    రిప్లయితొలగించండి
  2. రవితేజ గారూ నామధారులు లేదా తిరుమణిధారులు, మోటోళ్ళు లేదా మోడికాళ్ళు ఈ రెండు విభాగాలు వారు అనుసరించిన మతాలకు సంబంధించినవి. బలిజ కులస్తులందరూ మొదట్లో శాక్తేయ మతావలంబకులు. తరువాత కాలంలో శైవులయ్యారు. ఆ తరువాత కాలం లో బౌద్ధ, జైన మతాలను అనుసరించారు. వాటి తరువాత బసవేశ్వరుదు వీరశైవాన్ని ప్రభోధించాడు. బలిజ కులస్తులు వారిని అనుసరించిన 18 కులాల పూర్వాచారులు వీరశైవ మతాన్ని పుచ్చుకున్నారు. వీరిలోని బలిజ కులస్తులను లింగబలిజలు అంటారు. కాకతీయుల కాలం నాటి వరకు దక్షిణ భారతదేశ బలిజలు ఎక్కువశాతం జైన బలిజలుగానే వున్నారు. తరువాత సైవమతాన్ని కొందరు అవలంబించగా మరికొందరు వైష్ణవమతాన్ని అవలంబించారు. రామానుజాచార్యుడు ప్రభోధించిన వైష్ణవాన్ని అనుసరించిన వారు నామధారులని, సైవాన్ని కొనసాగించిన వారు విభూధి ధారులు లేదా ప్ర్రచీన మతం కాబట్టి మోటోళ్ళని పిలువబడుతున్నారు. వీరు అనుసరించిన మతాల కారణంగా కర్మకాండలు చేసే విధానాలు భిన్నంగా ఏర్పాటు చేశారు. నామధారులు మహాలయ అమవాస్య సందర్భంగా పితృదేవతలకు మాంసాహారంతో నైవేద్యాలు సమర్పిస్తారు. మోటోళ్ళు దసరా సందర్భంగా శాఖాహార పిండివంటలతో నైవేధ్యాలు సమర్పిస్తారు. ఈ రెండు వర్గాలకు కంచం పొత్తు మంచం పొత్తు వున్నాయి. ఈ ఆచారాల కారణంగానే కొందరు వీరి మధ్య వివాహ సంబంధాలకు అంగీకరించరు. ఈప్పుడు వీటిని ఎవరూ అంతగా పట్టించుకోవడంలేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మంచి వివరాలు తెలియపరచినందుకు ధన్యవాధములు

      తొలగించండి
    2. కానూరి ఇంటిపేరు గురించి చెప్పండి. పైడిపాల గోత్రము

      తొలగించండి