17, ఆగస్టు 2016, బుధవారం

మధురను పాలించిన విశ్వనాథ నాయకుడి కులము, ఇంటిపేరు ఏమిటొ చూడండి...ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి....

మధురను పాలించిన విశ్వనాథ నాయకుడి కులము, ఇంటిపేరు ఏమిటొ చూడండి...ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి....


మిత్రులారా మధురను పరిపాలించిన విశ్వనాథ నాయకుడి గురించి చాలామంది తమ ఇష్టమొచ్చినట్టు తమ కులస్తుడని రాసుకుంటున్నారు. వాస్తవాలు ప్రపంచం ముందుకు తీసుకు రావడానికి మావంతు ప్రయత్నం చేస్తున్నాము. మిత్రులు ఇకనైనా వాస్తవ చరిత్రలు రాసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కొటికం వారి కైఫీయత్తు ఒరిజినల్ స్కాన్ డ్ కాపీని పెడుతున్నాను చూడండి.  దీనిలో విశ్వనాథ నాయకుడి కులము, ఇంటిపేరును ప్రస్తావించారు. భద్రతాంశాలను దృష్టిలో పెట్టుకుని కొటికం వారి కైఫీయత్ మొత్తాన్ని ఇక్కడ పెట్టలేక పోతున్నాను. ఈ కైఫీయత్ ను పోలిశెట్టి సత్తిరాయుడు గారు సేకరించారు.
సేకరణ : పోలిశెట్టి సత్తిరాయుడు, హైదరాబాదు.

19, మార్చి 2016, శనివారం

కమ్మ మిత్రులారా చూడండి మీ వారి చరిత్ర కబ్జాలు....



మధురను పరిపాలించిన విశ్వనాథ నాయకుడు అతడి తండ్రి నాగమనాయకుడు,కమ్మ కులస్తులా ....
      విశ్వనాథ నాయకుడి గురించిన వివరాలాన్నీ కొటికం కైఫీయత్ చాలా స్పష్టంగా చెబుతోంది కొటికం కైఫీయత్ లో "బలిజవర్ణ గరికపాటి" అని కులాన్ని ఇంటిపేరుతో సహా పేర్కొన్నారు. ఇక ఆయన వంశం లో విజయరంగ చొక్కనాథుడు శ్రీరంగం లోని రంగనాథ స్వామి దేవాలయం లోని కోనేరు వద్ద శాసనం వేయించాడు. అందులో తనది బలిజ కులం అని రాజబంధువులు, గోష్టి బంధువులు అంటూ 200 ఇంటిపేర్లను చెక్కించాడు.  ఆ శాసనం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే వుంది. ఇంత స్పష్టంగా చరిత్ర మనకు లభిస్తుంటే మరో కమ్మ మిత్రులు ముత్తేవి రవీంధ్రనాథ్ గారు ఏ ఆధారాలు చూపకుండా చరిత్రను వివరిస్తున్నారు. ఇందులో కూడా మధుర రాజుల చరిత్రను కబ్జా చేసుకుని తన కులానికి అన్వయించుకున్నారు. అయ్యా ముత్తేవి రవీంధ్ర నాథ్ గారూ ఇప్పటికైన మేలుకోండి. ప్రపంచం మనవైపు చూస్తోంది.
మరొక విషయం కరికాళ చోళుడు కూడా కమ్మ వారే అని వీరు నిర్ధారించారు సుమండీ ....                               
ఈ   పోస్ట్ పెట్టడానికి గల కారణం ముత్తేరవీంద్రనాథ్ గారి ఫేస్ బుక్ టైం లైన్ లోనే ఖండించాలని అనుకున్నాను కానీ వారి టైంలైన్ లో కామెంట్లకు అవకాశం లేకుండా సెట్ చేశారు కనుక తప్పని సరి పరిస్థితిలో ఈ బ్లాగులో ఖండిస్తున్నాను.  
దయచేసి ఇకనైనా చరిత్ర కబ్జా చేయడం మానుకుంటారని ఆసిస్తున్నాను.

 రవీంధ్రనాథ్ గారి ఫేస్ బుక్ లంకెను ఇక్కడ ఇస్తున్నాను గమనించండి.

        ,


https://www.facebook.com/ravindranath.muthevi/posts/973980656005999

29, జనవరి 2016, శుక్రవారం

ఇది చరిత్ర కబ్జా చేయడం కాదా...

ఇది చరిత్ర కబ్జా చేయడం కాదా....మధుర, తంజావూర్, జింజి లను పాలించిన నాయకరాజులు  బలిజ కులస్తులైతే వారిలో తిరుమల నాయకుడిని కమ్మవారు తమవాడు అని చెప్పుకోవడం సిగ్గుచేటు కాదా....ఇది ఏమిటని అడిగితే ఆయన రాజు కాబట్టి వేసుకున్నాం అంటారు. రాజు అయితే రాజుగానే గౌరవించాలి. కానీ కులపత్రికలలో తామ కులానికి చెందిన గొప్పవారి సరసన తిరుమల నాయకుడి ఫొటోను వేసుకోవడం ఎంతవరకు సమంజసం. చరిత్రను ఇష్టమొచ్చినట్టు కబ్జా చేసేసి తమను మించిన వాడు ఈ లోకంలోనే లేడని గప్పాలు కొట్టుకోవడం ఏ పాటి సంస్కారమో చెప్పాలి. ఏమైనా అంటే అందరూ మాపై పడి పోతారు అంటూ బుగ్గలు నొక్కుకునే కమ్మ మిత్రులారా  చూడండి మీవారి నిర్వాకం. ఇప్పటికైనా చరిత్ర తెలుసుకోండి. చరిత్రను కలుషితం చేయకండి. చరిత్రను చరిత్ర లాగ వుండనివ్వండి. గొప్పల కోసం గప్పాలు కొట్టుకోకండి.
 దయ చేసి మా చరిత్రను మాకు మిగిలించండి.