11, జులై 2015, శనివారం

వెలివేయబడిన బ్రహ్మనాయుడి బంధువులే వెలమలు (నాయకురాలు నాగమ్మ-7)



        నాకు లభించిన అనేక ఆధారాలను బట్టి బ్రహ్మనాయుడి బంధువులే వెలమ కులస్తులని స్పష్టం చేస్తున్నాను. నేను స్పష్టం చేస్తున్న ఈ విషయం ఎవరినో కించపరచాలనో, నొప్పించాలనో చేస్తున్నది కాదు. చరిత్ర అనేక విధాలుగా వక్రీకరించబడింది. ఏ కులానికి సంబంధించి ఆ కులం ప్రత్యేకతలు చరిత్రలో ఎన్నో వున్నాయి. చరిత్రగతిని అర్థం చేసుకోవడం లో జరిగిన పొరపాట్లు, లేని చరిత్రను తమకు ఆపాదించుకున్న కొందరు రచయితలు అసలు చరిత్రను బయటకు రాకుండా చేశారని నా అభిప్రాయము. రెండువేల సంవత్సరాలకు పూర్వం నాలుగు వర్ణాలుగా, 27 కులాలుగా వున్న కులాలు 19 వ శతాబ్దం ఆరంభం నాటికి 66 అంతకంటె ఎక్కువ కులాలుగా విభజన చెందాయి. ప్రధాన కులం లో నుండి విభజింపబడ్డ కొంతమంది తరువాత కాలంలో ప్రత్యేక కులాలుగా ఏర్పడ్డ సందర్భాలు అనేకం. కొన్ని కులాలు వృత్తులాలో సహాయకారులుగా వుంటూ తరువాత ప్రత్యేక కులాలుగా విడిపోయిన సందర్భాలు ఎక్కువగా కనిపిస్తాయి. 

     అలా బలిజ లేదా కాపు కులం నుండి విడిపోయిన వారే వెలమ, కమ్మ కులాలు. వీరిలో వెలమలు పలనాటి చరిత్ర కాలం లో విడిపోగా, కమ్మ కులస్తులు కాకతీయ ప్రతపరుద్రుని కాలంలో విడిపోయినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. 

     నేటికీ ప్రకాశం జిల్లా లోని దోర్నాల మండలం లో వున్న బొమ్మలాపురం ప్రాంతం లో వెలమ కులస్తులు వున్నారు వీరిని ఈ ప్రాంతం లో పెద్ద కమ్మ వారని అంటారు. దీన్ని బట్టి వెలమలు కమ్మల కంటె ముందుగా విడిపోయిన వారని అర్థమవుతోంది. 

 పద్మనాయక చరిత్ర లోని ఈ క్రింది పద్యాలను ఒకసారి గమనించండి.

ఊరివరదనీరు నురికి సరస్సుజేరి
తీర్థయోగమైన తెరగుగాదె
కాలచోదితమున గాకతీశ్వరుల గొల్చి
కాపులెల్ల వెలమ కమ్మలైరి.

తొలికాలముర్వి గొడవల 
వెలియై యాలయములందు విహరించుటచే
నిలకాపు జనులు కొందరు 
వెలమలన్ జగతిలోన విశ్రుతులగుటన్ 

ఈ పద్యాలు కాపు కులం నుండి పై రెండు కులాలు విడిపోయినట్లుగా స్పష్టం చేస్తున్నాయి. 

    కమ్మ కులం గురించి మరో సందర్భం లో చర్చిద్దాం. ప్రస్తుతానికి పలనాటి యుద్ధ కాలం లో వున్నాం కాబట్టి సందర్భానుసారంగా వెలమ కులం ముందు నాటి పరిస్థితులు ఏంటో దాని పూర్వాపరాల గురించి విశ్లేషిద్దాం.

రెండవ పద్యం లో "తొలికాలముర్వి గొడవల" అంటె మొదట్లో జరిగిన భూతగాదాల వల్ల.

    వెలియై యాలయములందు విహరించుటచే అంటే వెలివేయబడి ఆలయాలందు తలదాచుకున్నారు. వారే తరువాతి కాలం లో వెలమలుగా పిలువబడ్డారు. ఒక కులాన్నే వెలివేయడం సాధ్య మౌతుందా??? సాధ్యం కాదు. 

    కానీ పెద్ద ఎత్తున వెలివేయబడ్డారు. బహుశా అవి కొన్ని కుటుంబాలై వుంటాయి. అలాంటి పరిస్థితులు ఎప్పుడు ఏర్పడ్డాయి. 

    కమ్మలకంటే ముందుగానే వెలమలు వెలివేయబడి మరో కులంగా స్థిరపడ్డారు. అంటే కాకతీయుల కాలం కంటే ముందై వుండాలి. 

     వెలమ కులం లో ప్రసిద్ధి గాంచిన వారు వెలుగోటి రాజులు. వీరి గోత్రం "రేచెర్ల"  వీరు 11,12 శతాబ్దాలలో నేటి కర్నూలు జిల్లా "వెలుగోడు" లో స్థిరపడినట్లు కనిపిస్తొంది. ఆ కాలం నాటికి ఈ ప్రాంతం లో అనేక గ్రామాలు ఉన్నాయి. వీరు నివసించిన వెలుగోడు మొదట్లో వెలివాడ, వెలుగువాడ, వెలుగోడుగా రూపాంతరం చెదినట్లు తెలుస్తోంది. వీరు ఇక్కడ మట్టికోట కట్టుకుని విజయనగర రాజులకు సామంతులుగా రాజ్యమేలారు. నేటికీ విరు నిర్మిచిన చెన్నకేశవస్వామి దేవాలయం నాటి రాజులు వాడిన చలువబండ వెలుగోడులో వున్నాయి. ఆ తరువాత ముస్లిం పాలకుల దాడులలో వెలుగోడు మట్టి కోట ధ్వంసం కాగా వెంకటగిరి చేరినట్లు తెలుస్తోంది.

ఇక కథలోకి వద్దాం.....

      ప్రాచీన భారత దేశం లో శెట్టి సమయాలు అనే ఒక బృహత్తరమైన వ్యవస్థ వుండేది. వీరే అటు వ్యాపారాలను ఇటు గ్రామ, పట్టణ, నగర పాలనలను నిర్వహించారు. వీరినే దేశాయి రెడ్లు, దేశాయి శెట్లు అని పిలిచేవారు. ఈ దేశాయిలు, శెట్లు నాటి గ్రామాలలో పన్నులు వసూలు చేయడం, తీర్పులు చెప్పడం చేసేవారు. కులాల కట్టుబాట్లను నియంత్రించేది కూడా వీరే. నాటి ప్రజల లో కుడి, ఎడమ చేతులకు చెందిన కులాలు వుండేవి. వాటిలో కుడిచేతి కులాలే మొదటి నుండి ఆధిపత్యం చెలాయించాయి. ఈ కులాలకు చెందిన వారే నాటి రాజులు, చక్రవర్తులు. ఈ కుడి చేతి కులాలకు పెద్దలు బలిజ కులస్తులు.  

      నాగమ్మ తండ్రి రామిరెడ్డి జిట్టగామాల పాడులో తీర్పులు చెప్పడం లో దిట్ట అని పేరుప్రఖ్యాతులు గాంచాడు. అంటే ఆయన ఆ ప్రాంత దేశాయి రెడ్డి. దీన్ని బట్టి నాగమ్మ సామాన్య కుటుంబానికి చెందినది కాదు ఉన్నత కుటుంబానికి చెందినది అని తెలుస్తోంది. 

     భారత దేశాన్ని, ఇక్కడి సంపదను శాసించిన వారు వ్యాపారులు. పలనాటి చరిత్ర నాటికే పెద్ద ఎత్తున సముద్ర వ్యాపారాలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రతి రాజ్యం లో ప్రధాన ఆదాయ మార్గాలుగా వర్తక వాణిజ్యాలు వున్నాయి. ఈ వర్తక వాణిజ్యాలను శాసించిన వ్యాపారులు ఎవరు? 

    చరిత్రలో వర్తక వాణిజ్యాలను శాసించిన సమయాలు ప్రధానంగా వీరబలింజ సమయాలు. వీరిలో అయ్యావళీ-500, ముమ్మూరి దండులు-36 అనేవి శాసనాలలో ప్రముఖంగా కనిపిస్తాయి. వీరంతా వర్తకులే కాదు గొప్ప యుద్ధ వీరులు కూడా. ఈ ముమ్మూరి దండులు వర్తక బిడారులను దొంగల నుండి రక్షించే రక్షకులు. 

ఇదీ నాటి నేపథ్యం...

     ఇలాంటి పరిస్థితులలో వర్తకులపై పెద్ద ఎత్తున దొంగల దాడులు జరుగుతుండేవి. వీటిని అరికట్టాల్సిన బాధ్యత నాటి వీరబలింజలది. ఈ క్రమం లోనే వ్యాపారులు రాజుకు ఎన్నో సార్లు ఫిర్యాదులు చేసి వుంటారు.  కానీ రాజు మంత్రి బ్రహ్మనాయుడికి బాధ్యతలు అప్పగించి వుంటాడు. ఆ దోపిడీ దారులంతా బ్రహ్మనాయుడి బంధువులు, స్నేహితులు కావడం తో వారిపై ఎలాంటి చర్యలూ తీసుకుని వుండరు. 

    విరబలింజ సమయాలకు ఒక అలవాటు వుంది. ఏ రాజైనా తమకు అనుకూలంగా చర్యలు తీసుకోక పోతే ఆ రాజ్యాలను సైతం ఆక్రమించుకుంటారు. తమ వారిని పాలకులుగా నియమిస్తారు. కానీ ఇక్కడ పాలకులు దొంగలూ అందరూ తమవారే ఏం చేయాలి? 

అందుకే జిట్టగామాలపాడు లో తండ్రి తరువాత ఆ బాధ్యతలను నిర్వహిస్తున్న నాగమ్మను ఆశ్రయించారు. 

అలా నాగమ్మ అనుగురాజు తనకు ఇచ్చిన వరాన్ని ఉపయోగించుకుని బ్రహ్మనాయుడి భరతం పట్టింది. 

వాస్తవానికి నాగమ్మ ఒక్కతి కాదు ఆమె వెనుక ఉన్న సమయాలు ఆమెకు అండగా నిలిచాయి. 

      ఇక్కడ ఒక్క దొంగతనాలు మాత్రమే బ్రహ్మనాయుడిని మంత్రి పదవికి దూరం చేయలేదు. అది ఒక కారణం మాత్రమే. ప్రధానమైనది ఆయన ప్రతిపాదించిన చాపకూటి సిద్ధాంతం. ఈ చాపకూటి సిద్ధాంతం సహపంక్తి భోజనాలని చాలామంది రచయితలు అభిప్రాయపడ్డారు. కానీ అది తప్పు. చాపకూటి సిద్ధాంతం అనేది ఒక "ఎంగిలిమగళం" అని తెలుస్తోంది. ఒక చాపను పరచి అందులో  భోజనాన్ని కలిపుతారు. అక్కడ ఒకరు తిన్న తరువాత అదే చోట మరొకరు తింటారు. ఇక్కడ కులం లేదు కట్టుబాట్లు ఉండవు. ఇది చూసి చాలా మంది బ్రహ్మనాయుడిని గొప్ప సంఘ సంస్కర్తగా అభివర్ణిస్తారు. కానీ ఈ చాపకూడు వెనుక పచ్చి వ్యభిచారం జరిగేదని భార్యా భర్తల మధ్య ఉండే కట్టుబాట్లకు తిలోదకాలిచ్చేశారని తెలుస్తోంది. కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నమై పోయింది. దీనికి అనుగుణంగానే మాచెర్ల, మార్కాపురం లలో ఉన్న చెన్నకేశవస్వామి దేవాలయ గాలి గోపురాలపై విపరీతమైన బూతు బొమ్మలను చెక్కించారని అంటారు. 

     కులసంకరాన్ని అతి పెద్ద నేరంగా భావించే పూర్వాచార కులాలకు బ్రహ్మనాయుడు పెద్ద సవాలుగా మారాడు. దీనిని పలువురు నాటి పెద్దలు నలగామరాజు దృష్టికి తీసుకు వచ్చి వుంటారు కానీ బ్రహ్మనాయుడికి ఎదురు చెప్పలేని అశక్తత నలగాముడు వెలిబుచ్చి వుంటాడు. దీనిని అడ్డగించలేని నలగాముడు నాగమ్మకు పరోక్షంగా సహకరించి వుండవచ్చు. చాపకూడును అడ్డగించలేక పోయినా, బ్రహ్మనాయుడిని నిలువరించడానికి దొగతనం నేరాలు అవకాశంగా చిక్కాయి. ఆయన అనుచరులు పెద్ద ఎత్తున సాక్ష్యాలతో సహా పట్టుబడడం తో బ్రహ్మనాయుడు తప్పించుకోలేని పరిస్తితులు ఏర్పడ్డాయి. 


    అలా దొరికిన బ్రహ్మనాయుడిని మొదట దేశబహిష్కారం శిక్షగా వేసి వుంటారు.  యుద్ధం లో ఓడిపోయిన తరువాత అయన వర్గీయుల పై కుల బహిష్కరణ వేటు వేసి వుండవచ్చు.

ఇంకా  ఉంది తరువాత టపాలో ...

24, మే 2015, ఆదివారం

నాయుళ్ళంటే బలిజ కులస్తులే...నాయుడు పదాన్ని ఇతరులు వాడకూడదు...


          నాయకుడు అనే పదానికి ఆధునిక రూపమే నాయుడు. నాయక అనే శబ్దం కులసూచకం. ఈ పదాన్ని గతం లో కేవలం నాయక కుటుంబాల వారు మాత్రమే వాడేవారు. కానీ ఈ మధ్య కాలంలో ఇతర కులాల వారు కూడా ఈ శబ్దాన్ని తమ పేర్ల చివర తగిలించుకుంటున్నారు. నాయుడు అనేది బిరుదమని చాలామంది పొరపాటు పడుతున్నారు. అది పూర్తిగా తప్పు. 96 తెగలు కలిగి 56 రాజ్యాలు పరిపాలించిన వారు బలిజ కులస్తులు. ఈ 96 తెగల వారు సూర్య,చంద్ర,శేషనాగ,యదు వంశాలకు చెందిన వారు. ఈ 96 తెగల్లో "నాయక" అన్నది ఒకటి. ఈ విషయాన్ని అనేక ప్రాచీన గ్రంధాలలో ప్రస్తావించినప్పటికీ చాలామంది తమ పేరు చివరన నాయుడు అని తగిలించుకోవడం బహుశా వాస్తవం తెలియక అయి వుండవచ్చు. ఈ వాస్తవాలు అందరికీ తెలియాలని సంబంధిత సమాచారాన్ని ఇక్కడ పెడుతున్నాను గమనించగలరు. బాంబే గెజిటీర్ లో 96 తెగల సంచారం ఇచ్చారు. వాటిలో ఉన్న 'నాయక్' పదాన్ని గమనించండి.


1901 మద్రాస్ సెన్సస్ రిపోర్ట్ లో కూడా బలిజ బ్రాకేట్ లో నాయక్ అని వున్న విషయాన్ని గమనించండి. ఇదే పేరాలో  నాయక్ ఆర్ బలిజ కింగ్స్ అని వుండడం గమనించ గలరు.


కందుకూరి ప్రసాదిత్య భూపాలుడు రాసిన శ్రీ ఆంధ్ర విజ్ఞానము అనే గ్రంధం లో నాయక శబ్దం నాయుడుగా మారినదని తెలిపారు. ఈ గ్రంధం 1938 లో ప్రచురించబడింది. 
ఆయన తెలగ లేక నాయుడు అని సంభోధించారు.  
1381 వ పేజీ చివరలో, 1382 వ పేజీ మొదట్లో పెద్ద పెద్ద చదువులు చదివి యున్నతోద్యోగముల నొనర్చు వారు తెలగాలు నాయుళ్ళనిపించుకొనుచున్నారు. కానీ ఇటీవల నుద్యోగ గౌరవము నందుచున్న ప్రతి శూద్ర కులజుడును నాయుడు అని పిలువ బడుచున్నాడు. దీనిని చదువరులు గమనింతురు గాక అని హెచ్చరించాడు. 


దీనిని బట్టి నాయుడు అనే ఉపనామాన్ని బలిజ కులస్తులు మాత్రమే ఉపయోగించాలి. అది కులనామమే కానీ బిరుదం కాదని ఇతర కులాల వాళ్ళు తెలుసుకోవాలి. ఇలా నాయుడు అని ఉపనామాన్ని పెట్టుకున్న ఇతర కులాల వాళ్ళు ఇకనైనా దాన్ని తొలగించుకుంటారని ఆశిద్దాం. ఇప్పటికీ కోస్తా ప్రాంతం లో నాయుళ్ళు అని కేవలం బలిజ,కాపు లను మాత్రమే సంభోధిస్తారు. పాఠకులు గమనించ గలరు."నాయుడు" అనే ఉపనామం బలిజ కులాన్ని సూచిస్తుంది. ఇతర కులాల వాళ్ళూ దీన్ని తమ పేరు చివర తగిలించుకోవడం వల్ల వారు తమ కులాన్ని తప్పుగా చెప్పుకోవడం అనే భావించాల్సి వుంటుంది కనుక అలాంటి వారు సవరించుకుంటారని ఆశిస్తున్నాను.  

10, ఏప్రిల్ 2015, శుక్రవారం

తెలగ కులనామమే ఇవిగో ఆధారాలు.....

    తెలగాలు అంటే ఎవరో తెలియదు కానీ వారి గురించి వ్యాఖ్యానించడానికి ఏ మాత్రం వెనుకాడరు. తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారా అంటే కనీసం అది కూడా చేయరు. చరిత్ర అంటే నిజంగా వీరికి చిన్న పిల్లలు ఆడుకునే ఆటగా కనిపిస్తున్నట్లుంది.

     బలిజ కులస్తులను నిరంతరం కించపరుస్తూ రాతలు రాయించే వారు ఒకరైతే రాసేవారు మరొకరు. రాయించే వారు బయటకు రావడం లేదు కానీ రాసే వారు మాత్రం మనకు కనిపిస్తున్నారు. అలాంటి వారిలో యద్దనపూడి వెంకటరత్నం యాదవ్  అనే రచయిత ఒకరు. ఈయన గతం లో యయాతి వంశీకుడు శ్రీకృష్ణదేవరాయలు అనే వ్యాసాన్ని రాశారు. జులై 21,2010 లో ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రచురించింది. దీంట్లో రాయలు బలిజ కులస్తుడు కాదని పాణి అనే రచయితను విమర్శిస్తూ రాశారు. 2014 సెప్టెంబర్ లో పి.వి.పరబ్రహ్మ శాస్త్రి గారిని విమర్శిస్తూ తెలింగ కులనామం కాదు అంటూ తెగ విమర్శించారు. 

    నాకెందుకో వెంకటరత్నం గారు బలిజ కులం పై వ్యతిరేకతతో రగిలి పోతున్నట్లు కనిపించింది ఆ రెండు వ్యాసాలలో. చరిత్ర గతించి పోయిన వాస్తవం. దాని పాదముద్రలే ఆధారాలు. గాడ్ బాసన్ ను కనుక్కోవడనికి శాస్త్రవేత్తలు బిగ్ బాంగ్ ప్రయోగాన్ని చేశారు. ప్రయోగానంతరం తాము గాడ్ బాసన్ ను కనుక్కున్నామని ప్రకటించారు. వారు దాన్ని చూశారా? లేదు సెకెన్ లో వందల వంతు కాలంలో జరిగి పోయే సంఘఠనను ఏ మానవ నేత్రం చూడలేదు. కానీ అది మిగిల్చిన గుర్తులను చూశారు అప్పుడే అవి గాడ్ బాసన్ పాద ముద్రలుగా భావించారు. అందులో కూడా కొంత అనుమానమే...

    చరిత్ర కొరకు ఇంతలేసి ప్రయోగాలు సాధ్యం కాదు. గతం లొ నిర్మించబడిన రాతల ఆధారాలే చరిత్రకు సాక్షాలు. మరి ఎలాంటి చారిత్రక సాక్షాలు చూడకుండా తెలగ అనేది కులనామం  కాదు అంటూ ఎలా ఖండించ గలుగుతారు? 

కందుకూరి ప్రసాద భూపాలుడు రాసిన శ్రీ ఆంధ్ర విజ్ఞానము అనే గ్రంధం లో 

   1938 లో ప్రచురితమైన వ్యాల్యూం నెం.2 లో గాజుల బలిజ గురించి, వ్యాల్యూం నెం.3 లో తెలగలు తెలుగు ప్రభువుల సీమలు,వ్యాలూం నె.6 లో కోటబలిజలు, లింగబలిజలు, విశ్వనాథనాయకుడు గురించి రాసిన సమాచారాన్ని ఇక్కడ యథతథంగా ఇస్తున్నాను గమనించండి. 









సేకరణ :- పోలిశెట్టి సత్తిరాయుడు, హైదరాబాదు.

13, ఫిబ్రవరి 2015, శుక్రవారం

పెరిక బలిజలు బలిజ కులానికి చెందినవారే....



     "పెరిక బలిజ" కులస్తులు బలిజ కులస్తులే.... ఈ విషయం తెలియని చాలామంది రెండూ వేరు వేరు కులాలుగా పరిగణిస్తూ వారి మధ్య ప్రఛ్చన్న స్పర్థలను రేకెత్తిస్తున్నారు. నేను గతంలో పెరికబలిజ అనే కులం బలిజ కులానికి ఉపకులము అంటూ ఒక పోస్ట్ ను పెట్టాను. తెలంగాణ ప్రాంతం నుండి ఒక పెరిక సోదరుడు అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. దాంతో వారి మనోభావాలను నొప్పించకూడదనే ఉద్దేశ్యంతో ఆ పోస్ట్ ను తొలగించాను. ఆ తరువాత చాలా గ్రంధాలను పరిశోధించిన తరువాత "పెరిక బలిజ", బలిజ కులానికి ఉపకులమే అని నిర్ధారించుకున్నాను. చరిత్ర తెలియని చాలామంది మిడి మిడి జ్ఞానంతో కేవలం తమకు మాత్రం బంధుత్వాలు లేవనే కారణంతో పెరిక బలిజ కులస్తులకు రిజర్వేషన్లు అందకుండా అడ్డు పడుతున్నారు. అలాంటి వ్యక్తులు అనాలోచితంగా ప్రభుత్వాధికారులకు ఫిర్యాదులు చేయడంతో రాయలసీమ ప్రాంతంలో అనేకమంది "పెరిక బలిజ" విద్యార్థులు కులధృవీకరణ పత్రాలు అందక ఫీజు రీఎంబర్స్ మెంట్ అందక కాలేజీ చదువులు మానుకున్న సంఘటనలు చాలా వున్నాయి. 

1970 వరకు అగ్రకులాలలో వున్న పెరిక బలిజలు 1970 తరువాత బి.సి-బి జాబితాలో చేర్చబడ్డారు. 

   తమ కుల సంఘాలను ఏర్పాటు చేసుకునేటప్పుడు "పెరికె" "పెరికె(పురగిరి క్షత్రియ)" సంఘాలుగా మాత్రమే రాసుకుంటున్నారు. 

    ఇంకొందరైతే "కొన్ని పరిస్థితుల ప్రభావం వలన మన పెరికలు మారు వేషాలతో వ్యాపారం చేయవలసి వచ్చింది. అందుచే పెరిక బలిజలని వ్యవహరిస్తున్నారు" అంటూ సరికొత్త భాష్యాలను చెప్పి మరింత తప్పు దోవ పట్టిస్తున్నారు. 

   కులసంకరాలను అడ్డుకోవడం కులవ్యవస్థను పటిష్టంగా నడపడం బలిజల బాధ్యత ఎందుకంటే శెట్టి, దేశాయి, వ్యవస్థలకు నాయకులుగా సుమారు 2000 సంవత్సరాలు వ్యవహరించారు. 

    డబ్బు వున్నవాడు ఎక్కువ బలిజ అని, డబ్బులేని వాడు తక్కువ బలిజ అని వ్యవహరించీ వ్యవహరించీ లెక్కలేనన్ని ఉప కులాలుగా విడిపోయారు. ఈ ఉప కులాలు  కూడా వారు చేసే వృత్తి వల్ల ఏర్పడ్డాయని వీరంతా ఒకే జాతికి చెందిన వారని చాల గ్రంధాలలో రాసి పెట్టినప్పటికీ తెలుసుకోలేని అజ్ఞానంతో ఇంకా, ఇంకా దూరం అవుతూనే వున్నారు. 

     వీరబలిజ సమయాలు, శెట్టి సమయాలు అనేవి 18 ప్రధాన కులాల సమాహారాలు. వీరిలో చాలామంది బలిజ అని చివరన తగిలించుకుంటారు. అది వేరు.

పెరిక బలిజ కులస్తులు అలాంటి వారు కాదు. పెరిక బలిజ కులస్తులు ప్రధానంగా బలిజ కులానికి చెందిన వారే.  

బలిజ కులంలో శెట్టి బలిజ, తోటబలిజ లాగా వృత్తి ద్వారానే వీరు పెరిక బలిజలుగా పిలువబడ్డారు. 

రవాణ వ్యవస్థను శాసించిన జాతి ఇది. 

       ఒక యుద్ధం జరిగితే ఆ యుద్ధ సైనికుల అవసరాలు తీర్చే బాధ్యతలు వీరిపైన వుండేవి. ఎద్దులపైన, గాడిదల పైన జనప, గోగు నారలతో తయారైన గోనె సంచులతో రవాణాలు చేశారు. ఉప్పు తయారు చేయడం వల్ల ఉప్పు బలిజలుగా పిలువ బడ్డారు. స్వంత భూములలో  జనుము, గోగులు పండించి వటి నుండి నార తీసి గోనె పట్టలను మగ్గాలపై నేసే వారు. ఇలా నేత నేసే వారిని పీచు పెరికలని పిలిచే వారు. కాలక్రమేణా గొనె సంచుల తయారీ పరిశ్రమలు చేపట్టడంతో జనుము, గోగు పంటల అవసరం తగ్గిపోయింది. దీంతొ ఉపాధి లేని పెరికబలిజలు తప్పని సరి పరిస్థితులలో జనుము పండించే భూములను ఇతర పంటలకు మార్పు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 

    "బలిజ కుల చరిత్ర" కంటే నారాయణ దేశాయి గారు 20 శతాబ్దం మొదట్లో రాసిన గ్రంధం. ఇందులో వివిధ పేర్లతో పిలువబడుతున్న బలిజ శాఖల పేర్లు ఇచ్చారు. గమనించండి.
ఇక రెండు 1901 మద్రాస్ ప్రెసిడెన్సీ సెన్సస్ రిపోర్ట్ లో బలిజ కులంలో గాజులు అమ్మే వారికి గాజుల అని, ఉప్పు అమ్మే వారిని పెరికె అని రాశారు గమనించాండి. 

ఇక మూడు 1886 లో అచ్చయిన కర్నూలు మాన్యువల్ లో బలిజ కులాల మధ్యన పెరిక బలిజ అని స్పష్టంగా పేర్కొన్నారు గమనించ గలరు.

ఇక నాలుగు 1968 లో అనంతరామన్ కమీషన్ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది. అందులో 1891 తమను ప్రత్యేక కులం గా గుర్తించాలని కోరినట్లు రాశారు. అంతే కాకుండా పెరిక కులం బలిజ, మరియు కవరై కులాలకు ఉపకులమని స్పష్టం చేశారు. అంతే కాకుండా అప్పటి జనాభా లెక్కల ప్రకారం చదువుకున్న వారి శాతం సంతృప్తి కరంగా లేదని రాశారు. వీరి అభివృద్ధికి ఏమేమి చర్యలు తీసుకోవాలో దిగువన సిఫారసు చేశారు. గమనించండి.
ఇక ఐదు... పెరిక కులం గురించి పరిశోధించి "చరిత్ర వాహినిలో పెరిక కులం" అని కానుగంటి మధుకర్ పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆయన ఏమని రాశారొ గమనించండి.