రాయలు తల్లి మత్రమే బలిజ కులస్తురాలు తండ్రి గొల్ల కులానికి చెందిన వాడని గొల్ల గొల్ల కులస్తులు ఒక అసంబద్దమైన వాదన చేస్తుంటారు.
ఇది ఒక చెత్త వాదన
తండ్రి నరస నాయకుడు బలిజ వంశస్తుడు. వీరు కర్నాటక లోని తుళు ప్రాంతం లో నివశించారు కాబట్టి తుళువ నరస నాయకుడు అన్నారు. .
బలిజ కులస్తులలో కోటబలిజలు, పేటబలిజలు అని రెండు విభాగాలు వున్నాయి. కోటబలిజలు ద్విజులు అంటే కేవలం రాచరికం చేయువారు మాత్రమే జంధ్యం ధరిస్తారు.
ఇక్కడ ముందుగా తెలుసుకోవల్సిన అంశం ఒకటుంది. భారతదేశం లో చాలా మంది కులం, వర్ణం ఒకటే అనుకుంటారు. అది తప్పు కులం వేరు వర్ణం వేరు.
జన్మనా జాయతే శూద్ర:
కర్మణా జాయతే ద్విజ:
వేద పఠనంతు విప్రానాం
బ్రహ్మజ్ఞానంతు బ్రహ్మణే
జన్మించుటద్వారా అందరూ శూద్రులుగానే జన్మిస్తారు. కర్మలు చేయుట ద్వారా ద్విజులగుచున్నారు. వేదాలు పఠించినవారు విప్రులనబడతారు బ్రహ్మజ్ఞానం సంపాదించినవారు బ్రహ్మణులని పిలవబడతారు.
ద్విజులు తమ తమ కర్మానుష్ఠానం చెయడానికుద్యుక్తులు కావడమే ఉపనయనం.
ఒకప్పుడు కేవలం మూడు వర్ణాలు మాత్రమే వుండేవి అవి బ్రహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలు ఈ మూడు వర్ణాలు ద్విజులే అంటె ఉపనయనం ద్వారా కర్మలు చేయడానికి మనసా, వాచా, కర్మణా సిద్దమైనటువంటివారు. వీరిలో వ్యవసాయము, వ్యాపారము వైశ్య వర్ణమే చేస్తుండేది. వైశ్యవర్ణ కర్మలను నిర్వహించే వారిలో వ్యవసాయము చేసే వారికి సమయానికి అనుష్టానాలు చేయడం సాధ్యమయ్యేది కాదు అందువల్ల వారికి ఉపనయనం నుండి మినహాయింపు నిచ్చారు. వారే సూద్ర వర్ణం. శూద్ర వర్ణం లో ఎన్నో కులాలున్నట్లుగానే పై వర్ణాలలో సైతం కులాలున్నాయి. ఉదాహరణకు నంబి బ్రహ్మణులు, తంబలి బ్రాహ్మణులు వీరిద్దరూ బ్రహ్మణులే కానీ వారి కులాలు వేరు. వీరిద్దరి వృత్తి దేవాలయాలలో పూజాదికాలు నిర్వహించడమే మొదటివారు వైష్నవ పూజారులు, రెండవ వారు శైవ పూజారులు. అదె విధం గా క్షత్రియులు క్షాత్రమున్న వారందరూ క్షత్రియులే. వీరిలో వివిధ కులాలు వుండవచ్చు.
ఇది కులాలకు, వర్ణాలకు వున్న తేడా. ఈ సంగతి తెలియక చాలామంది వర్ణాన్ని కులంగా చెబుతుంటారు.
ఈ విషయం అర్థం అయితే కోటబలిజలకు, పేటబలిజలకు తేడా అర్థమవుతుంది.
ఇక రాయల విషయానికి వస్తే ఆయన రాసిన ఆముక్తమాల్యద ను ఒక సారి పరిశీలిద్దాం.
యమునాచార్యుడు రంగనాథ స్వామి పాదాలు చూసిన తరువాత పూర్వజ్ఞానం కలుగుతుంది. అప్పుడు తన కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి రాజ నీతి గురించి చెబుతాడు.
ఇక్కడ రాజనీతి గురించి చెబుతున్నది యమునాచార్యుడనే పాత్ర అయినా ఆ రాజనీతి రాయల వారి స్వంత రాజనీతి అన్న విషయం గుర్తుంచుకోవాలి.
భిల్లులు, మొదలైన ఆటవిక జాతుల వారు రాక్షస నీతి అవలంబిస్తారు. రాజు ఆజ్ఞకు అటువంటివారు వణుకుతూ బద్ధులై వుండేటట్లు చూడాలి.
అంటే ఆటవిక జాతులైన బొయ, ఎరుకల వంటి జాతుల కు రాయల కులానికి ఎలాంటి సంబంధం లేదని రుజువవుతుంది. ఎందుకంటే ఏ రచయిత కూడా తన జాతిని తప్పుగా చెప్పుకోడు.
కోట కాపలా, రక్షణ భారాలను ఆప్త బంధువులకే అప్పగించాలి. ఎవరిని బడితే వారిని నమ్మి ఇలాంటి బాధ్యతలు అప్పగిస్తే వారు కోటకే ప్రమాదం తీసుకు వచ్చి రాజ్యవిచ్చిత్తికి కారణం కాగలరు. అంటే రాయల వారి కాలం లో తమ కులం వారికి పెద్ద పీట లభించింది.
మరొక చోట అల్పబుద్ధి గలవారిని, హీనకులస్తులను దూరం చేసుకుంటే వారు తొందరగా అలుగుతారు కనుక వారిని పరాయి వారికి భారం కాకుండా తృప్తిపరుస్తూ వుందు.
భార్యల పతిభక్తి, స్త్రీ పురుషులు వావి వరుసలు పాటించడం, దిగువ జాతులు అగ్రజాతులను అనుసరించుట, అధికారి పనికి సేవకులు ఒప్పుకొనుట ఇవన్నీ రాజు దండిస్తాడనే భయం తోనే సుమా!
అంటాడు రాయల వారు. చివరి రెండు పేరాలను గమనిస్తే రాయలు అగ్రకులానికి చెందిన వాడనే అర్థం అవుతోంది కదా.
మరి ఆంధ్ర దేశ చరిత్రలో ఎప్పుడైనా ఏ కాలం లోనైనా గొల్లకులస్తులు అగ్ర కులస్తులుగా చలామణి కాలేదు.
గొల్ల ప్రభువుగా చెప్పబడుతున్న కాటమరాజు సైతం గొప్ప పశు సంపద కలిగిన సంపన్న గొల్లడే కానీ రాజు కానీ చక్రవర్తి కానీ కాదు.
ఈ కథలోనే తెలుస్తుంది శ్రీశైలం అడవులలో ఆవులను మేపుకుంటుండగా గడ్ది దొరకక నెల్లూరు మండలాన్నేలుతున్న నల్లసిద్ది మహారాజును ఆవులు మేపుకుంటానని అనుమతి కోరుతాడు. తరువాత మాటతప్పి యుద్ధానికి దిగుతాడు. ఈ యుద్ధం లో సైతం ఎక్కడ కూడా ఏనుగులు వాదినట్లు చెప్పరు ఏనుగుల లాంటి ఎద్దుల గురించే చెబుతారు.
దీన్ని బట్టి ఏమర్థమౌతోంది గొల్లలు ఏ రోజు కూడా రాజ్యాలు ఏలలేదు అన్నది సుస్పస్టం.
ఎప్పుడూ కాటమరాజు పౌరుషాన్ని కథలుగా చెప్పే సుద్దుల గొల్లలు మరి మహా చక్రవర్తి అయిన రాయల వారి కథను ఎందుకు చెప్పలేదో......
ఎందుకంటె కాటమ రాజు గొల్లప్రభువు కాబట్టి ఆయన కథలు చెప్పారు,
రాయల వారు గొల్ల కులస్తుడు కాదు కాబట్టి ఆయన కథలు వారు చెప్పలేదు.
ఇక రాయల వారి తండ్రి సంపెట నరస నాయకుడు. ఈయన విజయనగర చక్రవర్తి సాళువ నరసిం హ దేవరాయల వద్ద సర్వ సేనాధిపతిగా వుండేవాడు. వీరు ఇద్దరూ వియ్యపు కుటుంబాలకు చెందిన వారు. ఈదే సాళువ వంశానికి చెందిన తిమ్మరాజు (కన్నడం లో అరుసు అంటే రాజు అని అర్థం) మంత్రిగా వుండేవాడు. నరస నాయకుని పెద్ద భార్య తిప్పాదేవి లేదా తిప్పాంబ. సాళువ నరసిం హ రాయలుకు సోదరి. ఈమె కుమారుడే వీర నరసిం హ రాయలు.
సాళువ నరసిం హదేవరాయల తదనంతరం ఆయన కుమారుడు రెండవ నరసిం హరాయలు పిల్లవాడు కావడం తో ఆయనను సిం హాసనం పై కూర్చోబెట్టి నరసనాయకుడు రాజ్యపాలన చేశాడు. నరసనాయకుని అనంతరం ఆయన పెద్దకుమారుడు వీరనరసిం హరాయలు రెండవ నరసిం హరాయలుకు ప్రతినిధిగా వుండి రాజ్య పాలన సాగించాల్సి వుండగా అతడిని చంపి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఇతని కౄరత్వానికి ప్రజలంతా అసహ్యించుకున్నారు. కానీ బలవంతుడు కావడం తో ఎవరూ నోరు మెదపలేదు తిమ్మరుసు తో సహా. కేవలం ఆరు సంవత్సరాలు మాత్రమే ఈయన రాజ్యం చేశాడు. అనారోగ్యం తొ చనిపొయిన తరువాత ఆయన సవతి సొదరుడు శ్రీకృష్ణదేవరాయలును తిమ్మరుసు చక్రవర్తిని చేశాడు.
నరస నాయకునికి ముగ్గురు భార్యలు ఒకరు తిప్పాంబ సాళువ నరసిం హ దేవరాయలకు సోదరి వరుస అవుతుంది. రెండవ భార్య నాగంబ నరసిమ్హదేవరాయల సోదరుదు తిమ్మరాజు బంధువులు అరిగండాపురం(దీనినే ఆ తరువాత తల్లి పేరుమీద నతులపురం గ పేరు మార్చరు) గాజుల వారి ఆడపదుచు, ఇక మూడవ భార్య ఓబులాంబ.
రెండవ భార్య నాగాంబ ఎకైక కుమారుడే మన హీరో కృష్ణరాయలు.
ఈమెనే పెమ్మసాని వారి ఆడపడుచు అని కమ్మ వారు పొరపాటు పడుతుంటారు. ఎందుకంటే గండికోట లో వున్న పెమ్మసాని కుమార్తె పేరు కూడా నాగమ్మే కావడం ఈ పొరపాటుకు కారణం. గండికోట నాగమ్మను దీపాల నాగి అంటారు.
నాగాంబను చంద్రగిరి ప్రాంతానికి వచ్చినప్పుడు నరసనాయకుడు మోహీంచి పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకున్నాడు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే విజయనగర రాజులందరూ తెలుగు వారేనన్న సంగతి. నాగాంబ సొంత ఊరు నాగులాపురం, ఈ గ్రామం పేరు అరిగండాపురం. రాయలు ఈక్కడే జన్మించారు. తాను పుట్టిన ఊరు కొరకు వేదనారాయణ స్వామి దేవాలయాన్ని ఇక్కడ నిర్మించాడు. నేటికీ ఈ దేవాలయాన్ని నిర్వహించేది రాయల వారి బంధువులే.
బలిజ కులం లో ఇంటర్ క్యాస్ట్ మేరెజెస్ లేవు. ఒక వేళ అలా చేసుకున్నా వారిని కులం లోనుండి వెలివేస్తారు.
రాయల వారి విషయం లో కూడా అలాగే జరగాల్సివుండేది. చిన్నమదేవి నర్తకి కావడం తో ఆమెను ఎంత ఇష్టపడి పెళ్ళి చేసుకున్నా ఆమె పట్టపురాణి కాలేక పోయింది.
మొదటి భార్య కావాల్సిన చిన్నమదేవి రెండవ భార్య కావాల్సి వచ్చింది.
తన ప్రేమ విషయం చెప్పగానే వారిని వివాహం చేసుకోకూడదు అని తిమ్మరుసు వారించాడు. ప్రభువు ఎప్పుడు కూడా కులకాంతలనే మొదట పెళ్ళి చేసుకోవాలని మైసూరు గంగరాజు కుమార వీరయ్య కుమార్తె తిరుమలదేవినిచ్చి వివాహం జరిపించాడు. ఆ తరువాత రాయసం కొండమరుసు చిన్నమ దేవిని దత్తు తీసుకుని కన్యాదానం చేశాడు. ఆ తరువాత తుక్కాదేవితొ సహా 12 మందిని రాయలు వివాహం చేసుకున్నారు. అందువల్లనే తిరుమలదేవి కుమార్తెలను పెళ్ళి చేసుకున్న ఆరవీటి వంశస్తులు రామరాయలు, తిరుమలదెవరాయలులకే రాజ్యం దక్కింది. మిగిలిన రాణులకు పిల్లలున్నప్పటికీ వారికి రాజ్యార్హత దక్కలేదు. కనుక కులకాంతలనే రాజమాతలు గా అంగీకరించేవారు.
దీన్నిబట్టి రాయల తల్లిదండ్రుల కులాలు వేరు వేరు కాదన్నది స్పష్టమౌతోంది.