29, జూన్ 2012, శుక్రవారం

పెరికబలిజలు ఉద్యమించారు

బలిజ కులానికి ఉప కులమైన పెరికబలిజలు ఉద్యమించారు

            కర్నూలు జిల్లా, శ్రీశైలం నియొజకవర్గం లోని వెలుగోడు మండలం లో నివశిస్తున్న పెరికబలిజలు  తమకు లభించాల్సిన హక్కుల కోసం గురువారం (27-6-2012)న భారీర్యాలీ నిర్వహించారుతమకు   1958 నుండి 1997 వరకు కులధృవీకరణ పత్రాలు ఇచ్చారని 1998 నుంది సర్టిఫికేట్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆ కు ల నాయకులు ఆరోపించారు.ఆ కాలం లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులకు ఓట్లు వేయకపోవడం   వల్లనే అప్పటి నాయకులు కక్షకట్టి తమకు సర్టిఫికేట్లు ఇవ్వకుండా వారు ఇబ్బందులకు గురిచేశారని   వారు ఆరోపించారు.     ఈ విషయం పై అప్పట్లో పెరికబలిజ నాయకులు ఫిర్యాదు చేయగా అప్పటి ఆర్డీఓ శ్రీ సుబ్బరాయుడు గారిని విచారణకు కలెక్టర్ ఆదేశించారని వారు తెలిపారు. 

          శ్రీ సుబ్బరాయుడు గారు ఆత్మకూరు నియోజకవర్గం లో పెరికబలీజలు వున్నారని వారికి 1958 నుండి 1997 వరకు కుల సర్టిఫికేట్లు ఇచ్చారని తెలుగుదేశం పార్టీ నాయకులు వారి అనుచరులతో వున్న స్పర్థల కారణంగానే సర్టిఫికేట్లు ఇవ్వకుండా నిరోధించారని ఇదంతా కేవలం పెరికబలిజలను వేధించడానికేనని అయన స్పష్టం చేస్తూ నివేదిక సమర్పించారని వారు తెలిపారు. 










         ఆ తరువాత జిల్లా కలెక్టర్లు రెండుసార్లు పెరికబలిజలకు సర్టిఫికేట్లు ఇవ్వండంటూ తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ వారు సర్టిఫికేట్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని వారు ఆరోపించారు. తమ కుల సర్టిఫికేట్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టక పోతే  పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారుఅనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ కు సమర్పించారు.  




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి