24, డిసెంబర్ 2012, సోమవారం
19, అక్టోబర్ 2012, శుక్రవారం
16, జులై 2012, సోమవారం
15, జులై 2012, ఆదివారం
9, జులై 2012, సోమవారం
పాములపాడు పెరికబలిజలు గర్జించారు.
కర్నూలు జిల్లాలోని పెరికబలిజలు గర్జించారు. తమ హక్కులకై పోరాటాలకు తెరతీశారు. పాములపాడు పట్టణం లోని శివాలయం వద్ద 9-7-2012 సోమవారం సమావేశమైన మండలం లోని పెరికబలిజలు మహార్యాలీ నిర్వహించారు. పట్టణం లోని ప్రధాన వీధులగుండా సాగిన ర్యాలీలో "పెరికబలిజలు వర్ధిల్లాలి" మాహక్కులు మాకు కావాలి అంటూ నినాదాలతో వీధులు మారుమ్రోగాయి. 1958 నుండి 1997 వరకు వున్న మాహక్కులు మాకు కావాలి అంటూ నినాదాలిచ్చారు. అనంతరం పాములపాడు తహశీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమం లో కర్నూలు జిల్లా కాపు, తెలగ,బలిజ, మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు యర్రంశెట్టి నారాయణరెడ్డి, జిల్లా కార్యదర్శి ధూపం అభిమన్యుడు, పాములపాడు మండల అధ్యక్షుడు పూజల రామలింగారెడ్ది, కోశాధికారి రామకృష్ణ, ఆత్మకూరు నాయకులు రిటైర్డు డిఆర్ ఓ వెంకటేశ్వర్లు.కొత్తపల్లె పెరికబలిజ నాయకులు, వెలుగోడు పెరికబలిజ నాయకులు పాములపాడు మండలం లో వున్న అన్ని గ్రామాల పెరికబలిజలు పాల్గొన్నారు.
30, జూన్ 2012, శనివారం
మా హక్కులు మాకు కావాల్సిందే...
కొత్తపల్లె మండలం లో ఎలుగెత్తి చాటిన పెరికబలిజలు
కర్నూలు జిల్లా కొత్తపల్లె మండలం లోని పెరికబలిజలు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన మా హక్కులు మాకు దక్కాల్సిందే నంటూ శుక్రవారం ర్యాలీ, ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. గత ఆత్మకూరు నియోజకవర్గం లోని మండలాలైన వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు, కొత్తపల్లె మండలాల లో నివశిస్తున్న పెరికబలిజలు తమకు ఓట్లు వేయలేదనే ఒకే ఒక్క కారణం తో వారికి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను కాలరాయడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు. గత ౧౫ సంవత్సరాలుగా తమకులాన్ని అణగదొక్కారని వారు వాపోయారు. ఈ కుట్ర వల్ల గత ౧౫ సంవత్సరాలుగా ఎన్నో విద్య, ఉపాధి అవకాశాలను తమ కుటుంబాలు కోల్పోయాన్నారు. ఇంతకాలం జరిగిన కుట్రను తాము కనుగొన్నామని ఈ కుట్రను ఇక సాగనీయమని కలసికట్టుగా పోరాటం చేసితీరుతామని వారు హెచ్చరించారు. అనంతరం తహశీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు.
29, జూన్ 2012, శుక్రవారం
పెరికబలిజలు ఉద్యమించారు
బలిజ కులానికి ఉప కులమైన పెరికబలిజలు ఉద్యమించారు
కర్నూలు జిల్లా, శ్రీశైలం నియొజకవర్గం లోని వెలుగోడు మండలం లో నివశిస్తున్న పెరికబలిజలు తమకు లభించాల్సిన హక్కుల కోసం గురువారం (27-6-2012)న భారీర్యాలీ నిర్వహించారు. తమకు 1958 నుండి 1997 వరకు కులధృవీకరణ పత్రాలు ఇచ్చారని 1998 నుంది సర్టిఫికేట్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆ కు ల నాయకులు ఆరోపించారు.ఆ కాలం లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులకు ఓట్లు వేయకపోవడం వల్లనే అప్పటి నాయకులు కక్షకట్టి తమకు సర్టిఫికేట్లు ఇవ్వకుండా వారు ఇబ్బందులకు గురిచేశారని వారు ఆరోపించారు. ఈ విషయం పై అప్పట్లో పెరికబలిజ నాయకులు ఫిర్యాదు చేయగా అప్పటి ఆర్డీఓ శ్రీ సుబ్బరాయుడు గారిని విచారణకు కలెక్టర్ ఆదేశించారని వారు తెలిపారు.
శ్రీ సుబ్బరాయుడు గారు ఆత్మకూరు నియోజకవర్గం లో పెరికబలీజలు వున్నారని వారికి 1958 నుండి 1997 వరకు కుల సర్టిఫికేట్లు ఇచ్చారని తెలుగుదేశం పార్టీ నాయకులు వారి అనుచరులతో వున్న స్పర్థల కారణంగానే సర్టిఫికేట్లు ఇవ్వకుండా నిరోధించారని ఇదంతా కేవలం పెరికబలిజలను వేధించడానికేనని అయన స్పష్టం చేస్తూ నివేదిక సమర్పించారని వారు తెలిపారు.
ఆ తరువాత జిల్లా కలెక్టర్లు రెండుసార్లు పెరికబలిజలకు సర్టిఫికేట్లు ఇవ్వండంటూ తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ వారు సర్టిఫికేట్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని వారు ఆరోపించారు. తమ కుల సర్టిఫికేట్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టక పోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ కు సమర్పించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)