బలిజ కులస్తులకు ఉపనయనము ఎప్పుడు చేయాలి...పెళ్ళిలో చేయవలసిన తతంగాలు ఏవి? బలిజ కులస్తుల గోత్రములు, సూత్రము తదితర వివరాలను 120 సంవత్సరాల క్రితమే శ్రీ పగడాల నరసింహులు నాయుడు గారు గ్రందస్తం చేశారు...ఈ ఆచారాలను ఆనాడు కొందరు ఆచరిస్తే మరి కొందరు ఆచరించ లేక పోయేవారు...అందరికీ ఈ సమాచారం అందుబాటులో వుండాలని ఆయన బలిజవారు పురాణం అనే తమిళ గ్రంథం లో,బలిజ వంశ పురాణము అనే తెలుగు గ్రంథం లో ఆయన వివరంగా తెలిపారు..బలిజవంశ పురాణం లోని అంశాలు ఇవి. అందరూ తెలుసుకోవాల్సినవి....
7, జూన్ 2020, ఆదివారం
5, జూన్ 2020, శుక్రవారం
114 సంవత్సరాల నాటి బలిజల ఇండ్లపేర్లు....
విజయరంగ చొక్కనాథుడు (1704) మధుర రాజ్యాన్ని పాలించిన నాయక రాజు... రాజులు నిజానికి తమ కులం బహిరంగంగా చెప్పుకోవడానికి సంకోచించారు..అందుకే వారు కులం పేరు చెప్పుకోకుండా తమ తమ వంశాల పేర్లు మాత్రమే శాసనాలలో చెప్పుకున్నారు...మరి విజయరంగ చొక్కనాథుడికి ఎవరికీ లేనంత కులాభిమానం ఏమిటో అర్థం కాదు..శ్రీ రంగం లోని కోనేరు వద్ద గల శాసనం లో తమ బంధువుల ఇంటిపేర్లు అన్నీ రాయించాడు..వీరిలో 40 రాజకుటుంబాల కు సేవికా వృత్తి కానీ,వెండి ఆభరణాలు కానీ ధరించడం నిషేధం...ఎందుకంటే ఈ కుటుంబాలు సేవికా వృత్తి చేస్తే ఆయా వంశాల గౌరవం తగ్గుతుందని ఆనాటి వారు భావించేవారు..అదే విధంగా వెండి ఆభరణాలు అంటే కాళ్ళకు మెట్టెలు, కానీ కాళ్ళ గొలుసులు కానీ బంగారం తో చేసినవి మాత్రమే వాడాలి....
అదే విధంగా మహా బంధువులు, గోష్టి బంధువులు, బహు బంధువులు అంటూ చాలా ఇండ్ల పేర్లు శాసనం లో చెక్కించారు...ఆ ఇండ్ల పేర్లు మీ కోసం ...120 సంవత్సరాల క్రితం అచ్చు వేయబడిన పగడాల నరసింహులు నాయుడు గారి "బలిజ వంశ పురాణం" కాపీలు...
1, జూన్ 2020, సోమవారం
114 సంవత్సరాల క్రితం నాటి బలిజవంశ పురాణం ...అప్పటి గురుపీఠాలు ...బలిజ కులస్తుల గురించి వెలిబుచ్చిన అభిప్రాయాలు
120 సంవత్సరాల క్రితం బ్రిటీషువారు కులగణన కార్యక్రమం చేపట్టారు . ఆ సందర్భంగా బలిజ కులస్తులను శూద్రులుగా పరిగణించి నాలుగవ తరగతిలో చేర్చారు...దీనికి నాటి బలిజ సమాజం అభ్యంతరాలు వెలిబుచ్చింది...బలిజకులస్తులు చంద్రవంశ క్షత్రియులని వారిని నాలుగవతరగతిలో కాకుండా రెండవతరగతిలో చేర్చాలని డిమాండ్ చేసింది....దానికి సెన్సస్ కమిటీ ఆధారాలు చూపెట్టమని అడిగింది ...దానికి అనేక పురాణాధారాలు ...చారిత్రక ఆధారాలను నాటి బలిజ పెద్దలు వారికి చూపించారు....ఆ ఆధారాలను అనేకమంది బ్రాహ్మణ పండితులకు ...చరిత్రకారులకు ...గురుపీఠాల అధిపతులకు పంపించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నాక బలిజకులస్తులను చంద్రవంశ క్షత్రియులుగా అంగీకరిస్తూ తెల్లవారు రెండవ కేటగిరీలో చేర్చారు.. ఆ వివరాలను ఉటంకిస్తూ శ్రీ పగడాల నరసింహులు నాయుడు గారు "శ్రీ చంద్రవంశ క్షత్రియులైన, ఆంధ్రులు, గౌరవులు, అను బలిజవంశ పురాణం లేక నాయుడుగార్ల సంస్థాన చరిత్రము" అనే పుస్తాకాన్ని వెలువరించారు...దీనికంటే ముందు "బలిజవారు పురాణం" అనే పుస్తకాన్ని ఆయన రచించారు ఇది సుమారు 500 పేజీల లకు పైగా తమిళ భాషలో వున్నది. ఈ రెండు పుస్తకాలు ప్రస్తుతము ఇండియాలో లభించడం లేదు. కాపు చరిత్ర సంకలన సమితి సభ్యులు ...శ్రీ పోలిశెట్టి సత్తిరాయుడు గారు లండన్ లోని బ్రిటీషు మ్యూజియం నుండి వాటి కాపీలను తెప్పించారు...ఆ వివరాలు మీ కోసం...
10, ఏప్రిల్ 2020, శుక్రవారం
పెమ్మసాని కుటుంబీకులకు శ్రీ కృష్ణదేవరాయలుకు ఎలాంటి సంబంధం లేదు
పెమ్మసాని కుటుంబీకులకు శ్రీ కృష్ణదేవరాయలుకు ఎలాంటి సంబంధం లేదు
స్పష్టం చేసిన పెమ్మసాని రాజా కుటుంబీకులు పెమ్మసాని పరంధామ్ గారు....
-ధూపం అభిమన్యుడు
స్పష్టం చేసిన పెమ్మసాని రాజా కుటుంబీకులు పెమ్మసాని పరంధామ్ గారు....
. ఈ రోజు అనగా 10-4-2020 మధ్యాహ్నం 11-27 నిముషాలకు నాకు ఒక మెస్సెజీ వచ్చింది. నేను పెమ్మసాని పరంధామ్ మీతో మాట్లాడవచ్ఛా ...అని. నేనే వారికి ఫోన్ చేశాను. ఆయన చాలా సౌమ్యంగా మాట్లాడారు. ఆయన నాతో మాట్లాడుతూ ఫేస్ బుక్ లో రాయల వివాదం గురించి చదివానండీ మీ బ్లాగు కూడా చూశాను అన్నారు. శ్రీకృష్ణదేవరాయల తల్లి దీపాల నాగమ్మ అని చెన్నై లోని రాతప్రతుల లైబ్రరీ నుండి సేకరించిన పత్రాలలో వుందన్నారు...ఈ దీపాల నాగమ్మ ప్రస్తావన మా పెమ్మసాని వారి రికార్డులలో ఎక్కడా లేదని వారు స్పష్టం చేశారు,శ్రీకృష్ణదేవరాయల కుటుంబానికి పెమ్మసాని వారి కుటుంబానికి ఎలాంటి బంధుత్వం లేదని ఆయన స్పష్టం చేశారు...అదేవిధంగా మధురను పాలించిన విశ్వనాథనాయకుని కుటుంబం తో కానే తంజావూరు రాజకుటుంబాలతో కానీ పెమ్మసాని వారికి బంధుత్వం లేదని తెలిపారు. శ్రీ ముత్తేవి రవీంధ్ర నాథ్ రాసిన శ్రీకృష్ణదేవరాయల వంశ మూలాలు అనే పుస్తకం విషయం లో తమకు ఎలాంటి ప్రమేయం లేదన్నారు. అదే విధంగా ఆయన రాసిన పుస్తకాన్ని తాము సమర్థించడం లేదని స్పష్టం చేశారు... ఇక అదేవిధంగా తమిళనాడు కమ్మ సంఘం వారు కూడా తిరుమలై నాయకర్ చిత్రపటాన్ని కమ్మ కుల సంఘం పోస్టర్ లలో కమ్మకులస్తుడిగా చూపవద్దని సూచించానని ఆయన తెలిపారు....తాను కొటికం వారి కైఫీయాత్ తో పాటు చాలా మాన్యు స్క్రిప్ట్స్ పరిశీలించానని వారందరూ బలిజకులస్తులేనని అదే విషయాన్ని తమ కులస్తులకు చెప్పానని ఆయన తెలిపారు. శ్రీకృష్ణదేవరాయల కుల వివాదంలో కమ్మవారి తరపునుండి శ్రీ పెమ్మసాని పరంధాం గారు ముగింపునిచ్చారనే అనుకుంటున్నాను. అదేవిధంగా కొందరు ఉద్రేక స్వభావులు వికీపీడియాలో శ్రీకృష్ణదేవరాయల తల్లి నాగులాంబ పెమ్మసాని వారి ఆడపడుచు అని పెట్టారు. అలాంటి వాటిని కూడా తొలగించమని శ్రీ పరంధామ్ గారిని సవినయంగా కోరుతున్నాను..
.... ప్రతి కులంలో మంచి వాళ్ళు వుంటారు, చెడ్డవాళ్ళూ వుంటారు...శ్రీ పెమ్మసాని పరంధామ్ గారు నాతో మాట్లాడిన తీరు వారిపై గౌరవాన్ని పెంచింది.... మీ వాదనను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను...కమ్మ వారి పట్ల నాకు ఎలాంటి ద్వేష భావన లేదు...ఎవరో కొందరు ఫేక్ ఐడీ లతో వచ్చి నన్ను బూతులతో సత్కరించారు .... ఎవరో కొందరు వెధవలు చేసే పనులకు మనం కులాన్ని ధూషించకూడదు అన్నది నా అభిమతం ....నా రాతల వల్ల మిమ్మల్ని నొప్పించి వుంటే నన్ను మన్నించమని పెమ్మసాని పరంధామ్ గారిని కోరుతున్నాను......-ధూపం అభిమన్యుడు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)