"పెరిక బలిజ" కులస్తులు బలిజ కులస్తులే.... ఈ విషయం తెలియని చాలామంది రెండూ వేరు వేరు కులాలుగా పరిగణిస్తూ వారి మధ్య ప్రఛ్చన్న స్పర్థలను రేకెత్తిస్తున్నారు. నేను గతంలో పెరికబలిజ అనే కులం బలిజ కులానికి ఉపకులము అంటూ ఒక పోస్ట్ ను పెట్టాను. తెలంగాణ ప్రాంతం నుండి ఒక పెరిక సోదరుడు అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. దాంతో వారి మనోభావాలను నొప్పించకూడదనే ఉద్దేశ్యంతో ఆ పోస్ట్ ను తొలగించాను. ఆ తరువాత చాలా గ్రంధాలను పరిశోధించిన తరువాత "పెరిక బలిజ", బలిజ కులానికి ఉపకులమే అని నిర్ధారించుకున్నాను. చరిత్ర తెలియని చాలామంది మిడి మిడి జ్ఞానంతో కేవలం తమకు మాత్రం బంధుత్వాలు లేవనే కారణంతో పెరిక బలిజ కులస్తులకు రిజర్వేషన్లు అందకుండా అడ్డు పడుతున్నారు. అలాంటి వ్యక్తులు అనాలోచితంగా ప్రభుత్వాధికారులకు ఫిర్యాదులు చేయడంతో రాయలసీమ ప్రాంతంలో అనేకమంది "పెరిక బలిజ" విద్యార్థులు కులధృవీకరణ పత్రాలు అందక ఫీజు రీఎంబర్స్ మెంట్ అందక కాలేజీ చదువులు మానుకున్న సంఘటనలు చాలా వున్నాయి.
1970 వరకు అగ్రకులాలలో వున్న పెరిక బలిజలు 1970 తరువాత బి.సి-బి జాబితాలో చేర్చబడ్డారు.
తమ కుల సంఘాలను ఏర్పాటు చేసుకునేటప్పుడు "పెరికె" "పెరికె(పురగిరి క్షత్రియ)" సంఘాలుగా మాత్రమే రాసుకుంటున్నారు.
ఇంకొందరైతే "కొన్ని పరిస్థితుల ప్రభావం వలన మన పెరికలు మారు వేషాలతో వ్యాపారం చేయవలసి వచ్చింది. అందుచే పెరిక బలిజలని వ్యవహరిస్తున్నారు" అంటూ సరికొత్త భాష్యాలను చెప్పి మరింత తప్పు దోవ పట్టిస్తున్నారు.
కులసంకరాలను అడ్డుకోవడం కులవ్యవస్థను పటిష్టంగా నడపడం బలిజల బాధ్యత ఎందుకంటే శెట్టి, దేశాయి, వ్యవస్థలకు నాయకులుగా సుమారు 2000 సంవత్సరాలు వ్యవహరించారు.
డబ్బు వున్నవాడు ఎక్కువ బలిజ అని, డబ్బులేని వాడు తక్కువ బలిజ అని వ్యవహరించీ వ్యవహరించీ లెక్కలేనన్ని ఉప కులాలుగా విడిపోయారు. ఈ ఉప కులాలు కూడా వారు చేసే వృత్తి వల్ల ఏర్పడ్డాయని వీరంతా ఒకే జాతికి చెందిన వారని చాల గ్రంధాలలో రాసి పెట్టినప్పటికీ తెలుసుకోలేని అజ్ఞానంతో ఇంకా, ఇంకా దూరం అవుతూనే వున్నారు.
వీరబలిజ సమయాలు, శెట్టి సమయాలు అనేవి 18 ప్రధాన కులాల సమాహారాలు. వీరిలో చాలామంది బలిజ అని చివరన తగిలించుకుంటారు. అది వేరు.
పెరిక బలిజ కులస్తులు అలాంటి వారు కాదు. పెరిక బలిజ కులస్తులు ప్రధానంగా బలిజ కులానికి చెందిన వారే.
బలిజ కులంలో శెట్టి బలిజ, తోటబలిజ లాగా వృత్తి ద్వారానే వీరు పెరిక బలిజలుగా పిలువబడ్డారు.
రవాణ వ్యవస్థను శాసించిన జాతి ఇది.
ఒక యుద్ధం జరిగితే ఆ యుద్ధ సైనికుల అవసరాలు తీర్చే బాధ్యతలు వీరిపైన వుండేవి. ఎద్దులపైన, గాడిదల పైన జనప, గోగు నారలతో తయారైన గోనె సంచులతో రవాణాలు చేశారు. ఉప్పు తయారు చేయడం వల్ల ఉప్పు బలిజలుగా పిలువ బడ్డారు. స్వంత భూములలో జనుము, గోగులు పండించి వటి నుండి నార తీసి గోనె పట్టలను మగ్గాలపై నేసే వారు. ఇలా నేత నేసే వారిని పీచు పెరికలని పిలిచే వారు. కాలక్రమేణా గొనె సంచుల తయారీ పరిశ్రమలు చేపట్టడంతో జనుము, గోగు పంటల అవసరం తగ్గిపోయింది. దీంతొ ఉపాధి లేని పెరికబలిజలు తప్పని సరి పరిస్థితులలో జనుము పండించే భూములను ఇతర పంటలకు మార్పు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
"బలిజ కుల చరిత్ర" కంటే నారాయణ దేశాయి గారు 20 శతాబ్దం మొదట్లో రాసిన గ్రంధం. ఇందులో వివిధ పేర్లతో పిలువబడుతున్న బలిజ శాఖల పేర్లు ఇచ్చారు. గమనించండి.
ఇక రెండు 1901 మద్రాస్ ప్రెసిడెన్సీ సెన్సస్ రిపోర్ట్ లో బలిజ కులంలో గాజులు అమ్మే వారికి గాజుల అని, ఉప్పు అమ్మే వారిని పెరికె అని రాశారు గమనించాండి.
ఇక మూడు 1886 లో అచ్చయిన కర్నూలు మాన్యువల్ లో బలిజ కులాల మధ్యన పెరిక బలిజ అని స్పష్టంగా పేర్కొన్నారు గమనించ గలరు.
ఇక నాలుగు 1968 లో అనంతరామన్ కమీషన్ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది. అందులో 1891 తమను ప్రత్యేక కులం గా గుర్తించాలని కోరినట్లు రాశారు. అంతే కాకుండా పెరిక కులం బలిజ, మరియు కవరై కులాలకు ఉపకులమని స్పష్టం చేశారు. అంతే కాకుండా అప్పటి జనాభా లెక్కల ప్రకారం చదువుకున్న వారి శాతం సంతృప్తి కరంగా లేదని రాశారు. వీరి అభివృద్ధికి ఏమేమి చర్యలు తీసుకోవాలో దిగువన సిఫారసు చేశారు. గమనించండి.
ఇక ఐదు... పెరిక కులం గురించి పరిశోధించి "చరిత్ర వాహినిలో పెరిక కులం" అని కానుగంటి మధుకర్ పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆయన ఏమని రాశారొ గమనించండి.