కాకతీయ ప్రతాపరుద్రుడు రుద్రమదేవి కుమార్తె యొక్క కుమారుడు అన్న విషయం అందరికీ తెలిసినదే. పెద్ద కుమార్తె ముమ్మడమ్మను తన పుట్టింటి వారికి ఇచ్చి పెళ్ళి చేసింది. తన పుట్టింటి వంశీయుడైన కాకతీయ మహదేవుడికి ( ఇతడికి "కాకతీయ వంశ దుగ్దాబ్ది చంద్రమ" అనే బిరుదు ఉంది) ఇచ్చి పెళ్ళి చేసింది. వీరి కుమారుడే ప్రతాపరుద్రుడు. రుద్రమదేవి చాళుక్య వీరభధ్రుడి ఇల్లాలైనప్పటికీ కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలడానికి పుట్టింటికి వచ్చి వారి సామ్రాజ్యానికి వారసులు లేని లోటు తీర్చింది. తన తదనంతరము తన కుమార్తె కుమారుడిని సిమ్హాసనము పై కూర్చోబెట్టింది.
దీన్ని బట్టి చాళుక్య వీరభధ్రుడి కుటుంబము కాకతీయుల కుటుంబము వియ్యపు కుటుంబాలే కదా. అలాంటప్పుడు వీరభధ్రుడి కుమార్తె కుమారుడు చాళుక్య వంశీయుడెలా అవుతాడు???
మరి ''ఆంధ్రుల చరిత్ర '' లో చిలుకూరి వీరభధ్ర రావు గారు మహదేవుడు నియోగి బ్రహ్మణుడు అని రాశారు. మరి దీనికి సంబంధించిన ఆధారాలు ఏమైన చుపించారా అంటే అదీ లేదు. ప్రతాప రుద్రుడు కాకతియుడెలా అవుతాడు అని ఆయన ప్రశ్నించిన వైనాన్ని ఒక్క సారి గమనించండి. ఈ గ్రంధం లోని పీటికలోనే ఆయన అనేక వివాదాలను ఎదుర్కున్నట్లు చెప్పారు. శేషాద్రి,రమణకవులనే వారి తొ చరిత్ర నిర్మాణంలో అభిప్రాయ భేదాలున్నట్లు ఆయనే చెప్పుకున్నారు. ఈ గ్రంధం లో ఈయన చాళుక్య వంశీయులను బ్రహ్మణులను చేసేశాడు.
చాళుక్య వంశీయులు బ్రహ్మణులు అనడానికి ఎలాంటి ఆధారాలు చూపించడు.
ఎవరు చరిత్ర రాస్తే వారు తమ కులం వారని చెప్పుకోవడానికే ప్రాధాన్యతనిస్తే అసలు చరిత్ర ఎలా బయటకు వస్తుంది.
ఇలాంటి మహానుభావుల చేతిలో నిర్మాణమైన చరిత్ర లో వాస్తవాలు ఎంత?
ఇది కూడా గమనించండి