చరిత్రలో కనీస గౌరవం కూడా లభించని చాలా కులాలు శ్రీకృష్ణదేవరాయలు తమ కులస్తుడని చెప్పుకుంటూ, బలిజ కులస్తుడు కాదని అడ్డంగా వాదిస్తుంటారు. అలాంటి వారు ఈ శాసనాన్ని గమనించాలి. ఈ మూడు శాసనాలలో మొదటిది,రెండవది శ్రీకృష్ణదేవరాయలు కంటే ముందువి అంటే 1506 నాటివి. అప్పటికి విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయల అన్న వీరనరసిం హరాయలు పరిపాలిస్తున్నాడు. మూడవదైన ఫర్మానా క్రీ.శ.1549 ఔరంగాజేబు కాలం లో చేసిన శాసనం. ఈ శాసనాన్ని 56 దేశాలలో బలిజ కులస్తులు పన్నులు వసూలు చేయడమే కాదు గ్రామాల లో న్యాయాధికారులుగా గ్రామాల పై పెత్తనాన్ని కూడా కట్టబెట్టారు. దేశం లో ఇన్ని రకాల కులాలు ఉండగా ఒక్క బలిజ కులస్తులకు మాత్రమే ఈ గౌరవం ఎందుకు దక్కింది? ఏదో ఒకరో ఇద్దరో మేధావులు వుంటే వారికి మాత్రమే గౌరవం దక్కుతుంది కానీ ఇక్కడ ఒక కులానికి మొత్తం గౌరవాన్నే కాదు అధికారాన్ని కూడ ధారాదత్తం చేశారు.
మరి ఆ కాలం నాటి రాజులు తమ కులానికి గౌరవం దక్కకపోతే జీర్ణించుకునేవారేనా??
ఆ నాటి కట్టు బాట్లను మీరితే ఆ కులాలకు కఠిన శిక్షలుండేవి.
మరి ఆ నాటి రాజులు తమ కులస్తులని కొన్ని కులాలు ఊకదంపుడు ఉపన్యాసాలిస్తుంటాయి మరి అదే నిజమైతే ఆయా కులాలకు ఎంతో గౌరవం దక్కాలి కదా?
మరి కనీస గౌరవం కూడా దక్కని కులాలు ఈ రోజు విజయనగర రాజులు తమ కులస్తులని వాదిస్తుంటారు.
మరి నాటి రాజులు వారి కులస్తులైతే తమ కులానికి గౌరవం దక్కక పొవడం చూసి ఊరుకునే వారా???
పెళ్ళిళ్ళకు కూడా గుఱ్ఱం ఎక్కే అవకాశం కూడా లేని కులాలు నాటి రోజుల్లో ఎలా రాజ్యాలేలి వుంటాయి.
ఈ శాసనాన్ని చూసిన తరువాత అయినా ఆయా కులాలు వాస్తవాలను తెలుసుకుంటాయని ఆశిద్దాం.
శాసనం -1
ఎర్రంశెట్టి మీరాపాత్రుడు. వలదు యెలిజేటి శ్రీగవిరి ఆర్కాగుండవర ప్రవర్ధన వరాత్త జగదేవు కంశేంజేటి అశ్వపతి, గజపతి, నరపతి మూడు సిం హాసనాల రాజులున్నూ దేశాలలో నడిపించుచున్న పన్నులు వర్ణాశ్రమ ధర్మాల కల్లా పన్నులు.
1. గోవులకు తోకరూకలు పన్ను
2. బ్రాహ్మణులకు బొట్లపన్ను
3. తలవెంట్రుక స్త్రీలకు వర్ణాశ్రమ ధర్మాల పన్ను
4. ఋతువుల పన్ను
5. స్తనముల పన్ను
6. శుభశోభనాలకు పన్ను
7. సమస్త వర్ణాశ్రమ ధర్మాల వారికి పన్ను
ఈ పన్నులు రద్దు చేస్తూ
1. పెండ్లిండ్లకు దేవుని కట్నం ఒక రూక
సమయ మంత్రి కట్నం ఒక రూక
ఒజ్జలు కట్నం ఒక రూక
మంగలి వాని కట్నం ఒక రూక
2. పంట పుట్టి కుంచాలు, గోనెకు హర్బాజాకు ఒకటికి ఒక కాసు ఈ పద్దతిన ఏర్పాటు చేసి మహానాటి పెద్ద మాట మీరితే
1. కులం తప్పు
2. మహనాటివారి తప్పు
3. దివాణం తప్పు
4. దేవుని తప్పు విధిస్తారు
ఇందుకు సాక్షులు:
1. పూర్వలింగ
2. నారదలింగ
3. మార్కండేయులు
4. కవి సర్వాంచనులు
శాసనం -2
శాలివాహన శకం 1428 (క్రీ.శ.1506)
రాయన మంత్రి భాస్కరన్నగారు వ్రాసిన చప్పన్న దేశాలకు నిర్ణయ పత్రిక
స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శలివాహన శకవర్షంబులు 1428 నేటి తరణ నామ సంవత్సర మాహ శు15 లిఖితం
1.బ్రహ్మ ,2.క్షత్రియ, 3,వైశ్య, 4.శూద్ర, 5.వ్యవహారిక, 6.గొరక్షక, 7.కుంభకారక, 8.శిల్పికార, 9.పంచాణ, 10.తంతువాయి, 11.తిలఘాతక, 12.క్షౌరక, 13.రజక, 14.వస్త్రఛేదక,15.చిత్రకారక, 16.లుబ్దక, 17. ఛండాల, 18.మతంగ జాతులగు అష్టాదశ వర్ణంబుల వారున్నూ యేబది ఆరు దేశాలలో నున్న మంత్రి మహానాడున్నూ అశ్వపతి, గజపతి, నరపతి మూడు సిమ్హాసనాల వారున్నూ నరపతి సిం హాసనమున గూర్చుండి యేబది ఆరు దేశాల మంత్రి మ్హానాటిని పిలిపించుకొని కులాల హద్దులు నిర్ణయం చేసిరి.
కులాల హద్దులు
కులము అందలం పల్లకీ గుఱ్ఱం
1. బ్రహ్మణులు కలదు కలదు కలదు
2. క్షత్రియులు కలదు కలదు కలదు
3. వైశ్యులు కలదు కలదు కలదు
4. శూద్రులు కలదు కలదు కలదు
5. పల్లెవారి పెళ్ళికి లేదు కలదు కలదు
6. గొల్లవారి పెళ్ళికి లేదు లేదు లేదు
7. కుమ్మరి గుండయ్య సంతతికి లేదు లేదు లేదు
8. పంచాణము అయిదు విధముల
వారికి ఋషులు పెట్టిన శాపం
ఉన్నందున లేదు లేదు లేదు
9. సాలెవారికి లేదు కలదు కలదు
10. చాకలి వారికి లేదు లేదు కలదు
11. మంగలికి లేదు లేదు లేదు
12. బిక్ష జంగం లేదు లేదు లేదు
13. చిత్రకారుల శుభ శోభనలకు
నరపతి ఇచ్చిన పంచవన్నెలు
మహానాటి వారిచ్చిన తెల్ల గుఱ్ఱము
పేటేరుమాలు, సుల్తాన్ బసికము
కలదు
14. ఎరుకల వారికి లేదు లేదు లేదు
15. మాలవారికి లేదు లేదు లేదు
16. మాదిగవారి పెండ్లిండ్లకు యముడు
ఎక్కే వాహనము కలదు, మూడు
కొంగుల ఉల్లెడ గలదు, మూడు
స్తంభముల పందిరి రొమ్ము తప్పెట,
భూమిమీద అరివేణి కలదు లేదు లేదు లేదు
శాసనము -3 (ఫర్మానా)
శాలివాహన శకం 1471 అక్షయనామ సంవత్సర చైత్ర శు.10 ఇందు వారము
మహారాజశ్రీ అలంగరు పాదుషా వారు మంత్రి మహానాటి వారికి దయచేయించిన ఫర్మానా స్వస్తి సమస్త త్రిభువన విపుల విజ్ఞాన వీర వీరావతారులున్నూ గరుఢధ్వజ సిం హధ్వజ బిరుదాంక మూలికా ప్రశస్థ ధారులున్నూ, అంగ,వంగ,కళింగ కాశ్మీర కాంభోజాధి చప్పన్న దేశాధీశులున్నూ, వైఢూర్య, గొమేధిక,పుష్యరాగాధి నవరత్నాధికారులున్నూ, హరిహర గురుభక్తి పరాయణులున్నూ పరనారీ సహోదరులున్నూ మోకాలి పట్టభధ్రులున్నూ అయిన స్వస్తి సమస్త కల నామంక మాకాద ప్రశస్తదారులున్నూ సాలుమూల సమయ పెక్కండ్రున్నూ శ్రీ మహాకళ్యాణదారులున్నూ అయిన మంతి మహానాటివారికి విప్రముఖ్యులైన రాయని మంత్రి భాస్కరు మొదలైన దయచేయించిన పట్ట పదుషా ఫర్మానా.
నరపతి, గజపతి, అశ్వపతులు 56 దేశాల మంత్రులు రాజులును నవరత్న వ్యపారులును, అన్ని కులముల పెద్దలను పిలిపించి బలిజ కాపులను మహానాటి పెద్దలుగా పన్నులు వసూలు మరియు తప్పు చేసిన వారిని శిక్షించే అధికారము ఇస్తూ ఢిల్లీ పాదుషా గారు అక్షయనామ సంవత్సరం చైత్ర శుద్ద 10 ఇందువారం పార్షి మొహరు వున్న శాసనము ఉంది. పాదుషా గారి దస్కత్తు ఉన్నది.
సంగ్రహణం : ఇలియట్ దొర శాసన సంపుటముల నుండి